ఎంఎస్ సుబ్బులక్ష్మికి అరుదైన గౌరవం
న్యూయార్క్: కర్ణాటక సంగీత విధ్వాంసురాలు, లెజండరీ గాయని, ఒకప్పుడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సైతం తన గొంతు వినిపించిన గాన కోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మికి అత్యంత అరుదైన గౌరవం దక్కనుంది. ఐక్యరాజ్యసమితి ఆమె శతజయంతి నేపథ్యంలో ఒక స్టాంపును విడుదల చేస్తోంది.
ఐక్యరాజ్య సమితి పోస్టల్ పరిపాలన విభాగం 70వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేయనున్నట్లు ఐక్యరాజ్యసమితి భారత ప్రతినిధి చెప్పారు. ఈ ఆగస్టు 15న ఐరాస జనరల్ అసెంబ్లీ వద్ద హాలులో లెజండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కచేరి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఒక భారతీయుడు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇది రెండోసారి. అందుకు ప్రదర్శన ఇచ్చింది ఎంఎస్ సుబ్బలక్ష్మీ మాత్రమే. 1966 అక్టోబర్ నెలలో ఈ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ప్రదర్శన ఇచ్చారు.