సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘మిర్యాలగూడతో పాటు వైరా సీటు ఇస్తే ఓకే.. ఈ రెండు స్థానాలు ఇవ్వకపోతే పొత్తు కుదరదు. రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తేల్చకపోతే మేము విడిగా వెళ్తాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంగళవారం హైదరాబా ద్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటాయని, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరవుతారని తెలిపా రు. ఈ సమావేశాల్లోపు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే తాము విడిగా పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. బాల్ కాంగ్రెస్ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించారు.
చిత్తశుద్ధి లేకనే ఇలా చేస్తున్నారు..
కాంగ్రెస్‌తో పొత్తు కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగాయని, తొలు త భద్రాచలం, పాలేరు, మిర్యాలగూ డెం, ఇబ్రహీంపట్నం, వైరా స్థానాలను అడిగామని తమ్మినేని తెలిపారు. భద్రా చలం సిట్టింగ్ స్థానం ఇవ్వడం కుదరద ని చెప్పారని, ఒక దశలో పాలేరు ఇస్తా మని చెప్పి.. తర్వాత వారి అభ్యర్థిని ప్రకటించారని అన్నారు. ఒక్కో మెట్టు దిగి భద్రాచలం, పాలేరు వదులుకున్నామని, చివ రకువారు ప్రతిపాదించిన వైరా, మిర్యాలగూడ సీట్ల కు అంగీకరించామని వివరించారు. మళ్లీ ఇప్పుడు వైరా స్థానం ఇస్తామని చెప్పలేదంటూ ఆ పార్టీకి చెందిన ఒక నేత మాట్లాడారని విమర్శించారు.
ప్రస్తుతం మిర్యాలగూడతో పాటు హైదరాబాద్ నగరంలో ఒక సీటు ఇస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నా రని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సీపీఎంతో పొత్తుపై చిత్తశుద్ధి లేకనే అలా మాట్లాడుతున్నా రని, ఇది సరైంది కాదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, అది మద్దతిచ్చే పార్టీ గెలవొద్దనే విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ముందుకొస్తే సంతోషమని వ్యా ఖ్యానించారు. తాజా పరిణామాలను సీపీఐ నేతల కు కూడా తెలియజేశామని చెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment