ప్రధాని మోదీకి అపూర్వ గౌరవం.. మరోసారి ఐరాసలో | PM Narendra Modi Expected To Address In Annual UNGA Session | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి అపూర్వ గౌరవం.. మరోసారి ఐరాసలో

Published Sat, Aug 14 2021 7:39 PM | Last Updated on Sat, Aug 14 2021 8:03 PM

PM Narendra Modi Expected To Address In Annual UNGA Session - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అపూర్వ అవకాశం లభించింది. మరోసారి ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్‌ 25వ తేదీన ఐక్యరాజ్యసమితి అత్యున్నత జనరల్‌ అసెంబ్లీ సెషన్‌లో మాట్లాడనున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు అగ్రభాగం లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధానిగా ఉన్న మోదీ ప్రసంగం కీలకం కానుంది. 

ఈ మేరకు ఐక్యరాజ్య సమితి వక్తల జాబితా సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం, వైద్యారోగ్య సేవల్లో కొరత ఏర్పడిన నేపథ్యంలోనే 76వ వార్షికోత్సవ సమావేశం రానుంది. ఈ సమావేశాల్లో మొదటి రోజే ఉదయం ప్రధాని మోదీ ప్రసంగం ఉండడం విశేషం. 2019లో న్యూయార్క్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఆ సమయంలోనే జరిగిన ఐరాస అత్యున్నత జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. అనంతరం కరోనా వ్యాప్తి రావడంతో వర్చువల్‌గా సమావేశాలు జరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో మోదీ ముందస్తుగా మాట్లాడి ఆ వీడియోను పంపించారు. ఆ వీడియోను సమావేశంలో ప్రదర్శించారు. ప్రస్తుతం ఇప్పుడు సెప్టెంబర్‌ 25వ తేదీన జరగనున్న సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. అయితే ఈసారి కూడా వర్చువల్‌గా సమావేశం జరిగే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement