తల్లి సంరక్షణలో మాత్రమే ఉన్న పిల్లలు పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు తండ్రి పేరు, వివరాలను పొందుపరిచేందుకు ఇష్టపడకపోతే, తండ్రి పేరు లేకుండానే వారికి పాన్ కార్డును జారీ చేసేలా 1962 నాటి ఇన్‌కం ట్యాక్స్ నిబంధనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సడలించింది. ‘‘ఇప్పుడిక తండ్రికి దూరంగా తల్లితో ఉంటున్న పిల్లలు తండ్రి పేరుకు బదులుగా తల్లిపేరుతో పాన్ కార్టు పొందవచ్చు’’ అని స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఆ శాఖ మంత్రి మేనకా గాంధీ ఈ ఏడాది జూలైలో చేసిన సిఫారసుల మేరకు.. ఆర్థిక శాఖ ఈ విధమైన వెసులుబాటును కల్పించింది. భర్తతో విడిపోయి దూరంగా ఉంటున్న మహిళలు తమ పిల్లలకు తండ్రిగా అతడి పేరు పాన్ కార్డుపై ఉండడంపై విముఖత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేనక తెలిపారు.ఉమన్ పవరేంటో చూపించే హాలీవుడ్ చిత్రాలు, హీరో ప్రధాన నాయకుడిగా ఉన్న చిత్రాలకంటే కూడా ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నాయని ‘క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ అండ్ షిఫ్ట్7’ అనే సంస్థ సర్వేలో వెల్లడయింది.
2014–2017 మధ్య చిత్రాల వసూళ్లను గమనించినప్పుడు ‘ట్రోల్స్’, టీనేజ్ మ్యుటెంట్ నింజా టర్టీస్’, ‘మోనా’, ‘ఇన్‌సైడ్ అవుట్’, ‘వండర్ ఉమన్’ వంటి కథానాయిక ప్రాధాన్యం గల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తంలో కలెక్షన్‌లను మూటకట్టుకోవడం కనిపించిందని ఆ సంస్థ పేర్కొంది. తక్కువ బడ్జెట్‌తో తయారై ఎక్కువ లాభాలను సాధించిన చిత్రాలను కూడా తమ సర్వేకోసం తీసుకున్నామని, అలా చూసినా ఫిమేల్ లీడ్ మూవీలదే పై చేయిగా ఉందని సంస్థ ప్రతినిధి క్రిస్టీ హాబెగ్గర్ తెలిపారు. లాభాలను కోరుకునే నిర్మాతలు, కనీసం నష్టాలనైనా తప్పించుకోవాలనుకునే నిర్మాతలు తెర ముందు కనిపించే నటీమణులను, తెరవెనుక సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకునేటప్పుడు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని ఈ నివేదిక సూచిస్తోందని హాబెగ్గర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment