
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం.. కరోనా విస్తృతికి మరో వేదికగా మారకూడదని అమెరికా సంకల్పించింది. సమావేశాలను ఐరాస ప్రధాన కార్యాలయంలో వచ్చే నెలలో నిర్వహించనున్నారు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉండటంతో అక్కడికి 150కిపైగా ప్రపంచదేశాలకు చెందిన ముఖ్యనేతలు ప్రసంగించేందుకు తరలిరానున్నారు. ఇంతమంది అగ్ర నేతలు, వారి సహాయగణం న్యూయార్క్‌కు చేరుకుంటే కరోనా మరింతగా విజృంభిస్తుందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొనకుండా వీడియో సందేశాలు ఇస్తే బాగుంటుందని అమెరికా ప్రపంచ దేశాల నేతలకు కబురు పంపింది. ‘ 192 దేశాల ముఖ్య నేతలు, న్యూయార్క్ నగరవాసులు అనవసరంగా మరింతగా వైరస్ ముప్పు బారిన పడకుండా చూద్దాం’ అంటూ అమెరికా ఆయా దేశాలకు సూచనలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment