1946 డిసెంబరు 14న జన్మించిన సంజయ్ గాంధీ
అత్యంత విచిత్ర పరిస్థితుల్లో మేనకా గాంధీతో వివాహం
దీనికి ముందు సంజయ్‌కు రెండు ప్రేమ వ్యవహారాలు
జర్మన్ యువతి సబీన్‌తో సంజయకు వివాహం జరగాలని ఆకాంక్షించిన సోనియా
స్నేహితుని పెళ్లిలో సంజయ్‌కు పరిచయమైన మేనక
1980 జూన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్‌గాంధీ మృతి
సంజయ్ గాంధీ.. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు. సంజయ్ గాంధీ 1946 డిసెంబరు 14న జన్మించారు. రాజీవ్ గాంధీ ఈయన సోదరుడు. సంజయ్ గాంధీ అత్యంత విచిత్ర పరిస్థితుల్లో మేనకా గాంధీని కలుసుకున్నారు. ఆ తరువాత వివాహం చేసుకున్నారు.
అది 1973వ సంవత్సరం.. అప్పటికి సంజయ్ గాంధీ వయసు 27 ఏళ్లు. లండన్‌లో చదువు పూర్తి చేసుకుని సంజయ్ గాంధీ ఇండియాకు తిరిగివచ్చారు. అప్పటికే ఆయన ఇద్దరు యువతులతో ప్రేమ వ్యహారాలు నడిపారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. తొలుత సంజయ్ గాంధీ ఒక ముస్లిం యువతిని ప్రేమించారు. అయితే అది ఎక్కువకాలం కొనసాగలేదు. తరువాత ఆయన జర్మన్ యువతి సబీన్ వాన్ స్టీగ్లిట్జ్ ప్రేమలో పడ్డారు. ఆమె సోనియాగాంధీకి స్నేహితురాలు
సోనియా స్నేహితురాలు సబీన్‌తో..
ఆ సమయంలో సబీన్ ఢిల్లీలో టీచర్‌గా పనిచేసేవారు. ఆమె తరచూ రాజీవ్,సోనియాల ఇంటికి వచ్చేవారు. ఆ సమయంలో సంజయ్‌గాంధీ..సబిన్‌తో మాట్లాడేవారు. కొంతకాలం తరువాత వారిలో చిగురించిన ప్రేమను గమనించిన సోనియా వారిద్దరూ వివాహం చేసుకుంటే బాగుంటుందని భావించారట. అయితే అప్పట్లో సంజయ్ గాంధీ.. మారుతి కారు భారత్‌కు తీసుకురావాలనే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. సబీనాతో పెళ్లికి అంత ప్రాథాన్యత ఇవ్వలేదు. దీంతో సబీన్ యూరప్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుని విమనాశ్రయానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న సంజయ్ ఆ విమానంలోని పైలెట్‌తో రేడియోలో మాట్లాడి, సబీన్‌ను తిరిగి రమ్మని అభ్యర్థించారు. అలా ఆమె వెనక్కు వచ్చింది. అయితే తరువాతి కాలంలో సంజయ్- సబిన్ మధ్య విబేధాలు వచ్చి వారు విడిపోయారు.
మోడలింగ్ రంగంలో మేనకకు అవార్డులు
1973, సెప్టెంబర్ 14న సంజయ్ తన స్నేహితుని పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతని స్నేహితుడు సంజయ్‌కు మేనకా ఆనంద్ అనే యువతిని పరిచయం చేశారు. ఆమె రిటైర్డ్ సిక్కు కల్నల్ కుమార్తె. మోడలింగ్ చేస్తూ, ఈ రంగంలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. జర్నలిస్టు కావాలనేది ఆమె కల. అలా పరిచయమైన మేనకతో సంజయ్ ప్రేమలో పడ్డారు. ఇది సంజయ్ అన్నయ్య రాజీవ్ గాంధీ, వదిన సోనియాలకు అంతగా నచ్చలేదు. మేనక ప్రవర్తన వారికి నచ్చలేదు. కొన్నాళ్ల తరువాత సంజయ్ తన తల్లి ఇందిరకు మేనకను పరిచయం చేశాడు. ఇందిరాగాంధీని కలిసే సమయంలో మేనకా చాలా భయపడ్డారు. తొలిసారి ఇందిరను కలుసుకున్న మేనక తాను మోడల్‌ననే విషయాన్ని ఆమెకు చెప్పలేదు.
మేనక గురించి తెలుసుకున్న ఇందిర
దీనికి ముందు కూడా సంజయ్ పలువురు యువతులను ఇందిరకు పరిచయం చేశారు. మేనక కూడా ఇలాంటి స్నేహితురాలే అయివుంటుందని ఇందిరా గాంధీ తొలుత భావించారు. అయితే తరువాత సంజయ్ తన తల్లి ఇందిరను ఒప్పించి, మేనకతో తన వివాహానికి 1974, జూలై 29న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ హడావుడిలో ఇందర.. మేనక కుటుంబం గురించి తెలుసుకోలేకపోయారు. నిశ్చితార్థ వేడుక పూర్తయ్యాక, ఇరు కుటుంబాలకు ఇందిర ఇంట్లో విందు జరిగింది. అప్పడు ఇందిర స్వయంగా మేనక కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు.
భర్తను ప్రధానిగా చూడాలనుకున్న మేనక
అప్పటికే నిశ్చితార్థం జరిగిపోవడంతో ఇందిర మరేమీ చేయలేక మౌనం వహించారు. 1974, సెప్టెంబర్ 23న సంజయ్ గాంధీ, మేనకా గాంధీల వివాహం జరిగింది. అయితే మేనక ప్రవర్తన సోనియాకు నచ్చేది కాదని వినికిడి. ఏదో ఒకరోజు తన భర్త సంజయ్ ప్రధాని అవుతారని మేనక అందరికీ చెబుతుండేవారట. సంజయ్, మేనకలకు 1980లో వరుణ్‌గాంధీ జన్మించాడు. ఇది జరిగిన మూడు నెలలకు 1980 జూన్‌లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. రెండేళ్ల తరువాత ఇందిరాగాంధీ ఇంటి నుంచి మేనకా గాంధీ తన కుమారుడు వరుణ్ గాంధీని తీసుకుని మరో ఇంటికి వెళ్లిపోయారు. ఆ సమయంలో సోనియా, మేనకల మధ్య సత్సంబంధాలు లేవని చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నం? ఏ తరం వారు ఏం చేస్తున్నారు?
Comments
Please login to add a commentAdd a comment