separately
-
వరుణ్‌గాంధీ పోటీ.. మేనకాగాంధీ ఏమన్నారంటే?
బీజేపీ మహిళా నేత, సుల్తాన్పూర్ లోక్‌సభ అభ్యర్థి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ విషయమై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వరుణ్ గాంధీకి బీజేపీ పిలిభిత్ సీటును కేటాయించకపోవడంతో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా విలేకరులు మేనకా గాంధీని మీ కుమారుడు వరుణ్ గాంధీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అని అడిగినప్పుడు ఆమె ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. వరుణ్ ఉత్తమ ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. వరుణ్ దేశానికి మంచి చేస్తారని అంటూనే, వరుణ్ గాంధీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయరని, మేం అలాంటి వాళ్లం కాదని పేర్కొన్నారు. దీనికి ముందు బీజేపీ ఎంపి వరుణ్ గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు భవోద్వేగంతో కూడిన లేఖను రాశారు. ఎంపీగా తన పదవీకాలం ముగిసినా, పిలిభిత్‌తో తన అనుబంధం తన చివరి శ్వాస వరకు ఉంటుందని అన్నారు. సామాన్యుల గొంతు పెంచేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వరుణ్ ఆ లేఖలో రాశారు. #WATCH सुल्तानपुर: वरुण गांधी का टिकट कटने पर भाजपा नेता मेनका गांधी ने कहा, "ये पार्टी का फैसला है। वरुण बहुत अच्छे सांसद थे। आगे भी जिन्दगी में जो भी बनेंगे, देश के लिए अच्छा ही करेंगे।" वरुण गांधी द्वारा अलग से चुनाव लड़ने के सवाल पर उन्होंने कहा, "नहीं...हम इस तरह के लोग… pic.twitter.com/xAZTJOyrLA — ANI_HindiNews (@AHindinews) April 8, 2024 -
మిర్యాలగూడ, వైరా ఇస్తేనే పొత్తు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘మిర్యాలగూడతో పాటు వైరా సీటు ఇస్తే ఓకే.. ఈ రెండు స్థానాలు ఇవ్వకపోతే పొత్తు కుదరదు. రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తేల్చకపోతే మేము విడిగా వెళ్తాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం హైదరాబా ద్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటాయని, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరవుతారని తెలిపా రు. ఈ సమావేశాల్లోపు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే తాము విడిగా పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. బాల్ కాంగ్రెస్ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి లేకనే ఇలా చేస్తున్నారు.. కాంగ్రెస్‌తో పొత్తు కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగాయని, తొలు త భద్రాచలం, పాలేరు, మిర్యాలగూ డెం, ఇబ్రహీంపట్నం, వైరా స్థానాలను అడిగామని తమ్మినేని తెలిపారు. భద్రా చలం సిట్టింగ్ స్థానం ఇవ్వడం కుదరద ని చెప్పారని, ఒక దశలో పాలేరు ఇస్తా మని చెప్పి.. తర్వాత వారి అభ్యర్థిని ప్రకటించారని అన్నారు. ఒక్కో మెట్టు దిగి భద్రాచలం, పాలేరు వదులుకున్నామని, చివ రకువారు ప్రతిపాదించిన వైరా, మిర్యాలగూడ సీట్ల కు అంగీకరించామని వివరించారు. మళ్లీ ఇప్పుడు వైరా స్థానం ఇస్తామని చెప్పలేదంటూ ఆ పార్టీకి చెందిన ఒక నేత మాట్లాడారని విమర్శించారు. ప్రస్తుతం మిర్యాలగూడతో పాటు హైదరాబాద్ నగరంలో ఒక సీటు ఇస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నా రని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సీపీఎంతో పొత్తుపై చిత్తశుద్ధి లేకనే అలా మాట్లాడుతున్నా రని, ఇది సరైంది కాదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, అది మద్దతిచ్చే పార్టీ గెలవొద్దనే విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ముందుకొస్తే సంతోషమని వ్యా ఖ్యానించారు. తాజా పరిణామాలను సీపీఐ నేతల కు కూడా తెలియజేశామని చెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
మేమే నిర్వహించుకుంటాం
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై మంత్రి జగదీశ్‌రెడి ఎంసెట్ ప్రవేశాల నోటిఫికేషన్‌తో మాకు సంబంధం లేదు సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను మేమే నిర్వహించుకుంటాం.. ఈ విషయంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్‌తో మాకు సంబంధం లేదు. ఆ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, విద్యామండలి చైర్మన్ కలిసి ఆడుతున్న నాటకమిది..’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు కాలేజీలకు అనుమతులు ఇవ్వకముందే కౌన్సెలింగ్ ప్రక్రియ ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలోని కళాశాలలను తనిఖీ చేసి, అఫిలియేషన్ ఇచ్చిన అనంతరం ప్రవేశాల ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలనకు ఎంసెట్ కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. గత నాలుగేళ్లలో ఎప్పుడూ ప్రవేశాలు ఆగస్టు కంటే ముందు జరగలేదని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి సీఎంకు తెలియజేశారు. ఉన్నత విద్యా మండలికి, ప్రభుత్వానికి మధ్య వివాదం వచ్చినపుడు... ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అవుతుందని ‘ఉన్నత విద్యామండలి చట్టం-1988’ సెక్షన్ 18 (2)లోనే ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఉన్నత విద్యా మండలి తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎంతో దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా, ఇతర రాష్ట్ర విద్యార్థులకంటే తెలంగాణ విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్య అందిస్తామని... ఇందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని వివరించారు. కౌన్సెలింగ్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ఉన్నత విద్యా మండలి గందరగోళం సృష్టిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో సీట్లు కేటాయించే అధికారం ఏపీకి, ఏపీ ఉన్నత విద్యా మండలికి లేదని.. ఆంధ్రా ప్రభుత ్వం నిర్వహించే కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పారు. మండలి ప్రకటనపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా... ఇక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దనే ఉద్ధేశంతో చెబుతున్నామని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. జేఎన్టీయూ నుంచి అనుమతులు వచ్చాకే తెలంగాణలో కౌన్సెలింగ్ ఉంటుదన్నారు. సీఎంను కలిసిన వారిలో మంత్రితో పాటు విద్యాశాఖ అధికారులు ఉన్నారు.