లక్నో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. పదిరోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ యూపీలోని సుల్తాన్‌పూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన కుమారుడికి బీజేపీ ఫిలీభీత్ స్థానాన్ని నిరాకరించిన విషయం తెలిసిందే. బీజేపీ వరణ్‌గాంధీకి టికెట్ నిరాకరించిన తర్వాత తొలిసారి మేనకా గాంధీ స్పందించారు. ప్రస్తుతం వరణ్‌గాంధీ చేస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు మేనకా గాంధీ సమాదానం ఇచ్చారు.
‘వరుణ్‌కు గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి. లోక్‌సభ ఎన్నికల అనంతరం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా సమయం ఉంది’ అని ఆమె తెలిపారు. ‘నేను బీజేపీలో ఉన్నందుకు సంతోషపడుతున్నా. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నాకు టికెట్ ఇచ్చారు.అయితే టికెట్ కేటాయించటంలో కొంత జాప్యం జరిగింది. దీంతో నేను ఎక్కడ పోటీ పడతానోనని కొంత అయోమయం మొదలైంది. మళ్లీ అందులో ఈసారి ఫిలీభీత్? లేదా సుల్తాన్‌పూర్?. అయితే బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవటం సంతోషం. మళ్లీ నేను సుల్తాన్‌పూర్‌లో పోటీ చేయటం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్‌లో ఒకసారి గెలిచిన ఎంపీ మళ్లీ గెలవడని చర్రిత చెబుతోంది ’ అని మేనకా గాంధీ అన్నారు.
టికెట్ ప్రకటించిన తర్వాత మేనకా గాంధీ సుల్తాన్‌పూర్‌లో పర్యటించటం ఇదే మొదిటిసారి. పది రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తాన్‌పూర్ సెగ్మెంట్‌లో సుమారు 101 గ్రామాలను పర్యటించనున్నారు. ఇక.. అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వరణ్ గాంధీ సొంత పార్టీపైనే విమర్శలు చేయటంలో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరుణ్ గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిని లేఖ రాశారు. తన కడ శ్వాసవరకు ఫిలీభీత్ ప్రజలతో సంబంధాలను కొనసాగిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment