United Nations General Assembly
-
పాక్ నోట మళ్లీ పాతపాట
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కశీ్మర్ ప్రస్తావన తెచి్చంది. దీర్ఘకాలిక శాంతి కోసం భారత్ ఆరి్టకల్ 370ని పునరుద్ధరించాలని, జమ్మూకశీ్మర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ తన సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి షరీఫ్ శుక్రవారం ప్రసంగించారు. ఆరి్టకల్ 370, హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బుర్హాన్ వనీల ప్రస్తావన తెచ్చారు. ‘పాలస్తీనియన్ల లాగే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్య్రం, స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్దకాలంగా పోరాడుతున్నారు’ అని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూకశీ్మర్పై భారత్ చర్చలకు రావాలన్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపించారు. స్వీయ నిర్ణయాధికారం జమ్మూకశీ్మర్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయని అన్నారు. భారత్‌కు బ్రిటన్ మద్దతు ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వముండాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ మద్దతు పలికారు. భారత్ డిమాండ్‌కు అమెరికా, ఫ్రాన్స్‌లు ఇదివరకే మద్దతు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో, మరింత స్పందనతో కూడి ఉండాలని స్టార్మర్ ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. -
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు
ఐరాస: మానవాళి విజయం సమష్టి శక్తిలోనే దాగుంది తప్ప యుద్ధక్షేత్రంలో కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం ఎన్నటికీ సమస్యల పరిష్కార వేదిక కాబోదని కుండబద్దలు కొట్టారు. సోమవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు.ఉక్రెయిన్, గాజా యుద్ధాలు, దేశాల నడుమ ఉద్రిక్తతలు, గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పుల వంటి పెను సమస్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రపంచ శాంతికి, ప్రగతికి ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టే ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి’’ అని మోదీ సూచించారు. ‘‘నమస్కారం. ప్రపంచ మానవాళిలో ఆరో వంతుకు సమానమైన 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారి గళాన్ని విని్పస్తున్నా’’ అంటూ సాగిన ఐదు నిమిషాల ప్రసంగాన్ని పలు దేశాధినేతలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ఉగ్రవాదం పెనుముప్పు ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు పెను ముప్పుగా పరిణమించిందని మోదీ అన్నారు. మరోవైపు సైబర్, స్పేస్, మారిటైమ్ క్రైమ్ పెను సవాళ్లు విసురుతున్నాయని అభిప్రాయపడ్డారు. ‘‘వీటిని సమూలంగా రూపుమాపాలంటే కేవలం మాటలు చాలవు. నిర్దిష్ట కార్యాచరణతో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలి. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా, సురక్షితంగా వినియోగించుకునేలా అంతర్జాతీయ స్థాయిలో నియంత్రణ వ్యవస్థ రావాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘మానవాళి సంక్షేమానికి ఆహార, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యమివ్వాలి. సంక్షేమ, సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తం చేశాం. వాటిని మిగతా దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు. గాడిన పెట్టేందుకే: గుటెరస్ ప్రారం¿ోపన్యాసం చేసిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలపై మోదీ అభిప్రాయాలతో ఏకీభవించారు. వాటిని బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. ఐరాస భద్రతా మండలిని కాలం చెల్లిన వ్యవస్థగా అభివరి్ణంచారు! సరైన సంస్కరణలతో పనితీరును సరి చేసుకోకుంటే దాని విశ్వసనీయత అడుగంటడం ఖాయమని హెచ్చరించారు. ఘర్షణలకు ముగింపు కనుచూపు మేరలో కని్పంచడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘పట్టాలు తప్పుతున్న ప్రపంచాన్ని దారిన పెట్టేందుకు కఠిన నిర్ణయాలను, చర్యలను సూచించడమే లక్ష్యంగా సదస్సు జరిగింది’’ అన్నారు. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం చేపట్టాల్సిన చర్యలతో కూడిన ఒప్పందాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. సమగ్రాభివృద్ధి, అంతర్జాతీయ శాంతిభద్రతలు, శాస్త్ర సాంకేతికత, యువత, భావి తరాలు, అంతర్జాతీయంగా పాలన తీరుతెన్నుల్లో మెరుగైన మార్పులపై ఒప్పందం దృష్టి సారించింది.పాలస్తీనా అధ్యక్షునితో భేటీ పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోదీ భేటీ అయ్యారు. గాజాలో మానవతా సంక్షోభం పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. పాలస్తీనా ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. కువైట్ రాకుమారుడు షేక్ సబా ఖలీద్ అల్ సబా, నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి తదితరులతో కూడా మోదీ సమావేశమయ్యారు. -
Israel-Hamas war: ఓటింగ్‌కు దూరం సరికాదు
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్–హమాస్ పోరుపై ఐక్యరాజ్యసమితి తీర్మానానికి భారత్ దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ చెప్పారు. ‘‘హమాస్ దాడులను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. కానీ ప్రతీకారం పేరుతో నిస్సహాయులైన ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వినాశనానికే దారి తీస్తున్నాయి. పాలస్తీనా ఒక స్వతంత్ర దేశంగా శాంతియుతంగా సహజీవనం చేసేలా నేరుగా ద్వైపాక్షిక చర్చలు జరగాలన్నదే ఈ సమస్యపై కాంగ్రెస్ వైఖరి అని సోనియా గుర్తు చేశారు. సోమవారం ఓ ఆంగ్ల పత్రికకు రాసిన వ్యాసంలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. గాజాను అన్నివైపుల నుంచీ ఇజ్రాయెల్ చెరబట్టిన తీరు ఆ ప్రాంతాన్ని ఓపెన్ జైలుగా మార్చేసిందని ఆవేదన వెలిబుచ్చారు. -
గాజా మానవతా సంధి తీర్మానానికి ఓటేయని భారత్
ఇజ్రాయెల్-హమాస్ వివాదంలో.. తక్షణ మానవతావాద సంధికి పిలుపునిచ్చిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యింది. గాజాలో మానవతా దృక్పథంతో సంధి కుదర్చాలనే పలు ప్రతిపాదనలపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యదేశాలున్న జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌లో మొత్తం 179 సభ్య దేశాలు పాల్గొన్నాయి. ఈ ప్రతిపాదనలకు అనుకూలంగా 120 దేశాలు ఓటు వేశాయి. 14 దేశాలు వ్యతిరేకించాయి. అయితే 45 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు కాగా.. అందులో భారత్ కూడా ఉంది. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకే దూరంగా ఉన్నాయి. ‘‘పౌరుల రక్షణ, చట్టపరమైన & మానవతా బాధ్యతలను సమర్థించడం’’ పేరిట జోర్దాన్ ఈ తీర్మానం ప్రతిపాదించింది. బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, రష్యా సహా 40 దేశాలు మద్దతు తీర్మానానికి ఇచ్చాయి. గాజా స్ట్రిప్‌లో నివసిస్తోన్న వారికి మానవత దృక్పథంతో సహాయం అందించడం, వారికోసం ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేయడం.. వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే.. ఈ అనూహ్య నిర్ణయానికి గల కారణాల్ని భారత్ వివరించింది. తీర్మానంలో ఎక్కడా హమాస్ గురించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ విషయంలో జోర్డాన్ తీరును తప్పు పట్టింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని భారత్ తన నిర్ణయాన్ని వివరించింది. "ఈ అసెంబ్లీ చర్చలు ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని పంపుతాయని, దౌత్యం-చర్చల అవకాశాలను విస్తరింపజేస్తాయని మేము ఆశిస్తున్నాము" అని ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అన్నారు. ఓటింగ్‌కు దూరంగా ఉంటూనే కెనడా చేసిన సవరణలను భారత్ సమర్థించింది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడులు.. అనే వాక్యాన్ని ఈ ప్రతిపాదనల్లో చేర్చాలంటూ కెనడా సవరణలను సూచించగా.. భారత్ సమర్థించింది. ఈ సవరణలు చేయగలిగితే తాము ఓటింగ్‌లో పాల్గొంటామని యోజనా ముందుగానే తెలిపారు. కానీ, అది జరగలేదు. జోర్డాన్ రూపొందించిన తీర్మానంలో హమాస్ గురించి ప్రస్తావన లేకపోవడంపై అమెరికా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. హమాస్, వారి చెరలో బందీలు.. అనే పదాలను జోర్డాన్ రూపొందించిన డ్రాఫ్ట్‌లో చేర్చాలనేది కెనడా డిమాండ్. కెనడా ప్రతిపాదించిన ఈ సవరణలను ఇందులో చేర్చడానికి ఓటింగ్ సైతం నిర్వహించింది ఐరాస. దీనికి అనుకూలంగా భారత్ సహా 87 దేశాలు ఓటు వేశాయి. అయితే.. మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో ఇది ఆమోదం పొందలేకపోయింది. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో మెరుపు దాడులకు దిగింది హమాస్. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చి.. పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో సైన్యంతో ఎదురుదాడికి దిగిన ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ చేపట్టింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఫలితంగా.. గాజా ఛిద్రమైపోయింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 6,700 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దాడులు తీవ్రతరమౌతోన్న కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
పీఓకేను ఖాళీ చేయండి: భారత్ అల్టిమేటమ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి పాకిస్తాన్‌కు భారత్ ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది. పాక్ దురాక్రమణలో ఉన్న కశ్మీర్లో భూభాగాలను ఖాళీ చేయాలని, పాక్ గడ్డపైనున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేయాలని గట్టిగా చెప్పింది. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 78వ సర్వప్రతినిధి సమావేశాల్లో పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో భారత్ గట్టిగా కౌంటర్ ఇచి్చంది. భారత్‌తో పాకిస్తాన్ శాంతిని కోరుకుంటోందని, రెండు దేశాల మధ్య శాంతి స్థాపన జరగాలంటే కశ్మీర్ అంశమే కీలకమని కాకర్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితిలో భారత ఫస్ట్ సెక్రటరీ అయిన పెటల్ గెహ్లోత్ ఈ సమావేశంలో మాట్లాడారు. కాకర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. భారత్‌పై నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాక్‌కు ఒక అలవాటుగా మారిందని ఆమె అన్నారు. పాకిస్తాన్లో మానవ హక్కుల హననం నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చడానికే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారని మండిపడ్డారు. ‘‘జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని మేము పదే పదే చెబుతున్నాం. మా అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు పాక్‌కు లేదు’’అని ఆమె గట్టిగా చెప్పారు. దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే పాకిస్తాన్ మూడు పనులు చేయాలని ఆమె సూచించారు. ‘‘మొదటిది సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలి, ఉగ్రవాద శిబిరాలను వెంటనే ధ్వంసం చేయాలి. రెండోది చట్టవిరుద్ధంగా, దురాక్రమణ చేసి ఆక్రమించుకున్న భారత్ భూభాగాలను (పాక్ ఆక్రమిత కశ్మీర్)ను ఖాళీ చేసి వెళ్లిపోవాలి. ఇక మూడోది. పాకిస్తాన్లో మైనారీ్టలైన హిందువుల హక్కుల ఉల్లంఘనను అరికట్టాలి. ’’అని గెహ్లోత్ తీవ్ర స్వరంతో చెప్పారు. భారత్‌ను వేలెత్తి చూపించడానికి ముందు పాక్ తన దేశంలో మైనారీ్ట, మహిళల హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. -
ఐరాసలో పాక్ నోట మళ్లీ ‘కశ్మీర్’ మాట
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని మరోసారి పాకిస్తాన్ ప్రస్తావించింది. భారత్‌తో సంబంధాలు సజావుగా కొనసాగేందుకు కశ్మీరే కీలకమని పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలని పాకిస్తాన్ కోరుకుంటోందని చెప్పారు. అయితే, భారత్‌తో సంబంధాల విషయంలో మాత్రం కశ్మీరే కీలకమన్నారు. కశ్మీర్‌కు సంబంధించి భద్రతా మండలి చేసిన తీర్మానాలన్నిటినీ అమలయ్యేలా చూడాలని కోరారు. ఐరాస మిలటరీ అబ్జర్వర్ గ్రూప్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్(యూఎన్‌ఎంవోజీఐపీ)ని తిరిగి అమల్లోకి తేవాలని కకర్ అన్నారు. వ్యూహాత్మక, సంప్రదాయ ఆయుధాలపై పరస్పర నియంత్రణకు సంబంధించిన పాక్ ప్రతిపాదనను అంగీకరించేలా భారత్‌పై ఒత్తిడి తేవాలన్నారు. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కీలక ఓటింగ్‌కు భారత్, చైనా దూరం
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్వహించింది. ఈ యుద్ధాన్ని రష్యా తక్షణమే ముగించాలని, బలగాలను వెనక్కిమళ్లించాలని సభ్య దేశాలు తీర్మానించాయి. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొలపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాయి. ఐరాస జనరల్ అసెంబ్లీలో మొత్తం 193 సభ్య దేశాలున్నాయి. అయితే రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌లో 141 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 7 దేశాలు మాత్రం వ్యతిరేకించాయి. భారత్, చైనా సహా 32 దేశాలు మాత్రం ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఐరాస జనరల్ అసెంబ్లీలో రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాలు జరిగిన ప్రతిసారి భారత్ ఓటింగ్‌కు దూరంగానే ఉంటోంది. ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, శాంతి స్థాపనకు కృషి చేయాలని సూచిస్తోంది. అటు చైనా కూడా రష్యాకు అనుకూలం కాబట్టి ప్రతిసారి ఆ దేశానికి సానుకూలంగా వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 24న మొదలై.. ఐరోపా దేశాల కూటమి నాటోలో చేరాలనుకున్న ఉక్రెయిన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా.. 2022 ఫిబ్రవరి 24న ఆ దేశంపై దండయాత్రకు దిగింది. లక్షల మంది సైన్యం, క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. యుద్ధాన్ని మూడు రోజుల్లోనే ముగిస్తామని అతివిశ్వాసం ప్రదర్శించింది. అయితే ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటించడంతో రష్యాకు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఉక్రెయిన్‌కు ఇతర దేశాలు మద్దతుగా నిలిచి ఆయుధాలు సమకూర్చడంతో రష్యాకు కూడా యుద్ధంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడాదిగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన 42,295 మంది ప్రాణాలు కోల్పోయారు. 56,576 మంది తీవ్రంగా గాయపడ్డారు. 15,000 మంది గల్లంతయ్యారు. 1.4కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. 1,40,000 భవనాలు ధ్వంసం అయ్యాయి. లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. చదవండి: సూపర్మార్కెట్లలో కూరగాయలు, పండ్లపై పరిమితులు.. ఒక్కరికి మూడే! -
ముమ్మాటికీ అక్రమమే.. రష్యాకు భారీ షాక్
న్యూయార్క్: ఐక్య వేదిక నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ముక్తకంఠంతో ఖండించాయి ప్రపంచ దేశాలు. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రష్యా వ్యతిరేక తీర్మానానికి ఏకపక్షంగా ఓటేశాయి ప్రపంచ దేశాలు. ఉక్రెయిన్ భూభాగంలోని నాలుగు ప్రాంతాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగాక సాధారణ అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. ఆల్బేనియా తీసుకొచ్చిన ఈ ముసాయిదా తీర్మానంపై.. UNGA(ఐరాస సాధారణ అసెంబ్లీ) అత్యవసర ప్రత్యేక సమావేశంలో రికార్డెడ్ ఓటింగ్ జరిగింది. మొత్తం 193 సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో.. రష్యా వ్యతిరేక తీర్మానానికి 143 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. రష్యాతో పాటు ఉత్తర కొరియా, బెలారస్, సిరియా, కరేబియన్ దేశం నికరాగ్వాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి. మరో 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని లుగన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా తనలో అధికారికంగా విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా తీరును ఖండించగా.. భద్రతా మండలిలో అమెరికా-ఆల్బేనియా తీసుకొచ్చిన తీర్మానాన్ని వీటో పవర్‌తో వీగిపోయేలా చేసింది రష్యా. అయితే ఇప్పుడు సర్వసభ్య దేశ వేదికైన ఐరాస అసెంబ్లీలో మాత్రం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో యుద్ధం ఆపేయాలంటూ ప్రపంచ దేశాలకు రష్యాకు బలంగా పిలుపు ఇచ్చినట్లయ్యింది. మారని భారత్ తీరు ఇక ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరి మారడం లేదు. తటస్థ తీరునే అవలంభిస్తూ వస్తోంది. తాజాగా సాధారణ అసెంబ్లీలో రష్యా వ్యతిరేక తీర్మానంపై కూడా అదే వైఖరి అవలంభించింది. ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. అయితే.. అంతకు ముందు ఈ తీర్మానం ఓటింగ్ ఎలా జరగాలనే అంశంపై మాత్రం రష్యాకు భారత్ షాక్ ఇచ్చింది. రికార్డెడ్ ఓటింగ్ జరగాలని ఆల్బేనియా-రహస్య బాలెట్ కోసం రష్యా పట్టుబట్టగా.. జరిగిన ఓటింగ్‌లో భారత్ రష్యాకు వ్యతిరేకంగా ఓటేసి.. ఆశ్చర్యపరిచింది. ఇదీ చదవండి: యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా.. అండగా ఉంటాం! -
ఐరాసలో పాక్ ‘శాంతి’ మాటలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) 77వ సమావేశాల వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు దీటుగా బదులిచ్చింది ఢిల్లీ. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని స్పష్టం చేసింది. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. శాంతి కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత బృందం తొలి సెక్రెటరీ మిజిటో వినిటో పాక్‌పై నిప్పులు చెరిగారు. ‘భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబయిలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు వినిటో. పాకిస్థాన్‌తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్ కాంక్షిస్తోందని పేర్కొన్నారు వినిటో. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసిపోయినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
ఐరాస తీర్మానంలో హిందీ
ఐరాస: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ శుక్రవారం బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్ తో´ ాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తరప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐరాస గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది. -
అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!
చదవడం, వ్రాయడం అనేవి రెండు కూడా ప్రజలు నేర్చుకోగల అత్యంత ఉపయోగకరమైన ముఖ్యమైన విషయాలు . అంతేకాదు ఇవి రెండే మానవులు విద్యనభ్యసించడానికి ఉపకరించే అత్యం తముఖ్యమైన సాధనాలు. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అంధులు ఉన్నారు. వారు విద్యనభ్యసంచాలంటే ఎలా అనేదానికి సమాధానమే ఈ బ్రెయిలీ లిపి. లక్షలాది మంది అంధులు మంచి విద్యనభ్యసించి వారు జీవితంలో విజయాలను సాధించేందుకు వీలు కల్పించిన పద్ధతి. బ్రెయిలీ అనేది అంధుల కోసం కనుగొన్న వ్రాతపూర్వక భాష రూపం. దీనిలో అక్షరాలను వేలికొనలతో గుర్తుపట్టేగలిగే విధంగా ఎత్తైన చుక్కల నమూనా. బ్రెయిలీ డే ప్రాముఖ్యత అంధులకు, దృష్టిలోపం ఉన్నవారికి కమ్యూనికేషన్ సాధనంగా ఉన్న బ్రెయిలీ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకే ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృష్టి లోపం ఉన్నవారు బ్రెయిలీలో చదివి వ్రాస్తారు. దృష్టి లోపం లేని వ్యక్తులు కళ్ళతో బ్రెయిలీని చదవగలరు. వివిధ భాషలలో వర్ణమాల క్రమాన్ని బట్టి విలువలు బ్రెయిలీ చిహ్నాలకు కేటాయించబడతాయి. చాలా బ్రెయిలీ వర్ణమాలలు 26 అక్షరాల లాటిన్ వర్ణమాలకు చెందిన ఫ్రెంచ్ సార్టింగ్ క్రమాన్ని అనుసరిస్తాయి. జపనీస్, కొరియన్ బ్రెయిలీ ఇతర బ్రెయిలీ ట్రాన్స్క్రిప్షన్ల నుండి చాలా భిన్నంగా ఉంటాయి. అంతేకాదు బ్యాంకులు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు వంటి అనేక సంస్థలు ఇప్పటికీ తమ ప్రింటెడ్ మెటీరియల్‌లో బ్రెయిలీ వెర్షన్లను అందించనందున ఈ రోజు దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు స్వేచ్చయుతం జీవించడానికి మన వంతుగా అందించాల్సిన సహాయ సహకారాలను గురించి వివరిస్తుంది. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు.... జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 2018లో ప్రకటించింది. మొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జనవరి4, 2019న జరుపుకున్నారు. జనవరి 4న ఎందుకంటే.. 1809లో బ్రెయిలీని కనిపెట్టిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ జన్మదినం అయిన జనవరి 4న పురస్కరించుకుని బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. లూయిస్ బ్రెయిలీ ఎవరు? లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ విద్యావేత్త. అతను కనిపెట్టిన బ్రెయిలీ లిపి వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అంధులకు చదవడానికి విస్తృతంగా ఉపయోగించే మాధ్యమంగా ఉంది. లూయిస్ బ్రెయిలీకి మూడేళ్ల వయసులో తన తండ్రి జీనులు తయారు చేసే దుకాణంలో కుట్టుపని చేస్తున్నప్పుడు ప్రమాదంలో ఒక కన్ను పోయింది. అయితే కొన్నాళ్లకు ఇన్ఫెక్షన్ ఏర్పడి రెండు కళ్లకు వ్యాపించి పూర్తిగా అంధత్వం ఏర్పడింది. కానీ అతను అన్ని సవాళ్లను అధిగమించి విద్యలో రాణించాడమే కాకుండా కొత్త పద్ధతిలో త్వరగా చదవడం, కమ్యూనికేట్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. అంతేకాదు అందుల కోసం బ్రెయిలీని కనిపెట్టాడు. బ్రెయిలిని అనేది నైట్ రైటింగ్ అనే స్పర్శ కోడ్... అయితే ఈ వ్యవస్థ రాత్రిపూట ఎటువంటి కాంతి వనరులు లేకుండా సైనికులు నిశ్శబ్దంగా కమ్యూనికేట్ చేయడానికి నెపోలియన్ ఆదేశాల మేరకు చార్లెస్ బార్బియర్ చేత అభివృద్ధి చేయబడిన నైట్ రైటింగ్ అనే స్పర్శ సైనిక కోడ్. అంతేకాదు లూయిస్ బార్బియర్ నైట్ రైటింగ్' గురించి తెలుసుకున్నాడు. దీన్ని ఆధారంగా చేసుకునే బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు. అయితే లూయిస్ క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు గురువుగారి అంధుల లిపికి గుర్తింపునివ్వాలని పోరాటాలు చేయగా.. బ్రెయిలీ లిపికి గుర్తింపు నిచ్చి.. దేశ ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్. నేటికీ అంధులకు అన్నిరకాల పత్రికలు, పుస్తకాలు బ్రెయిలీ లిపిలోనే రూపొందిస్తున్నారు. లూయిస్ పేరు మీద స్టాంపులు బ్రెయిలీ కనిపెట్టిన అంధుల లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా రూపొందించబడిందంటే ఆయన ముందుచూపు ఏమిటో అర్థమవుతుంది. లూయిస్ చనిపోయాక ఆయన పేరు మీద స్టాంపులు, కరెన్సీ, విద్యాసంస్థలు, పట్టణాలు వెలిశాయి. భారతదేశం 2 రూపాయల నాణెం మీద, యుఎస్ డాలర్ మీద బ్రెయిలీ ముఖచిత్రాన్ని ప్రచురించారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటయ్యే పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశాయి. (చదవండి: worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!) -
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల న్యాయవాదిగా నోబెల్ గ్రహిత కైలాశ్ సత్యార్థి: యూఎన్
న్యూయార్క్: యూఎన్ జనరల్ అసెంబ్లీ 76వ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) న్యాయవాదిగా నోబెల్ గ్రహిత కైలాశ్ సత్యార్థిని నియమిస్తున్నట్లుగా శుక్రవారం ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొన్నారు. ఈ మేరకు కైలాశ్ సత్యార్థి తోపాటు స్టెమ్ కార్యకర్త వాలెంటినా మునోజ్ రబనాల్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాండ్‌స్మిత్, కే పాప్ సూపర్‌స్టార్స్ బ్లాక్ పింక్‌లను ఎస్డీజీ కొత్త న్యాయవాదులుగా నియమిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ఒక ప్రతిక ప్రకటనలో తెలిపింది. (చదవండి: ఫస్ట్ టైం.. బెజోస్-మస్క్ మధ్య ఓ మంచి మాట) ఈ సందర్భంగా యూఎన్ చీఫ్ గుటెర్రెస్ మాట్లాడుతూ... కొత్తగా నియమితులైన ఈ ఎస్డీజీ న్యాయవాదులు తమ సరికొత్త విధానాలతో సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని సుస్థిరాభివృద్ధి దిశగా నడిపించటమే కాక తమ ఆశయాలను నెరవేర్చుకోగలరంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ పురోగాభివృద్ధికై 17 అంశాలతో కూడిన సుస్థిరభివృద్ధి లక్ష్యాల కోసం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కలిసి పనిచేస్తామని అంగీకరించిన సంగతిని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2030 కల్లా ఐక్యరాజ్యసమితి వర్కింగ్ గ్రూప్ సుస్థిరాభివృద్ధి కోసం ప్రతిపాదించిన లక్ష్యాల గురించి కూడా ప్రస్తావించారు. బాలకార్మిక వ్యవస్థ, మానవ అక్రమ రవాణ, బానిసత్వం వంటి వాటిపై నోబెల్ గగ్రహిత కైలాశ్ సత్యార్థి దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఎర్త్ - 2.0,‘అయ్యా! ఇంతకీ ఆ భూమి ఏ నగరంలో ఉంది?’) -
ఐరాస భేటీ కోసం న్యూయార్క్‌కు రావొద్దు
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం.. కరోనా విస్తృతికి మరో వేదికగా మారకూడదని అమెరికా సంకల్పించింది. సమావేశాలను ఐరాస ప్రధాన కార్యాలయంలో వచ్చే నెలలో నిర్వహించనున్నారు. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉండటంతో అక్కడికి 150కిపైగా ప్రపంచదేశాలకు చెందిన ముఖ్యనేతలు ప్రసంగించేందుకు తరలిరానున్నారు. ఇంతమంది అగ్ర నేతలు, వారి సహాయగణం న్యూయార్క్‌కు చేరుకుంటే కరోనా మరింతగా విజృంభిస్తుందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొనకుండా వీడియో సందేశాలు ఇస్తే బాగుంటుందని అమెరికా ప్రపంచ దేశాల నేతలకు కబురు పంపింది. ‘ 192 దేశాల ముఖ్య నేతలు, న్యూయార్క్ నగరవాసులు అనవసరంగా మరింతగా వైరస్ ముప్పు బారిన పడకుండా చూద్దాం’ అంటూ అమెరికా ఆయా దేశాలకు సూచనలు చేసింది. -
సెప్టెంబర్ 25న ఐరాసలో మోదీ ప్రసంగం
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) 76వ ఉన్నత స్థాయి వార్షిక సమావేశానికి భారత ప్రధాని మోదీ ప్రత్యక్షంగా హాజరై ప్రసంగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఐరాస విడుదల చేసిన వివిధ ప్రభుత్వాధినేతలతో కూడిన తాత్కాలిక మొదటి షెడ్యూల్ జాబితాలో భారత ప్రధాని పేరుంది. ఐరాస షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం ప్రసంగించే నేతల్లో మోదీ పేరు మొదటిది. కాగా, సెప్టెంబర్ 21న అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రసంగించనున్నారు. అమెరికా అధ్యక్ష హోదాలో ఐరాసలో ఆయన ప్రసంగించడం ఇదే ప్రథమం. సెప్టెంబర్ 14–27వ తేదీల మధ్య జరిగే ఐరాస సమావేశాల్లో 167 దేశాధి నేతలు, ప్రభుత్వాధినేతలు, 29 మంది మంత్రులు, రాయబారులు ప్రసంగిస్తారు. ఇందులో ఇరాన్, ఈజిప్టు, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, నేపాల్ తదితర 46 దేశాల నేతలు వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్ష హోదాలో ఏడాదిపాటు కొనసాగుతారు. సమావేశాల సమయానికి ఆతిథ్య నగరం న్యూయార్క్ నగరంలో అమలయ్యే కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అమలు చేస్తామని ఐరాస సెక్రటరీ జనరల్ గ్యుటెర్రస్ ప్రతినిధి స్టిఫానీ తెలిపారు. ఇందుకు సంబంధించి మొత్తం 193 సభ్య దేశాలతో మాట్లాడతామన్నారు. 2019లో మొదటిసారిగా భారత ప్రధాని మోదీ ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రసంగించారు. గత ఏడాది సర్వప్రతినిధి సభలో ప్రసంగించాల్సిన ప్రధాని మోదీ సహా వివిధ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రికార్డు చేసిన ప్రసంగాన్ని పంపించారు. ఐరాస 75 ఏళ్ల చరిత్రలో వర్చువల్‌గా ఐరాస ఉన్నత స్థాయి భేటీ జరగడం అదే ప్రథమం. -
అప్పటి, ఇప్పటి పరిస్థితులేంటి? : మోదీ
-
అప్పటి, ఇప్పటి పరిస్థితులేంటి? : మోదీ
న్యూయార్క్/న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారత్‌కు ఐక్యరాజ్యసమితి మరింత పెద్దపీట వేయాలని కోరారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వశాంతి కోసం కృషి చేస్తోందని అన్నారు. ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఆన్లైన్ ద్వారా మోదీ ప్రసంగించారు. ‘ప్రస్తుతం మనం భిన్నమైన పరిస్థితుల్లో ఉన్నాం. సరికొత్త సవాళ్లను ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటోంది. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతోంది. ఐక్యరాజ్యసమితి చేయగలిగినంత చేస్తోందా?’అని మోదీ సందేహం వెలిబుచ్చారు. కోవిడ్ వాక్సిన్లను వేగంగా తయారు చేసేందుకు భారత ఫార్మా సిద్ధంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇవాళ ఐక్యరాజ్యసమితి అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని అన్నారు. 1945లో ఐరాస ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులేంటి.. ఇప్పుడు పరిస్థితులేంటి? అని మోదీ ప్రశ్నించారు. ఐరాసలో సంస్కరణల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. 21వ శతాబ్దంలోని సవాళ్లకు అనుగుణంగా ఐరాసలో సంస్కరణలు రావాలని చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో సమూల ప్రక్షాళన జరగాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. (చదవండి: కరోనా పాపం చైనాదే) -
ఇమ్రాన్‌కు భంగపాటు
-
వీడియో వైరల్.. ఇమ్రాన్‌కు భంగపాటు
జెనీవా: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భంగపాటు ఎదురయ్యింది. పాక్ ప్రధాని ఉపన్యాసం ప్రారంభం అయిన వెంటనే భారత ప్రతినిధి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం నాటి సర్వసభ్య సమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడమే కాక కశ్మీర్ సమస్యను లేవనెత్తడంతో భారత దౌత్యవేత్త మిజిటో వినిటో వాకౌట్ చేశారు. అనంతరం పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టీఎస్ తిరుమూర్తి స్పందించారు. భారత్ వ్యతిరేక ప్రకటనకు తగిన సమాధానం చెప్తామన్నారు. ఇమ్రాన్ ఖాన్ దౌత్యపరంగా చాలా తక్కువ స్థాయి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ మేరకు తిరుమూర్తి ట్వీట్ చేశారు. ‘75 వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి చాలా తక్కువ స్థాయి దౌత్యపరమైన ప్రకటన చేశారు. పాకిస్తాన్ తన సొంత మైనారిటీలను హింసించడం గురించి, సరిహద్దు ఉగ్రవాదం గురించి దుర్మార్గపు అబద్ధాలు, వ్యక్తిగత దాడులకు దిగింది. ఇందుకు తగిన సమాధానం ఎదురు చూస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: ‘ఉగ్ర అడ్డాగా సోషల్ మీడియా’) అంతకు ముందు విద్వేష ప్రసంగాలు, నకిలీ వార్తలు, వీడియోల ద్వారా ఉగ్రవాదులు సోషల్ మీడియాలో దుష్ర్పచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్ఆర్సీ) 45వ సమావేశాల్లో భారత్ పేర్కొంది. ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ పెరిగిపోవడం పట్ల ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత మిషన్ కార్యదర్శి పవన్ బాధే ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అమాయక ప్రజలు, యువతను తమ శ్రేణుల్లో నియమించుకునే ఉద్దేశంతో ఈ ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. భద్రతా దళాలు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు ఉగ్రవాదులు వీరిని ఉసిగొల్పుతున్నారని మండిపడిన సంగతి తెలిసిందే. -
మోదీ టర్కీ పర్యటన రద్దు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక టర్కీ పర్యటన రద్దయ్యింది. గత నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై టర్కీ అధ్యక్షుడు తుయ్యిప్ ఎర్డోగన్ విమర్శలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పారిస్‌లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలోనూ పాక్‌కు మద్దతుగా ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు కూడా పర్యటనకు రద్దు కు కారణాలుగా తెలుస్తోంది. ఈ నెల్లో జరగనున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు సౌదీ అరేబియాకు వెళ్లనున్న మోదీ.. అక్కడి నుంచి టర్కీ రాజధాని అంకారా వెళ్లాల్సి ఉంది. అయితే తాజా నిర్ణయంతో మోదీ కేవలం సౌదీలో మాత్రమే పర్యటించనున్నారు. ఈ వార్తలపై విదేశాంగ శాఖ స్పందిస్తూ అసలు మోదీ టర్కీ పర్యటన ఖరారే కాలేదని, అలాంటప్పుడు రద్దయ్యే అవకాశమే లేదని పేర్కొంది. తమిళంలో మోదీ కవిత: ఇటీవల మామల్లపురం లో తాను సముద్రంతో సంభాషణ అంటూ రాసిన కవిత తమిళ అనువాదాన్ని తాజాగా ఆది వారం ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో అనధికార భేటీ సందర్భంగా మహాబలిపురంలో మోదీ ఒక రోజు గడిపిన విషయం తెలిసిందే. భేటీ రోజు ఉదయం బీచ్‌లో ప్లాగింగ్ చేసిన మోదీ.. అక్కడే కాసేపు కూర్చున్నారు. ఆ సందర్భంగా సముద్రంతో మమేకమయ్యానంటూ తన భావావేశాన్ని కవితగా మలిచానని తరువాత చెప్పారు. ఆ కవితనే తమిళంలో ఆదివారం ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో తమిళంపై ప్రధాని ప్రత్యేక ప్రేమ చూపుతున్న విషయం తెలిసిందే. ఐరాస వేదికపైనా తమిళం అత్యంత ప్రాచీన భాష అని గుర్తు చేశారు. జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా మామల్లపురంలో తమిళ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. -
ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తేనే : అమెరికా
న్యూయార్క్ : కశ్మీర్ అంశంలో భారత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న పాకిస్తాన్ తొలుత ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని అమెరికా సూచించింది. భారత్‌తో శాంతి చర్చలు కోరుకుంటున్న విషయం వాస్తమే అయితే అందుకు తగ్గట్టుగా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 74వ సెషన్లో భాగంగా అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయక కార్యదర్శి అలైస్ వెల్స్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కశ్మీర్ విషయంలో దాయాది దేశాల సామరస్యపూర్వక చర్చలు జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అణ్వాయుధ దేశాలైన భారత్, పాకిస్తాన్ చర్చల ద్వారానే సమస్యకు ముగింపు పలికితే బాగుంటుందన్నారు. ‘ కశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యాన్ని కోరబోమని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక పాకిస్తాన్ మాత్రం కశ్మీర్ అంశంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే పాకిస్తాన్ తొలుత ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఐక్యరాజ్యసమితిచే అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రపడిన హఫీజ్ సయీద్, జైషే ఛీప్ మసూద్ అజర్ వంటి వాళ్లకు పాక్ ఆశ్రయం కల్పించకుండా ఉండాలి. అపుడే పరిస్థితులు చక్కబడతాయి’ అని అలైస్ పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్‌లోని ముస్లింల విషయంలో ఒకలా, చైనాలోని ముస్లింల విషయంలో మరోలా వ్యవహరించడమేమిటని ఆమె పాకిస్తాన్‌ను ప్రశ్నించారు. ‘కశ్మీర్ కంటే చైనాలోని ముస్లింలే నిర్భంధంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాబట్టి పాకిస్తాన్ వాళ్ల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అలైస్ వ్యాఖ్యానించారు. -
ఐరాసలో కశ్మీర్ ప్రస్తావన!
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సమావేశాల్లో చర్చల సందర్భంగా కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని ఐరాస ప్రధాన కార్యదర్శి అంటానియొ గ్యుటెరిస్ అధికార ప్రతినిధి స్టీఫానె డ్యుజారిక్ వెల్లడించారు. కశ్మీర్‌లోయలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మానవహక్కుల ఉల్లంఘన తదితర అంశాలను వచ్చేవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి గ్యుటెరిస్ లేవనెత్తవచ్చని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఏకైక మార్గం చర్చలేనన్న విషయాన్ని గ్యుటెరస్ బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత కశ్మీర్ సమస్య పరిష్కారంలో.. లోయలో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారని స్టీఫానె తెలిపారు. సాధారణ సభ సమావేశాలను ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రధాన కార్యదర్శి ఉపయోగించుకోవచ్చన్నారు. అయితే, కశ్మీర్ పరిష్కారానికి భారత్ పాక్ ల మధ్య చర్చలే మార్గమని, వారు కోరితే ఇరువర్గాలకు ఐరాస కార్యాలయం అందుబాటులో ఉంటుందని, అదే సమయంలో మానవహక్కులకు సముచిత గౌరవం ఇవ్వాల్సిందేనని బుధవారం గ్యుటెరస్ అభిప్రాయపడిన విషయం ఇక్కడ గమనార్హం. ‘అక్కడ మానవ హక్కులను కచ్చితంగా గౌరవించాల్సిందే. అయితే, భారత్– పాక్‌ల మధ్య చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని నా విశ్వాసం’ అని నాడు పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గ్యుటెరస్ సమాధానమిచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్ భారత్ భూభాగం. దీనికి సంబంధించిన ఏ సమస్యలోనైనా.. ఐరాస లేదా అమెరికా.. ఎవరైనా సరే మూడో శక్తి ప్రమేయాన్ని అంగీకరించబోం’ అని ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్, పాక్‌లు కోరితేనే ఇందులో జోక్యం చేసుకుంటామని కూడా ఐరాస ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం భారత్, పాక్‌ల సంబంధాలు కనిష్ట స్థాయికి దిగజారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27న న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస సాధారణ సభ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతానని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేసిన విషయమూ విదితమే. అయితే, అదే సెప్టెంబర్ 27న భారత ప్రధాని మోదీ కూడా ఐరాస వేదికగా ప్రసంగించనుండటం విశేషం. దీటుగా సమాధానమిస్తాం ఐరాస వేదికపై కశ్మీర్ అంశాన్ని లేవనెత్తే అధమ స్థాయికి పాకిస్తాన్ దిగజారితే.. అందుకు భారత్ అత్యున్నత స్థాయిలో జవాబిస్తుందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తేల్చి చెప్పారు. గతంలోనూ ఇలా అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తిన సందర్భాల్లో భారత్ తిరుగులేని విధంగా వారికి జవాబిచ్చామన్నారు. ఇప్పటివరకు ఉగ్రవాద వ్యాప్తిలో పెరెన్నికగన్న పాకిస్తాన్.. ఇప్పుడు భారత్‌పై ద్వేష భావజాల ప్రచారాన్ని కూడా తలకెత్తుకుందని విమర్శించారు. -
అమెరికా గుప్పిట్లోకి భారత్
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తారంటూ పలు మీడియాల్లో ప్రముఖంగా వార్తలొచ్చాయి. ఈ మాటలకు మురిసిపోతే ముందున్న ముప్పును ఊహాంచలేం. ఆ మాటకోస్తే ఒక్క భారత్‌నే కాదు, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, పోలాండ్ దేశాలను కూడా ఆయన పొగిడారు. గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ను ‘రాకెట్ మేన్’ అని, ‘సూసైడ్ మిషన్’పై వెళుతున్నాడని విమర్శించిన ట్రంప్ నిన్న ఆయన్ని కూడా ప్రశంసించారు. ఇరాన్, వెనుజులా, క్యూబా, చైనా, జర్మనీ దేశాలను విమర్శించారు. అంటే ఓ స్పష్టమైన వైఖరితోనే వ్యూహాత్మకంగా ట్రంప్ మాట్లాడారన్నది అర్థం అవుతోంది. డొనాల్ట్ ట్రంప్, భారత్‌ను ప్రశంసించడం అంటే అమెరికా కక్ష్యలోకి భారత్ అడుగు పెడుతోందనడానికి కచ్చితమైన సంకేతం. ఈ నెల మొదట్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతోని ‘కామ్కాసా’గా వ్యవహరించే ‘కమ్యూనికేషన్ కంపాటిబిలిటీ అండ్ సెక్యూరిటీ అరెంజ్మెంట్స్’ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందాన్ని ‘సీస్‌మోవా’ అంటే, ‘కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్’ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఒప్పందం ఇరు దేశాల సైన్యాల మధ్య పరస్పర సహకారాన్ని, సమన్వయాన్ని పెంచుతుంది. అమెరికా మిలటరీ మిత్రపక్ష కూటమిలో చేరేందుకు వీలు కల్పించే మూడు ఒప్పందాల్లో ఈ కామ్కాసా లేదా సీస్‌మోవా రెండో ఒప్పందం. ‘లెమోవా’గా పిలిచే తొలి ఒప్పందం ‘లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్’పైన 2016లోనే ఇరుదేశాల సంతకాలు చేశాయి. అప్పటి భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, అప్పటి అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్లు దానిపై సంతకాలు చేశారు. ఇక ‘బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోపరేషన్ అగ్రిమెంట్ (బీఈపీఏ)’ ఒప్పందంపైన సంతకం చే యాల్సి ఉంది. ఈ సంతకం కూడా చేసేస్తే భారత్ పూర్తిగా అమెరికా మిలటరీ గుప్పిట్లో ఇరుక్కుపోయినట్లే. అప్పుడు అమెరికా, అమెరికా సైన్యం సూచించిన ఆయుధాలనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, అన్య దేశాలపై అమెరికా చేస్తున్న, చేయబోయే యుద్ధాల్లో భారత్ సైన్యం కూడా ప్రత్యక్షంగా పాల్గొనాల్సి వస్తుంది. ఇప్పటికే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న విమాన విధ్వంసక క్షిపణులు ‘ఎస్–400’ను కొనద్దంటూ అమెరికా ఆంక్షలు విధించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ క్షిపణులు భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో అవసరం. ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతిని సంపూర్ణంగా నిలిపివేసినట్లయితేనే రష్యా నుంచి ఈ క్షిపణుల దిగుమతిని అనుమతిస్తామని గత కొంతకాలంగా ఇరాన్‌పై కత్తిదూస్తున్న అమెరికా భారత్‌కు అల్టిమేటమ్ కూడా జారీ చేసింది. చమురు ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తుల దిగుమతిని భారత్ పూర్తిగా నిలిపివేసినట్లయితే దేశీయంగా చమురు ధరలు మరింతగా మండిపోతాయి. ఇప్పటికే అమెరికా ఆంక్షలకు పాక్షికంగా తలొగ్గిన భారత్, ఇరాన్ నుంచి చమురు ఉత్పత్తులను డాలర్ల రూపంలో కాకుండా రూపాయల్లోనే దిగుమతి చేసుకుంటోంది. నాటి చర్చ నేడేది? సరిగ్గా పదేళ్ల క్రితం భారత్‌లోని అప్పటి మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం, అమెరికాతోని పౌర అణు ఒప్పందం చేసుకోవడం పట్ల దేశంలో పెద్ద చర్చ జరిగింది. అలీన విదేశీ విధానానికి విడాకులిచ్చి అమెరికాతోని అణు ఒప్పందాన్ని చేసుకున్నదంటూ మన్మోహన్ ప్రభుత్వంపైన దుమారం కూడా రేగింది. విమర్శించిన పక్షాల్లో బీజేపీ కూడా ఉంది. అదే ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎలాంటి చర్చకు ఆస్కారం ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా అమెరికాతో సైనిక ఒప్పందాలు చేసుకుంటూ వెళుతోంది. మరో గల్ఫ్ యుద్దం వస్తే ఆ పరిణామాలు భారత్‌పై ఎంత భయంకరంగా ఉంటాయో కనీసం ఊహించలేం! -
భారత్ అంటే నాకెంతో ఇష్టం: ట్రంప్
ఐరాస: భారత్ అంటే నాకెంతో ఇష్టం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల సమస్యకు పరిష్కారాల కోసం సోమవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఓ సదస్సు నిర్వహించారు. ట్రంప్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. సదస్సు తర్వాత ఐరాసలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ సుష్మాను ఆలింగనం చేసుకుని అక్కడే ఉన్న ట్రంప్‌కు పరిచయంచేశారు. వెంటనే సుష్మాతో ట్రంప్ ‘భారత్ అంటే నాకెంతో ఇష్టం. మా అభిమానాన్ని నా ప్రియమిత్రుడు నరేంద్ర మోదీకి తెలియజేయండి’ అంటూ కాసేపు ముచ్చటించారు. -
ట్రంప్‌కు కిమ్ దిమ్మతిరిగే వార్నింగ్!
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ 'మతిచెడిన' పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని, ఉ.కొరియాను నాశానం చేస్తానంటూ వ్యాఖ్యలు చేసినందుకు ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కిమ్ హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిసారి మాట్లాడిన ట్రంప్.. అమెరికాపై గానీ, తన మిత్రదేశాలపైగానీ దాడులు చేస్తే.. ఉ.కొరియాను సమూలంగా నాశానం చేస్తానని తీవ్రస్వరంతో హెచ్చరించారు. ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన కిమ్ 'డీపీఆర్కే (డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా)ను సమూలంగా నాశనం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు తగిన మూల్యం చెల్లించుకోనేలా చేస్తా' అని పేర్కొన్నట్టు కొరియా ప్రభుత్వ వార్తాసంస్థ కేసీఎన్ఏ అధికార వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఐరాస వేదికగా ఒక సార్వభౌమాధికార దేశాన్ని పూర్తిగా నాశనం చేస్తానని పేర్కొనడం ద్వారా అమెరికా అధ్యక్షుడు పిచ్చివాడిగా ప్రవర్తించాడని కిమ్ మండిపడ్డారు. ఉత్తర కొరియాను సమూలంగా నాశనం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన భీకర హెచ్చరికను.. ఆ దేశం తేలికగా కొట్టిపారేసింది. ట్రంప్ హెచ్చరికలను కుక్క అరుపులేనని, ఈ బెదిరింపులకు ఉత్తరకొరియా లొంగే ప్రసక్తే లేదని ఇప్పటికే తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా ఇటీవల వరుసగా అణ్వాయుధ పరీక్షలు, క్షిపణీ ప్రయోగాలు నిర్వహిస్తుండటంతో అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఉ. కొరియా అణుపరీక్షలపై అమెరికా, దానిమిత్రదేశాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. అయితే, ఎన్ని ఆంక్షలు విధించినా అణ్వాయుధాల విషయంలో వెనుకకు తగ్గేది లేదని ఉ.కొరియా తెగేసి చెప్తుండటం ఉద్రికత్తలు రేపుతోంది. -
ట్రంప్ హెచ్చరికలు.. కుక్క అరుపులే!
సియోల్: ఉత్తర కొరియాను సమూలంగా నాశనం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన భీకర హెచ్చరికను.. ఆ దేశం తేలికగా కొట్టిపారేసింది. ట్రంప్ హెచ్చరికలను కుక్క అరుపులతో పోల్చి ఎద్దేవా చేసింది. ఈ బెదిరింపులకు ఉత్తరకొరియా లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్.. ఉత్తర కొరియాపై తీవ్రంగా విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అమెరికాపైగానీ, తన మిత్రదేశాలపైగానీ దాడిచేస్తే.. కొరియాను సమూలంగా నాశనం చేస్తానని హెచ్చరించారు. ఉ.కొరియా ఇటీవల వరుసగా అణ్వాయుధ పరీక్షలు, క్షిపణీ ప్రయోగాలు చేస్తుండటంతో ట్రంప్ ఈ మేరకు హెచ్చరికలు జారీచేశారు. ఐరాస సమావేశాల్లో పాల్గొనడానికి న్యూయార్క్ వచ్చిన ఉ.కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హోను ట్రంప్ హెచ్చరికలపై విలేకరులు ప్రశ్నించగా.. ఒక సామెతతో బదులిచ్చారు. 'ఏనుగుల ఊరేగింపు సాగుతుంటే.. కుక్కలు మొరుగుతాయి' అని యాంగ్ పేర్కొన్నారు. 'కుక్క అరుపులతో వారు మమ్మల్ని బెదిరించాలని చూస్తే.. అది శునకస్వప్నమే అవుతుంది' అని ఎద్దేవా చేశారు.