Menaka Gandhi
-
Sanjay Gandhi Birthday: ఇందిరకు నచ్చని మేనక?.. అయినా సంజయ్‌తో పెళ్లెలా జరిగింది?
సంజయ్ గాంధీ.. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు. సంజయ్ గాంధీ 1946 డిసెంబరు 14న జన్మించారు. రాజీవ్ గాంధీ ఈయన సోదరుడు. సంజయ్ గాంధీ అత్యంత విచిత్ర పరిస్థితుల్లో మేనకా గాంధీని కలుసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్నారు. అది 1973వ సంవత్సరం.. అప్పటికి సంజయ్ గాంధీ వయసు 27 ఏళ్లు. లండన్‌లో చదువు పూర్తి చేసుకుని సంజయ్ గాంధీ ఇండియాకు తిరిగివచ్చారు. అప్పటికే ఆయన ఇద్దరు యువతులతో ప్రేమ వ్యహారాలు నడిపారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తొలుత సంజయ్ గాంధీ ఒక ముస్లిం యువతిని ప్రేమించారు. అయితే అది ఎక్కువకాలం కొనసాగలేదు. తరువాత ఆయన జర్మన్ యువతి సబీన్ వాన్ స్టీగ్లిట్జ్ ప్రేమలో పడ్డారు. ఆమె సోనియాగాంధీకి స్నేహితురాలుసోనియా స్నేహితురాలు సబీన్తో..ఆ సమయంలో సబీన్ ఢిల్లీలో టీచర్‌గా పనిచేసేవారు. ఆమె తరచూ రాజీవ్,సోనియాల ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో సంజయ్‌గాంధీ..సబిన్తో మాట్లాడేవారు. కొంతకాలం తరువాత వారిలో చిగురించిన ప్రేమను గమనించిన సోనియా వారిద్దరూ వివాహం చేసుకుంటే బాగుంటుందని భావించారట. అయితే అప్పట్లో సంజయ్ గాంధీ.. మారుతి కారు భారత్‌కు తీసుకురావాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. సబీనాతో పెళ్లికి అంత ప్రాథాన్యత ఇవ్వలేదు. దీంతో సబీన్ యూరప్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని విమనాశ్రయానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న సంజయ్ ఆ విమానంలోని పైలెట్‌తో రేడియోలో మాట్లాడి, సబీన్ను తిరిగి రమ్మని అభ్యర్థించారు. అలా ఆమె వెనక్కు వచ్చింది. అయితే తరువాతి కాలంలో సంజయ్- సబిన్ మధ్య విబేధాలు వచ్చి వారు విడిపోయారు.మోడలింగ్ రంగంలో మేనకకు అవార్డులు1973, సెప్టెంబర్ 14న సంజయ్ తన స్నేహితుని పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతని స్నేహితుడు సంజయ్‌కు మేనకా ఆనంద్ అనే యువతిని పరిచయం చేశారు. ఆమె రిటైర్డ్ సిక్కు కల్నల్ కుమార్తె. మోడలింగ్ చేస్తూ, ఈ రంగంలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. జర్నలిస్టు కావాలనేది ఆమె కల. అలా పరిచయమైన మేనకతో సంజయ్ ప్రేమలో పడ్డారు. ఇది సంజయ్ అన్నయ్య రాజీవ్ గాంధీ, వదిన సోనియాలకు అంతగా నచ్చలేదు. మేనక ప్రవర్తన వారికి నచ్చలేదు. కొన్నాళ్ల తరువాత సంజయ్ తన తల్లి ఇందిరకు మేనకను పరిచయం చేశాడు. ఇందిరాగాంధీని కలిసే సమయంలో మేనకా చాలా భయపడ్డారు. తొలిసారి ఇందిరను కలుసుకున్న మేనక తాను మోడల్ననే విషయాన్ని ఆమెకు చెప్పలేదు.మేనక గురించి తెలుసుకున్న ఇందిరదీనికి ముందు కూడా సంజయ్ పలువురు యువతులను ఇందిరకు పరిచయం చేశారు. మేనక కూడా ఇలాంటి స్నేహితురాలే అయివుంటుందని ఇందిరా గాంధీ తొలుత భావించారు. అయితే తరువాత సంజయ్ తన తల్లి ఇందిరను ఒప్పించి, మేనకతో తన వివాహానికి 1974, జూలై 29న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ హడావుడిలో ఇందర.. మేనక కుటుంబం గురించి తెలుసుకోలేకపోయారు. నిశ్చితార్థ వేడుక పూర్తయ్యాక, ఇరు కుటుంబాలకు ఇందిర ఇంట్లో విందు జరిగింది. అప్పడు ఇందిర స్వయంగా మేనక కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు.భర్తను ప్రధానిగా చూడాలనుకున్న మేనకఅప్పటికే నిశ్చితార్థం జరిగిపోవడంతో ఇందిర మరేమీ చేయలేక మౌనం వహించారు. 1974, సెప్టెంబర్ 23న సంజయ్ గాంధీ, మేనకా గాంధీల వివాహం జరిగింది. అయితే మేనక ప్రవర్తన సోనియాకు నచ్చేది కాదని వినికిడి. ఏదో ఒకరోజు తన భర్త సంజయ్ ప్రధాని అవుతారని మేనక అందరికీ చెబుతుండేవారట. సంజయ్, మేనకలకు 1980లో వరుణ్‌గాంధీ జన్మించాడు. ఇది జరిగిన మూడు నెలలకు 1980 జూన్‌లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. రెండేళ్ల తరువాత ఇందిరాగాంధీ ఇంటి నుంచి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీని తీసుకుని మరో ఇంటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో సోనియా, మేనకల మధ్య సత్సంబంధాలు లేవని చెబుతుంటారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నం? ఏ తరం వారు ఏం చేస్తున్నారు? -
‘సుల్తాన్పూర్ ప్రజల ‘అమ్మ‘కు మద్దతు ఇవ్వడానికి వచ్చా’
లక్నో: దేశంలో కేవలం సుల్తాన్పూర్ నియోజకవర్గం ప్రజలు మాత్రమే తమ ఎంపీని ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తారని బీజేపీ నేత వరుణ గాంధీ అన్నారు. వరుణ గాంధీ తన తల్లి మేనకా గాంధీ కోసం గురువారం సుల్తాన్పూర్ పార్లమెంట్ స్థానంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేనకా గాంధీ సుల్తాన్పూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా వరుణ్ గాంధీ మాట్లాడారు.‘‘దేశంలోనే ఒకే ఒక పార్లమెంట్ స్థానంలో అక్కడి ప్రజలంతా తమ ఎంపీని ఆప్యాయంగా ‘అమ్మ’ అని పిలుస్తారు. నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మ మేనకా గాంధీకి ప్రజలు మద్దలు ఇవ్వాలని కోరడానికి రాలేదు. సుల్తాన్పూర్ ప్రజల ‘అమ్మ’కు మద్దతు ఇవ్వాలని కోరటం కోసం వచ్చా’’ అని వరుణ్ గాంధీ అన్నారు.#WATCH | Uttar Pradesh | BJP leader Varun Gandhi campaigns for his mother and party candidate from Sultanpur constituency Maneka Gandhi "There is only one constituency in the country where its people do not call its MP as 'Sansad' but as 'Maa'...I am here not just to gather… pic.twitter.com/8n7u9k8Ztp— ANI (@ANI) May 23, 2024మేనకా గాంధీ సుల్తాన్పూర్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయటం ఇది రెండోసారి. 2019 ఎన్నికల్లో ఆమె ఇక్కడ 14000 వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈసారి భారీ మెజార్టీ సాధించటంపై బీజేపీ దృష్టి పెట్టింది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఇక.. ఫిలిబీత్ సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ గాంధీకి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే వరుణ్ గాంధీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించటం వల్లనే బీజేపీ ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదని రాజకీయంగా పార్టీలో చర్చ జరుగుతోంది. -
‘వరుణ్ విషయంలో బీజేపీని సవాల్ చేయలేను’
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. 400 స్థానాలే లక్ష్యంగా ప్రచారంలో వేగం పెంచింది. ఇక.. ఈసారి కొంతమంది సిట్టింగ్‌లకు బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అందులో ప్రముఖంగా వరుణ్‌గాంధీకి ఫిలిభీత్ స్థానంలో బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవటంపై చర్చ జరిగింది. అయితే తాజాగా శనివారం వరణ్ గాంధీకి టికెట్ కేటాయించకపోవటంపై ఆయన తల్లి మేనకా గాంధీ స్పందించారు. ఆమె ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘వరుణ్ గాంధీ విషయంలో బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తాను సవాల్ చేయలేను. నేను పార్టీకి నిర్ణయానికి గౌరవిస్తాను. అలాగే వరుణ్ గాంధీపై నాకు అపారమైన నమ్మకం, విశ్వాస ఉంది. నా కుమారుడు వరుణ్ గాంధీ చాలా సమర్థవంతుడు, తన స్థాయికి తగినట్లు కృషి చేస్తాడు. కొంతమంది ఎంపీ కావాలనుకుంటారు. కానీ, కొంతమంది ఎంపీ పదవికి ఎంపిక కాకుండానే ప్రజల కోసం రాజకీయనాయకులు అవుతారు. జీవితం మన కోసం ఏం నిక్షిప్తం చేసి ఉందో తెలియదు’’ అని మేనకా గాంధీ అన్నారు. ఇక.. మేనకా గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ పార్లమెంట్ నుంచి బరిలో ఉన్నారు. ప్రజలకు సేవ చేయటం కోసం మరోసారి బీజేపీ టికెట్ కేటాయించటంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఎన్ని ఓట్లను సాధిస్తార్న ప్రశ్నకు స్పందిస్తూ.. వీలైనన్ని ఎక్కువ ఓట్లు సంపాదించటం కోసం ప్రతిరోజూ ప్రయత్నం చేస్తూ ఉంటానని తెలిపారు.వరుణ్ గాంధీ రెండుసార్లు ఫిలిభీత్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ, ప్రభుత్వ విధానాలకు వరుణ్ గాంధీ బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ ఫిలిభీత్ టికెట్ నిరారించినట్లు ప్రచారం జరిగింది. -
సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్ పుర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి క్రితికా జోత్నకు నామినేషన్ ప్రతాలు అందించారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్డీఏ కూటమి పార్టీలు నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, అప్నాదల్ నేత, కేబినెట్ మంత్రి అశిష్ పటేల్‌లు ఆమె వెంట ఉన్నారు.నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మేనకా గాంధీ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల చేసిన అభివృద్ది కంటే వచ్చే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడి ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.ప్రతిపక్షాల ఆరోపణలపైబీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై మేనకా గాంధీ ఖండించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ నుంచి తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.వరుణ్ గాంధీకి నో టికెట్వరుణ్ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పిలిభిత్ లోక్‌సభ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. జితిన్ ప్రసాదకు అప్పగించింది.2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. -
వరుణ్‌గాంధీ పోటీ.. మేనకాగాంధీ ఏమన్నారంటే?
బీజేపీ మహిళా నేత, సుల్తాన్పూర్ లోక్‌సభ అభ్యర్థి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ విషయమై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వరుణ్ గాంధీకి బీజేపీ పిలిభిత్ సీటును కేటాయించకపోవడంతో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా విలేకరులు మేనకా గాంధీని మీ కుమారుడు వరుణ్ గాంధీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అని అడిగినప్పుడు ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. వరుణ్ ఉత్తమ ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. వరుణ్ దేశానికి మంచి చేస్తారని అంటూనే, వరుణ్ గాంధీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయరని, మేం అలాంటి వాళ్లం కాదని పేర్కొన్నారు. దీనికి ముందు బీజేపీ ఎంపి వరుణ్ గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు భవోద్వేగంతో కూడిన లేఖను రాశారు. ఎంపీగా తన పదవీకాలం ముగిసినా, పిలిభిత్‌తో తన అనుబంధం తన చివరి శ్వాస వరకు ఉంటుందని అన్నారు. సామాన్యుల గొంతు పెంచేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వరుణ్ ఆ లేఖలో రాశారు. #WATCH सुल्तानपुर: वरुण गांधी का टिकट कटने पर भाजपा नेता मेनका गांधी ने कहा, "ये पार्टी का फैसला है। वरुण बहुत अच्छे सांसद थे। आगे भी जिन्दगी में जो भी बनेंगे, देश के लिए अच्छा ही करेंगे।" वरुण गांधी द्वारा अलग से चुनाव लड़ने के सवाल पर उन्होंने कहा, "नहीं...हम इस तरह के लोग… pic.twitter.com/xAZTJOyrLA — ANI_HindiNews (@AHindinews) April 8, 2024 -
ఏం చేస్తారో వరుణ్ గాంధీనే అడగండి: మేనకా గాంధీ
లక్నో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పదిరోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ యూపీలోని సుల్తాన్పూర్ పర్యటిస్తున్నారు. తన కుమారుడికి బీజేపీ ఫిలీభీత్ స్థానాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. బీజేపీ వరణ్‌గాంధీకి టికెట్ నిరారించిన తర్వాత తొలిసారి మేనకా గాంధీ స్పందించారు. ప్రస్తుతం వరణ్‌గాంధీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు మేనకా గాంధీ సమాదానం ఇచ్చారు.‘వరుణ్‌కు గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి. లోక్‌సభ ఎన్నికల అనంతరం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా సమయం ఉంది’అని ఆమె తెలిపారు. ‘నేను బీజేపీలో ఉన్నందుకు సంతోషపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నాకు టికెట్ ఇచ్చారు.అయితే టికెట్ కేటాయించటంలో కొంత జాప్యం జరిగింది. దీంతో నేను ఎక్కడ పోటీ పడతానోనని కొంత అయోమయం మొదలైంది. మళ్లీ అందులో ఈసారి ఫిలీభీత్? లేదా సుల్తాన్పూర్?. అయితే బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవటం సంతోషం. మళ్లీ నేను సుల్తాన్‌పూర్‌లో పోటీ చేయటం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఒకసారి గెలిచిన ఎంపీ మళ్లీ గెలవడని చర్రిత చెబుతోంది ’అని మేనకా గాంధీ అన్నారు.టికెట్ ప్రకటించిన తర్వాత మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌లో పర్యటించటం ఇదే మొదిటిసారి. పది రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్పూర్ సెగ్మెంట్లో సుమారు 101 గ్రామాలను పర్యటించనున్నారు. ఇక.. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వరణ్ గాంధీ సొంత పార్టీపైనే విమర్శలు చేయటంలో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుణ్ గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిని లేఖ రాశారు. తన కడ శ్వాసవరకు ఫిలీభీత్ ప్రజలతో సంబంధాలను కొనసాగాస్తానని చెప్పారు. -
ఏం చేస్తారో వరుణ్ గాంధీనే అడగండి: మేనకా గాంధీ
లక్నో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పదిరోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ యూపీలోని సుల్తాన్పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన కుమారుడికి బీజేపీ ఫిలీభీత్ స్థానాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. బీజేపీ వరణ్‌గాంధీకి టికెట్ నిరాకరించిన తర్వాత తొలిసారి మేనకా గాంధీ స్పందించారు. ప్రస్తుతం వరణ్‌గాంధీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు మేనకా గాంధీ సమాదానం ఇచ్చారు. ‘వరుణ్‌కు గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి. లోక్‌సభ ఎన్నికల అనంతరం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా సమయం ఉంది’ అని ఆమె తెలిపారు. ‘నేను బీజేపీలో ఉన్నందుకు సంతోషపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నాకు టికెట్ ఇచ్చారు.అయితే టికెట్ కేటాయించటంలో కొంత జాప్యం జరిగింది. దీంతో నేను ఎక్కడ పోటీ పడతానోనని కొంత అయోమయం మొదలైంది. మళ్లీ అందులో ఈసారి ఫిలీభీత్? లేదా సుల్తాన్పూర్?. అయితే బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవటం సంతోషం. మళ్లీ నేను సుల్తాన్‌పూర్‌లో పోటీ చేయటం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఒకసారి గెలిచిన ఎంపీ మళ్లీ గెలవడని చర్రిత చెబుతోంది ’ అని మేనకా గాంధీ అన్నారు. టికెట్ ప్రకటించిన తర్వాత మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌లో పర్యటించటం ఇదే మొదిటిసారి. పది రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్పూర్ సెగ్మెంట్లో సుమారు 101 గ్రామాలను పర్యటించనున్నారు. ఇక.. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వరణ్ గాంధీ సొంత పార్టీపైనే విమర్శలు చేయటంలో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుణ్ గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిని లేఖ రాశారు. తన కడ శ్వాసవరకు ఫిలీభీత్ ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తానని చెప్పారు. -
బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి బిగ్ షాక్..
ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మేనకాగాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ మేనకా గాంధీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసేందుకు ఇస్కాన్ సిద్ధమైంది. ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ఇటీవల మేనకా గాంధీ.. గోశాలల్లో ఉన్న గోవుల్ని ఇస్కాన్ అమ్ముకుంటున్నదని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, ఇస్కాన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, మేనకా గాంధీ వ్యాఖ్యలపై కోల్‌కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మేనకా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తుల్ని ఆమె వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఆమెపై వంద కోట్ల పరువునష్టం కేసు వేసేందుకు న్యాయ ప్రక్రియ చేపట్టామని, ఇవాళ ఆమెకు నోటీసు జారీచేశామని చెప్పుకొచ్చారు. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అయిన ఆమె ఎటువంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థపై ఎలా ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. #Breaking ISKCON sends Rs 100 cr defamation notice to Maneka Gandhi over 'biggest cheat' remark #ISKCON #ManekaGandhi #Defamation #Cows — MANOJ KUMAR (@ManojBroadcast) September 29, 2023 అంతకుముందు కూడా.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. ఆమె ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని ఇష్కాన్ పేర్కొన్నది. గోవులు, ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్ తెలిపారు. కేవలం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని ఆదరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. Sad reality of ISCON Temple ISCON temple exposed by Maneka Gandhi ji#ISKCON | @yudhistirGD | #ManekaGandhi | Maneka Gandhi | मेनका गांधी pic.twitter.com/2hgc7ED7Aq — INDIA Alliance (@2024_For_INDIA) September 27, 2023 ఇదిలా ఉండగా.. మేనకా గాంధీ ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారు. ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. ఓ చోట ఉన్న ఇస్కాన్ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారు. ఇది కూడా చదవండి: పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్.. ‘ఇండియా’ కూటమిపై కేజ్రీవాల్ క్రేజీ కామెంట్స్ -
ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్‌పై( ISKCON) సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారామె. ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. అనంతపూర్ ఇస్కాన్ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారామె. #BJP MP and former minister #MenakaGandhi telling what #ISKCON is doing at #Gaushalas #Bhakts and @IskconInc should react on this.. pic.twitter.com/RdpLMBsZP1 — manishbpl (@manishbpl1) September 26, 2023 అయితే.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. పశు సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఇస్కాన్ ప్రతినిధి యుధిష్టిర్ గోవిందా దాస్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా అనే సంగతి తెలిసిందే. Response to the unsubstantiated and false statements of Smt Maneka Gandhi. ISKCON has been at the forefront of cow and bull protection and care not just in India but globally. The cows and bulls are served for their life not sold to butchers as alleged. pic.twitter.com/GRLAe5B2n6 — Yudhistir Govinda Das (@yudhistirGD) September 26, 2023 -
మేనకా గాంధీపై కేసు నమోదు
తిరువనంతపురం : బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీపై కేసు నమోదైంది. మలప్పురం జిల్లా, జిల్లా వాసులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ మలప్పురానికి చెందిన సుభాష్ చంద్రన్ అనే అడ్వకేట్ గురువారం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే 29న జరిగిన ఏనుగు ఘటన పాలక్కడ్ జిల్లాలో చోటుచేసుకుందని, మలప్పురం జిల్లాలో కాదని ఆయన స్పష్టం చేశారు. ఏనుగు ఘటనకు కొంతమంది మతం రంగు పులుముతున్నారని ఆయన పేర్కొన్నారు. ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉన్న మలప్పురం జిల్లాపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ మలప్పురం జిల్లాపై, జిల్లా వాసులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ( ఏనుగు మృతి కేసులో తొలి అరెస్టు ) కాగా, బుధవారం మేనకా గాంధీ ట్విటర్ వేదికగా ఏనుగు ఘటనపై స్పందిస్తూ.. ‘‘మలప్పురం జిల్లాలో జంతువులపై అమానుషంగా ప్రవర్తించే నేర ప్రవృత్తి ఎక్కువ. ఇప్పటివరకు ఒక్క నేరస్తుడిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఇలా అయితే వాళ్లు నేరాలు చేస్తూనే ఉంటారు’’ అని పేర్కొన్నారు. (చదవండి: ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్) -
మంచికి ఆద్యులు
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ‘మానవతావాది’ అని పేరు. ట్విట్టర్లో ఏదైనా సమస్యను పెడితే వెంటనే ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆమె తన యంత్రాంగాన్ని ఆమె పరుగులు తీయించేవారు. ఇప్పుడు ఆమె లేరు. ఆమె స్ఫూర్తి మిగిలే ఉంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మాజీ మంత్రి మేనకా గాంధీకి సోమవారం ఒక ట్వీట్ వచ్చింది. ‘‘ఈ వానరం గాయపడింది. దాని పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఎవరైనా ఎన్జీవోలు కానీ, యానిమల్ యాక్టివిస్టులు కానీ వచ్చి ఈ మర్కటాన్ని కాపాడండి. ఇది ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, రైసీనా రోడ్డు, న్యూఢిల్లీ సమీపంలో ఉంది’ అని ట్వీట్ చేస్తూ ఎవరో మేనకా గాంధీని కూడా ట్యాగ్ చేశారు. జంతు ప్రేమికురాలైన మేనకా గాంధీ, ఆ ట్వీట్‌కు కేవలం గంటలోపే స్పందిస్తూ, ‘నన్ను ట్యాగ్ చేసినందుకు చాలా సంతోషం, నేను ఇప్పుడే కారు పంపిస్తున్నాను. ఆ మూగప్రాణిని వారు సంజయ్‌గాంధీ యానిమల్ సెంటర్‌కి చికిత్స కోసం తీసుకువెళ్తారు. కొద్ది నిమిషాలలోనే కారు అక్కడకు వస్తుంది’ అని రిప్లయ్ పోస్టు చేశారు. అన్నట్లే కారు వచ్చింది. వానరాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆ వానరం వైద్యుల సంరక్షణలో ఉంది. దాని ఆరోగ్యం బాగుంది. మంచి ఏదైనా మార్పు మహిళలతోనే మొదలౌతుంది. ప్రజల కష్టాలకు, కన్నీళ్లకు తక్షణం స్పందించడం అనేది సుష్మతో మొదలైంది. ఆమె తర్వాత మిగతా కేంద్ర మంత్రులు ఆమెను అనుసరిస్తున్నారు. మేనక కూడా సుష్మ బాటలోనే నడుస్తున్నారు. ఇప్పుడీ వానరం గురించి సమాచారం ఇచ్చింది కూడా ఒక మహిళే కావడం విశేషం. -
తల్లి బెదిరింపులు.. తనయుడి బుజ్జగింపులు
లక్నో : ‘‘ నా ముస్లిం సోదరులకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు నాకు ఓటేస్తే చాలా సంతోషిస్తా. ఒక వేళ ఓటు వేయకపోయినా నేను పట్టించుకోను. మీ కోసం పనిచేస్తా’’ ఆదివారం ఎన్నికల ప్రచార సభలో పిలీభిత్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి వరుణ్ గాంధీ అన్న మాటలివి. వరుణ్ గాంధీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి కంచుకోటలో ఎలాగైనా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారాయన. ఇదిలా ఉండగా వరుణ్ గాంధీ తల్లి కేంద్రమంత్రి మేనకా గాంధీ ఇందుకు పూర్తి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సుల్తాన్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె కొద్ది రోజుల క్రితం ముస్లిం ఓటర్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు‘‘ నేను గెలవబోతున్నాను. మీరు ఓటు వేసినా.. వేయకపోయినా.. మీరు 100 ఓట్లు వేయండి. 50 ఓట్లు వేయండి. మీరు నాతో పనిచేయించుకోవడానికి వచ్చినపుడు దాన్నే నేను దృష్టిలో పెట్టుకుంటాను.’’ అంటూ తనకు ఓటు వేయకపోతే ముస్లింలకు ఎలాంటి సహాయం చేసేది లేదని ఆమె చెప్పకనే చెప్పారు. ఒకరకంగా బెదిరింపులకు దిగారు. అయితే ఈ వ్యాఖ్యాలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఆమెపై రెండురోజుల పాటు ప్రచార నిషేదం విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని పిలీభీత్ స్థానం నుంచి వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ 1989 నుంచి ఆరుసార్లు విజయం సాధించి, ఈ స్థానాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 52 శాతం ఓట్లను సాధించి మేనకా గాంధీ విజయఢంకా మోగించారు. అంతకు ముందు 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్ గాంధీ పోటీచేసి, మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తల్లీ కొడుకులు తమ నియోజకవర్గాలను పరస్పరం మార్చుకోవడం విశేషం. ఈసారి మేనకా గాంధీ స్థానంలో ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. సుల్తాన్పూర్ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. -
నోరు మూయించిన ఈసీ
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగిఆదిత్యనాథ్, బీజేపీ నేత మేనకాగాంధీ, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ నేత ఆజంఖాన్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్రజేసింది. యోగి, మేనక, మాయ మతవిద్వేష వ్యాఖ్యలు చేయగా, బీజేపీ నేత జయప్రద వ్యక్తిత్వాన్ని అవమానించేలా ఆజంఖాన్ మాట్లాడారు. విద్వేష వ్యాఖ్యల అంశంలో ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో యోగి, ఆజంఖాన్‌లు 72 గంటలపాటు (3 రోజులు), మేనక, మాయ 48 గంటలపాటు (2 రోజులు) ఏ విధమైన ప్రచారం చేయకుండా ఈసీ నిషేధించింది. విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు వారికి ఈసీ చీవాట్లు పెట్టింది. యోగి, ఆజంఖాన్‌లు గతంలోనూ ఇలాంటి మత విద్వేష వ్యాఖ్యలు చేయడంతో వారిని ఈసీ హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో వారిద్దరిపై 72 గంటల నిషేధం విధించామని ఎన్నికల సంఘం అధికారి వెల్లడించారు. అదే మాయ, మేనకలు తొలిసారి విద్వేష వ్యాఖ్యలు చేసినందున వారిపై 48 గంటల నిషేధమే విధించామన్నారు. ఈ నిషేధం మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తుందని ఈసీ అధికారి చెప్పారు. ఈ ఎన్నికలు అలీకి, బజరంగ్ బలికి మధ్య జరిగే యుద్ధమని మీరట్‌లో యోగి అన్నారు. ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయకూడదని దేవబండ్‌లో మాయావతి కోరారు. ముస్లింలు తనకు ఓటు వేయకపోతే తర్వాత వారు ఏదైనా పనికోసం తన వద్దకు వచ్చినప్పుడు వారికి సాయం చేయాలని తనకు అనిపించదని మేనక పేర్కొన్నారు. ఇక జయప్రదకు ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాలపై ఆజంఖాన్ మాట్లాడుతూ జయప్రద ఖాకీ నిక్కర్ వేసుకుంటుందని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలోనూ మత విద్వేష వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఎస్పీ నేత ఆజం ఖాన్‌లపై ఈసీ నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలోనే.. విద్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఈసీ ఏ చర్యలూ తీసుకోవడం లేదంటూ సుప్రీంకోర్టు బెంచ్ తొలుత ఆగ్రహం వ్యక్తం చేసింది. అర్ధగంటలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తమ ముందు ఉండాలని కూడా ఓ సందర్భంలో హెచ్చరించింది. -
ముస్లిం ఓటర్లకు మేనకా గాంధీ బెదిరింపులు
-
ప్రియాంక గాంధీ పుస్తకం.. కాంగ్రెస్ పార్టీ హోప్స్!
కష్టాలు, కడగండ్లలో ఉన్న మహిళల విజ్ఞప్తులను స్వీకరించి ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు, అవస రమైతే వారికి ఆశ్రయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘స్వాధార్ గృహ్’ షెల్టర్ హోమ్‌లలో తక్షణం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో ఐదు, ఒడిస్సాలో ఎనిమిది, కర్ణాటకలో ఎనిమిది, ఉత్తర ప్రదేశ్‌లోని ఐదు స్వాధార్ హోమ్‌లను తనిఖీలు జరిపించిన అనంతరం మేనక ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. స్వాధార్ గృహ్ పథకం కింద ఏర్పాటైన షెల్టర్ హోమ్‌లలో అసహాయ మహిళల్ని భౌతికంగా వేధిస్తున్నారని, అనారోగ్యంగా ఉన్నవారికి వైద్య సేవలు అందడం లేదని తనిఖీ అధికారులకు ఫిర్యాదు అందడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తారా, రారా అనే విషయంపై ఇప్పటికింకా స్పష్టత రానప్పటికీ, ప్రస్తుతం ఆమె రాస్తున్న ఒక పుస్తకం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు లేకుండా పోవని అంతా భావిస్తున్నారు. ‘అగైన్స్ట్ అవుట్రేజ్’ అనే టైటిల్‌తో రాబోతున్న 300 పేజీల ఆ పుస్తకానికి ప్రచురణకర్తలు ఇప్పటికే కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం 2019 మార్చి లోపు ప్రియాంక ఆ పుస్తకం స్క్రిప్టును అందజేయవలసి ఉంటుంది. ఇంగ్లిషు, హిందీ, మిగతా కొన్ని ప్రాంతీయ భాషలతో పాటు, ఆడియో బుక్‌గానూ అందుబాటులోకి రానున్న ‘అగైన్స్ట్ అవుట్రేజ్’.. ఎన్నికలకు నెల ముందుగా విడుదల అయ్యే అవకాశం ఉంది. బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీకి, ఆయన ఆమెరికన్ ప్రియురాలు మేఘన్ మార్కెల్‌కు ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. అనంతరం మార్కెల్ యు.ఎస్.తో తన భవబంధాలనన్నింటినీ తెంచేసుకుని రాజప్రాసాదంలోకి అడుగు పెట్టారు. అలా ఆమె తెంచుకున్న బంధాలలో ఆమె తండ్రి థామస్ కూడా ఒకరు. ఆయన రాస్తున్న ఉత్తరాలకు ఆమె స్పందించడం లేదు. ఇస్తున్న మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వడం లేదు. దీంతో దుఃఖితుడైన థామస్ ‘నా కూతురికి దూరంగా ఉండలేకపోతున్నానని’ ఏకంగా బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్నే ఆశ్రయించారు. ‘కనీసం క్రిస్మస్కైనా నా కూతురు నా దగ్గరకు వచ్చేలా ఒప్పించండి’ అని ఒక అమెరికన్ టీవీ షో లో కన్నీరు మున్నీరవుతూ రాణిగారిని అభ్యర్థించారు. థామస్ గతంలో టీవీ లైటింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రిటైర్మెంట్లో ఉన్నారు. నెత్తిపై అప్పులు ఉన్నాయి. కూతురు మంచి పొజిషన్లో ఉంది కనుక తనకు చెడు కాలం తప్పుతుందని ఆయన ఆశిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా 2015 జూలై 9న ప్రదర్శన జరుపుతున్న 300 మంది సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులపై చైనా ప్రభుత్వం ‘దేశ విద్రోహులు’గా ముద్ర వేసి వారిపై విరుచుకుపడింది. వారిలో నలుగురిని కారాగారంలో బంధించి ఇప్పటి వరకు వారి ‘నేరం’పై విచారణ జరిపించడం గానీ, శిక్ష విధించడం గానీ చేయలేదు. తక్షణం వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ నలుగురి భార్యలు శిరోజాలు తీయించుకుని హైకోర్టు ఎదుట ప్రదర్శన జరిపారు. ‘ఇదెక్కడి న్యాయం?’ అని ప్రశ్నించారు. చైనాలో ‘ఊఫా’ అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. న్యాయం ధర్మం లేకపోవడం ఒక అర్థం కాగా, తలపై జుట్టు లేకపోవడం ఇంకో అర్థం. ఈ రెండు అర్థాలనూ సం++గురు మహిళలు ఇలా శిరోజాలు తీయించుకుని న్యాయం కోసం పోరాడుతున్నారు. -
స్త్రీలోక సంచారం
తల్లి సంరక్షణలో మాత్రమే ఉన్న పిల్లలు పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు తండ్రి పేరు, వివరాలను పొందుపరిచేందుకు ఇష్టపడకపోతే, తండ్రి పేరు లేకుండానే వారికి పాన్ కార్డును జారీ చేసేలా 1962 నాటి ఇన్‌కం ట్యాక్స్ నిబంధనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సడలించింది. ‘‘ఇప్పుడిక తండ్రికి దూరంగా తల్లితో ఉంటున్న పిల్లలు తండ్రి పేరుకు బదులుగా తల్లిపేరుతో పాన్ కార్టు పొందవచ్చు’’ అని స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఆ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ ఏడాది జూలైలో చేసిన సిఫారసుల మేరకు.. ఆర్థిక శాఖ ఈ విధమైన వెసులుబాటును కల్పించింది. భర్తతో విడిపోయి దూరంగా ఉంటున్న మహిళలు తమ పిల్లలకు తండ్రిగా అతడి పేరు పాన్ కార్డుపై ఉండడంపై విముఖత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనక తెలిపారు.ఉమన్ పవరేంటో చూపించే హాలీవుడ్ చిత్రాలు, హీరో ప్రధాన నాయకుడిగా ఉన్న చిత్రాలకంటే కూడా ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నాయని ‘క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ అండ్ షిఫ్ట్7’ అనే సంస్థ సర్వేలో వెల్లడయింది. 2014–2017 మధ్య చిత్రాల వసూళ్లను గమనించినప్పుడు ‘ట్రోల్స్’, టీనేజ్ మ్యుటెంట్ నింజా టర్టీస్’, ‘మోనా’, ‘ఇన్సైడ్ అవుట్’, ‘వండర్ ఉమన్’ వంటి కథానాయిక ప్రాధాన్యం గల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తంలో కలెక్షన్లను మూటకట్టుకోవడం కనిపించిందని ఆ సంస్థ పేర్కొంది. తక్కువ బడ్జెట్‌తో తయారై ఎక్కువ లాభాలను సాధించిన చిత్రాలను కూడా తమ సర్వేకోసం తీసుకున్నామని, అలా చూసినా ఫిమేల్ లీడ్ మూవీలదే పై చేయిగా ఉందని సంస్థ ప్రతినిధి క్రిస్టీ హాబెగ్గర్ తెలిపారు. లాభాలను కోరుకునే నిర్మాతలు, కనీసం నష్టాలనైనా తప్పించుకోవాలనుకునే నిర్మాతలు తెర ముందు కనిపించే నటీమణులను, తెరవెనుక సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకునేటప్పుడు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని ఈ నివేదిక సూచిస్తోందని హాబెగ్గర్ అన్నారు. -
స్త్రీలోక సంచారం
పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల ఫిర్యాదులను స్వీకరించి, విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ (ఐ.సి.సి.) ఏర్పాటు చేసినట్లు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు).. కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీకి లేఖ రాసింది. 2013 నాటి ‘సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్‌ప్లేస్’ చట్టాన్ని అనుసరించి ఐ.సి.సి.ని ఏర్పాటు చేసే విషయమై గత నెలలో మేనకాగాంధీ ఏడు జాతీయ పార్టీలకు, 51 ప్రాంతీయ పార్టీలకు పంపిన లేఖకు ప్రత్యుత్తరంగా సి.ఐ.పి. ఈ లేఖను రాసింది. పార్టీ చీఫ్ మమతా బెనర్జీ మందలించినందుకు కోల్‌కతా మేయర్, తృణమూల్ కాంగ్రెస్ లీడర్ సోవన్ చటర్జీ తన మంత్రి పదవులకు రాజీనామా చేశారు. తర్వాత ఇంటికెళ్లి గొడవ పెట్టుకున్నాడు. తర్వాత ఇంటి పరువును, పార్టీ పరువును తీసుకెళ్లి ఓ బెంగాలీ టీవీ చానల్లో కలిపేశాడు. ఆయన భార్య రత్నా చటర్జీ. ఆమెకు వేరే మగాళ్లతో çసంబంధాలున్నాయని చానల్ ముఖంగా ఆయన ఆరోపించారు. ఇంకో ఆరోపణ.. తన స్నేహితురాలు వైశాఖీ బెనర్జీని, ఆమె కూతుర్ని చంపించడానికి తన భార్య సుపారీ ఇచ్చిందట. (వైశాఖీ యూనివర్శిటీ లెక్చరర్). అయితే ఇవన్నీ అబద్ధాలనీ అదే చానల్‌కు వచ్చి, ఖండించి తిరిగి వెళ్లిపోయారు సోవన్ భార్య రత్న. ఇంతకీ మమత అతణ్ణి ఎందుకు మందలించారు? ఆ విషయాన్ని రత్న అయితే బాగా చెప్పగలుగుతారు. సోవన్.. పని దొంగలా మారాడట! దీదీ టికెట్ ఇచ్చి, గెలిపించి, మేయర్ పదవినీ, మంత్రి పదవులను ఇప్పిస్తే.. పరస్త్రీ వ్యామోహంలో పడి.. ఇంటినీ, కన్నతల్లిలాంటి పార్టీని నిర్లక్ష్యం చేసి తన గోతిని తనే తవ్వుకున్నాడట. ఇంకా ముఖ్యమైన విషయం ఈ భార్యాభర్తలిద్దరూ యేటా కాళీపూజకు మమత ఇంటికి వెళతారు. ఈ ఏడాది రత్న ఒక్కరే వెళ్లివలసి వచ్చింది. ‘‘ఆమె వలలో పడి నన్ను పట్టించుకోవడం మానేశాడు. పూజకు నా భర్త లేకుండా వెళ్లడం నన్నెంతో బాధించింది’’ అని రత్న అంటున్నారు. పాపం.. హౌసింగ్, ఫైర్, ఎమర్జెన్సీ అనే మూడు పదవులు నిర్వహించిన సోవన్ చటర్జీ హౌస్‌లో ఇప్పుడు ఫైర్ రేగి, ఆయన మనశ్శాంతి అత్యవసర స్థితిలో పడిపోయింది. రత్న వేరే ఫ్లాట్‌లో ఉంటున్నారు. -
మంత్రుల మధ్య ‘అవని’ చిచ్చు
న్యూఢిల్లీ/ముంబై: మ్యాన్ఈటర్ పులి అవనిని చంపిన ఉదంతంలో మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మధ్య వివాదం మరింత ముదిరింది. సుధీర్ ముంగంతివార్‌ను కేబినెట్ నుంచి తొలగించే విషయాన్ని పరిశీలించాలని మేనకా గాంధీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మంగళవారం లేఖ రాశారు. దీనికి ధీటుగా స్పందించిన ముంగంటివార్..పోషకాహార లోపంలో పిల్లలు చనిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ మేనకా గాంధీనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వన్యప్రాణులను కాపాడాల్సిన అటవీ మంత్రే వాటిని సంహరిస్తూ విధుల నిర్వహణలో విఫలమయ్యారని మేనక ఆరోపించారు. పులి అవని గురించి రెండు నెలలుగా ఆయనతో మాట్లాడుతున్నానని, దానికి మత్తు సూది ఇచ్చి పట్టుకోవాలని సూచించానని అన్నారు. మంత్రి కొంత ఓపిక, సున్నితత్వం వహిస్తే పులిని ప్రాణాలతోనే పట్టుకునే వాళ్లమని తెలిపారు. మరోవైపు, అవని హత్యతో తనకేం సంబంధం లేకున్నా మేనకా గాంధీ తనని రాజీనామా చేయాలంటున్నారని ముంగంటివార్ అన్నారు. ‘నాకు సంబంధంలేని దానికి నేను నైతిక బాధ్యత తీసుకోవాలనుకుంటే ఒక షరతు. పోషకాహారం లోపంతో చిన్నారులు చనిపోతున్న ఉదంతాలకు కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఆదర్శంగా నిలవాలి’ అని వ్యాఖ్యానించారు. చంపడం పరిష్కారం కాదు.. భారత్‌లో వరసగా జరిగిన రెండు పులుల హత్యపై వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ ఆందోళన వ్యక్తం చేసింది. వన్య మృగాలతో ఎదురయ్యే ఇబ్బందులు తొలగించేందుకు వాటిని హతమార్చడం పరిష్కారం కాదని పేర్కొంది. ‘మానవుడు–జంతువుల మధ్య ఘర్షణ తలెత్తిన సందర్భాల్లో మానవీయ, ప్రొఫెషనల్ విధానాలు ఆచరించాలి. అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య చక్కటి సమన్వయం రాబట్టి, స్థానికంగా నివసించే ప్రజల్లో వన్యప్రాణుల పట్ల సున్నితత్వం పెంచాలి. ఇలాంటి సందర్భాల్లో మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని భారత్‌లో డబ్ల్యూఏపీ డైరెక్టర్ గజేందర్ కె.శర్మ అన్నారు. -
పులులు సంరక్షణ ఇలాగేనా!
మనుషుల ప్రాణాలకే విలువ లేకుండా పోతున్న వర్తమానంలో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బోరాతి గ్రామంలో శుక్రవారం రాత్రి పులిని కాల్చిచంపిన ఉదంతం చుట్టూ అల్లుకుంటున్న వివాదం కొందరికి ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. దీనిపై కేంద్ర శిశు, సంక్షేమ శాఖల మంత్రి మేన కాగాంధీ తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి సుధీర్ ముంగం టివార్ను లక్ష్యంగా చేసుకుని ఆమె వరస ట్వీట్లు హోరెత్తించారు. ‘అవని’ పేరుతో ఉన్న ఆ ఆడ పులిని ‘ఘోరంగా హత్య చేసిన తీరు’పై తాను చట్టపరంగా, రాజకీయపరంగా చర్యలు తీసుకుంటా నన్నారు. పులిని సంహరించిన నవాబ్ అస్ఘర్ అలీ ఖాన్ హైదరాబాద్‌కు చెందినవారు. తమ తొలి ప్రాధాన్యం సమస్యాత్మకంగా మారిన వన్య మృగాలను మత్తుమందు ప్రయోగించి పట్టుకోవడ మేనని అస్ఘర్ చెబుతుండగా...‘అవని’ని చంపమని మంత్రి నేరుగా ఆదేశాలిచ్చారన్నది మేనక అభి యోగం. పులిని మట్టుబెట్టడంలోని ఉచితానుచితాల సంగతలా ఉంచి ఈ ఉదంతంపై స్పందిం చాల్సిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇంతవరకూ మౌనంగా ఉండి పోయారు. కేంద్ర శిశు, సంక్షేమ శాఖల మంత్రి మేనకాగాంధీ మూగజీవాలు, వన్యప్రాణుల సంర క్షణ రంగంలో దశాబ్దాలుగా పనిచేస్తున్నందువల్ల కావొచ్చు... గట్టిగానే స్పందించారు. పైగా మహారాష్ట్రలో ఉన్నది తమ పార్టీ ప్రభుత్వమేనన్న సంగతి కూడా ఆమె మరచినట్టున్నారు. అక్కడ వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే ఈపాటికే దీనిపై ఎంతో రచ్చ అయ్యేది. ముంగంటివార్ చాలా జాగ్ర త్తగా జవాబిచ్చారు.‘మేనక హృదయంలో జంతువులపట్ల ఉన్న చాలా ప్రేమ ఉన్నదని అందరికీ తెలుసు. కానీ దాంతోపాటు ఆమెకు మనుషులపట్ల కూడా అంతే ప్రేమ ఉందని నేను భావి స్తున్నాను’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెండునెలలక్రితం సుప్రీంకోర్టు ముందుకు ‘అవని’ గురించి వ్యాజ్యం వచ్చినప్పుడు దాన్ని మత్తుమందిచ్చి పట్టుకోవాలని, తప్పనిసరి పరి స్థితుల్లో కాల్చి చంపవచ్చునని ధర్మాసనం తెలిపింది. యావత్మాల్ ఉదంతం జరిగిన రెండు రోజులకు ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో ఉన్న దూధ్వా టైగర్ రిజర్వ్‌లో మరో పులిని గ్రామ స్తులు చంపేశారు. ఒక గ్రామస్తుణ్ణి అది హతమార్చాక వారి ఆగ్రహం కట్టలు తెంచుకుందని అంటు న్నారు. గుజరాత్‌లోని సెక్రటేరియట్‌లోకి ప్రవేశించిన మరో పులిని సోమవారం అటవీ సిబ్బంది మత్తుమందిచ్చి అదుపులోకి తీసుకోగలిగారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో జీవ వైవిధ్యత పరిరక్షణ కీలకమని, అందుకోసం పులుల్ని సంరక్షించడం అవసరమని కేంద్రం గుర్తించాక 18 రాష్ట్రాల్లో 50 టైగర్ రిజర్వ్ల్ని ఏర్పాటు చేశారు. ఇవి మొత్తం 89,164 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. అందుకోసం జనావాసాలను తరలించడానికి ప్రయత్నించినప్పుడు ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదు రైంది. తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్ ప్రాంతాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం అడవుల్లోనూ ఈ టైగర్ రిజర్వ్‌లున్నాయి. వన్యప్రాణులు ఈ రిజర్వ్‌ల పరిధిలోనే ఉంటాయని చెప్పలేం. 30 శాతం పులులు ఆ పరిధి దాటి సంచరిస్తుంటాయని ఒక అంచనా. టైగర్ రిజర్వ్‌లు ఏర్పాటుచేసి నప్పుడు అక్కడుండే పులుల సంఖ్య పెరిగేకొద్దీ వాటన్నిటికీ అవసరమైన స్థాయిలో ఆహారం లభ్య మవుతున్నదా అన్నది తరచు సమీక్షించి లోటుపాట్లు పూడ్చాలి. లేనట్టయితే అందుకోసం సహజం గానే అవి బయటకొస్తాయి. మన దేశంలో పులుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కనుక మున్ముందు పరిస్థితి మరింత వికటిస్తుంది. నాలుగేళ్లకోసారి జరిగే పులుల గణన ప్రక్రియ ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. 2014 గణాంకాల ప్రకారం దేశంలో వాటి సంఖ్య 2,226. ప్రస్తుత లెక్కింపు ప్రక్రియ ఫలితాలను వచ్చే ఏడాది మార్చికల్లా ప్రకటిస్తారు. టైగర్ రిజర్వ్‌ల సమీప ప్రాంతాల్లో ఆదివాసీల బతుకులు అత్యంత దుర్భరం. సాగుచేసుకునేం దుకు వారి సెంటు భూమి కూడా ఉండదు. ఆదివాసీ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం రూ. 15,000 కూడా మించదని ఒక అంచనా. జీవిక కోసం వారు తప్పనిసరిగా అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడాలి. ఈ పరిస్థితుల్లో మనిషి–మృగం ఘర్షణ తప్పడం లేదు. పులుల్ని సజీ వంగా బంధించడం ఆషామాషీ కాదు. వాటిని పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమైనకొద్దీ అవి అనుభవం గడించి మరింత అప్రమత్తంగా మారతాయని, పర్యవసానంగా సమయం గడి చేకొద్దీ వాటిని బంధించడం అసాధ్యమవుతుందని వన్యప్రాణి సంరక్షకులు చెబుతారు. ఇప్పుడు యావత్మాల్ జిల్లాలో మట్టుబెట్టిన పులిని గత రెండేళ్లుగా బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా విజయం సాధించలేకపోయారు. కనుకనే చివరికిలా పరిణమించిందని అంటున్నారు. పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు తదితరాలను వన్యప్రాణులంటున్నామంటేనే అవి అర ణ్యాల్లోని జంతువులని అర్ధమవుతుంది. టైగర్ రిజర్వ్‌ల పేరుచెప్పి జనావాసాలను ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వాలు ఆ రిజర్వ్‌ల సమీపంలోనే అభివృద్ధి పేరిట పలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కన్హా, పెంచ్ రిజర్వ్‌ల కారిడార్‌లో జాతీయ రహదార్లు, రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే మహారాష్ట్రలోని మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచే రైల్వే లైన్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కెన్–బెత్వా నదుల్ని అనుసంధా నించే వివాదాస్పద ప్రాజెక్టు పూర్తయితే పన్నా టైగర్ రిజర్వ్ ప్రాంతంలోని 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతం మునిగిపోతుందని, అక్కడి వన్యప్రాణులకు మంచినీరు కూడా దొరకదని అంచనా. అటవీ సంపద చట్టవిరుద్ధంగా తరలిపోతున్నా పట్టించుకోకపోవడం దీనికి అదనం. కనుకనే ఆ జంతువులు జనావాసాల్లోకొచ్చి మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. తాజా ఉదంతాల నేపథ్యంలోనైనా ప్రభుత్వాలు పులులు సంరక్షణ విధానాన్ని సమీక్షించుకుని సవరించు కోవాలి. తమ చర్యల పర్యవసానాలులెలా ఉంటున్నాయో గుర్తించాలి. -
‘అవని’ అంతంపై ఆరోపణలు
మ్యాన్ ఈటర్‌గా మారిన ఆడపులి ‘అవని’ అలియాస్ టీ–1 ని కాల్చి చంపడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతిమ ప్రయత్నంగా మాత్రమే ఆ పులిని చంపాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టి, ఎలాంటి నిబంధనలను పాటించకుండా వేటగాడి తూటాలకు బలివ్వడంపై వన్యప్రాణుల హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి మేనకా గాంధీ ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా బొరాటి అటవీ ప్రాంతంలో ఉండే ఆడపులి ‘అవని’, అధికారులు పెట్టిన పేరు టీ–1, గత రెండేళ్లలో సమీపంలోని పొలాలు, గ్రామాల్లో ఉండే 13 మంది రైతులు, ఆదివాసీలను నరమాంస భక్షణకు అలవాటైన ఆ పులి చంపేసిందని భావిస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ పులిని పట్టుకునేందుకు గత మూడు నెలలుగా సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహారాష్ట్ర అటవీ శాఖ ఈ పులిని చంపేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన షార్ప్‌షూటర్ అస్ఘర్ అలీని రంగంలోకి దించింది. ఆయన శుక్రవారం రాత్రి అడవిలో ఉన్న ‘అవని’ని వేటాడి కాల్చి చంపారు. మత్తు ఇచ్చేందుకు ప్రయత్నించిన అటవీ సిబ్బందిపై దాడికి పాల్పడటంతో వారి ప్రాణాలను కాపాడేందుకే అవనిని కాల్చి చంపాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఉత్తర్వులు ఇచ్చినట్లు అటవీ మంత్రి సుధీర్ మునగంటి వార్ తెలిపారు. అవనికి ఉన్న పది నెలల రెండు పిల్లలకు తమను తాము పోషించుకోగల శక్తి ఉందన్నారు. వాటి పోషణ బాధ్యతను తమ శాఖ తీసుకుంటుందని తెలిపారు. అధికారులు ఏం చేయాలి? మ్యాన్ ఈటర్లను చంపాల్సిన సందర్భాల్లో అధికారులు ప్రామాణిక నిర్వహణ విధానం ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారినా, జబ్బు పడినా, అవయవాలు పనిచేయని స్థితిలో ఉన్నా అదీ దానిని పట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణులను చంపేందుకు అనుమతివ్వవచ్చు. దీంతోపాటు ఆ పులిని వేటగాడు స్పష్టంగా గుర్తించాలి. కెమెరా ట్రాప్‌లు లేక చారల తీరును బట్టి అది మ్యాన్ ఈటరేనని ధ్రువీకరించుకోవాలి. మ్యాన్ ఈటర్‌ను చంపిన వారికి అవార్డులు/రివార్డులు ఇవ్వడం కూడా నిషిద్ధం. విశాలమైన ప్రాంతంలో దానిని వేటాడేప్పుడు వెంట వన్యప్రాణుల నిపుణులు, బయోలజిస్టులు, పశువైద్యుడు, మత్తుమందు నిపుణులతో కూడిన బృందం ఉండాలి. ప్రభుత్వ ప్రతినిధిగా ఒక వైద్యుడు కూడా ఉండాలి. ఇవేమీ లేకపోవడం ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. వేటగాడు, ఆ పక్కన అవని కళేబరం ఉన్న ఫొటోలు మీడియాలో యథాతధంగా ప్రసారమయ్యాయి. ఇలా చేయడం 2016 నాటి ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పునకు విరుద్ధం. షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్‌తోపాటు అతడి కొడుకు అస్ఘర్ అలీఖాన్ ప్రభుత్వం అవనిని చంపటానికి పురమాయించింది. అస్ఘర్‌కు పులిని వేటాడేందుకు అనుమతి ఉందీ లేనిదీ తెలియదు. చంపడం అంతిమ యత్నమే కావాలి అవనిని చంపాలన్న ప్రతిపాదన కొన్ని నెలల క్రితమే వెలుగులోకి రాగా కొందరు వ్యతిరేకించారు. కొందరు అనుకూలంగా మాట్లాడారు. ఇది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టుకు చేరగా.. అవనిని మత్తు మందు ఇచ్చి బంధించడంలో విఫలమైన సందర్భాల్లో ఆఖరి యత్నంగా మాత్రమే కాల్చి చంపాలని ఆదేశించింది. అటవీ మంత్రే కారకుడు: మేనక ‘జంతువుల పట్ల ఎవరికీ సహానుభూతి లేదు. 1972 వన్యప్రాణుల చట్టం ప్రకారం అడవి జంతువులను కాల్చి చంపడం నేరం. మహారాష్ట్ర ప్రభుత్వం పులిని దారుణంగా చంపించింది. అటవీ మంత్రే దీనికి కారకుడు. ఈ విషయమై సీఎం ఫడ్నవిస్‌తో మాట్లాడతా. మ్యాన్ ఈటర్‌ను చంపేందుకు అస్ఘర్ అలీకి ఎటువంటి అధికారమూ లేదు’ అని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. జంతు హక్కుల సంస్థ ‘పెటా’ ఈ ఘటనను ఖండించింది. -
నేర అతిథులపై నిఘా!
సాక్షి, హైదరాబాద్: అతిథి దేవో భవ అన్నది భారతీయ సంప్రదాయం. కానీ, వచ్చే అతిథుల్లో కొందరు వక్రబుద్ధిగలవారూ ఉంటారు. ఇలాంటివారిని వడబోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే, భారత ప్ర భుత్వం పర్యాటక వీసాల్లో స్వల్ప మార్పులు చేసింది. దీనివల్ల నేర చరిత్ర ఉన్నవారికి వీసా మంజూరులో కఠినంగా వ్యవహరించనున్నారు. ఎందుకీ మార్పులు? వాస్తవానికి పర్యాటక ప్రదేశాల సందర్శనకు వచ్చే విదేశీయుల నేర చరిత్రపై గతంలో ఎలాంటి నిబంధనలు లేవు. కొంతకాలంగా మనదేశానికి వచ్చే విదేశీయుల్లో కొందరు ఇక్కడి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు పెరిగిపోయాయి. దీనిపై కేంద్రమంత్రి మేనకా గాంధీ స్వయంగా కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలకు ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారు. మేనకాగాంధీ చొ రవతో వీసా నిబంధనల్లో మార్పులు చేశారు. ఇది ప్రస్తుతం అమల్లోకి వచ్చిందని సోమవా రం మేనకాగాంధీ ప్రకటించారు. చిన్నపిల్లలపై వేధింపులు, ఇతర నేరాలకు పాల్పడిన వి దేశీయులకు ఇపుడు ప్రత్యేక కాలమ్ ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా పూర్తిచేయాలి. అందులో అభ్యంతరాలు లేకపోతేనే వీసా మంజూరవుతుంది. లేదంటే తిరస్కరిస్తారు. దీ నిపై పలువురు మహిళలు, బాలల హక్కుల నే తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎలా ఉంది? దేశంలోని చారిత్రక నగరాల్లో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ చరిత్ర ఉన్న భాగ్యనగరాన్ని ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. కేవలం సందర్శనకే కాకుండా మెడికల్ టూరిజం, ఐటీ, ఉన్నత విద్య, ఫార్మసీ తదితర రంగాలకు భాగ్యనగరం ప్రసిద్ధి. దీనికితోడు శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఏటా నగరానికి వచ్చే విదేశీయులు పెరుగుతున్నారు. మధ్యప్రాచ్యం నుంచి వైద్యానికి, ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి ఉన్నత వి ద్యకు, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల నుంచి పర్యాటకం కోసం నగరానికి వ స్తున్నారు. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలో జరిగిన మార్పులను అందరూ ప్రశంసిస్తున్నారు. -
లైంగిక వేధింపులపై జీవోఎం
న్యూఢిల్లీ: పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేసేందుకు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) నియమించింది. ఇందులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి మేనకా గాంధీ, ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను ఈ బృందం సమీక్షిస్తుందని హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అన్నివర్గాలను సంప్రదించి లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లోగా జీవోఎం కేంద్రానికి నివేదికను సమర్పిస్తుందని వెల్లడించింది. పని ప్రదేశంలో మహిళల గౌరవాన్ని కాపాడటానికి, భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. మరోవైపు మహిళా ఉద్యోగులు తమకు ఎదురయ్యే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ‘షీ–బాక్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. ఏ స్థాయి ఉద్యోగిని అయినా ఇందులో ఫిర్యాదు చేస్తే, కంపెనీలోని సంబంధిత పరిష్కార విభాగానికి దీన్ని బదిలీ చేస్తామని వెల్లడించింది. బాధితుల ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
మీటూ ఉద్యమంపై స్పందించిన కేంద్రం
-
‘మీటూ’ కేసులపై కమిటీ!
న్యూఢిల్లీ: ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా వెలుగుచూస్తున్న లైంగిక దాడుల ఆరోపణలపై విచారణకు న్యాయ నిపుణులతో కమిటీ నియమించాలని యోచిస్తున్నట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. బాధితురాళ్ల వేదన, క్షోభను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. మరింత మంది మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాల్ని వివరించాలని సూచించారు. శుక్రవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు చెప్పారు. లైంగిక వేధింపుల కేసులు చాన్నాళ్లుగా ఉన్నా, మనం పట్టించుకోవడంలేదని, ఇప్పుడు బాధితురాళ్లు వాటిని ఎలా నిరూపిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మేనక స్పందించలేదు. మంత్రి అక్బర్‌తో పాటు ప్రముఖ సినీ దర్శకుడు సాజిద్ ఖాన్, నటుడు అలోక్‌నాథ్ తదితరులపై లైంగిక అనుచిత ప్రవర్తన ఆరోపణలు వెల్లువెత్తాయి. నిరూపణ ప్రశ్నార్థకం.. ‘బాధితురాళ్లు చెప్పినదాన్ని నమ్ముతున్నా. వారి బాధ, క్షోభను అర్థంచేసుకోగలను. మీటూ ఉద్యమంలో భాగంగా వెలుగుచూస్తున్న ఇలాంటి కేసుల విచారణకు న్యాయ నిపుణులతో కూడిన కమిటీని నియమించాలని యోచిస్తున్నాం. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న న్యాయ, చట్టబద్ధమైన ఏర్పాట్లను పరిశీలించి, వాటిని బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖకు ఈ కమిటీ సలహాలు, సూచనలు చేస్తుంది. తమకు ఎదురైన ఇలాంటి చెడు అనుభవాల్ని బయటికి చెప్పడానికి మహిళలకు చాలా ధైర్యం కావాలి. లైంగిక వేధింపుల గురించి పాతికేళ్లుగా వింటున్నాం. కానీ వాటి గురించి చర్చించడానికి, మాట్లాడటానికి వెనకాడుతున్నాం. ఇన్నేళ్ల తరువాత బాధితులు వాటిని ఎలా నిరూపిస్తారన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కారకుల పేర్లను నిర్భయంగా బయటపెట్టడం వల్ల బాధితురాళ్లకు కాస్త సాంత్వన కలుగుతుంది’ అని మేనకా గాంధీ అన్నారు. మహిళలు నేరుగా తనకు ఫిర్యాదుచేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అజ్ఞాత వ్యక్తుల ఫిర్యాదుల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పారు. షీబాక్స్, మహిళా, శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయొచ్చని తెలిపారు. నిజాన్ని బిగ్గరగా చెప్పాల్సిందే: రాహుల్ ‘మీటూ’ ఉద్యమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతుపలికారు. మార్పు తీసుకురావాలంటే నిజాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కేంద్ర మంత్రి అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ‘మహిళలను గౌరవంగా, హుందాగా ఎలా చూడాలో అందరూ నేర్చుకోవాల్సిన సమయం ఇది. మార్పు తీసుకురావాలంటే నిజాన్ని బిగ్గరగా, స్పష్టంగా చెప్పాలి’ అని ‘మీటూ’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. -
మతం కన్నా సమానత్వం ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రార్థనా ప్రదేశాల్లో స్త్రీ పురుష భేదం లేకుండా అందరీకి సమాన హక్కులు కల్పించేందుకు ఈ తీర్పు దోహద పడుతోందని మహిళలు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ వయసు మహిళలైనా శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని, ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మతం కన్నా, సమానత్వం ముఖ్యం.. సుప్రీం తీర్పుపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ స్పందించారు. శబరిమల ఆలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అద్భుతమైనదిగా ఆమె వర్ణించారు. హిందుత్వంలో స్త్రీ, పురుష భేదం లేదని న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ తీర్పు తనకెంతో ఆనందం కలిగించిందని అన్నారు. మతం కన్నా, సమానత్వం ముఖ్యమైనదని సుప్రీంకోర్టు రుజువు చేసిందని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ఆలయంలోకి మహిళ ప్రవేశంతో అందరికీ సమాన హక్కుని కల్పించిందన్నారు. తమ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ అంబేద్కర్ నిజంగా గొప్పవాడు.. రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇన్నేళ్లకు మహిళలకు న్యాయం జరిగిందని కర్ణాటక మహళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి జయమాల సంతోషం వ్యక్తం చేశారు. తన జీవితంతో ఇంతగా సంతోష పడిన రోజు ఇంకోకటి లేదని.. రాజ్యాంగాన్ని నిర్మించి మహిళల హక్కులు గుర్తించిన అంబేద్కర్ నిజంగా గొప్పవాడని గుర్తు చేసుకున్నారు. వీరే కాకుండా అనేక మంది మహిళా ఉద్యమ నేతలు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము పోరాడుతున్న దానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
సానియా యోగాసనాలపై మంత్రి కామెంట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రపంచ యోగా దినోత్సవం రోజున గర్భిణిలు చేసే ప్రత్యేక యోగా చేసి ఆకట్టుకున్నారు. యోగాకు తాను ఇచ్చే ప్రాముఖ్యతను వివరిస్తూ ట్విటర్లో చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆ ట్వీట్లో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీని ట్యాగ్ చేయగా.. ఇంప్రెస్ అయిన మంత్రి సానియాను పొగడ్తలతో ముంచెత్తారు. అసలు విషయమేమిటంటే.. గర్భధారణతో ఉన్న సానియా మీర్జా యోగా డేను పురస్కరించుకొని యోగా చేస్తూ దిగిన ఫోటోలు ట్విటర్లో షేర్ చేశారు. ‘యోగా డే లేక ఏ రోజైనా ఫర్వాలేదు. గర్భాధారణ సమయంలోనూ ఫిట్‌గా ఉండటానికి నేను ప్రయత్నిస్తా. అందుకోసం యోగానే నా మంత్రం. మరి మీరు?’ అంటూ మహిళా శిశు సంక్షేమశాఖ పోర్టల్, మేనకా గాంధీలను ట్యాగ్ చేస్తూ సానియా ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మేనకా గాంధీ ‘అద్భుతం సానియా, గర్భిణి స్త్రీలు యోగా చేయడం ద్వారా వారికి, పుట్టబోయే పిల్లలకు ఎంతో ఆరోగ్యకరం’ అంటూ రీట్వీట్ చేశారు. త్వరలో గర్భిణీ స్త్రీలతో కలిసి యోగాలో పాల్గొంటానని కేంద్ర మంత్రి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మేనకా గాంధీ పాల్గొన్నారు. International Day of yoga or any other day , #PreNatalYoga is my way of keeping fit during pregnancy .. what’s yours??? 😀 @MinistryWCD and @ManekaGandhiBJP pic.twitter.com/wOTG14GcfA — Sania Mirza (@MirzaSania) 21 June 2018 Wonderful, Sania!!#PreNatalYoga is indeed an exhilarating way to be fit during pregnancy. @MirzaSania https://t.co/Gsm6YOfKqS — Maneka Gandhi (@Manekagandhibjp) 21 June 2018 -
కేంద్ర మంత్రి మాల వేస్తే...దళితులు ప్రక్షళన చేశారు
వడోదర : కేంద్ర మంత్రి మేనకా గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మేనకా గాంధీ పూలమాల వేయడంతో ఆ ప్రాంతమంతా కలుషితమైందని కొంత మంది దళితులు విగ్రహాన్ని ప్రక్షాళన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా మేనకా గాంధీ శనివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఎంపీ రంజరన్ బెన్, ఇతర బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. వీరంతా అక్కడకు చేరుకున్న సమయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఠాకూర్ సోలంకి నేతృత్వంలోని దళితులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు... దళితుల మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. వారు తిరిగి వెళ్లిపోయిన తర్వాత దళిత సంఘం కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహాన్ని పాలు, నీటితో ప్రక్షాళన చేశారు. బీజేపీ నేతల రాక వల్ల ఆ ప్రాంతం కలుషితమైపోయిందని, అందుకే ప్రక్షాళన చేశామని సోలంకి వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుల ఘెరావ్.. అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించడానికి దళిత కార్యకర్తలు, బీజేపీ నాయకుల కంటే ముందే స్థానిక జీఈబీ సర్కిల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో దళిత కార్యకర్తలు బీజేపీ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్కిల్ వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
త్వరలో పార్లమెంటులో శిశుసంరక్షక కేంద్రం
న్యూఢిల్లీ: మహిళా ఎంపీలు, పార్లమెంటు అధికారులు, సిబ్బంది చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు అనువుగా త్వరలో పార్లమెంటులో శిశు సంరక్షక కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కేంద్రంలో తల్లులు పాలివ్వడానికి విడిగా మరో గదిని ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే ఈ కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్లమెంటు మొత్తం సిబ్బందిలో మూడో వంతు మంది మహిళలే ఉన్నారని వారి చిన్నారుల కోసం ఈ కేంద్రం ఏర్పాటుచేయాలని గతేడాది మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ పార్లమెంటు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
కేంద్ర మంత్రి మేనకా గాంధీ షాకింగ్ కామెంట్లు
-
షాకింగ్: అందరి ముందే మేనకాగాంధీ...
బరేలి : బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న మేనకా గాంధీ షాకింగ్ కామెంట్లు చేశారు. శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్‌లో, మేనకాగాంధీ ఓ అధికారిని విపరీత వ్యాఖ్యలతో దూషించారు. అందరి ముందే పరుష పదజాలంతో చివాట్లు పెట్టారు. ఆ అధికారి అవినీతి పాల్పడుతున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేనకా గాంధీ ఈ విధంగా స్పందించారు. పబ్లిక్ మీటింగ్‌లో ఆయన్ను ఈ విధంగా తిట్టడంతో, ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. ముఖ్యంగా ఆయన్ను అందరి ముందు తిట్టడం, అవమానించడం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ బహేరీలో పీడీఎస్ స్కీమ్‌ను పరిశీలించడానికి వెళ్లిన్నప్పుడు మేనకా ఈ వ్యాఖ్యలు చేశారు. మేనకా గాంధీ ప్రస్తుత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
భార్యను విడిచిపెడితే, మీ ఆస్తులు గోవిందా
న్యూఢిల్లీ : తమ కుమార్తెలకు విదేశీ సంబంధాల కోసం తల్లితండ్రులు ఉబలాటపడుతుంటే, ఎన్ఆర్ఐ పెళ్ళిళ్లు అమ్మాయిలకు కన్నీళ్లు మిగుల్చుతున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. భారత్‌లో పెళ్లి చేసుకుని, కట్నం కానుకలు తీసుకుని భార్యలను విదేశాలకు తీసుకెళ్తున్న భర్తలు, వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వదిలి వేయడం, శారీరక వేధింపులకు గురిచేయడం..వంటి పలు కారణాలతో ఆడపిల్లలను వేధిస్తున్నారు. ఈ వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భార్యను వేధించినా.. వదిలేసినా భారత్‌లో భర్త లేదా వారి కుటుంబసభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని అంతర్ మంత్రిత్వ కమిటీ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. వదిలివేయబడ్డ మహిళలకు చట్టపరమైన పరిష్కారంగా, జస్టిస్ కోసం భర్త, వారి కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో 2015 జనవరి 1 నుంచి 2017 నవంబర్ 30 మధ్యలో ఈ తరహా ఫిర్యాదులు 3,328 వరకూ అందాయని తెలిసింది. ఎన్ఆర్ఐ భర్తలు, భార్యలను వదిలివేయడం, వేధించడం, కట్నం డిమాండ్లు, శారీరక వేధింపులు, పాస్‌పోర్ట్ సీజ్ వంటి చేష్టలకు పాల్పడుతున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటి నుంచి అన్ని పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లను స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌కు లింక్ చేయనున్నామని, ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియను ముగించనున్నట్టు కేంద్ర మంత్రి మేనకా గాంధీ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న వారిలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, న్యాయమంత్రి రవి శంకర్ ప్రసాద్‌లు కూడా ఉన్నారు. డబ్ల్యూసీడీ కింద ఒక ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజెన్సీని నియమించాలని, ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను అది విచారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ తరహా కేసుల్లో ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్టులు కూడా రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తప్సనిసరి అన్ని రాష్ట్రాలు అన్ని పెళ్లిళ్లను రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టడం లేదు. -
ఐష్ ఫస్ట్ లేడీ
మాజీ ప్రపంచ సుందరి, కథానాయిక ఐశ్వర్యారాయ్ ‘ఫస్ట్ లేడీ’ పురస్కారం అందుకున్నారు. వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలకు ఏటా ఈ అవార్డులు ఇస్తుంటారు. ఇందులో భాగంగా ఇరవై ఏళ్లుగా ఐశ్వర్యారాయ్ సినీరంగానికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘ఫస్ట్ లేడీ’ అవార్డును ఐశ్వర్యకి అందజేశారు. 2002 నుంచి ప్రతి ఏటా కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొంటున్న ఐశ్వర్య ఇటీవల జ్యూరీ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ‘కేన్స్’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ నటి ఐష్ కావడంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఆమెను ఘనంగా సత్కరించారు. కాగా, చిన్న వయసులోనే పైలెట్ అయిన ఆయేషా అజీజ్, కశ్మీర్‌కి చెందిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి రువేదా సలామ్‌లతో పాటు మరో 113 మందికి ‘ఫస్ట్ లేడీ’ పురస్కారాలు అందించారు. -
26 నుంచి ప్రయోగాత్మకంగా ‘ప్యానిక్’
న్యూఢిల్లీ: మహిళల భద్రత కోసం అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ద్వారా అప్రమత్తం చేసే ప్యానిక్ బటన్ సౌకర్యాన్ని ఈ నెల 26 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్యానిక్ బటన్ సౌకర్యాన్ని 2017 జనవరి నుంచి అమలు చేయాలని కేంద్రం గతంలో నిర్ణయించినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. గతంలో చేపట్టిన ప్రయోగాల్లో అనేక బూటకపు కాల్స్ రావటంతో దీనిని అమలు చేయలేదన్నారు. పాత మొబైల్ వినియోగదారులు కీని నొక్కిన వెంటనే సమీపంలోని 25–50 మందికి సమాచారం అందుతుందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి చేతన్ సంఘీ తెలిపారు. ప్రస్తుతం పాత మొబైళ్ల(కీ ప్యాడ్ ఉన్న ఫోన్లు)ను మాత్రమే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, కొత్త మొబైళ్లలో ఈ సౌకర్యాన్ని ఇప్పటికే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. -
అంగన్వాడీలకు గోవాలో అత్యధిక వేతనం
ఎంపీ కవిత ప్రశ్నకు కేంద్ర మంత్రి మేనకా గాంధీ సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: అంగన్వాడీ వర్కర్లకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అదనపు గౌరవ వేతన వివరాలను కేంద్రం వెల్లడించింది. శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీ కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ సమాధానమిచ్చారు. కేంద్రం అంగన్వాడీ వర్కర్లకు రూ.3 వేలు, సహాయకులకు రూ.1,500 ఇస్తోందని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా గౌరవ వేతనం ఇస్తున్నాయని పేర్కొన్నారు. గోవా అత్యధికంగా అర్హత, సర్వీసును బట్టి రూ.3,062 నుంచి రూ.11,937 వరకు ఇస్తోందని చెప్పారు. హెల్పర్లకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు ఇస్తోందన్నారు. తమిళనాడు రెండోస్థానంలో నిలిచిందని, వర్కర్లకు రూ.6,750, హెల్పర్లకు రూ.4,275 ఇస్తోందని చెప్పారు. తదుపరి స్థానంలో తెలంగాణ నిలిచిందని, వర్కర్లకు రూ.4 వేలు ఇస్తుండగా, హెల్పర్లకు రూ.3 వేలు ఇస్తోందని వివరించారు. -
ఒక మంచి ప్రయత్నం
మాయమవుతున్నవారు ఏమవుతున్నారన్న స్పృహ...వారి ఆచూకీ రాబట్టి కార కుల్ని దండించాలన్న ఆదుర్దా ప్రభుత్వ యంత్రాంగానికి లేనంతకాలమూ మనుషుల అపహరణ, అక్రమ తరలింపు, వెట్టిచాకిరీవంటివి కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ప్రపంచంలో ఆధునిక బానిసత్వం వర్ధిల్లుతున్న దేశాల్లో భారత్ అగ్ర భాగాన ఉన్నదని ‘వాక్ ఫ్రీ’ ఫౌండేషన్ మంగళవారం వెల్లడించిన సర్వే ఎవరినీ ఆశ్చర్యపరచదు. వివిధ దేశాల్లో అక్రమ తరలింపు బాధితులు 4 కోట్ల 58 లక్షల మంది ఉండొచ్చునని అంచనా వేస్తే అందులో దాదాపు సగం మంది భారత్‌లోనే ఉన్నారని ఆ సర్వే చెబుతోంది. చైనా(33.90లక్షలు), పాకిస్తాన్(21.30 లక్షలు), బంగ్లాదేశ్(15.30లక్షలు), ఉజ్బెకిస్తాన్(12.30లక్షలు)లను కూడా భారత్‌తో కలిపి లెక్కేస్తే మొత్తం బాధితుల్లో 58శాతంమంది ఈ దేశాల్లోనే ఉన్నారని వెల్లడవుతోంది. ఈ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించబోతున్నామని సంకేతాలు పంపుతూ మనుషుల అక్రమ తరలింపుపై రూపొందించిన ముసాయిదా బిల్లును కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ మంగళవారం విడుదల చేశారు. డబ్బు, పలుకుబడి, అధికారం, బాధితుల నిస్సహాయత వంటివి మనుషుల అక్రమ తరలింపునకు ప్రధానంగా దోహదపడుతున్నాయి. ప్రపంచంలో మాదక పదార్ధాల క్రయవిక్రయాల తర్వాత అతి పెద్ద వ్యాపారం మనుషుల అక్రమ తర లింపే. ఈ సమస్యపై 1949లోనే ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించినా.. 2012 డిసెంబర్లో మాత్రమే అడుగు ముందుకు పడింది. మనుషుల అక్రమ తర లింపుపై ఆ సంవత్సరం రూపొందిన అంతర్జాతీయ ప్రొటోకాల్ అక్రమ తరలింపు బాధితులకుండే మానవ హక్కులను గుర్తించింది. ఈ విషయంలో అన్ని దేశాలూ కఠినమైన చట్టాలు రూపొందించాలన్న సూచన వచ్చింది. ఆ ప్రొటోకాల్‌పై మన దేశం కూడా సంతకం చేసినా కఠినమైన నిబంధనలతో సమగ్ర రూపంలో బిల్లు తీసుకురావడం మరో నాలుగేళ్లకుగానీ సాధ్యంకాలేదు. ఈ సమస్యకు సంబంధించి నిర్దిష్టమైన చట్టాలు లేకపోవడంతో దోషులు సులభంగా తప్పించుకోగలుగుతు న్నారు. బాధితులు నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. ఏ శిక్షా లేకుండా బయటి కొస్తున్న దుర్మార్గులు మళ్లీ వారిని ఆ నరక కూపాల్లోకి తోసేస్తు న్నారు. కనుకనే ఈ సమస్యపై దృష్టి పెట్టి సమగ్రమైన చట్టం తీసుకురావాలని స్వచ్ఛంద సంస్థలు ఎప్పటినుంచో డిమాండు చేస్తున్నాయి. ఇన్నాళ్లకు వారి ఆకాంక్ష నెరవేరింది. మన రాజ్యాంగంలోని 23(1) అధికరణ బలవంతంగా చాకిరీ చేయించడాన్ని నిషేధిస్తున్నది. ఆర్ధిక అవసరాల కారణంగా ఎవరూ తమ వయసుకు మించిన పని చేసే పరిస్థితి లేకుండా చూడాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో గౌరవప్రదంగా బతికే వీలు వారికి కల్పించాలని ఆదేశిక సూత్రాలు చెబుతున్నాయి. 1956లో వచ్చిన వ్యభిచార నిరోధక చట్టం మహిళలనూ, బాలికలనూ వ్యభిచార రొంపిలోకి దించే వారిపైనే అధికంగా దృష్టి సారించింది. మనుషుల అక్రమ తరలింపు వ్యవహారం కోణంలో దీన్ని చూడలేదు. 2000లో వచ్చిన జువెనైల్ జస్టిస్ చట్టానికి కూడా ఇలాంటి పరిమితులే ఉన్నాయి. పిల్లలతో క్రూరంగా వ్యవహరించడం, వారిని బిక్షాటనలోకి దించడం, వారితో వయసుకు మించిన పనులు చేయించడంలాంటి అంశాలే అందులో అధికంగా ఉన్నాయి. భారత శిక్షాస్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 370ని సవరిస్తూ 2013లో తెచ్చిన సవరణ చట్టం తొలిసారి పిల్లల అక్రమ తరలింపు అంశాన్ని నేరంగా పరిగణించింది. ఎవరినైనా కొనడం లేదా అమ్మడం నేరమని పాత నిబంధన చెబుతుండగా ఆ సవరణ దాన్ని మరింత విస్తృతీకరించింది. ఈ ప్రక్రియలోని వివిధ దశల్లో పాలుపంచుకునేవారంతా నేరస్తులే అవుతారని స్పష్టం చేసింది. ఇలా పలు సందర్భాల్లో ఉన్న చట్టాలను సవరించడమో, కొత్త చట్టాలు చేయడమో జరుగుతున్నా పోలీసుల అలసత్వం వల్ల, ఈ చట్టాల్లో ఉండే లొసుగుల వల్ల నేరస్తులు సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. 2006లో బాలల వెట్టిచా కిరీకి సంబంధించి 1,672 కేసులు నమోదు కాగా ఎవరికీ శిక్ష పడలేదు. అదే సంవత్సరం వ్యభిచార రొంపిలోకి దించుతున్నారని 685మందిపై కేసులు నమోదైతే ఒక్కరంటే ఒక్కరికి శిక్ష పడలేదు. అక్రమ తరలింపు అనేక రూపాల్లో ఉంటున్నది. ఉపాధి కల్పిస్తామని కొందరు, ఆశ్రయమిస్తామని కొందరు సంస్థలు స్థాపించి అమాయకులను మభ్యపెట్టి వివిధ రకాల నరకకూపాల్లోకి దించుతున్నారు. అది వ్యవసాయ పనుల్లో లేదా పరిశ్రమల్లో వెట్టిచాకిరీ కావొచ్చు...బిక్షాటన కావొచ్చు...వ్యభిచారంలాంటివి కావొచ్చు. తప్పిం చుకుని వచ్చినవారు చెప్పడం వల్లనో, నిర్దిష్టమైన సమాచారం అందడంవల్లనో, కొన్ని స్వచ్ఛంద సంస్థల నిరంతర నిఘా వల్లనో దాడులు నిర్వహిస్తే ఈ అభా గ్యులకు విముక్తి లభిస్తున్నది. హైదరాబాద్ పాత బస్తీలో నిరుడు గాజుల బట్టీలు, ఇతర కుటీర పరిశ్రమలపై దాడులు చేసినప్పుడు వందలమంది పిల్లలు చెర వీడటం తెలిసిందే. ఒక సమగ్ర చట్టానికి వీలు కల్పిస్తున్న తాజా బిల్లు... మనుషుల అక్రమ తరలింపు అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోవ డానికి వీలు కల్పిస్తోంది. పునరావాస కల్పన బాధితుల హక్కుగా పరిగణిస్తోంది. వ్యభిచారం కేసుల్లో బాధితులను కూడా అరెస్టు చేసే ప్రస్తుత విధానానికి స్వస్తి పలకబోతున్నది. బాలికలను చిన్న వయసులోనే వ్యభిచారంలోకి దించడం కోసం ఆక్సిటోసిన్ వంటి హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం, వారి ఆరోగ్యానికి ముప్పు కలిగించడంవంటివాటిని నేరంగా పరిగణిస్తోంది. అక్రమ తరలింపు బాధితులను సరిహద్దులు దాటించేవారి పనిబట్టడం కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తోంది. అయితే చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా అమలు చేసే యంత్రాంగం సరిగా లేకపోతే ఆశించిన ఫలితాలు రావు. అందువల్లే సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫల మైనా, నేరగాళ్లతో కుమ్మక్కయినట్టు తేలినా...బాధితులకు పునరావాసంలో అల సత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకునే ఏర్పాటు కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకొక శాశ్వత పరిష్కారం లభిస్తుంది. -
ఆడ శిశువు రక్షణ ఇలాగా?!
మన దేశంలో చడీచప్పుడూ లేకుండా నిత్యమూ సాగే నరమేథం ఒకటుంది. అభివృద్ధి చెందిన టెక్నాలజీ సాక్షిగా... కాసుల కక్కుర్తి రోగంతో చెలరేగే వైద్యుల సాక్షిగా... చేతగానట్టు మిగిలిపోయే చట్టాల సాక్షిగా ‘గర్భ’గుడిలో ఆడ శిశువుల్ని చిదిమేసే భయంకర నరమేథమది. బాలిక పుడితే కుటుంబానికి భారమవుతుంద నుకునే పాపిష్టి ఆలోచన దేశంలో రోజుకు 1,370మంది ఆడ శిశువుల్ని కడతేరుస్తున్నదని ఆమధ్య కొన్ని గణాంకాలు వెల్లడించాయి. ఇంతటి దారుణాన్ని ఆపడానికి తీసుకోవాల్సిన చర్యలపై పౌర సమాజ కార్యకర్తలనుంచి, ఇతరుల నుంచి ఎన్నో సలహాలు, సూచనలు వస్తూనే ఉన్నాయి. వీటన్నిటి మాటెలా ఉన్నా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ ఇటీవల చేసిన ప్రతిపాదన అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఇప్పుడు నిషేధం అమలవుతున్న లింగ నిర్ధారణ పరీక్షల్ని తప్పనిసరి చేయాలన్నదే ఆ ప్రతిపాదన సారాంశం. ఆ పరీక్షల అనంతరం గర్భంలో ఉన్నది ఆడ శిశువో, మగ శిశువో తేలాక ఆ వివరాలను ఒక రిజిస్టర్లో నమోదు చేయాలని, పుట్టేది ఎవరైనా కనాల్సిందేనని వారికి నచ్చ జెప్పాలని ఆమె అభిప్రాయం. ఆ రిజిస్టర్‌లోని వివరాలకు అనుగుణంగా శిశు జననాలున్నాయో లేదో తనిఖీ చేయాలని కూడా ఆమె చెప్పారు. అలా చేస్తే అమ్మ కడుపులో ఉన్న ఆడ శిశువులకు రక్షణ ఉంటుందని ఆమె అంటున్నారు. ఈ మాట చెబుతూ ఇది కేవలం తన ఆలోచన మాత్రమేనని కూడా మేనక వివరించారు. ఈ ఆలోచన వెనకున్న కారణాన్ని కూడా ఆమె చెప్పారు. చట్టవిరుద్ధంగా అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లు చేస్తున్న వారిని ఎంతకాలం అరెస్టు చేస్తూ పోతాం...అది శాశ్వత పరిష్కారం ఎలా అవుతుంది అన్నదే ఆమె ప్రశ్న. కానీ ఈ క్రమంలో గర్భిణులను నేరస్తులుగా పరిగణిస్తున్నామన్న సందేహం ఆమెకు కలగలేదు. బిడ్డను కనాలో లేదో నిర్ణయించుకునే హక్కును మహిళలకు లేకుండా చేసినట్టవుతుందన్న ఆలోచన కూడా రాలేదు. అందువల్లే మేనకాగాంధీ ప్రతిపాదనపై మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. బాలలు, బాలికల నిష్పత్తి విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా యన్నది వాస్తవం. 1991నాటికి ప్రతి వెయ్యిమంది బాలలకూ 945 బాలిక లుండగా...2011 జనాభా లెక్కల్లో అది 919కి పడిపోయింది. హైదరాబాద్ నగరంలో అది 914 మాత్రమే. వాస్తవానికి వెయ్యిమంది బాలురకూ 950 మంది ఆడపిల్లలు ఉండటం ఆరోగ్యకరమైన నిష్పత్తి అంటారు. కానీ మహిళలను గౌరవిస్తున్నామని, పూజిస్తున్నామని చెప్పే దేశంలోనే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీన్ని ఎంతో కొంత మార్చాలన్న సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు జనవరిలో ‘బేటీ బచావో, బేటీ పఢావో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆడపిల్లల్ని పుట్టకముందే చంపేసే ధోరణి అత్యంత హీనమని ఆ సందర్భంగా మోదీ చెప్పారు. ఆడపిల్లల విషయంలో వివక్ష ప్రదర్శించడం అలవాటైన సమా జానికి ఆధునిక టెక్నాలజీ కూడా తోడ్పడుతున్నది. కనీస వైద్య సదుపాయాలు కరువైన మారుమూల ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పోర్టబుల్ స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉంటున్నాయని ఢిల్లీ ఐఐటీకి చెందిన ఒక ప్రొఫెసర్ జరిపిన అధ్యయనంలో తేలింది. చట్టాలున్నా వాటిని సమర్థవంతంగా అమలు పరిచే వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడంవల్ల ఈ జాడ్యం నానాటికీ ముదురుతోంది. లింగ నిర్ధారణ పరీక్షల్ని నిషేధించే చట్టం వచ్చి రెండు దశాబ్దాలవుతున్నది. అయినా మెరుగైన ఫలితాలు రావడంలేదని జనాభా లెక్కలు చెబుతున్నాయి. మెరుగైన జీవనం, చదువు వంటివి భ్రూణ హత్యల్ని నివారిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ అది నిజంకాదు. ఆర్ధిక సంస్కరణలు అమలై అవకాశాలు పెరిగాక కుటుంబాలు కుంచించుకుపోవడం, ఒక్కరితో సరిపెట్టుకోవాలను కోవడం, ఆ ఒక్కరూ మగపిల్లాడైతే బాగుంటుందని భావించడం పెరిగిందని సామాజిక అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలాంటి ఆలోచనలు మధ్య తరగతిలో ప్రబలంగా ఉన్నాయంటున్నారు. ఈ విషయంలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కాస్త మెరుగు. సమాజంలో మహిళల స్థితిగతులకూ, వారిపట్ల చూపుతున్న వివక్షకూ...గర్భస్త శిశు పిండాలను చిదిమేయడానికీ ఉన్న సంబంధాన్ని గుర్తించనంతకాలమూ ఈ స్థితి మారదు. సామాన్య పౌరుల సంగతలా ఉంచి నాయకులుగా చలామణి అవుతున్నవారు సైతం మహిళల విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారో, వారి సమస్యల విషయంలో ఎంత వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అదే కుటుంబాల్లోనూ కొనసాగుతోంది. లింగ నిర్ధారణ పరీక్ష మొదలుకొని భ్రూణ హత్యల వరకూ అన్నిటినీ నిర్దేశిస్తున్నది కుటుంబాల్లోని పురుషాధిక్యతే. ఇప్పుడు సాగుతున్న భ్రూణహత్యల్లో మహిళలు నేరస్తులు కాదు...బాధితులు. అయితే మేనకాగాంధీ తాజా ప్రతిపాదన బాధితుల్నే నేరస్తులుగా మార్చేట్టు కనబడుతోంది. పైగా ఇది ఆచరణసాధ్యం కూడా కాదు. కొన్ని లక్షల సంఖ్యలో ఉండే వైద్యులనూ, వారి కార్యకలాపాలనూ పసిగట్టలేని వ్యవస్థ కోట్లాదిమంది తల్లులపై నిఘా పెట్టి ఉంచడం కుదిరేపనేనా? రోజుకు 50,000 శిశు జననాలుండే మన దేశంలో గర్భిణుల డేటా సేకరణ, దానికనుగుణంగా ఆడ శిశువులు జన్మిస్తున్నారో లేదో చూడటమన్నది సాధ్యమేనా? మారుమూల పల్లెల్లో ఇప్పటికీ చాలాచోట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉన్నా వాటిల్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. మాతాశిశు సంర క్షణకంటూ ఎన్నో పథకాలున్నా అవి సక్రమంగా అమలు కావడంలేదు. పౌష్టికాహార లేమితో, ప్రాణాంతక వ్యాధులతో శిశువులు కన్నుమూసే సిగ్గుమాలిన పరిస్థితులున్నాయి. వీటన్నిటినీ సరిచేయడమెలాగో ఆలోచించి చర్యలు తీసుకోవడం తక్షణావసరం. మేనకాగాంధీ అలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి. -
‘జువనైల్’ వయసు16కు తగ్గింపు
* బాల నేరస్తుల సవరణ బిల్లుకు రాజ్యసభ ఓకే * వామపక్షాల వాకౌట్; కలిసొచ్చిన కాంగ్రెస్ * బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న సీపీఎం, ఎన్సీపీ, డీఎంకే * ‘జువనైల్’ వయస్సు 16కు తగ్గింపు * రేప్ లాంటి హేయ నేరాలకు పాల్పడే 16 -18 ఏళ్ల పిల్లలకు కఠిన శిక్షలు * చర్చను గ్యాలరీ నుంచి వీక్షించిన ‘నిర్భయ’ తల్లిదండ్రులు న్యూఢిల్లీ: అత్యంత హేయమైన నేరాలకు పాల్పడిన 16 నుంచి 18 ఏళ్ల వయసున్న మైనర్లను పెద్దలకు ఉద్దేశించిన చట్టాల ప్రకారం విచారించాలన్న సవరణతో కూడిన జువనైల్ జస్టిస్ బిల్లుకు మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అంతకుముందు, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వామపక్షాలు సభనుంచి వాకౌట్ చేశాయి. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు రాష్ట్రపతి రాజముద్రతో త్వరలో చట్టరూపం దాల్చనుంది. దీని ప్రకారం ఇకపై హత్య, రేప్ వంటి పాశవిక నేరాలకు పాల్పడిన 16 ఏళ్ల పైబడిన మైనర్లకు వయోజనులకుద్దేశించిన చట్టాల ప్రకారమే శిక్ష విధిస్తారు. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ దోషి జువనైల్ చట్టం ప్రకారం మూడేళ్ల శిక్షే అనుభవించి ఆదివారం విడుదలవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమైన నేపథ్యంలో.. బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లు ఆమోదం విషయంలో అధికారపక్ష, విపక్షాలపై ఒత్తిడి నెలకొంది. బిల్లుపై చర్చను ఢిల్లీ గ్యాంగ్‌రేప్ బాధితురాలు ‘నిర్భయ’ జ్యోతిసింగ్ తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రీసింగ్ పాండేలు గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించారు. బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఆమోదం ఆర్నెళ్ల క్రితమే జరిగుంటే నా కూతురిపై అత్యంత పాశవికంగా దాడి చేసినవాడు విడుదలై ఉండేవాడు కాద’ని ఆశాదేవి అన్నారు. 15 ఏళ్ల బాలుడు ఈ నేరం చేస్తే..? ‘జువనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్) బిల్’ను మహిళ, శిశు అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ సభలో ప్రవేశపెట్టారు. మరింత అధ్యయనం అవసరమంటూ సీపీఎం, ఎన్సీపీ, డీఎంకే తదితర పార్టీలు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరాయి. రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ సభ్యుడు గులాం నబీ ఆజాద్ చర్చను ప్రారంభిస్తూ.. ఈ బిల్లు ఆమోదం పొందడం అత్యంత ఆవశ్యకమన్నారు. ‘నిర్భయ తల్లిదండ్రులు.. ముఖ్యంగా తల్లి ఆశాదేవి.. తన కూతురి గురించే కాకుండా, దేశంలో మరో నిర్భయ ఘటన జరగొద్దనే పట్టుదలతో పోరాటం చేస్తున్నారు’ అని ప్రశంసించారు. ‘రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నసమయంలో బాల నేరస్తుల చట్టం వచ్చింది. అప్పుడు కనీస వయస్సుగా 16 ఏళ్లనే నిర్ధారించారు. ఆ తరువాత 2000 సంవత్సరంలో ఎన్డీయే ప్రభుత్వం దాన్ని 18 ఏళ్లకు పెంచింది. ఇప్పుడు మళ్లీ రాజీవ్ ప్రతిపాదించిన 16 ఏళ్లకు మారుస్తోంది’ అన్నారు. సెంటిమెంట్ ఆధారంగా చట్టాలు చేయడం సరికాదని, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. ‘ఒకవేళ 15 ఏళ్ల 11 నెలల వయసున్న బాలుడు ఇలాంటి నేరానికి పాల్పడితే.. మళ్లీ జువనైల్ నిర్వచనాన్ని మారుస్తారా? ఉగ్రవాద సంస్థ ఐఎస్ 14 ఏళ్ల పిల్లలను కూడా చేర్చుకుంటోంది. జువనైల్ వయస్సును 14కు తగ్గిస్తారా?’ అని ప్రశ్నించారు. సమగ్రం.. సంవేదనాత్మకం.. బిల్లు సంవేదనాత్మకంగానూ, సమగ్రంగానూ ఉందని మేనక పేర్కొన్నారు. బాలలు పాల్పడుతున్న తీవ్రమైన నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని గణాంకాలతో వివరించారు. ఒక్క ఢిల్లీలోనే రేప్ తరహా నేరాలకు పాల్పడి, అరెస్టైన 16 ఏళ్లు పైబడిన బాలుర సంఖ్య వెయ్యికి పైగా ఉందన్నారు. ‘నిర్భయ కేసులో దోషిగా తేలిన బాలనేరస్తుడి విషయంలో ప్రస్తుతం మనమేం చేయలేకపోవచ్చు. కానీ ఈ బిల్లుతో ఇంకెందరో బాలలు అలాంటి ఘాతుకాలకు పాల్పడకుండా అడ్డుకోగలం’ అన్నారు. ఈ బిల్లు యూపీఏ హయాంనాటిదేనని గుర్తు చేశారు. ఇది బాలల భద్రతకు, పరిరక్షణకు ఉద్దేశించినదన్నారు. రూపకల్పన సమయంలో నిర్భయ కేసును విచారించిన ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీల సూచనలను తీసుకున్నామన్నారు. అవిద్య, పేదరికమే ఇలాంటి నేరాలకు కారణమనలేమని చదువుకున్నవారు, సంపన్నుల పిల్లలూ ఈ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. స్వీడన్ లాంటి సంపన్న దేశంలోనూ మైనర్లు రేప్‌లకు పాల్పడుతున్న ఘటనలున్నాయన్నారు. త్వరలో ప్రతీగ్రామంలోనూ ప్రత్యేక మహిళా పోలీసు అధికారులను నియమిస్తామన్నారు. బిల్లు ఆమోదం పొందడంలో సహకరించిన విపక్షాలక కృతజ్ఞతలు తెలిపారు. మేనకా గాంధీ వివరించిన బిల్లులోని కీలకాంశాలు.. నిందితుడైన ఏ ఒక్క బాలుడు నేరుగా జైలుకు వెళ్లడు. మొదట ఆ బాలుడు.. చిన్నపిల్లల చేష్టగా భావించి నేరం చేశాడా? లేక పెద్దల తరహా మనస్తత్వంతో నేరానికి పాల్పడ్డాడా? అనేది జువనైల్ జస్టిస్ బోర్డులోని మానసిక నిపుణులు నిర్ధారిస్తారు. దోషిగా నిర్ధారించిన తరువాత మొదట అతడిని బాలనేరస్తుల పరివర్తన కేంద్రం(బోర్స్టల్)కు పంపిస్తారు. 21 ఏళ్ల వయసు వచ్చిన తరువాత ఆతడి మానసిక ఆరోగ్యం, సామాజిక స్పందనలను పరీక్షిస్తారు. ఆ తరువాత పెద్దల జైలుకు పంపే విషయంలో నిర్ణయం తీసుకుంటారు. -
ఓ మై డాగ్
న్యూఢిల్లీ: దేశంలో కోడి పందేలు, జల్లికట్టు పందేల గురించి మనకు తెలుసు. ‘డాగ్‌ఫైట్ ’ పందేల గురించి అంతగా తెలియదు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో గత మూడు, నాలుగేళ్లుగా గుట్టుగా కొనసాగుతున్న ఈ పందేలు ఇప్పుడు ఢిల్లీ నగరానికి కూడా చేరుకోవడం కలవరపెడుతున్న విషయం. ఈ పందేల పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. మూగ జీవాలు మాత్రం కాళ్లు, చేతులేకాకుండా తలల పగులగొట్టుకొని రక్తం మోడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మృత్యువాత కూడా పడుతున్నాయి. కుక్కల కొట్లాటకు కావాల్సిన కుక్కలను అంతర్జాతీయ ముఠాలు కూడా పుట్టుకొచ్చాయి. అఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాల నుంచి ఈ ముఠాలు డాగ్‌ఫైట్ కోసం బలమైన కుక్కలను సరఫరా చేస్తున్నాయి. పంజాబ్‌లోని గ్రామీణ ప్రాంతాలు, హర్యానాలోని పట్టణ ప్రాంతాలకు మాత్రమే ఇంతకాలం పరిమితమైన ఈ ఫైట్ ఢిల్లీ నగరానికి కూడా చేరడంతో ‘డాగ్ ఫైట్’ వీడీయో దృశ్యాలు ఇప్పుడు సామాజిక వెబ్సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఈ ఫైట్ కోసమే వెలిసిన ‘డాగ్ క్లబ్’లు వీటిని పోస్ట్ చేస్తున్నాయి. గెలిచిన కుక్కలతో యజమానులు దిగిన ఫొటోలు కూడా రెండు రోజుల క్రితం వరకు ఫేస్బుక్లో హల్ చల్ చేశాయి. పోలీసు అధికారుల నుంచి హెచ్చరికలు రావడంతో ఇలాంటి ఫొటోలను ఇప్పుడు సైట్ల నుంచి తొలగించారు. అయితే డాగ్ ఫైట్‌కు సంబంధించిన వీడియో దృశ్యాలు మాత్రం నేటికి కనిపిస్తున్నాయి. ఫైట్‌లో పాల్గొనే కుక్కలకు చెవులు, తోకలు పూర్తిగా కత్తిరిస్తున్నారు. ఫైట్‌కు కొన్ని రోజులకు ముందు నుంచి వాటికి ఎలాంటి ఆహారం లేకుండా మలమల మాడుస్తున్నారని హర్యానాకు చెందిన జంతుకారుణ్య కార్యకర్త జూహి భట్టాచార్య తెలిపారు. ఫైట్ సందర్భంగా రెచ్చిపోవడం కోసమే ఇలా జంతువులను హింసిస్తారని, బోనులో బంధిస్తారని ఆయన వివరించారు. వీఐపీలు, పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉండడం వల్లనే డాగ్‌ఫైట్ నిర్వాహకులపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మీడియా ప్రతినిధులు ఆ రాష్ట్రాలకు ఇటీవల వెళ్లి డాగ్ఫైట్ను ప్రత్యక్షంగా చూడడమే కాకుండా వీడియోలను తీసి పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇప్పుడు ఢిల్లీకి పాకిన ఈ పోటీలు నగర శివారులోని ఫామ్ హౌజుల్లో కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి మీడియా తీసుకెళ్లగా నిర్వాహకులు తమదాకా రానీయకుంగా జాగ్రత్త పడతారని చెబుతున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చే వీటిని నిర్వహిస్తున్నట్టు పోటీల్లో పాల్గొంటున్నవారే చెప్పడం గమనార్హం. జీవకారుణ్య కార్యకర్తగా గుర్తింపు పొందిన ప్రస్తుత కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ దృష్టికి ఈ విషయాన్ని మీడియా తీసుకెళ్లగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఇలాంటి పోటీలు జరుగుతున్నాయనే విషయం తనకు గత మూడేళ్లుగా తెలుసునని చెప్పారు. వీటిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ తాను స్వయంగా పంజాబ్ డిప్యూటీ ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు లేఖ రాశానని, ఆయన నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని ఆమె చెప్పారు. వీఐపీలో ప్రమేయం ఉండడం వల్లనే చర్య తీసుకోలేదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. -
మహా'రేప్' రాష్ట్ర
మహిళలపై లైంగికదాడులు, వేధింపుల్లో మహారాష్ట్ర దేశంలోని మిగతా రాష్ట్రాలన్నింటి కంటే అగ్రస్థానంలో నిలిచి సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి కొనితెచ్చుకుంది. గత ఏడాది ఆ రాష్ట్రంలో 13,827 లైంగికదాడి, వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు కూడా కావాల్సినంత అప్రతిష్ఠను మూటగట్టుకున్నాయి. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన వివరాలను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సోమవారం పార్లమెంటులో వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం మహారాష్ట్ర తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ (13,323), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (13,267) రాష్ట్రాలున్నాయి. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 1,17,035 గా నమోదయింది. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు, ప్రస్తుత పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి మేనకా గాంధీ వివరించారు. అందరూ మహిళలే ఉండే మహిళా పోలీస్ స్టేషన్లు మహారాష్ట్రలో ఇంకా ప్రారంభం కాలేదని, మహిళల ఫిర్యాదులు స్వీకరించేందుకు మహిళా సిబ్బందిని నియమించాలని, దాంతోపాటు మహిళా అధికారుల సంఖ్యనూ పెంచాల్సిన అవసం ఉందని ఆ రాష్ట్రానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు సూచించారు. -
'జయకు లేఖ రాయడం మేనకా వ్యక్తిగతం'
చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాయడం మేనకా గాంధీ వ్యక్తిగతమని బీజేపీ జాతీయ నేత మురళీధరరావు స్పష్టం చేశారు. తాజాగా జయలలితకు మేనకా లేఖలు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించారు. అది ఆమె వ్యక్తిగతం. ఇందులో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు'అని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో మద్దతుపై ఎటువంటి బెదిరింపు ధోరణి లేదన్నారు. శివసేనతో తమ మైత్రి కొనసాగుతుందనే అనుకుంటున్నా అని ఆయన తెలిపారు. మేనకా గాంధీతో పాటు, రజనీ కాంత్ లు వేర్వేరుగా జయక లేఖలు రాసిన సంగతి తెలిసిందే. రజనీ కాంత్ వంటి స్టార్లను నియంత్రించ లేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలా ఉండగా వారిద్దరి లేఖలు తనను లోతుగా కదిలించాయని జయ తెలిపారు. రజనీ, మేనకాగాంధీలు తమ తమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించటం సంతోషకరమన్నారు. -
ఆ 'లేఖలు' నన్ను కదిలించాయి: జయ
చెన్నై : సినీ నటుడు రజనీకాంత్, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధ్యక్షురాలు జయలలిత ధన్యవాదాలు తెలిపారు. జయ జైలు నుంచి విడుదలైన సందర్భంగా రజనీకాంత్, మేనకా గాంధీలు తమ సానుభూతి, మద్దతు తెలుపుతూ వేర్వేరుగా లేఖలు రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన జయలలిత ... వారిద్దరి లేఖలు తనను లోతుగా కదిలించాయన్నారు. రజనీ, మేనకాగాంధీలు తమ తమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించటం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా వారికి, వారి కుటుంబాలకు మంచి జరగాలని జయ ఆకాక్షించారు. ఈ మేరకు అన్నాడీఎంకే కార్యాలయం సోమవారం ఓ లేఖను విడుదల చేసింది. కాగా జీవితంలో ఎన్నో కష్టాల్ని, ఒడిదుడుకుల్ని చవి చూశారని, వాటిన్నింటిని ఎదుర్కొన్నట్టుగానే ప్రస్తుత కష్టాన్ని అధిగమించి త్వరితగతిన బాధ్యతలు చేపట్టాలని కేంద్రమంత్రి మేనకా గాంధీ ...జయలలితకు రాసిన లేఖలో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే రజనీ కాంత్ తన లేఖలో మనో ధైర్యంగా ఉండాలని, ప్రశాంత పూరితంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మళ్లీ ప్రజల్లోకి రావాలని ఆంక్షిస్తూ, ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఆయన ఆలేఖలో పేర్కొన్నారు. -
ముఖ్యమంత్రిగా మా అబ్బాయే ఉత్తమం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చాలా ఏళ్ల తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రి పీఠంపై ఆ పార్టీ నాయకులు కన్నేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో లేకపోయినా ఆశావహ అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కేంద్ర మంత్రి మేనకా గాంధీ తన కుమారుడు, ఎంపీ వరుణ్ గాంధీ పేరును స్వయంగా ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుణ్ అత్యుత్తమ వ్యక్తి అవుతారని మేనక అన్నారు. ఉత్తరప్రదేశ్ లో సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మేనక అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మేనక్, వరుణ్ ఇద్దరూ యూపీ నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం యూపీలో సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. కాగా అత్యాచారాలు, నేరాలను అరికట్టడంలో విఫలమైన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అద్భుత ఫలితాలు సాధించడంతో ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రత్యేక దృష్టిసారిస్తోంది. మేనక ఆశలు నెరవేరాలంటే ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు పొందాలి. -
మహిళలకు 33% కోటా
పోలీసు శాఖలో అమలుకు కేంద్ర ప్రభుత్వం సూచన న్యూఢిల్లీ: గుజరాత్ ప్రభుత్వం స్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల లైంగిక వేధింపులు, మహిళలపై నేరాలకు సంబంధించి కేసులను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఈ చర్య తోడ్పడుతుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. ‘మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను సమర్థవంతంగా పరిష్కరించడానికి అనువైన చర్యలు తీసుకోవాలని నేను ప్రతి ముఖ్యమంత్రికీ లేఖ రాశాను’ అని మేనకా గాంధీ ఆదివారం చెప్పారు. గత నెలలో గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ ఆ రాష్ట్రంలోని పోలీసు బలగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలీసు బలగాల్లో మహిళల సంఖ్యను పెంచడం ద్వారా బాధితులు వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించవచ్చని, కేసు దర్యాప్తులోనూ వీరు సహాయపడతారని మహిళా, శిశు అభివృద్ధి శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
'మహిళలపై ధృక్పథాన్ని మార్చుకోండి'
న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై యధేచ్చగా జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే సమాజంలోనే మార్పు రావాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే నిర్మూలించడం అనేది కష్టతరమని ఆమె పేర్కొన్నారు. ఇందుకు గాను మహిళల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు వివిధ రకాలైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు మేనకా గాంధీ తెలిపారు. మహిళా రక్షణ అనేది దేశ ప్రాథమిక కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు. మహిళలు నివసించే చోట, ఉద్యోగాలు చేసే చోట అనువైన వాతావరణాన్ని కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని మేనక స్పష్టం చేశారు. -
తమ్ముడూ... ఇప్పటికైనా...
-
తమ్ముడు దారి తప్పాడు!
వరుణ్‌గాంధీపై ప్రియాంక సంచలన ఆరోపణలు ఎన్నికల్లో అతన్ని గెలిపించొద్దని ప్రజలకు విజ్ఞప్తి ఎవరు దారి తప్పారో ప్రజలే నిర్ణయిస్తారన్న వరుణ్ తల్లి న్యూఢిల్లీ: అసలే ఉప్పు, నిప్పుగా ఉండే సోనియాగాంధీ, మేనకాగాంధీ కుటుంబాలు రాజకీయంగా మరోసారి కత్తులు దూసుకున్నాయి. మాటల తూటాలు సంధించుకున్నాయి. తన చిన్నాన్న సంజయ్‌గాంధీ కుమారుడు, తనకు తమ్ముడయ్యే వరుణ్‌గాంధీపై ప్రియాంకా గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. వరుణ్ దారితప్పాడని ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుణ్‌ను ఎన్నికల్లో గెలిపించరాదని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం అమేథీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలోని ఫిల్బిత్ సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ ఈసారి ఎన్నికల్లో అమేథీ పక్క నియోజకవర్గమైన సుల్తాన్పూర్ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ‘‘వరుణ్‌గాంధీ కచ్చితంగా మా కుటుంబానికి చెందిన వ్యక్తే. అతను నాకు తమ్ముడే. కానీ అతను దారితప్పాడు. కుటుంబంలో అందరికన్నా చిన్నోడు తప్పుడు బాటను ఎంచుకుంటే పెద్దలే అతనికి సరైన మార్గాన్ని చూపుతారు. అందువల్ల నా తమ్ముడికి సరైన మార్గం చూపాలని కోరుతున్నా’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. వరుణ్ రాజకీయంగా ముందుకు సాగాలంటే మంచి మనసుతో అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. ‘‘దేశ ఐక్యత కోసం మనస్ఫూర్తిగా ఓటు వేయాలని కోరేందుకే నేను ఇక్కడకు (సుల్తాన్పూర్) వచ్చా. ఈసారి మీ నియోజకవర్గం గురించే కాకుండా యావత్ దేశం గురించి ఆలోచించండి. కుటుంబంలోని చిన్న వ్యక్తికి సరైన బాట చూపేలా తెలివిగా ఓటు వేయండి’’ అని కోరారు. ప్రజలే నిర్ణయిస్తారు: మేనక ప్రియాంక విమర్శలపై వరుణ్‌గాంధీ తల్లి, బీజేపీ నాయకురాలు మేనకాగాంధీ దీటుగా స్పందించారు. ఎవరు తప్పు దోవలో వెళ్లారో దేశమే నిర్ణయిస్తుందనిఆదివారం వ్యాఖ్యానించారు. దేశ సేవలో ఒకవేళ అతను తప్పుడు బాటలో పయనించి ఉంటే దేశమే దానిపై నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు వరుణ్‌గాంధీకి బీజేపీ బాసటగా నిలిచింది. వరుణ్ సరైన దారిలోనే ప్రయాణిస్తున్నారని, దేశాన్ని ఎవరైనా తప్పుదోవ పట్టించారంటే అది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. -
బుద్ధికుశలతను వాడాలి
వరుణ్‌గాంధీకి తల్లి మేనకాగాంధీ హితవు పిలిభిత్(యూపీ): ఏదైనా మాట్లాడేముందు హృదయాన్ని కాదు.. బుద్ధికుశలతను ఉపయోగించాలని తన కుమారుడు వరుణ్‌గాంధీకి ఆయన తల్లి, బీజేపీ నేత మేనకాగాంధీ గురువారం సలహా ఇచ్చారు. వరుణ్ తన పెదనాన్న కుమారుడైన రాహుల్‌గాంధీని ప్రశంసించడాన్ని ఆమె తప్పుపట్టారు. అమేథీలో అభివృద్ధి గురించి తన కుమారుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని పేర్కొంటూ ఆమె పై విధంగా హితవు పలికారు. అమేథీలో గడిచిన 45 ఏళ్లుగా ఏ విధమైన అభివృద్ధి జరగలేదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే ఈ సందర్భంగా మేనకాగాంధీ తన కుమారుడ్ని వెనకేసుకొచ్చారు. వరుణ్ అమాయకుడని, అతని హృదయం ఎలాంటి కల్మషం లేనిదని చెప్పారు. యూపీలోని సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వరుణ్ గత మంగళవారం ఓ ఉపాధ్యాయ బృందాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ స్వయంసహాయక సంఘాల ద్వారా తన నియోజకవర్గం అమేథీలోని మహిళల సాధికారతకు చక్కగా కృషి చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించడం తెలిసిందే. -
'కాంగ్రెస్ చచ్చిపోయింది, బ్రతికించేనాథుడే లేడు'
-
ఉద్యమకారులపై ఎస్ఐ జులుం
చౌడేపల్లె, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమకారులపై పుంగనూరు ఎస్ఐ శంకరమల్లయ్య జులుం ప్రదర్శించి చేయి చేసుకున్న ఘటన ఆదివారం చౌడేపల్లె బస్టాండులో చోటు చేసుకుంది. సదుం మండలం నుంచి మాజీ ఎంపీ మేనకాగాంధీ రోడ్డుమార్గంలో చౌడేపల్లె మీదుగా పుంగనూరుకు వెళ్తున్నారని ఉద్యమకారులకు సమాచారం అందింది. దీంతో వారు ఆమె వాహనాన్ని అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె వాహనానికి ముందు వస్తున్న ఎస్ఐ జీపు దిగి ఉద్యమకారులపై విరుచుకుపడ్డారు. మేనకాగాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన తీరు మారలేదు. ఉద్యమకారులను పక్కకు నెట్టి చేయిచేసుకున్నారు. దీంతో సమైక్యవాదులు ఎస్ఐకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఆపై చౌడేపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలమనేరు డీ ఎస్పీ, ఎస్పీలకూ ఫ్యాక్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్టు వడ్డెర సంఘం నాయకులు పేర్కొన్నారు.