న్యూఢిల్లీ: మహిళా ఎంపీలు, పార్లమెంటు అధికారులు, సిబ్బంది చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు అనువుగా త్వరలో పార్లమెంటులో శిశు సంరక్షక కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కేంద్రంలో తల్లులు పాలివ్వడానికి విడిగా మరో గదిని ఏర్పాటుచేయనున్నారు.
ఇప్పటికే ఈ కేంద్రం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్లమెంటు మొత్తం సిబ్బందిలో మూడో వంతు మంది మహిళలే ఉన్నారని వారి చిన్నారుల కోసం ఈ కేంద్రం ఏర్పాటుచేయాలని గతేడాది మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ పార్లమెంటు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
త్వరలో పార్లమెంటులో శిశుసంరక్షక కేంద్రం
Published Wed, Feb 21 2018 12:25 AM | Last Updated on Wed, Feb 21 2018 12:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment