
సాక్రమెంటో: అగ్రరాజ్యం మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కి పడింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ(Florida state University)లో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.
తొలుత.. తల్లహస్సి క్యాంపస్‌లోని స్టూడెంట్ యూనియన్‌లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు తొలుత సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్ లాక్‌డౌన్(Lock Down)లోకి వెళ్లింది. ఈ రోజు జరగాల్సిన క్లాస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు.
గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తల్లహస్సి మెమోరియల్ హెల్త్‌కేర్ ప్రతినిధి తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయాన్ని అధికారులు చేరవేశారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని ట్రంప్ పేర్కొన్నారు. ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లుగా ఫుటేజీ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిందితుడు యూనివర్సిటీ విద్యార్థిగానే తెలియగా.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు.. ఐదుగురు మృతి చెందినట్లు కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది.

#Shooting at American university
Media report that over 30 shots were fired on the campus of #Florida State #University.
At least 5 people were killed and 4 others injured in the incident. pic.twitter.com/49nBiC6SLv— Tamadon News - English (@TamadonTV_EN) April 18, 2025