కేంద్ర మంత్రి మేనకా గాంధీ షాకింగ్‌ కామెంట్లు | Union Minister Maneka Gandhi abuses officer in Bareilly | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి మేనకా గాంధీ షాకింగ్‌ కామెంట్లు

Published Sat, Feb 17 2018 11:14 AM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM

బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న మేనకా గాంధీ షాకింగ్‌ కామెంట్లు చేశారు. శుక్రవారం నిర్వహించిన పబ్లిక్‌ మీటింగ్‌లో, మేనకాగాంధీ ఓ అధికారిని విపరీత వ్యాఖ్యలతో దూషించారు. అందరి ముందే పరుష పదజాలంతో చివాట్లు పెట్టారు. ఆ అధికారి అవినీతి పాల్పడుతున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేనకా గాంధీ ఈ విధంగా స్పందించారు.

పబ్లిక్‌ మీటింగ్‌లో ఆయన్ను ఈ విధంగా తిట్టడంతో, ఒక్కసారిగా అందరూ హవాక్కయ్యారు. ముఖ్యంగా ఆయన్ను అందరి ముందు తిట్టడం, అవమానించడం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్‌ బహేరీలో పీడీఎస్‌ స్కీమ్‌ను పరిశీలించడానికి వెళ్లిన్నప్పుడు మేనకా ఈ వ్యాఖ్యలు చేశారు. మేనకా గాంధీ ప్రస్తుత ప్రభుత్వంలో మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement