burhan vani
-
పాక్ నోట మళ్లీ పాతపాట
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కశీ్మర్ ప్రస్తావన తెచి్చంది. దీర్ఘకాలిక శాంతి కోసం భారత్ ఆరి్టకల్ 370ని పునరుద్ధరించాలని, జమ్మూకశీ్మర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ తన సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి షరీఫ్ శుక్రవారం ప్రసంగించారు. ఆరి్టకల్ 370, హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బుర్హాన్ వనీల ప్రస్తావన తెచ్చారు. ‘పాలస్తీనియన్ల లాగే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్య్రం, స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్దకాలంగా పోరాడుతున్నారు’ అని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూకశీ్మర్పై భారత్ చర్చలకు రావాలన్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపించారు. స్వీయ నిర్ణయాధికారం జమ్మూకశీ్మర్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయని అన్నారు. భారత్‌కు బ్రిటన్ మద్దతు ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వముండాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ మద్దతు పలికారు. భారత్ డిమాండ్‌కు అమెరికా, ఫ్రాన్స్‌లు ఇదివరకే మద్దతు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో, మరింత స్పందనతో కూడి ఉండాలని స్టార్మర్ ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. -
బుద్ది పోనివ్వని పాక్.. ఉగ్రవాది హీరోనట!
శ్రీనగర్: ఉగ్రవాదులకు తామేప్పుడూ మద్దతుగా నిలుస్తామని పాకిస్తాన్ మరోసారి నిరూపించుకుంది. భారత భద్రతా దళాల చేతిలో మూడేళ్ల క్రితం హతమైన కురుడుగట్టిన ఉగ్రవాది బుర్హాన్ వనీపై పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రసంశల వర్షం కురిపించారు. బుర్హాన్ వనీ మరణించి నేటితో మూడేళ్లు అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గఫూర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘నిబద్ధత, అంకితభావం, త్యాగం లేకుండా ఏదీ రాదు. రేపటి తరాల కోసం వీరులు దాన్ని కొనసాగించాలి’’ అని పేర్కొన్నారు. దాని తోడు బుర్హాన్ వనీ, జస్టిస్ ఫర్ కశ్మీర్ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఈ ట్వీట్‌కి జతచేశారు. కాగా గతంలో కూడా ఇలాంటి అనేక చర్యలకు పాకిస్తాన్ పాల్పడిన విషయం తెలిసిందే. 2017లో వనీ మరణంపై ఆ దేశ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ స్పందిస్తూ.. అతన్ని అమరవీరులతో పోల్చారు. కశ్మీర్లో అనేక మంది భారత సైనికుల మరణాలకు కారకుడైన బుర్హాన్ వనీని.. 2016 జూలై 8న భద్రతా దళాలు ఎన్కౌంటర్లో హతమార్చిన విషయం తెలిసిందే. దీనిపై కశ్మీర్లో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. రెండు నెలల పాటు లోయలో ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేశారు. బుర్హాన్ వనీ హతమై మూడేళ్లు అయిన సందర్భంగా సోమవారంనాడు శ్రీనగర్‌లోని దుకాణాలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. అంతే కాకుండా అక్కడి ప్రజా రవాణా కూడ మూత పడడంతో రోడ్లన్నీ బోసిపోయి కనిపించాయి. సున్నిత ప్రాంతాల్లో ఎలాంటి చెదురు మదురు సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశాయి. సోషల్ మీడియాలో భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా మొబైల్ డాటాను 2జీకి తగ్గించారు. శ్రీనగర్ సహా, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ చర్యలు తీసుకున్నట్లు భద్రతా దళలు పేర్కొన్నాయి. -
చనిపోతోంది మన పిల్లలే.. సంబరమొద్దు!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో హతమవుతున్న స్థానిక మిలిటెంట్ల గురించి ఆ రాష్ట్ర పోలీసు అధికారి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కశ్మీర్లో స్థానిక మిలిటెంట్లను చంపేసినప్పుడు సంతోషం వ్యక్తం చేయవద్దని, వారు మన పిల్లలేనని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ రిజర్వు పోలీసు (ఐఆర్పీ) రెండో బెటాలియన్ కమాండెంట్ ఎస్ఎస్స్పీ శైలేంద్రకుమార్ మిశ్రా ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, ఆ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన గురువారం మీడియాతో అన్నారు. 2009 ఏపీఎస్ బ్యాచ్ అదికారి అయిన మిశ్రా గతవారం ముంబైలో జరిగిన బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడుతూ కశ్మీరీ మిలిటెంట్లను హతమార్చడం మన ఉమ్మడి వైఫల్యంగా అభివర్ణించారు. 'మిలిటెంట్ల హత్యలపై సంతోషం వ్యక్తం చేయకండి. ఈ హత్యలు మన పరాజయానికి, ఉమ్మడి వైఫల్యానికి ప్రతీకలు. బుర్హాన్ వనీ హత్యకు దారితీసిన పరిస్థితులేమిటి? వసీం మల్లా (వనీ అనుచరుడు. గత ఏడాది ఎన్కౌంటర్లో మృతిచెందాడు) ఒక భారతీయ పౌరుడు. షోపియన్‌లో జన్మించారు. బీఏ సెకండియర్ విద్యార్థి అయిన అతడు ఎందుకు తుపాకి పట్టాడు. భారతీయుడి గుర్తింపు కాదనుకొని.. దేశంలోని ప్రతి వ్యవస్థను ఎందుకు ద్వేషించాడు?' అని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదం లేదని, మిలిటెన్సీ మాత్రమే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని చెప్పారు. 'జమ్మూకశ్మీర్‌లోని కొంతమంది యువతకు మన వ్యవస్థ, మన పనితీరు పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. కానీ వారు కూడా మన పిల్లలే. వాళ్లు మన సొంత మనుషులు. వాళ్లు బందిపోట్లుగా, అసాంఘిక శక్తులుగా మారి ఉండొచ్చు. కానీ వారిని చంపడంలో మాకు ఎలాంటి సంతోషం ఉండదు' అని మిశ్రా వివరించారు. -
ప్రజాస్వామిక సంస్కృతిని కాపాడుకుందాం!
రెండేళ్ల క్రితం ఎన్నికలు జరిగి కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడినపుడు ఏదైతే జరుగుతుందని ఊహించామో, భయపడ్డామో, ఆందోళన చెందామో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రజాస్వామ్య సంస్కృతి, విలువలపట్ల ప్రభుత్వాలకు, వాటి అండ గల శక్తుల్లో అసహనం తారస్థాయికి చేరింది. భిన్నాభిప్రాయాలు కలిగిన వారిపై వారు చేస్తున్న బౌద్ధిక, భౌతిక దాడులకు లెక్కే లేదు. యూనివర్సిటీల నుంచి ఉడీ దాకా ‘దేశభక్తి’ పేరిట తమను వ్యతిరేకించిన అందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. గోర క్షణ నెపంతో రాజకీయాలు నడుపుతున్నారు. మతం, జాతీయత, దేశభక్తి పదాలతో వారు ప్రజలను మానసికంగా బ్లాక్మెయిల్ చేస్తున్నందువల్ల సరిహద్దుల్లోనే కాదు దేశంలోనూ యుద్ధోన్మాద విద్వేష ప్రచారం నాట్యం చేస్తోంది. మనం ఆందోళన చెందవల సింది ప్రజాస్వామ్య విలువలకు ఎదురవుతున్న ప్రమాదాన్నే. ఈ ప్రయత్నాలు జరగడం లేదని కాదు. అన్యాయమైన ఆరో పణలు ఎదుర్కొని రోహిత్ వేముల మరణించినప్పుడు హైదరా బాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెల్లుబికిన విద్యార్థి ఆందోళన అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి అన్యాయమైన జీవో ఒకటి జారీచేసి పంట పొలాల స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వం పూనుకున్నప్పుడు మల్లన్నసాగర్ రైతులు చేసిన ఆందోళన అలాంటి ప్రయత్నాల్లో ఒకటి. ఢిల్లీలోని జేఎన్ యూలోను, గుజరాత్‌లోని ఉనాలోను, చాలాకాలంగా కశ్మీర్ లోను, ఛత్తీస్‌గఢ్‌లోను జరుగుతున్న ఆందోళనలన్నీ కూడా అప్ర జాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలే. బాలగోపాల్ ఏడో వర్ధంతి సందర్భంగా అలాంటి కొన్ని ఆందోళనలలో పాల్గొన్న వ్యక్తులను వక్తలుగా ఆహ్వానించాం. జూలై 8న బుర్హాన్ వాని (22) ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ ఎంతగా రగిలిపోయిందో గత 3 నెలలుగా చూస్తూనే ఉన్నాం. 60 రోజుల కర్ఫ్యూ, 88 మంది మృతి, పెల్లెట్ గాయాలకు వందల మంది కంటిచూపు కోల్పోవడం.. ఇంత జరిగినా భారత రాజ్యా నికి, పౌర సమాజానికి కశ్మీర్ భూభాగం తప్ప మనుషులు కనబ డటం లేదు. ప్రజా ఆకాంక్షల మేరకే సరిహద్దులు ఏర్పడాలి, సమసిపోవాలి అని మాట్లాడటమే రాజ ద్రోహమై కూర్చుంది. కశ్మీర్‌ను ఎప్పటికీ సరిహద్దు తగాదాగానే చూద్దామా? అదొక నెత్తురోడుతున్న గాయంలా మనకు ఎప్పుడు కనిపిస్తుంది? ప్రస్తుత కశ్మీర్ పరిస్థితిని చెప్పేందుకు ఈ సభకు రావాల్సిన జేకేసీసీఎస్ నాయకుడు ఖుర్రం పర్వేజ్‌ను అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆయన స్థానంలో అదే సంస్థకు చెందిన జమీర్ అహ్మద్ కశ్మీర్ పరిస్థితి మీద మాట్లాడనున్నారు. ఇతరులను జాతిద్రోహులని ముద్రలు వేసే ఈ ప్రభుత్వాలు ఛత్తీస్‌గఢ్‌లో మటుకు ‘బైట’ రాష్ట్రాల మేధావులను తరిమికొట్టి, రాజపక్సే ఫార్ములాను అమలు పరచాలని చూస్తున్నాయి. ‘బైట’ రాష్ట్రాల న్యాయవా దులు అక్కడ వాదించకూ డదు. ‘బైట’ రాష్ట్రాల విలేక రులు అక్కడ ఉండి వార్తలు రాయకూడదు. పోలీసులు స్థాపించిన ‘అగ్ని’ సంస్థ మావో యిస్టులకు వ్యతిరేకంగా ‘లల్కార్’ యాత్రలు తీస్తుంది కాని సోని సోరిని మట్టుకు తిరంగా యాత్ర తీయనీయదు. దుర్గ-మహి షాసురుని కథపై తమకే గుత్త ఉన్నట్లు.. దానికి వేరే భాష్యం చెప్పిన వామపక్ష ఆదివాసీ ఉద్యమ కారుడు మనిష్ కుంజంపై కేసు పెట్టింది. కల్లోల ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం ఏమి జరుగుతున్నదో మనిష్ కుంజం మనతో పంచుకోనున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఆలోచనలకు పహారా కాస్తున్నారు. విద్యార్థులెవరూ కశ్మీర్, ఛత్తీస్‌గఢ్ గురించి మాట్లాడకూడదు. ముజఫర్‌నగర్ గురించి, అక్కడి సహాయక శిబిరాల్లో చనిపోతున్న పిల్లల గురించి మాట్లాడకూడదు. అఖ్లాక్ హత్యపై అసలే మాట్లాడ కూడదు. మాట్లాడితే రోహిత్ వేములను నెట్టినట్లే మృత్యువు నోట్లోకి నెడతారు. ఒక చేతిలో బాబాసాహెబ్ పటాన్ని, మరో చేతిలో పక్కబట్టలను పట్టుకుని వెనక్కి తిరిగి చూసుకుంటూ రోహిత్ తారలను వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. రోహిత్ నమ్మకా లను పంచుకున్న మనం రాధిక గారి కడుపుకోతను చూసి బాధప డుతున్నాం కానీ వీసీ అప్పారావు దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు ఒక్కరికీ తప్పు చేసామన్న అపరాధ భావం లేదు. ఆదివాసీలపై, పేదవారిపై, స్త్రీలపై, ప్రతి అణగారిన వర్గంపై జరుగుతున్న జులుంకి వ్యతిరేకంగా ‘హల్లా బోల్’ అంటున్న జేఎన్‌యూ ఉద్యమ విశేషాలను (బసొ) కార్యకర్త అయిన జేఎన్ యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్ వివరించనున్నారు. ప్రేమ, బాధ, జీవితం, మృత్యువు వంటి విషయాలలో సైతం మహా మొరటుగా వ్యవహరించే కుల వ్యవస్థ విషపరిష్వంగంలో కూరుకుపోయిన విశ్వవిద్యాలయాలను సంస్కరించాల్సింది ఎలాగో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కేవై రత్నం చెబుతారు. హిందుత్వవాదం మన మెదళ్లకు చుడుతున్న ఉరితాళ్లన్నిటినీ తెంచే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఊపిరి సలపడం లేదు. బాల గోపాల్ 7వ వర్ధంతి సందర్భంగా అందరం కలుద్దాం. విందాం. పరిస్థితులు మెరుగవుతాయో ఆలోచిద్దాం. అందరూ రండి. బాలగోపాల్ 7వ వర్ధంతి సందర్భంగా నేడు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా హైదరాబాద్ బాగ్‌లింగం పల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవహక్కుల వేదిక ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరుగనుంది. బాలగోపాల్ రాసిన నాలుగు పుస్తకాలు కూడా ఈ సభలో ఆవిష్కృతమవుతాయి. బాల గోపాల్ తెలుగు ఉపన్యాసాల డీవీడీ, సీడీని కూడా నేడు విడుదల చేయడం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. - వీఎస్ కృష్ణ, మానవహక్కుల వేదిక 94404 11899 -
‘కశ్మీర్లోపరిస్థితి మెరుగవుతోంది’
కశ్మీర్‌లోయలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగవుతోందని సుప్రీం కోర్టుకు కేంద్ర తెలిపింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేసిన తర్వాత జరిగిన ఆందోళనలతో పోలిస్తే.. ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందని విన్నవించింది. జూలై 9న 201 హింసాత్మక ఘటనలు జరిగితే ఆగస్టు మూడున 11 సంఘటనలు మాత్రమే నమోదు అయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు వాస్తవ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఉంచింది. లోయలోని మూడు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కర్ఫ్యూ కొనసాగుతోందని, భద్రతా దళాలు పోలీసుల నిర్విరామ కృషితో పరిస్థితి మెరుగైందని నివేదికలో సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ చెప్పారు. వనీ ఎన్కౌంటర్ తర్వాత మొత్తం 872 హింసాత్మక సంఘటనలు జరగ్గా.. 42 మంది పౌరులు, ఇద్దరు జవాన్లు మృతి చెందారని, 2656 మంది పౌరులు, 3783 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. 28 ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పుపెట్టారని, 48 కార్యాలయాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు.