Secretary General
-
ఏపీఏబీసీ ప్రెసిడెంట్‌గా హొర్మూజ్ మసానీ
న్యూఢిల్లీ: ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ–ఇండియా) జనరల్ సెక్రెటరీ హొర్మూజ్ మసానీ వరుసగా ఐదోసారి ఏషియా పసిఫిక్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సరి్టఫికేషన్ (ఏపీఏబీసీ) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆడిట్ బ్యూరో ఆఫ్ సరి్టఫికేషన్ (ఐఎఫ్ఏబీసీ) సర్వసభ్య సమావేశంలో ఆయనను ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఆనరరీ ట్రెజరర్ హోదాలో ఐఎఫ్ఏబీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్‌గా కూడా మసానీ వరుసగా తొమ్మిదోసారి ఎన్నికయ్యారు. ఆయన 1998 నుంచి ఏబీసీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. 2008 నుంచి ఐఎఫ్ఏబీసీలో ఏబీసీ–ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
ఇరాన్ దాడులు.. ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ నిషేధం
టెల్ అవివ్: తమ దేశంపై ఇరాన్ భారీ మిసైల్స్‌తో దాడి చేస్తే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్రంగా ఖండించటంలో విఫలమయ్యారని ఇజ్రాయెల్ మండిపడింది. ఆంటోనియో గుటెర్రెస్ను ‘పర్సనా నాన్ గ్రేటా’గా ప్రకటించింది. ఆయన తమ దేశంలోకి రాకుండా నిషేధం విధిస్తున్నామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పోషల్ మీడియాలో ఓ పోస్ట్‌లో పేర్కొంది.‘‘ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన హేయమైన దాడిని నిస్సందేహంగా ఖండించలేని ఎవరైనా ఇజ్రాయెల్ గడ్డపై అడుగు పెట్టే అర్హత లేదు. హమాస్, హెజ్బొల్లా, హౌతీలు ఇప్పుడు ఇరాన్ నుంచి ఉగ్రవాదులు, రేపిస్టులు, హంతకులకు ఐరాస సెక్రటరీ జనరల్ మద్దతు ఇస్తున్నారు. ఐక్యరాజ్యసమితి చరిత్రలో ఆంటోనియో గుటెర్స్ ఒక మాయని మచ్చగా మిగిలిపోతారు. ఆంటోనియో గుటెర్స్ ఉన్నా.. లేకపోయినా.. ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకుంటుంది. అదేవింధంగా దేశ గౌరవాన్ని నిలబెట్టుకుంటుంది’’ అని ఇజ్రాయెల్ పేర్కొంది.మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్‌తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్.. తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించింది.చదవండి: ఇరాన్ దాడులు.. బంకర్లోకి ఇజ్రాయెల్ ప్రధాని పరిగెత్తారా? -
Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది
ఖాన్ యూనిస్/టెల్ అవీవ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల రోజులు దాటింది. గాజాపై భూతల దాడులను తాత్కాలికంగా నిలిపివేసిన ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులను కొనసాగిస్తోంది. బుధవారం గాజా అంతటా క్షిపణులు, రాకెట్లు ప్రయోగించింది. గాజా గత 24 గంటల వ్యవధిలో 214 మంది మరణించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నెల రోజులకుపైగా సాగుతున్న యుద్ధంలో హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 10,569కి చేరుకుంది. గాజాలో పెరిగిపోతున్న మరణాలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. గాజాస్ట్రిప్ మొత్తం చిన్నపిల్లల శ్మశాన వాటికగా మారుతోందని చెప్పారు. మృతుల సంఖ్య పెరుగుతోంది అంటే ఇజ్రాయెల్ సైన్యం తప్పుడు దారిలో పయనిస్తున్నట్లు అర్థమని స్పష్టం చేశారు. దాడులకు 4 గంటలు విరామం ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజా నుంచి నిత్యం వేలాది మంది దక్షిణ గాజాకు వలస వెళ్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 70 శాతం మంది వెళ్లిపోయినట్లు అంచనా. గాజా ఆసుపత్రుల్లో గుండెను పిండేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లేక ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేక క్షతగాత్రులకు చికిత్స అందించడం లేదు. ఇంక్యుబేటర్లలో శిశువులు విగత జీవులుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. చాలా హాస్పిటళ్లలో పెట్రోల్, డీజిల్ లేక జనరేటర్లు పనిచేయడంలేదు. ఇజ్రాయెల్ సైన్యం తొలిసారిగా బుధవారం గాజాపై దాడులను 4 గంటలపాటు నిలిపివేసింది. గాజాకు మానవతా సాయం చేరవేయడానికి వీలుగా దాడులు ఆపినట్లు వెల్లడించింది. హమాస్‌పై యుద్ధం ముగిశాక గాజా రక్షణ బాధ్యతను తాము స్వీరిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ స్పందించారు. గాజాను ఆక్రమించుకొనే ఆలోచన చేయొద్దని ఇజ్రాయెల్‌కు హితవు పలికారు. ఇజ్రాయెల్‌కు జీ7 దేశాల మద్దతు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంపై జీ7 దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధులు జపాన్ రాజధాని టోక్యోలో చర్చలు జరిపారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు బుధవారం ముగిశాయి. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడిని వారు ఖండించారు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు. ఆత్మరక్షణ చేసుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని తేల్చిచెప్పారు. గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించానికి మార్గం సులభతరం చేయాలని, ఇందుకోసం హమాస్‌పై యుద్ధానికి కొంత విరామం ఇవ్వాలని జీ7 ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు సూచించారు. కాల్పుల విరమణ పాటించాలని సూచించకపోవడం గమనార్హం. 50 వేల మందికి 4 టాయిలెట్లు గాజాలో నెలకొన్న భయానక పరిస్థితులను అమెరికా నర్సు ఎమిలీ చలాహన్ మీడియాతో పంచుకున్నారు. గాజాలో క్షతగాత్రులకు సేవలందించిన ఎమిలీ ఇటీవలే అమెరికా చేరుకున్నారు. 26 రోజుల తర్వాత ఈరోజే స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నానని తెలిపారు. గాజాలో 26 రోజుల్లో ఐదు చోట్లకు మారాల్సి వచి్చందన్నారు. ఒకచోట 35 వేల మంది నిరాశ్రయులు ఉన్నారని తెలిపారు. ముఖాలు, మెడ, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలున్న చిన్నారులు కనిపించారని వెల్లడించారు. 50 వేల మంది తలదాచుకుంటున్న ఓ శిబిరంలో కేవలం 4 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అక్కడ రోజుకు కొద్దిసేపు మాత్రమే నీటి సరఫరా జరిగేదని వివరించారు. -
బాలల సంరక్షణకు భారత్ చర్యలు భేష్
ఐక్యరాజ్య సమితి: అంతర్జాతీయంగా భారత్‌కు మరో శుభపరిణామమిది. చిన్న పిల్లలు సాయుధ పోరాటాల వైపు వెళ్లకుండా కట్టడి చేసినందుకు గాను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ (యూఎన్ఎస్జీ) వార్షిక నివేదిక నుంచి భారత్ పేరును తొలగించినట్టుగా యూఎన్ సెకట్రరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ తెలిపారు. సాయుధ ఘర్షణల ప్రభావం పడకుండా చిన్నారుల మెరుగైన సంరక్షణ కోసం భారత్ తీసుకున్న చర్యల్ని గుటెరెస్ స్వాగతించారు. 2010 నుంచి భారత్ పేరు ఈ నివేదికలో ఉంటూ వస్తోంది. కశ్మీర్లో ఉగ్రసంస్థలు బాలలను నియమించడం, భద్రత పేరుతో సైనికులు తిరిగి అదుపులోకి తీసుకోవడం వంటివాటితో భారత్ పేరు ఆ నివేదికలో ఉంటూ వస్తోంది. భారత్‌తో పాటు బుర్కినా ఫాసో, కేమరూన్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిఫ్పీన్స్లోనూ చిన్నారులు ఉగ్రముఠాల్లో చేరుతున్నట్టు యూఎన్ నివేదికలు చెబుతున్నాయి. బాలల హక్కుల పరిరక్షణకు కశ్మీర్లో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడంపై గుటెరెస్ హర్షం వ్యక్తం చేశారు. బాలల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలతో ఛత్తీస్‌గఢ్, అసోం, జార్ఖండ్, ఒడిశా, జమ్ముకశ్మీర్‌లలో బాలల సంరక్షణ మెరుగైందని ఆ నివేదిక వెల్లడించింది. -
Russia-Ukraine war: ఏళ్ల తరబడి ఉక్రెయిన్ యుద్ధం!
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. జర్మనీ వార పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరు దేశాల నడుమ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉందని, దానికి అందరూ సిద్ధపడాలని చెప్పారు. ప్రపంచదేశాలు ఉక్రెయిన్‌కు వివిధ రూపాల్లో ఇస్తున్న మద్దతును ఇలాగే కొనసాగించాలని సూచించారు. మద్దతును బలహీనపర్చరాదని అన్నారు. జవాన్లను కలుసుకున్న జెలెన్స్కీ చాలారోజులుగా రాజధాని కీవ్కే పరిమితం అవుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా మైకోలైవ్, ఒడెసాలో జవాన్లను, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందిని కలుసుకున్నారు. స్వయంగా మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై ఆరా తీశారు. విశేషమైన సేవలందిస్తున్న పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. వారి సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. మైకోలైవ్‌లో జెలెన్స్కీ పర్యటన ముగిసిన కొద్దిసేపటి తర్వాత రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. ప్రావ్డైని, పొసద్–పొక్రోవ్స్క్, బ్లహోదట్నే ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ఫిరంగులతో దాడి చేశాయి. గలిస్టీన్ కమ్యూనిటీలో రష్యా దాడుల్లో ఇద్దరు మరణించారు. జవాన్లలో అడుగంటుతున్న నైతిక స్థైర్యం! ఉక్రెయిన్– రష్యా మధ్య నాలుగు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న సైనికుల్లో నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. తరచూ సహనం కోల్పోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఇరు దేశాల సైన్యంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. డోన్బాస్లో ఇరు పక్షాల నడుమ భీకర పోరాటం సాగుతోందని, ఆదే సమయంలో జవాన్లు నిరాశలో మునిగిపోతున్నారని పేర్కొంది. -
రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పీసీ మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ 13వ సెక్రటరీ జనరల్‌గా 1982 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి ప్రమోద్ చంద్ర మోదీ నియమితులయ్యారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) మాజీ ఛైర్మన్ అయిన పీసీ మోదీ, తెలుగు వ్యక్తి అయిన పీపీకే రామాచార్యుల స్థానంలో శుక్రవారం సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 1న బాధ్యతలు చేపట్టిన పీపీకే రామాచార్యులు 72 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి, సెక్రటరీ జనరల్‌గా స్వల్ప కాలం పనిచేసిన వారిలో 2వ వ్యక్తిగా నిలిచారు. అంతకు ముందు 1997 జూలై 25న బాధ్యతలు చేపట్టిన ఎస్ఎస్ సహోని 1997 అక్టోబర్ 2 వరకు ఆ పదవిలో ఉన్నారు. పీపీకే రామాచార్యులును రాజ్యసభ సెక్రటేరియట్ సలహాదారుగా నియమించారు. సంప్రదాయకంగా ఐఎఎస్ అధికారులు, సీనియర్ పార్లమెంట్ సెక్రటేరియట్ అధికారులకు రిజర్వ్ చేసిన సెక్రటరీ జనరల్ స్థానంలో ఐఆర్ఎస్ అధికారి పీసీ మోదీని నియమించడం గమనార్హం. వచ్చే ఏడాది ఆగస్ట్ 10 వరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా మోదీ కొనసాగనున్నారు. ఈనెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, తాజా మార్పులపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. ‘రాజ్యసభ సెక్రటరీ జనరల్ పదవికి తగిన వ్యక్తి డాక్టర్ పీపీకే రామాచార్యులు, అటువంటి అనుభవశాలి, నిష్పాక్షికంగా వ్యవహరించే వ్యక్తిని తొలగించడం మాకు ఆశ్చర్యం కలిగించలేదు. మోదీ ప్రభుత్వం పాల్పడిన మూడు ఘోర పాపాల్లో ఇదొకటి’అని పేర్కొన్నారు. -
మహాత్ముడి స్ఫూర్తితో కరోనాపై పోరు
ఐక్యరాజ్యసమితి: గాంధీజీ ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచ సమాజం అందిపుచ్చుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. ఒకరిపై ఒకరు యుద్ధం చేసుకోవడం కాదు, మనందరి ఉమ్మడి శత్రువైన కరోనా మహమ్మారిపై మహాత్ముడి స్ఫూర్తితో కలిసికట్టుగా యుద్ధం సాగిద్దామని సూచించారు. కరోనాను ఓడించడమే మన లక్ష్యం కావాలని చెప్పారు. గాంధీజీ జయంతి రోజే అంతర్జాతీయ అహింసా దినం కావడం యాదృచ్ఛికం కాదని అన్నారు. ఆయన పాటించిన అహింసా, శాంతియుత నిరసనలు, గౌరవం, సమానత్వం అనేవి మాటలకు అతీతమైనవని తెలిపారు. మానవాళి భవిష్యత్తుకు అవి చోదక శక్తులని ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులకు ఇవి చక్కటి పరిష్కార మార్గాలని వివరించారు. ఈ మేరకు అంతర్జాతీయ అహింసా దినం సందర్భంగా గుటెరస్ శనివారం ఒక సందేశం విడుదల చేశారు. ఘర్షణలు, వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అపనమ్మకం, ప్రజల మధ్య విభజనలు ప్రపంచానికి పెద్ద సమస్యగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
సెక్రటరీ జనరల్‌గా రామాచార్యులు; 70 ఏళ్ల చరిత్రలో తొలిసారి..
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు వ్యక్తి డాక్టర్ పరాశరం పట్టాభి కేశవ రామాచార్యులు రాజ్యసభ కొత్త సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. 2018 నుంచి రాజ్యసభ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న రామాచార్యులును సచివాలయంలో అత్యున్నత పదవికి రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపిక చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఆయన ఈ హోదాలో కొనసాగుతారు. 1952లో రాజ్యసభ ఆవిర్భవించినప్పటి నుంచి 70 ఏళ్ల కాలంలో రాజ్యసభ సచివాలయంలో పనిచేసిన అధికారి సెక్రటరీ జనరల్ కావడం ఇదే ప్రథమం. రామాచార్యులు పార్లమెంటు కార్యకలాపాల నిర్వహణలో సుమారు 40 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నారు. చదవండి: 40- Storey Noida Towers: కుమ్మక్కయ్యారు.. కూల్చేయండి -
ఐరాస సెక్రటరీ జనరల్‌గా మళ్లీ గుటెరస్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి(సెక్రటరీ జనరల్)గా ఆంటోనియో గుటెరస్(72) మరోసారి ఎన్నికయ్యారు. సమితి సాధారణ సభ శుక్రవారం ఆయనను ఎన్నుకుంది. రెండోసారి ఈ పదవిలో గుటెరస్ నియామకం 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 2026 డిసెంబర్ 31వ తేదీదాకా.. అంటే ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. జనరల్ సెక్రటరీగా గుటెరస్ రెండోసారి ఎన్నికకు భారత్ ఇంతకుముందే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గుటెరస్ 2017 జనవరి 1న ఐరాస 9వ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ కాలం ముగియనుంది. -
ఆమ్నెస్టీ పీఠంపై కుమీ నాయుడు
ప్రసిద్ధ అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా భారత తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు కుమీ నాయుడు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న బెంగళూరుకు చెందిన సలీల్షెట్టి 2018 ఆగస్ట్‌లో రిటైరయ్యాక నాయుడు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. లండన్కేంద్రస్థానంగా పనిచేసే ఆమ్నెస్టీ అత్యున్నత పదవిలో సలీల్2010 నుంచి కొనసాగుతున్నారు. 52 ఏళ్ల నాయుడు ఇంతకు ముందు గ్రీన్పీస్ఇంటర్నేషన్ఎగ్జిక్యూటివ్డైరెక్టర్గా 2009 నుంచి 2015 వరకూ పనిచేశారు. ఆయన ఈ ఆమ్నెస్టీ సెక్రెటరీ జనరల్‌గా మొదట నాలుగేళ్లు ఉంటారు. మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశముంది. డర్బన్నగరంలో దిగువ మధ్య తరగతి భారత సంతతి కుటుంబంలో జన్మించిన నాయుడు 15 ఏళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకున్నారు. తండ్రితో గొడవపడిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేత దురహంకార సర్కారు పాలనతో సరైన ఆదరణ, కనీస సౌకర్యాలు లేక స్థానిక నల్లజాతివారు, భారత్‌నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబాల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరిగేవని నాయుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగు మూలాలున్న తల్లిదండ్రులకు పుట్టినా మిగిలిన భారత సంతతి జనం మాదిరిగానే నాయడు కూడా తనను నల్లజాతి దక్షిణాఫ్రికా పౌరునిగానే భావించి, తెల్లజాతి పాలకులపై పోరు సాగించారు. చదువుకునే రోజుల్లో అక్కడి ఎమర్జెన్సీ నిబంధనలు ఉల్లంఘించారనే సాకుతో నాయడును అనేక సార్లు అరెస్ట్‌చేశారు. పదిహేనేళ్ల వయసులో ఆయనను స్కూలు నుంచి బహిష్కరించాక కూడా ఇంట్లో చదువుకున్నారు. తర్వాత యూనివర్సిటీ లా డిగ్రీ సాధించారు. 1987లో దేశంలో తనకు భద్రత లేదని గ్రహించి ఆయన ఇంగ్లండ్వెళ్లి ఆక్స్ఫర్డ్యూనివర్సిటీలో చేరారు. మండేలా విడుదలతో ఆఫ్రికాలో ఆక్షరాస్యతా ఉద్యమం వర్ణవివక్ష వ్యతిరేక విప్లవపోరాట యోధుడు నెల్సన్మండేలా 1990లో విడుదలయ్యాక నాయుడు ఆక్స్ఫర్డ్చదువును మధ్యలో ఆపేసి దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ నల్లజాతివారి పిల్లలకు, పెద్దలకు చదువు నేర్పే ఉద్యమంలో పనిచేశారు. ఓటర్లలో చైతన్యం నింపే కార్యక్రమాలు రూపొందించి అమలు చేశారు. బానిస సంకెళ్లు తెంచుకున్న మాతృదేశంలో చేయాల్సింది చాలా ఉన్నా ఆక్స్‌ఫర్డ్‌లో డాక్టరేట్పూర్తిచేయడానికి మళ్లీ లండన్వెళ్లారు. తన డాక్టరేట్పూర్తయితే ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ తీసుకునే మొదటి దక్షిణాఫ్రికా భారతీయుడినయ్యే అవకాశం పొందడానికే వెళ్లానని తర్వాత ఆయన వివరించారు. మళ్లీ దక్షిణాఫ్రికాకు చేరుకుని ప్రపంచవ్యాప్తంగా పౌరసమాజం, పౌరుల స్వయం కృషిని బలోపేతం చేసే లక్ష్యంతో ఆయన సివికస్అనే ఎన్జీఓను స్థాపించి దాని లక్ష్య సాధనకు బాగా పనిచేశారు. మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా మానవహక్కులు, పౌరసమాజం కోసం చేసిన విశేష కృషిని గుర్తించి ఆమ్నెస్టీ ఇంటర్నేషన్బోర్డు ఆయనను సెక్రెటరీ జనరల్పదవికి ఎంపికచేసింది. లండన్‌లోని ఈ సంస్థ ప్రధాన ప్రతినిధిగా, సెక్రెటేరియట్చీఫ్ఎగ్జిక్యూటివ్గా సెక్రెటరీ జనరల్పనిచేస్తారు. ఆమ్నెస్టీ ప్రపంచంలోనే అతిపెద్ద మానవహక్కుల పరిరక్షణ సంస్థ. 70 దేశాల్లో 2600 మంది సిబ్బందితో దీని కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది సభ్యులు, వలంటీర్లు, మద్దతుదార్లు ఉన్నారు. కుమీ నాయుడు తెలుగు మూలాలు 1860 నుంచి 1911 వరకూ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తమిళులతోపాటు తెలుగువారువ్యవసాయ సామాజికవర్గాలైన రెడ్లు, కాపు బలిజలు పెద్ద సంఖ్యలో వ్యవసాయం చేయడానికి, కింది కులాలకు చెందిన పేదలు పనిచేయడానికి దక్షిణాఫ్రికాకు వలసపోయారు. అక్కడి తెల్లజాతి పాలకుల దృష్టిలో స్థానిక నల్లజాతివారితో భారత సంతతికి చెందినవారూ సమానమే. అందుకే 20వ శతాబ్దంలో వర్ణవివక్ష వ్యతిరేకపోరాటంలో నల్లజాతివారితో కలిసి భారత సంతతి జనం పోరాడారు. తెలుగువారిలో కొందరు తమ ఉనికి తెలుపుకోవడానికి (ఒక వేళ క్రైస్తవంలోకి మారినా) పేరు చివర నాయుడు అని పెట్టుకునేవారు. ఇలాంటి తెలుగు కార్మిక కుటుంబంలో నాయుడు జన్మించారు. డర్బన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని చాట్స్వర్త్పట్టణానికి బలవంతంగా వేలాది మంది తెలుగువారిని అక్కడి సర్కారు తరలించింది. నాయుడు పుట్టడానికి 50 సంవత్సరాల ముందే డర్బన్నుంచి ఇండియా వెళ్లిపోయిన మోహన్దాస్గాంధీ చిత్రపటం ఇంటి గోడపై వేలాడదీసి ఉంది. శ్వేతదురహంకార సర్కారుపై ఆఫ్రికా నేషనల్‌కాంగ్రెస్(ఏఎన్సీ) సాగించిన సాయుధపోరాటంలో చేరాలని కూడా ఒకానొక దశలో ఆలోచించానని, గాంధీజీ స్పూర్తితో హింసామార్గంలోకి వెళ్లకుండా ఆగిపోయానని నాయుడు చెప్పారు. (సాక్షి నాలెడ్జ్సెంటర్) -
ఐఎన్ఎస్ సెక్రటరీ జనరల్‌గా లవ్ సక్సేనా
న్యూఢిల్లీ: ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) నూతన సెక్రటరీ జనరల్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లవ్ సక్సేనా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ శుక్రవారం విడుదలచేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ అధ్యక్షురాలు అఖిల ఉరంకార్, ఐఎన్ఎస్ అధికారులు సక్సేనాకు శుభాకాంక్షలు తెలిపారు. -
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా స్నేహలత
న్యూఢిల్లీ: లోక్‌సభ నూతన సెక్రటరీ జనరల్‌గా స్నేహలతా శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఈమేరకు లోక్‌సభ సెక్రటెరియట్ ఓ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ పదవి చేపట్టబోతున్న తొలి మహిళ ఈమెనే కావడం విశేషం. పదవీ విరమణ చేయబోతున్న అనూప్ మిశ్రా స్థానంలో స్నేహలత డిసెంబర్ 1న బాధ్యతలు చేపడతారు.ఆమె పదవీ కాలం 2018 డిసెంబర్ 30న ముగియనుంది. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స్నేహలత ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పలు హోదాల్లో పనిచేశారు. -
పార్టీ మారిన వారిపై అనర్హత వేటు పడుతుంది
-
'ప్రత్యక్ష చర్చలకు రండి'
న్యూయార్క్: భారతదేశం, పాకిస్థాన్ నేరుగా ప్రత్యక్ష చర్చలకు రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్ కోరారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రత్యక్ష చర్చల ద్వారా నిలువరించుకోవచ్చని చెప్పారు. 'మేం ప్రపంచంలోని అన్ని దేశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మార్పులను గమనిస్తున్నాం. పరిస్థితులు చేయిదాటే పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే అణ్వాయుధ సామర్ధ్యం కలిగి ఉన్న భారత్, పాక్‌లు నేరుగా చర్చలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను' అని బాన్ కీమూన్ చెప్పినట్లు ఆయన అధికారిక ప్రతినిధి స్పెపానే దుజార్రిక్ విలేకరులకు తెలిపారు. గత నెలలో 23-24 మధ్య జరగాల్సిన చర్చలు అనూహ్యంగా రద్దవడంపట్ల బాన్ కీమూన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. ఇరు దేశాల సరిహద్దుల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న అంశాలు తమ దృష్టికి వస్తున్నాయని, దీనిపట్ల కొన్ని సూచనలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు.