ఐరాస వేదికపై కశీ్మర్ ప్రస్తావన
ఆరి్టకల్ 370ని పునరుద్ధరించాలి
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కశీ్మర్ ప్రస్తావన తెచి్చంది. దీర్ఘకాలిక శాంతి కోసం భారత్ ఆరి్టకల్ 370ని పునరుద్ధరించాలని, జమ్మూకశీ్మర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ తన సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి షరీఫ్ శుక్రవారం ప్రసంగించారు.
ఆరి్టకల్ 370, హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బుర్హాన్ వనీల ప్రస్తావన తెచ్చారు. ‘పాలస్తీనియన్ల లాగే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్య్రం, స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్దకాలంగా పోరాడుతున్నారు’ అని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూకశీ్మర్‌పై భారత్ చర్చలకు రావాలన్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపించారు. స్వీయ నిర్ణయాధికారం జమ్మూకశీ్మర్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయని అన్నారు.
భారత్‌కు బ్రిటన్ మద్దతు
ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వముండాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ మద్దతు పలికారు. భారత్ డిమాండ్‌కు అమెరికా, ఫ్రాన్స్‌లు ఇదివరకే మద్దతు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో, మరింత స్పందనతో కూడి ఉండాలని స్టార్మర్ ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశిస్తూ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment