బీజేపీ మహిళా నేత, సుల్తాన్‌పూర్ లోక్‌సభ అభ్యర్థి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ విషయమై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వరుణ్ గాంధీకి బీజేపీ పిలిభిత్ సీటును కేటాయించకపోవడంతో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తాజాగా విలేకరులు మేనకా గాంధీని మీ కుమారుడు వరుణ్ గాంధీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అని అడిగినప్పుడు ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. వరుణ్ ఉత్తమ ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. వరుణ్ దేశానికి మంచి చేస్తారని అంటూనే, వరుణ్ గాంధీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయరని, మేం అలాంటి వాళ్లం కాదని పేర్కొన్నారు.
దీనికి ముందు బీజేపీ ఎంపి వరుణ్ గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు భవోద్వేగంతో కూడిన లేఖను రాశారు. ఎంపీగా తన పదవీకాలం ముగిసినా, పిలిభిత్‌తో తన అనుబంధం తన చివరి శ్వాస వరకు ఉంటుందని అన్నారు. సామాన్యుల గొంతు పెంచేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వరుణ్ ఆ లేఖలో రాశారు.
#WATCH सुल्तानपुर: वरुण गांधी का टिकट कटने पर भाजपा नेता मेनका गांधी ने कहा, "ये पार्टी का फैसला है। वरुण बहुत अच्छे सांसद थे। आगे भी जिन्दगी में जो भी बनेंगे, देश के लिए अच्छा ही करेंगे।"
— ANI_HindiNews (@AHindinews) April 8, 2024
वरुण गांधी द्वारा अलग से चुनाव लड़ने के सवाल पर उन्होंने कहा, "नहीं...हम इस तरह के लोग… pic.twitter.com/xAZTJOyrLA
Comments
Please login to add a commentAdd a comment