భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రపంచ యోగా దినోత్సవం రోజున గర్భిణిలు చేసే ప్రత్యేక యోగా చేసి ఆకట్టుకున్నారు. యోగాకు తాను ఇచ్చే ప్రాముఖ్యతను వివరిస్తూ ట్విటర్‌లో చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆ ట్వీట్‌లో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీని ట్యాగ్ చేయగా.. ఇంప్రెస్ అయిన మంత్రి సానియాను పొగడ్తలతో ముంచెత్తారు.
అసలు విషయమేమిటంటే.. గర్భధారణతో ఉన్న సానియా మీర్జా యోగా డేను పురస్కరించుకొని యోగా చేస్తూ దిగిన ఫోటోలు ట్విటర్‌లో షేర్ చేశారు. ‘యోగా డే లేక ఏ రోజైనా ఫర్వాలేదు. గర్భాధారణ సమయంలోనూ ఫిట్‌గా ఉండటానికి నేను ప్రయత్నిస్తా. అందుకోసం యోగానే నా మంత్రం. మరి మీరు?’ అంటూ మహిళా శిశు సంక్షేమశాఖ పోర్టల్, మేనకా గాంధీలను ట్యాగ్ చేస్తూ సానియా ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మేనకా గాంధీ ‘అద్భుతం సానియా, గర్భిణి స్త్రీలు యోగా చేయడం ద్వారా వారికి, పుట్టబోయే పిల్లలకు ఎంతో ఆరోగ్యకరం’ అంటూ రీట్వీట్ చేశారు. త్వరలో గర్భిణీ స్త్రీలతో కలిసి యోగాలో పాల్గొంటానని కేంద్ర మంత్రి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మేనకా గాంధీ పాల్గొన్నారు.
International Day of yoga or any other day , #PreNatalYoga is my way of keeping fit during pregnancy .. what’s yours??? 😀 @MinistryWCD and @ManekaGandhiBJP pic.twitter.com/wOTG14GcfA
— Sania Mirza (@MirzaSania) 21 June 2018
Wonderful, Sania!!#PreNatalYoga is indeed an exhilarating way to be fit during pregnancy. @MirzaSania https://t.co/Gsm6YOfKqS
— Maneka Gandhi (@Manekagandhibjp) 21 June 2018
Comments
Please login to add a commentAdd a comment