చెన్నై:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాయడం మేనకా గాంధీ వ్యక్తిగతమని బీజేపీ జాతీయ నేత మురళీధరరావు స్పష్టం చేశారు. తాజాగా జయలలితకు మేనకా లేఖలు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన స్పందించారు. అది ఆమె వ్యక్తిగతం. ఇందులో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు'అని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో మద్దతుపై ఎటువంటి బెదిరింపు ధోరణి లేదన్నారు. శివసేనతో తమ మైత్రి కొనసాగుతుందనే అనుకుంటున్నా అని ఆయన తెలిపారు. మేనకా గాంధీతో పాటు, రజనీ కాంత్ లు వేర్వేరుగా జయక లేఖలు రాసిన సంగతి తెలిసిందే. రజనీ కాంత్ వంటి స్టార్లను నియంత్రించ లేమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇదిలా ఉండగా వారిద్దరి లేఖలు తనను లోతుగా కదిలించాయని జయ తెలిపారు. రజనీ, మేనకాగాంధీలు తమ తమ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన గురించి ఆలోచించటం సంతోషకరమన్నారు.