ఐరాస సెక్రటరీ జనరల్‌గా మళ్లీ గుటెరస్‌ | Antonio Guterres re-elected as UN Secretary General | Sakshi
Sakshi News home page

ఐరాస సెక్రటరీ జనరల్‌గా మళ్లీ గుటెరస్‌

Published Sat, Jun 19 2021 5:32 AM | Last Updated on Sat, Jun 19 2021 5:32 AM

Antonio Guterres re-elected as UN Secretary General - Sakshi

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి(సెక్రటరీ జనరల్‌)గా ఆంటోనియో గుటెరస్‌(72) మరోసారి ఎన్నికయ్యారు. సమితి సాధారణ సభ శుక్రవారం ఆయనను ఎన్నుకుంది.  రెండోసారి ఈ పదవిలో గుటెరస్‌ నియామకం 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 2026 డిసెంబర్‌ 31వ తేదీదాకా.. అంటే ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.  జనరల్‌ సెక్రటరీగా గుటెరస్‌ రెండోసారి ఎన్నికకు భారత్‌ ఇంతకుముందే సంపూర్ణ మద్దతు ప్రకటించింది.  గుటెరస్‌ 2017 జనవరి 1న ఐరాస 9వ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్‌ 31న పదవీ కాలం ముగియనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement