General assembly
-
ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21
ఐక్యరాజ్యసమితి: ఏటా డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న భారత్ సహ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. లీచెన్స్టయిన్, భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రాలతో కూడిన దేశాల బృందం 193 సభ్య దేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఈ తీర్మానం ప్రవేశపెట్టాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘సర్వజనుల శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు! డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐరాస ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించేందుకు ఇతర దేశాలతో కలిసి భారత్ మార్గదర్శనం చేసిందని తెలిపేందుకు సంతోíÙస్తున్నాం’అని హరీశ్ పేర్కొన్నారు. -
‘ఐక్యరాజ్య సమితి’లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సందర్శించారు. అంతకు ముందు.. జనరల్ అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ ప్రవచించిన శాంతి, అహింస, ఐక్యత ప్రపంచానికి ఆదర్శమైందని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ కు భారత ప్రతినిధి బృందంలో విజయసాయిరెడ్డి సభ్యులుగా వెళ్లిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ అవకాశంపై ఆయన స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. This week, I am in New York as part of India’s Non-Official Delegation to the 79th Session of the UNGA. Engaging with global stakeholders on critical issues of peace and conflict, we have had the opportunity to interact with UN organizations and representatives from the Permanent… pic.twitter.com/2pMdbTiTvX— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024శాంతి, అంతర్యుద్ధాలు.. లాంటి ఎన్నో అంశాలపై భారత్, ఇతర దేశాల ప్రతినిధులు సాధారణ అసెంబ్లీలో మాట్లాడతారు. నవంబర్ 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది.Offered floral tributes at the Mahatma Gandhi Bust on the United Nations Lawn during the 79th Session of the UNGA. A moment to honor the ideals of peace, nonviolence, and unity that continue to inspire the world. #UNGA79 #MahatmaGandhi #PeaceForAll #GlobalUnity pic.twitter.com/elppFhiAun— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024 -
‘తుంగభద్ర’ సామర్థ్యంపై కర్ణాటకాలు
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్ వేదికగా కర్ణాటక సరికొత్త నాటకానికి తెరలేపింది. డ్యామ్ నీటినిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలు కాదు.. 105.78 టీఎంసీలని తుంగభద్ర బోర్డు 218వ సర్వసభ్య సమావేశంలో అంగీకరించిన కర్ణాటక 219వ సమావేశంలో అడ్డంతిరిగింది. డ్యామ్ నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు ఉండదని.. అంతకంటే తక్కువే ఉంటుందని.. మళ్లీ హైడ్రోగ్రాఫిక్ సర్వేచేసి, తేల్చాలని పట్టుబట్టింది. పూడికవల్ల డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గిందనే సాకుచూపి.. జలవిస్తరణ ప్రాంతంలో చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాలను చేపట్టి కర్ణాటక యథేచ్ఛగా జలచౌర్యానికి పాల్పడుతుండటంపై బోర్డును ఏపీ ప్రభుత్వం నిలదీసింది. దీనిపై సంయుక్త సర్వేచేసిన బోర్డు.. కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతోందని తేల్చడంతో కర్ణాటకానికి చెక్‌పడింది. దీంతో డ్యామ్ నీటినిల్వ సామర్థ్యంపై ఆ రాష్ట్రం పాత పల్లవి అందుకుందని బోర్డు వర్గాలు వెల్లడించాయి. పూడికతో 33 టీఎంసీలు తగ్గిన నిల్వ కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు అయిన తుంగభద్ర డ్యామ్‌ను 1952లో 133 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అప్పట్లో ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 132.47 టీఎంసీలని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) తేల్చింది. దీని నిల్వ సామర్థ్యం, ఏడాదిలో వచ్చే ప్రవాహాల ఆధారంగా అక్కడ 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం–ఆర్డీఎస్) టీఎంసీల చొప్పున కేటాయించింది. పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలుగా 2008లో నిర్వహించిన సర్వేలో తేలింది. దీంతో.. నీటి లభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు నీటిని పంపిణీ చేస్తోంది. 133 నుంచి 105.78 టీఎంసీలకు.. తుంగభద్ర డ్యామ్‌లో నీటినిల్వ సామర్థ్యంపై ఆర్వీ అసోసియేట్స్ అనే సంస్థతో తుంగభద్ర బోర్డు 2016లో టోపోగ్రాఫికల్ సర్వేను చేయించింది. అందులో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. ఆ సర్వేను కర్ణాటక అంగీకరించకపోవడంతో ఈ అంశంపై మూడు రాష్ట్రాల అధికారులతో జాయింట్ సర్వేను ఈ ఏడాది బోర్డు చేయించింది. ఇందులో డ్యామ్ నిల్వసామర్థ్యం 105.78 టీఎంసీలుగా తేలింది. ఈ క్రమంలోనే చిన్నచిన్న ఎత్తిపోతలు, తాగునీటి పథకాల ద్వారా కర్ణాటక జలచౌర్యానికి పాల్పడుతుండటం బయటపడింది. ఇదే అంశాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తిచూపడంతో గత బోర్డు సమావేశంలో డ్యామ్ నీటి సామర్థ్యాన్ని 105.78 టీఎంసీలుగా కర్ణాటక అంగీకరించింది. 2022–23లో దాన్నే పరిగణలోకి తీసుకున్న బోర్డు.. ఆ నీటిని మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. -
ఉగ్ర స్థావరాలను పెకిలించాల్సిందే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, అవినీతిపరులు, డ్రగ్ స్మగ్లర్లు, వ్యవస్థీకృత నేరగాళ్లకు ఏ దేశమూ ఆశ్రయంగా మారకూడదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి స్థావరాలు ఎక్కడున్నా సరే, వాటన్నింటినీ నిర్మూలించాల్సిందేనని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇందుకు కలసికట్టుగా కృషి చేయాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. సురక్షిత ప్రపంచం అంతర్జాతీయ సమాజపు సమష్టి బాధ్యత అన్న వాస్తవాన్ని అందరూ గుర్తించాలన్నారు. ‘స్థానిక సంక్షేమం కోసం అంతర్జాతీయ సహకారం’ అన్నదే భారత నినాదమన్నారు. ‘‘సానుకూల శక్తులన్నీ పరస్పరం సహకరించుకుంటే దుష్టశక్తులు, నేరగాళ్ల పీచమణచవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఇంటర్‌పోల్ 90వ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఢిల్లీలో మోదీ ప్రారంభించారు. 195 దేశాల నుంచి హోం మంత్రులు, పోలీసులు ఉన్నతాధికారులు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్ తరఫున ఆ దేశ ఫెరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహసిన్ బట్ పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇంటర్‌పోల్ అధ్యక్షుడు అహ్మద్ నాజర్ అల్‌రైసీ, సెక్రెటరీ జనరల్ ఉర్గన్ స్టాక్ వేదిక వద్ద మోదీకి స్వాగతం పలికారు. సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంతో పోలిస్తే ఈ దుష్టశక్తుల వేగం పెరిగిందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇలాంటి నేరాలు ఎక్కడ జరిగినా వాటిని మొత్తం మానవత్వంపై దాడిగానే చూడాలి. ఎందుకంటే ఇవి భావి తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ స్థాయి ముప్పులను ఎదుర్కొనేందుకు స్థానిక స్పందనలు సరిపోవు’’ అని స్పష్టం చేశారు. అందుకే వీటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావడం తక్షణావసరమన్నారు. సదస్సుకు గుర్తుగా 100 రూపాయల నాణాన్ని, పోస్టల్ స్టాంపును మోదీ విడుదల చేశారు. ఇంటర్‌పోల్ సదస్సు పాతికేళ్ల తర్వాత భారత్‌లో జరుగుతోంది. ఉగ్రవాదం తీరు మారింది... పొరుగు దేశాల ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా పోరాడుతోందని మోదీ గుర్తు చేశారు. ‘‘ఉగ్రవాద భూతాన్ని మిగతా ప్రపంచం గుర్తించడానికి చాలాకాలం ముందు నుంచే మేం దానితో పోరాడుతూ వస్తున్నాం. భద్రత, రక్షణ కోసం ఎంతటి మూల్యం చెల్లించాల్సి ఉంటుందో మాకు బాగా తెలుసు. ఈ పోరులో వేలాదిమంది వీరులను కోల్పోయాం’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఉగ్రవాదం ఆన్లైన్ బాట కూడా పట్టిందన్న వాస్తవాలను గుర్తించాలన్నారు. ‘‘ఇప్పుడు ఎక్కడో మారుమూల నుంచి ఒక్క బటన్ నొక్కడం ద్వారా భారీ పేలుడు సృష్టించవచ్చు. తద్వారా ఈ దుష్టశక్తులు వ్యవస్థలనే తమ ముందు సాగిలపడేలా చేసుకునే పరిస్థితి నెలకొంది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చారు. వీటిని ఎదుర్కొనడానికి దేశాలు వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలు చాలవని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా పటిష్ట వ్యూహాల ద్వారా సైబర్ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ఆ దిశగా తక్షణం విధానాలు రూపొందాలని సూచించారు. పోలీసు, చట్టపరమైన సంస్థలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు మార్గాలు కనిపెట్టాలని సూచించారు. ‘‘ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు, రవాణా, కమ్యూనికేషన్ సేవలను కాపాడుకునే యంత్రాంగం, సాంకేతిక, నిఘా సమాచారాల త్వరితగత మార్పిడి తదితరాలను ఆధునీకరించుకోవాలి. అవినీతి, ఆర్థిక నేరాలు చాలా దేశాల్లో పౌరుల సంక్షేమానికి గొడ్డలిపెట్టుగా మారాయి. ఇలా దోచిన సొమ్ము అంతిమంతా ఉగ్రవాదానికి పెట్టుబడిగా మారుతోంది. యువత జీవితాలను డ్రగ్స్ సమూలంగా నాశనం చేస్తోంది’’ అని మోదీ అన్నారు. రెడ్ కార్నర్ నోటీసుల్లో వేగం పెరగాలి పరారీలో ఉన్న నేరగాళ్లను పట్టుకునేందుకు వీలు కల్పించే రెడ్ కార్నర్ నోటీసుల జారీలో వేగం మరింత పెరగాల్సి ఉందని ఇంటర్‌పోల్‌కు ప్రధాని మోదీ సూచించారు. ప్రస్తుతం భారత్ తరఫున 780 రెడ్ కార్నర్ నోటీసులున్నాయని గుర్తు చేశారు. వీటిలో 205 పలు నేరాల్లో సీబీఐ జాబితాలో వాంటెడ్‌గా ఉన్న నేరగాళ్లకు సంబంధించినవని ఆయన చెప్పారు. నేరగాళ్లు ఇంటర్‌పోల్ సభ్య దేశాల్లో ఎక్కడున్నా అరెస్టు చేసేందుకు, వెనక్కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసు వీలు కల్పిస్తుంది. భారత్ జారీ చేసిన నోటీసుల్లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహాయకుడు చోటా షకీల్, ఉగ్రవాదులు మసూద్ అజర్, హఫీజ్ సయీద్‌తో పాటు ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులున్నారు. రెడ్ కార్నర్ నోటీస్ అంతర్జాతీయ అరెస్టు వారెంటు కాదని, నేరగాళ్లను అరెస్టు చేసి తీరాలంటూ సభ్య దేశాలను ఇంటర్‌పోల్ ఒత్తిడి చేయలేదని సంస్థ ప్రధాన కార్యదర్శి ఉర్గన్ సోమవారం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. దావూద్‌పై పాక్ మౌనం అండర్ వరల్డ్ డాన్, భారత్‌లో విధ్వంసం సృష్టించి పరారీలో ఉన్న ఇతర ఉగ్రవాదుల ఉనికిపై పాక్ మరోసారి మౌనం వహించింది. దావూద్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ ఎక్కడున్నారన్న మీడియా ప్రశ్నకు ఇంటర్‌పోల్ సదస్సులో పాల్గొంటున్న పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) చీఫ్ మొహసిన్ బట్ బదులివ్వలేదు. ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆయన సరిగ్గా సదస్సు మొదలయ్యే సమయంలో సమావేశ మందిరంలోకి వచ్చారు. అయినా మోదీ ప్రసంగం పూర్తవగానే మీడియా అంతా బట్‌ను చుట్టుముట్టి ప్రశ్నలు కురిపించింది. వాటికి బదులివ్వకుండానే ఆయన వెళ్లిపోయారు. -
ఇంటికి నిప్పు పెట్టి ఆర్పుతున్నట్లు నటన
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో భారత యువదౌత్యవేత్త స్నేహ దుబే పాకిస్తాన్ నోరుమూయించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నెటిజన్లు ఆమె ప్రసంగంలో పటిమకు జేజేలు కొడుతున్నారు. యూఎన్ వేదికపై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగానికి స్నేహ గట్టిగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ ప్రధాని భారత్ అంతర్గత విషయాలను ప్రస్తావించారు. అవాస్తవాలు ప్రచారం చేయడానికి అంతర్జాతీయ వేదికపై విషం చిమ్మడం ఇది మొదటిసారి కాదు. పదే పదే తానే ఉగ్రవాద బాధిత దేశమని పాక్ చెప్పుకుంటుంది. తనే ఇంటికి నిప్పు పెట్టి, మళ్లీ దానిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాటకాలు ఆడుతూ ఉం టుంది. పాక్ విధానాలతో యావత్ ప్రపంచం ఇ బ్బందులు ఎదుర్కొంటోంది. పాకిస్తాన్లో ఉగ్రవా దులు చాలా స్వేచ్ఛగా తిరుగుతారు. ఆ దేశం ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చి, వారికి నిధులు సమకూ ర్చి పెంచి పోషిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ లాంటి వారికి ఆశ్రయం ఇచ్చింది’’అని ఫస్ట్ సెక్రటరీ స్నేహ దుబే దుయ్యబట్టారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తన సందేశాన్ని వీడియో ద్వారా పంపించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ మృతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ భారత్‌లో ఇస్లాం వ్యతిరేకులు పరిపాలకులుగా ఉన్నారని, ముస్లిం లపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. దీనికి స్నేహ దుబే సమాధానమిస్తూ జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ తక్షణమే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్ జారీ చేశారు. ఎవరీ స్నేహ దుబే? స్నేహ దుబే తన 12 ఏళ్ల వయసు నుంచే దేశానికి ప్రాతినిధ్యం వహించి విదేశాలు చుట్టి రావాలని కలలు కన్నారు. ఆమె కన్న కలకి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైంది. గోవాలో పాఠశాల విద్య అభ్యసించారు. ఉన్నత విద్య పుణెలో చదివారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎంఫిల్ చేశారు. 2011లో యూపీఎస్సీకి మొదటి ప్రయత్నంలోనే పాసయ్యారు. అంతర్జాతీయ వ్యవహారాలు, విభిన్న సంస్కృతులు తెలుసుకోవడంపై మక్కువ ఎక్కువ. ప్రయాణాలంటే ఆసక్తి ఉన్న ఆమె ఫారెన్ సర్వీసులో చేరితే ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చునని ఆశపడ్డారు. దానికి తగ్గట్టే ఆమెకి అవకాశం వచ్చింది. మొదట విదేశాంగ శాఖలో పని చేసిన స్నేహ ప్రస్తుతం ఐరాసలో భారత్ ఫస్ట్ సెక్రటరీగా ఉన్నారు. భారత్‌లో ఫాసిస్ట్ ప్రభుత్వ పాలన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అమెరికా ధోరణితో తమకు ఎంతో నష్టం జరిగిందని ఐక్యరాజ్య సమితి వేదికగా చెప్పారు. అమెరికా కనీస కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం, అంతర్జాతీయ సమాజం ద్వంద్వ ప్రమాణాలతో తమ దేశం ఎన్నో ఇబ్బందులు పడిందన్నారు. ముందుగా రికార్డు చేసిన ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగం వీడియోను శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రదర్శించారు. వాతావరణ మార్పుల దగ్గర నుంచి ఇస్లాం వ్యతిరేకత వరకు ఎన్నో అంశాలపై ఆయన మాట్లాడారు. భారత్‌ని పదునైన మాటలతో తూలనాడారు. భారత్‌లో మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అభివర్ణించారు. ఇస్లాం వ్యతిరేక ధోరణితో విషం కక్కుతోందని ఆరోపించారు. అఫ్గాన్‌లో పరిణామాలతో పాకిస్తాన్‌ను అందరూ దోషిగా చూస్తున్నారని అన్నారు. ‘అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఉగ్రవాదులపై జరిపిన యుద్దంలో ఆ దేశంతో చేతులు కలిపి మేమే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అఫ్గానిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌కి ఎక్కువ నష్టం జరిగింది’’అని పేర్కొన్నారు. -
ఐరాసలో మాకూ చోటివ్వండి: తాలిబన్లు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ దేశాల అంతర్జాతీయ కూటమి అయిన ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో తామకూ భాగస్వామ్య పాత్ర పోషించే అవకాశమివ్వాలని తాలిబన్లు విన్నవించుకున్నారు. తమ శాశ్వత ప్రతినిధి, దోహాకు చెందిన సుహైల్ షాహీన్ ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు అనుమతినివ్వాలని తాలిబన్లు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌కు తాలిబన్లు లేఖ రాశారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని గత సర్కార్ కూలిపోయిందని, ఇక మీదట ఐరాసలో అఫ్గాన్ శాశ్వత ప్రతినిధిగా సుహైల్‌ను కొనసాగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి 20న లేఖ వచ్చిందని ఐరాసలో ఉన్నతాధికారి ఫర్హాన్ హక్ వెల్లడించారు. తమ ప్రతినిధి బృందం ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు, అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్‌కు మాట్లాడే అవకాశమివ్వాలని తాలిబన్లు కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఘనీ ప్రభుత్వ హయాంలో ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన గ్రామ్ ఇసాక్జాయ్ ఇంకా ఐరాసలో కొనసాగుతున్న నేపథ్యంలో తాలిబన్ల ప్రతిపాదన కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉంది. సర్వ సభ్య సమావేశంలో 193 సభ్య దేశాలకు ఈ విషయం తెలియజేశామని, 27న ‘అఫ్గాన్’ సీటు వద్ద ఎవరిని ప్రతినిధిగా సమావేశాల్లో కూర్చోబెట్టాలో ఇంకా నిర్ణయించలేదని ఐరాస ఉన్నతాధికారి ఫర్హాన్ చెప్పారు. తాలిబన్లను బహిష్కరించకండి: ఖతార్ అఫ్గాన్ సంక్షోభంలో మధ్యవర్తి పాత్ర పోషించిన ఖతార్ ఈ విషయంలో స్పందించింది. ‘ అఫ్గాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగాలంటే తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. వారిని బహిష్కరించకూడదు. అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వం తరఫున శాశ్వత ప్రతినిధిని ఈ సమావేశాల్లో అనుమతించాలి’ అని న్యూయార్క్‌లో సర్వ సభ్య సమావేశంలో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన టర్కీ అధ్యక్షుడు 74 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కశ్మీర్ అంశాన్ని భారత్–పాక్‌లు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస వేదికగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగన్ బుధవారం మరోసారి లేవనెత్తారు. అయితే, గతంలోనూ ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. -
ఐరాస భేటీ కోసం న్యూయార్క్‌కు రావొద్దు
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం.. కరోనా విస్తృతికి మరో వేదికగా మారకూడదని అమెరికా సంకల్పించింది. సమావేశాలను ఐరాస ప్రధాన కార్యాలయంలో వచ్చే నెలలో నిర్వహించనున్నారు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉండటంతో అక్కడికి 150కిపైగా ప్రపంచదేశాలకు చెందిన ముఖ్యనేతలు ప్రసంగించేందుకు తరలిరానున్నారు. ఇంతమంది అగ్ర నేతలు, వారి సహాయగణం న్యూయార్క్‌కు చేరుకుంటే కరోనా మరింతగా విజృంభిస్తుందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొనకుండా వీడియో సందేశాలు ఇస్తే బాగుంటుందని అమెరికా ప్రపంచ దేశాల నేతలకు కబురు పంపింది. ‘ 192 దేశాల ముఖ్య నేతలు, న్యూయార్క్ నగరవాసులు అనవసరంగా మరింతగా వైరస్ ముప్పు బారిన పడకుండా చూద్దాం’ అంటూ అమెరికా ఆయా దేశాలకు సూచనలు చేసింది. -
ప్రధాని మోదీకి అపూర్వ గౌరవం.. మరోసారి ఐరాసలో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అపూర్వ అవకాశం లభించింది. మరోసారి ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ఐక్యరాజ్యసమితి అత్యున్నత జనరల్ అసెంబ్లీ సెషన్లో మాట్లాడనున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు అగ్రభాగం లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధానిగా ఉన్న మోదీ ప్రసంగం కీలకం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి వక్తల జాబితా సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం, వైద్యారోగ్య సేవల్లో కొరత ఏర్పడిన నేపథ్యంలోనే 76వ వార్షికోత్సవ సమావేశం రానుంది. ఈ సమావేశాల్లో మొదటి రోజే ఉదయం ప్రధాని మోదీ ప్రసంగం ఉండడం విశేషం. 2019లో న్యూయార్క్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఆ సమయంలోనే జరిగిన ఐరాస అత్యున్నత జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. అనంతరం కరోనా వ్యాప్తి రావడంతో వర్చువల్‌గా సమావేశాలు జరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో మోదీ ముందస్తుగా మాట్లాడి ఆ వీడియోను పంపించారు. ఆ వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. ప్రస్తుతం ఇప్పుడు సెప్టెంబర్ 25వ తేదీన జరగనున్న సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. అయితే ఈసారి కూడా వర్చువల్‌గా సమావేశం జరిగే అవకాశం ఉంది. -
ఐరాస సెక్రటరీ జనరల్‌గా మళ్లీ గుటెరస్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి(సెక్రటరీ జనరల్)గా ఆంటోనియో గుటెరస్(72) మరోసారి ఎన్నికయ్యారు. సమితి సాధారణ సభ శుక్రవారం ఆయనను ఎన్నుకుంది. రెండోసారి ఈ పదవిలో గుటెరస్ నియామకం 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 2026 డిసెంబర్ 31వ తేదీదాకా.. అంటే ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. జనరల్ సెక్రటరీగా గుటెరస్ రెండోసారి ఎన్నికకు భారత్ ఇంతకుముందే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గుటెరస్ 2017 జనవరి 1న ఐరాస 9వ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ కాలం ముగియనుంది. -
ఐరాసలో ఈసారి ట్రంప్ ఒక్కరే
న్యూయార్క్: సెప్టెంబర్ 22న జరగనున్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వసభ్య సమావేశానికి ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని ఐరాసలో అమెరిగా రాయబారి కెల్లీ క్రాఫ్ట్ చెప్పారు. సాధారణంగా ఏటా జరిగే ఐరాస సర్వసభ్య సమావేశా నికి 193 దేశాల అధికారులు గానీ, విదేశాంగ మంత్రులు గానీ హాజర వుతుం టారు. కానీ, ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఈ కార్యక్ర మాన్ని 75 ఏళ్ల ఐరాస చరిత్రలో మొదటిసారిగా వర్చువల్‌గా నిర్వహించను న్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ దేశాధినేతలు తమ సందేశాలను వీడియో రూపంలో ముందే చిత్రీకరించి ఐరాసకు అందించనుండగా స్వయంగా హాజరై ప్రసంగించే నేత ట్రంప్ ఒక్కరేనని కెల్లీ తెలిపారు. ఎన్నికల వాయిదాపై వెనక్కి తగ్గిన ట్రంప్ ‘మెయిల్ ఇన్ ఓటింగ్’లో భారీగా అవకతవకలు జరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలను వాయిదా వేస్తే మంచిదంటూ వ్యాఖ్యలు చేసిన ట్రంప్ వెనక్కి తగ్గారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక లు జరగాలని కోరుకుంటున్న ట్లు మీడియా తో అన్నారు. ‘ఎన్నికలు జరగాలి. అవి ఆలస్యం కావాలనుకోవడం లేదు. అప్పటి దాకా వేచి చూడటం, ఆతర్వాత బ్యాలెట్లు కనిపించకుండా పోవడం వంటివి జరగాలని కూడా కోరుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రత్యర్ధి బిడెన్ ముందుకు దూసుకెళ్తుండటంతో ‘మెయిల్ ఇన్ ఓటిం గ్’లో అవకతవకలంటూ ఎన్నికలు వాయిదా పడేలా చేసేందుకు ట్రంప్ పథకం వేశారు. అయితే, సొంత పార్టీలోనే మద్దతు కరువవడంతో స్వరం మార్చారు. -
ఎంఎస్ సుబ్బులక్ష్మికి అరుదైన గౌరవం
న్యూయార్క్: కర్ణాటక సంగీత విధ్వాంసురాలు, లెజండరీ గాయని, ఒకప్పుడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సైతం తన గొంతు వినిపించిన గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మికి అత్యంత అరుదైన గౌరవం దక్కనుంది. ఐక్యరాజ్యసమితి ఆమె శతజయంతి నేపథ్యంలో ఒక స్టాంపును విడుదల చేస్తోంది. ఐక్యరాజ్య సమితి పోస్టల్ పరిపాలన విభాగం 70వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేయనున్నట్లు ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధి చెప్పారు. ఈ ఆగస్టు 15న ఐరాస జనరల్ అసెంబ్లీ వద్ద హాలులో లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కచేరి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఒక భారతీయుడు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారి. అందుకు ప్రదర్శన ఇచ్చింది ఎంఎస్ సుబ్బలక్ష్మీ మాత్రమే. 1966 అక్టోబర్ నెలలో ఈ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ప్రదర్శన ఇచ్చారు. -
ఐరాస సంస్కరణలపై చర్చలు వాయిదా
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఈ ఏడాదే శాశ్వత సభ్యత్వం సాధించటం కోసం.. మండలికి సత్వరమే సంస్కరణలు తేవాలన్న భారత ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతామండలి సంస్కరణలపై చర్చలను తర్వాతి సమావేశానికి వాయిదా వేయాలని సమితి సర్వసభ్య సభ తాజాగా నిర్ణయించింది. సంస్కరణలపై ప్రస్తుత సమావేశాల్లోనే చర్చించలేకపోవటం దురదృష్టకరమని భారత్ సహా జీ4 దేశాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్‌లతో కూడిన జీ4 దేశాల బృందం తరఫున.. సమితిలో బ్రెజిల్ రాయబారి ఆంటోనియో డి అగ్వైర్ పాట్రియోటా మాట్లాడుతూ.. సంస్కరణలను ఎంత దూరం వాయిదా వేస్తే ఐరాసపై అవిశ్వాసం అంతగా పెరుగుతుందని వ్యాఖ్యానించారు. సమితి ప్రస్తుత 70వ సర్వసభ్య సభ సమావేశాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనున్నాయి. -
నేడు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన నేతలు నగరమంతా పార్టీ ప్రచారాల సందడి ప్రసంగించనున్న పార్టీ అధినేత్రి జయలలిత హైకోర్టులో ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకున్న తరుణంలో అన్నాడీఎంకే సర్వసభ్య, కార్యనిర్వాహక సమావేశాలకు సమాయత్తం అయింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత చేయబోతున్న ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చెన్నై తిరువాన్మియూరులోని డాక్టర్ వాసుదేవన్ నగర్ శ్రీ రామచంద్ర వైద్యకళాశాల, పరిశోధన ప్రాంగణంలో గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలను ప్రారంభించేందుకు భారీ ఏ ర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మేలో జరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూ టమి ఏర్పాట్లు, ఎన్నికల ఎత్తుగడల్లో తలమునకలై ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు, జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీలు సైతం ఎన్నికల కసరత్తులను వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే తొలిసారిగా తాజా ఎన్నికలకు సమాయత్తం కావడంలో భాగంగా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే చెన్నైలో బసచేసి ఉండగా, రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లా కమిటీలు, కార్యకర్తలు బుధవారం సాయంత్రానికే పెద్ద సంఖ్యలో చెన్నైకి చేరుకున్నారు. పార్టీ ఉన్నతస్థాయి సమావేశం జరిగే ప్రాంగణం వరకు జయలలిత పయనించే మార్గాలన్నీ బ్యాన ర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలతో నిండిపోయాయి. నగరంలో ఎటుచూసినా అన్నాడీఎంకే పతాకాలు, ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఉదయం 9.30 గంటల కల్లా తమకు కేటాయించిన సీట్లకు చేరుకోవాలని పార్టీ ఆదేశించింది. పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత సభాస్థలికి రాగానే ముందుగా కార్యవర్గ సమావేశం, ఆ తరువాత సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. సర్వసభ్య సమావేశంలో సీనియర్ నేతలను స్వాగతిస్తూ ప్రసంగించిన తరువాత నలుగురు కార్యనిర్వాహక కార్యదర్శులు మాట్లాడుతారు. చివరగా తీర్మానాలు చేస్తారు. చివరగా జయలలిత ప్రసంగిస్తారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందాలనే అంశంపై జయ దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారు. ఇటీవల చెన్నైని ముంచెత్తిన వరదల సమయంలో అధికార పార్టీ కొంత అప్రతిష్ట మూటకట్టుకున్న తరుణంలో సాగుతున్న సమావేశం కావడంతో జయ ఎలా సమర్థించుకుంటారని ఆసక్తి నెలకొంది. గత 2011 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే, వామపక్షాలు, మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం, సమత్తువ మక్కల్ కట్చి, కుడియరసు కట్చి, ఫార్వర్డ్‌బ్లాక్, కొంగుపేరవై పార్టీలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కొత్తగా ఎన్నికల బరిలోకి దిగనున్న తమాకా జీకే వాసన్ అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే గురువారం నాటి సర్వసభ్య సమావేశ ప్రసంగంలో జయలలిత పొత్తుల అంశం జోలికి వెళ్లకుండా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నూరిపోసే ప్రయత్నం మాత్రమే చేస్తారని అంచనాగా ఉంది. ట్రాఫిక్ రామస్వామి పిటిషన్:అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని నిలుపుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ ట్రాఫిక్ రామస్వామి బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నందున నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. -
ఇది వేదిక కాదు!
కాశ్మీర్ అంశాన్ని ఐరాసలో పాక్ లేవనెత్తడం సరికాదు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మోదీ ఐరాస: కాశ్మీర్‌పై భారత వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి వేదికగా స్ప ష్టం చేశారు. ఆ అంశాన్ని లేవనెత్తేందుకు ఐరాస సరైన వేదిక కాదని తేల్చి చెప్పారు. 193 సభ్య దేశాల ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (69వ సదస్సు)ను ఉద్దేశించి శనివారం ఆయన మొదటిసారి ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అవసరమని, 2015లోగా భద్రతామండలి సహా ఐరాసలో అవసరమైన సంస్కరణలన్నింటినీ చేపట్టాలని పిలుపునిచ్చారు. 21 శతాబ్దపు ఆకాంక్షలను ఐరాస ప్రతిఫలించాలన్నారు. ‘పాకిస్థాన్‌తో మనఃపూర్వక ద్వైపాక్షిక చర్చలకు భారత్ సిద్ధమే. అయితే, అందుకు ఉగ్రవాద నీడ లేని.. అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాక్‌పై ఉంది’ అని మోదీ కుండబద్ధలు కొట్టారు. సమస్యల పరిష్కారం దిశగా పురోగతి సాధించాలనుకుంటే.. ఈ వేదికపై వాటిని లేవనెత్తడం సరైన పని కాదన్నారు. పాకిస్థాన్ సహా పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకునేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ‘యూఎన్‌లో సమస్యలను లేవనెత్తే బదులు.. వరద బాధిత కాశ్మీర్లో సహాయ చర్యల గురించి ఆలోచిస్తే మంచిద’ని షరీఫ్‌కు చురకలంటించారు. వరద బాదితులకు భారత్‌లో భారీ స్థాయిలో సహాయ చర్యలు చేపట్టామని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ సాయమందిస్తామన్నామని గుర్తుచేశారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐరాస జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ప్రసంగిస్తూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఉగ్రవాద కేంద్రాలకు ఆశ్రయమిస్తున్నారు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో, వినూత్న రూపాలతో ఉగ్రవాదం విస్తృతమవడాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని దేశాలకు ఉగ్రవాదం ప్రమాదకరంగా మారిందన్నారు. ‘ఈ ఉగ్రవాద శక్తులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా, సమైక్యంగా, నిజాయితీగా ప్రయత్నిస్తున్నామా? లేక మన రాజకీయాలు, మన విభేదాలు, దేశాల మధ్య మన వివక్షలు, మంచి ఉగ్రవాదం.. చెడ్డ ఉగ్రవాదం అంటూ నిర్వచనాలు.. వీటిలోనే కొట్టుకుపోతున్నామా?’ అని ప్రపంచ దేశాలను మోదీ సూటిగా ప్రశ్నించారు. పాక్ పేరెత్తకుండానే నేటికీ కొన్ని దేశాలు తమ భూభాగంపై ఉగ్రవాద కేంద్రాలకు అనుమతించడమో లేక తమ విధానంలో ఉగ్రవాదాన్ని కూడా భాగం చేసుకోవడమో చేస్తున్నాయని విమర్శించారు. ఐరాసలో సంస్కరణలు ఐరాసలో సంస్కరణలపై మాట్లాడుతూ.. ప్రపంచదేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థగా ఐక్యరాజ్య సమితి మరింత ప్రజాస్వామికంగా రూపొందాలన్నారు. ‘20వ శతాబ్దపు అవసరాల ప్రాతిపదికగా ఏర్పడిన సంస్థలు 21వ శతాబ్దపు ఆకాంక్షలను ప్రతిఫలించలేవు. సమయానుకూలంగా మార్పు చెందకపోతే.. ఆ సంస్థల్లో ఎవరూ పరిష్కరించలేని స్థాయిలో అసంబద్ధత, గందరగోళం నెలకొంటాయి’ అని హెచ్చరించారు. ఐరాస భద్రతామండలిలో వచ్చే సంవత్సరం నాటికి అవసరమైన మార్పులు చేయాలని కోరారు. ‘ఐరాస 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న 2015 సంవత్సరంలో.. భద్రతామండలిలో అత్యంతావశ్యక సంస్కరణలను చేపట్టాలి’ అన్నారు. ఏ ఒక్క దేశమో, లేక కొన్ని దేశాల బృందమో ప్రపంచ గతిని నిర్ధారించలేవని, ప్రపంచ దేశాలన్నింటికీ నిజమైన ప్రాతినిధ్యం లభించాలని మోదీ స్పష్టం చేశారు. దాదాపు 35 నిమిషాల పాటు హిందీలో మోదీ చేసిన ప్రసంగంలో పశ్చిమాసియాలో ఉగ్రవాదం, భద్రతామండలిలో సహా ఐరాసలో సంస్కరణలు, సమ్మిళిత అంతర్జాతీయ అభివృద్ధి.. తదితర అంశాలను ప్రస్తావించారు. హసీనాతో చర్చలు న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారమిక్కడ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో అరగంట సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూగాగాన్ని వాడుకోవడానికి అనుమతించబోమని, ఈ విషయంలో భారత్ కూడా తమలాగే వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామని హసీనా పేర్కొన్నారు. భారత్, బంగ్లాదేశ్ మిత్రదేశాలని, మోదీతో చర్చలు బాగా సాగాయని భేటీ తర్వాత విలేకర్లతో అన్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. {పపంచం పెను మార్పులకు, తీవ్రస్థాయి గతిశీలతకు లోనవుతున్న సమయమిది. ఎన్నడూ చూడని స్థాయిలో ఉద్రిక్తతలు, విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. భారీ స్థాయి యుద్ధాలేవీ జరగడం లేదు.. అదే సమయంలో నిజమైన శాంతి కూడా నెలకొని లేదు. భవిష్యత్‌పై అనిశ్చితి ఏర్పడి ఉంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంత రక్షణ ఆందోళనకరంగా ఉంది. ఆ ప్రాంత అభివృద్ధికి తీర ప్రాంత రక్షణ చాలా కీలకం. ఇరాక్, సిరియాల్లో విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించే కార్యక్రమాన్ని భారత్ స్వాగతిస్తోంది. ఆ ప్రాంతంలోని అన్ని దేశాలు ఇందుకు సహకరించాలి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర తీర్మానాన్ని ఐరాస ఆమోదించాల్సి ఉంది. బాన్ కి మూన్తో మోదీ భేటీ ఐరాస: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్తో శనివా రం భారత ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ప్రసంగిస్తూ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని ఈ సందర్బంగా మోదీ ప్రస్తావించారు. కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికమైనదని, దాన్ని ప్రస్తావించేందుకు ఐరాస సరైన వేదిక కాదని బాన్ కి మూన్‌కు మోదీ స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. న్యూయార్క్ లవ్స్ మోదీ! ఐరాస: అమెరికా పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అన్నిచోట్లా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తొలి ప్రసంగం ఇచ్చేందుకు వచ్చిన మోదీకి ఐరాస ప్రధాన కార్యాలయం వెలుపల భారీగా గుమికూడిన భారతీయ అమెరికన్లు సాదర స్వాగతం పలికారు. ‘మోదీ చిత్రం ఉన్న టీషర్టులు, మాస్క్‌లు ధరించి, న్యూయార్క్ లవ్స్ మోదీ’, ‘అమెరికా లవ్స్ మోదీ’ అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, భారత్, అమెరికా జాతీయ జెండాలు చేతపట్టుకుని, డ్రమ్స్ వాయిస్తూ.. ‘మోదీ, మోదీ’ అనే నినాదాలు చేస్తూ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఐరాస ప్రధాన కార్యాలయం బయట వారికోసం ఒక ప్రత్యేక ఎన్క్లోజర్ను ఏర్పాటుచేశారు. తాను 40 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నానని, ఏ భారతీయ నేతకూ ఈ స్థాయిలో స్వాగతం లభించలేదని సతీశ్ మల్హోత్రా అనే 75 ఏళ్ల వ్యక్తి వ్యాఖ్యానించారు. యోగా ప్రచార కార్యక్రమం యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం, ప్రోత్సాహం కల్పించేందుకు ఐరాస ప్రసంగాన్ని మోదీ ఉపయోగించుకున్నారు. యోగాపై తనకున్న అభిమానాన్ని మరోసారి అలా చాటుకున్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ‘యోగాను ప్రోత్సహించేందుకు ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రాచీన సంప్రదాయం మనకందించిన అమూల్యమైన బహుమతి యోగా. యోగాతో జీవనవిధానాన్ని మార్చుకోవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకోవచ్చు. యోగా అంటే ఎక్సర్సైజ్ కాదు. నిన్ను నీవు తెలుసుకునే సాధనమే యోగా. మనసును శరీరాన్నీ ఏకం చేసే సాధనం యోగా. ప్రకృతితో మనిషిని సమన్వయం చేస్తుంది యోగా’ అని వివరించారు. ‘జీ1’ గా ముందుకెళ్దాం పంచ్లైన్లకు ప్రసిద్ధిగాంచిన మోదీ ఐరాస ప్రసంగంలోనూ వాటిని విరివిగా వాడారు. ‘జీ 5, జీ 20.. ఇలా వివిధ సంఖ్యలతో ‘జీ’లు(గ్రూప్‌లను ఉద్దేశిస్తూ) ఏర్పాటు చేసుకున్నాం. భారత్ కూడా పలు గ్రూప్‌ల్లో ఉంది. వీటన్నింటిని ఏకం చేసి ‘జీ1 గానో ‘జీ ఆల్’గానో మార్చుకోలేమా? ఒక్కటిగా ఉగ్రవాదంలాంటి కీలక సవాళ్లను ఎదుర్కోలేమా? అని ప్రశ్నించారు. పరస్పరాధారిత ప్రపంచంలో సమస్యల పరిష్కారానికి మరింత సమైక్యంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. మార్పు సాధ్యం కాదని నిరాశ చెందడం సులభమేనని, దాని వల్ల మన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, అందువల్ల నిజాయతీతో కూడిన అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని మోదీ పిలుపునిచ్చారు. -
ఐక్యరాజ్యసమితిలో మోడీ ప్రసంగం
న్యూయార్క్: భారత్ దృష్టిలో ప్రపంచం వసుధైక కుటుంబమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి 8 గంటలకు ఐక్యరాజ్య సమతి జనరల్ అసెంబ్లీలో మోడీ హిందీలో ప్రసంగించారు. యూఎన్వో ప్రసంగించడం గర్వకారణంగా ఉందని అన్నారు. మొన్నటి వరకు 91 దేశాలు ఉండేవి ఇప్పుడు 193 దేశాలున్నాయని మోడీ చెప్పారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ప్రజాస్వామ్యం బలపడుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాదం కొత్తపేర్లతో పుట్టుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగుదేశం పాకిస్థాన్‌తో స్నేహాన్ని కోరుకుంటున్నామని, ఆ దేశం చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాలని అన్నారు. భద్రతామండలిని మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మార్చాల్సిన అవసరముందని మోడీ అభిప్రాయపడ్డారు.