లక్నో: దేశంలో కేవలం సుల్తాన్‌పూర్ నియోజకవర్గం ప్రజలు మాత్రమే తమ ఎంపీని ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తారని బీజేపీ నేత వరుణ గాంధీ అన్నారు. వరుణ గాంధీ తన తల్లి మేనకా గాంధీ కోసం గురువారం సుల్తాన్‌పూర్ పార్లమెంట్ స్థానంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మేనకా గాంధీ సుల్తాన్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రచారంలో భాగంగా వరుణ్ గాంధీ మాట్లాడారు.
‘‘దేశంలోనే ఒకే ఒక పార్లమెంట్ స్థానంలో అక్కడి ప్రజలంతా తమ ఎంపీని ఆప్యాయంగా ‘అమ్మ’ అని పిలుస్తారు. నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మ మేనకా గాంధీకి ప్రజలు మద్దలు ఇవ్వాలని కోరడానికి రాలేదు. సుల్తాన్‌పూర్ ప్రజల ‘అమ్మ’కు మద్దతు ఇవ్వాలని కోరటం కోసం వచ్చా’’ అని వరుణ్ గాంధీ అన్నారు.
#WATCH | Uttar Pradesh | BJP leader Varun Gandhi campaigns for his mother and party candidate from Sultanpur constituency Maneka Gandhi
"There is only one constituency in the country where its people do not call its MP as 'Sansad' but as 'Maa'...I am here not just to gather… pic.twitter.com/8n7u9k8Ztp— ANI (@ANI) May 23, 2024
మేనకా గాంధీ సుల్తాన్‌పూర్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయటం ఇది రెండోసారి. 2019 ఎన్నికల్లో ఆమె ఇక్కడ 14000 వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈసారి భారీ మెజార్టీ సాధించటంపై బీజేపీ దృష్టి పెట్టింది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం సుల్తాన్‌పూర్‌లో మేనకా గాంధీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు.
ఇక.. ఫిలిబీత్ సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్ గాంధీకి ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే వరుణ్ గాంధీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా విమర్శించటం వల్లనే బీజేపీ ఈసారి ఆయనకు టికెట్ ఇవ్వలేదని రాజకీయంగా పార్టీలో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment