Pakistan PM
-
విషెస్ చెప్పి విమర్శలపాలైన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ప్రజలకు సుద్దులు చెప్పే నేతలు తాము మాత్రం నిబంధనల్ని బేఖాతరు చేస్తూ వ్యవహరిస్తారన్న విమర్శలు నిజమని పాక్ ప్రధాని నిరూపించారు. వేర్పాటువాద శక్తులు విరివిగా ఉపయోగిస్తూ దేశంలో అస్థిరకతకు కారణమవుతున్నారని, అందుకు పరోక్షంగా కారణమైన ‘ఎక్స్’సోషల్ మీడియాపై నిషేధం విధిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. దానిని అమలుచేస్తోంది కూడా. అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయనాదం చేసిన ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘ఎక్స్’వేదికను వినియోగించుకోవడం విమర్శలకు తావిచ్చింది. స్వయంగా ప్రభుత్వాధినేతనే సొంత నిర్ణయాలకు విలువ ఇవ్వనప్పుడు ప్రజలేం పట్టించుకుంటారని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. -
పాక్ నోట మళ్లీ పాతపాట
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమతి సర్వసభ్య సమావేశంలో పాకిస్తాన్ మరోసారి కశీ్మర్ ప్రస్తావన తెచి్చంది. దీర్ఘకాలిక శాంతి కోసం భారత్ ఆరి్టకల్ 370ని పునరుద్ధరించాలని, జమ్మూకశీ్మర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్ తన సైనిక సంపత్తిని భారీగా పెంచుకుంటోందని ఆరోపించారు. ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి షరీఫ్ శుక్రవారం ప్రసంగించారు. ఆరి్టకల్ 370, హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాది బుర్హాన్ వనీల ప్రస్తావన తెచ్చారు. ‘పాలస్తీనియన్ల లాగే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా తమ స్వాతంత్య్రం, స్వీయ నిర్ణయాధికారం కోసం శతాబ్దకాలంగా పోరాడుతున్నారు’ అని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీరీల అభిమతానికి అనుగుణంగా, ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా జమ్మూకశీ్మర్పై భారత్ చర్చలకు రావాలన్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ దూరంగా జరిగిందని ఆరోపించారు. స్వీయ నిర్ణయాధికారం జమ్మూకశీ్మర్ ప్రజల ప్రాథమిక హక్కని, దానిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని భద్రతా మండలి తీర్మానాలు చెబుతున్నాయని అన్నారు. భారత్‌కు బ్రిటన్ మద్దతు ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వముండాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ మద్దతు పలికారు. భారత్ డిమాండ్‌కు అమెరికా, ఫ్రాన్స్‌లు ఇదివరకే మద్దతు పలికిన విషయం తెలిసిందే. ప్రపంచ ఐక్యవేదిక మరింత ప్రాతినిధ్యంతో, మరింత స్పందనతో కూడి ఉండాలని స్టార్మర్ ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. -
భారత్‌తో చర్చలకు సిద్ధమే: షెహబాజ్
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఇరు దేశాల్లో పేదరికం, నిరుద్యోగంతో పోరాడుతున్న నేపథ్యంలో యుద్ధం అనేది మార్గం కాదన్నారు. పాకిస్తాన్ మినరల్స్ సమ్మిట్ సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో షెహబాజ్ పాల్గొన్నారు.. ఆర్థికంగా కుదేలైన దేశంలో విదేశీ పెట్టుబడుల కోసం ఉద్దేశించిన ఈ సదస్సులో హెహబాజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ కోలుకోవడం కోసం ఇరుగు పొరుగు దేశలన్నింటితోనూ తాము మాట్లాడతామని, పొరుగు దేశంతో యుద్ధం అనేది ఇక మార్గం కాదన్నారు. భారత్‌తో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కశ్మీర్ అంశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రేరేపిస్తూ ఉండడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. -
మా పార్టీ గెలిస్తే మా అన్నే పీఎం: షెహబాజ్
ఇస్లామాబాద్: రానున్న ఎన్నికల్లో తమ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్–ఎన్) మరోసారి విజేతగా నిలిచిన పక్షంలో తన సోదరుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధానిగా పగ్గాలు చేపడతారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. లండన్‌లో గడుపుతున్న నవాజ్ çస్వదేశానికి త్వరలో వస్తారన్నారు. సాధారణ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు వీలుగా తటస్థుడిని తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేస్తామన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరనే విషయమై భాగస్వామ్య పార్టీలతోపాటు, పీఎంఎల్–ఎన్ చీఫ్ నవాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపాక నిర్ణయిస్తామని తెలిపారు. -
పతనం అంచున పాక్
‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన కశ్మీర్ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ ‘‘అణ్వాయుధాలు కలిగిన మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం కాదు’’ ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో మరో దారి లేక షరీఫ్ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్ సర్కార్ ఉంది. గోధుమల లారీని వెంబడించి.. ! పాకిస్తాన్లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు. ఇరుగు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్ నిల్వలు తరిగిపోతున్నాయి. కరాచీలో కేజీ గోధుమ పిండి రూ.160 ధర పలుకుతూ ఉండడంతో ప్రజలు కడుపు నింపుకోవడమెలాగ అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో ఒక భోజనం ఖరీదు ఏకంగా రూ.800కి చేరుకుంది. విద్యుత్ సంక్షోభంతో మార్కెట్లను, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే మూసేస్తూ ఉండడంతో జనం కూడా చేసేదేమి లేక త్వరగా నిద్రపోతున్నారు. దీంతో పాక్‌లో చీకటి పడగానే విద్యుత్ వెలుగులు లేక కారు చీకట్లోకి దేశం వెళ్లిపోతోంది. పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.200కి పైనే ఉండడంతో సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు ప్రాణావసరమైన మందులకి కూడా కొరత ఏర్పడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరాచీలో ఇన్సులిన్ లభించకపోవడంతో మధుమేహ రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఇక సైనికులకి రెండు పూటలా తిండి పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దేశంలో టాప్‌లో ఉన్న 8 తయారీ సంస్థలు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేక మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిధ దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా పాక్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరుకున్నట్టయింది. ►పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో నిల్వలు నిండుకుంటున్నాయి. స్టేట్ బ్యాంకులో 420 కోట్ల డాలర్లే ఉన్నాయి. ఇవి 25 రోజుల దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతాయి. ►విదేశీ మారక నిల్వలు 2022 జనవరిలో 1660 కోట్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి కాస్త 560 కోట్ల డాలర్లకి పడిపోయాయి. ►ఈ ఆర్థిక సంవత్సరం జనవరి –మార్చి మధ్య పాకిస్తాన్ 830 కోట్ల డాలర్ల విదేశీ అప్పులు తీర్చవలసి ఉంది. ►2022–23లో జీడీపీలో 2.8% ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2.2శాతానికి తగ్గించారు. ►2022 ఆకస్మిక వరదలు 3.8 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. దేశం విలవిలలాడింది. ► స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. ►వాణిజ్య లోటు ఒక్కసారిగా 57% పెరిగిపోయింది. అత్యవసర జాబితాలో లేని లగ్జరీ వస్తువులు 800కి పైగా రకాల వస్తువుల దిగుమతులపై నిషేధం విధించినప్పటికీ వాణిజ్య లోటు పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం పాక్ వాణిజ్య లోటు 4.866 కోట్ల డాలర్లుగా ఉంది. భారతే దిక్కా ..? పాకిస్తాన్‌కు అండదండ అందించే చైనా ఈ సారి ఆ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితులు కనిపించడం లేదు. పాకిస్తాన్ ప్రాంతంలో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టుకు సంబంధించిన భద్రతాపరమైన ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కోసం వందల కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ఇంక ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం లేదు. యూఏఈ, సౌదీ అరేబియాలు ముస్లిం దేశాలు కావడంతో పాక్‌కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. యూఏఈ 200 కోట్ల డాలర్ల సాయాన్ని చేయడానికి కూడా అంగీకరించింది. కరోనా విలయం, రష్యా, అమెరికా యుద్ధంతో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాలు కూడా సాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే భారత్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చునని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తే నిత్యావసరాలైన బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, మందులు వంటివి తీసుకురావడం అత్యంత సులభంగా మారుతుంది. వాఘా–అట్టారి, ఖోఖర్పార్–మునాబావో సరిహద్దుల నుంచి నిత్యావసర సామగ్రి తరలించడం సులభతరంగా ఉంటుందని పాక్‌లో ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పాకిస్తానేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆ దేశ వృద్ధి రేటు గతంలో వేసిన అంచనాల కంటే 2%‘ నెమ్మదిస్తుందని తెలిపింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కారణంగా దక్షిణాసియా ప్రాంత పురోగతి రేటు కూడా తగ్గిపోతోందని పేర్కొంది. పాకిస్తాన్‌ను గత ఏడాది ముంచెత్తిన వరదలే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషించింది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు 3,300 కోట్ల డాలర్లు రుణంగా వస్తే తప్ప ఆ దేశం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా దారుణ పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద ట్వీట్‌పై (152/0 VS 170/0) తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఫైనల్‌కు చేరామన్న మదంతో కొట్టుకుంటున్న పాక్ ప్రధానికి.. ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ ప్రధాని మరోసారి వంకర బుద్ధి చాటుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. So, this Sunday, it’s: 152/0 vs 170/0 🇵🇰 🇬🇧 #T20WorldCup — Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022 మీకు మాకు ఇదే తేడా.. మేము గెలిచినా, ప్రత్యర్ధి గెలిచినా మేము సంతోషిస్తాం, కానీ మీరు ఇతరుల ఓటమితో రాక్షసానందం పొందుతున్నారు.. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకుని, సొంత దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఓ రేంజ్లో చురలకలంటిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. పాక్ ప్రధానికి భారత్ అభిమానులు ఇచ్చిన కౌంటర్లతో పోలిస్తే, ఇర్ఫాన్ ఇచ్చిన ఈ కౌంటర్ మరింత స్ట్రాంగ్‌గా ఉంది. Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai. — Irfan Pathan (@IrfanPathan) November 12, 2022 దీంతో ఇర్ఫాన్ చేసిన కౌంటర్ అటాక్‌పై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా బుద్ధి చెప్పావంటూ ఇర్ఫాన్‌ను మెచ్చుకుంటున్నారు. వంకర బుద్ధి గల వ్యక్తులు నిజంగానే ఇతరుల బాధను ఎగతాలి చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ ఇర్ఫాన్ కౌంటర్ ట్వీట్‌కు మద్దతు పలుకుతున్నారు. పాక్ ప్రధానిని ఇన్ స్వింగింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి భలే బుద్ధి చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో, టీ20 వరల్డ్‌కప్-2021 గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రత్యర్ధులు చేసిన స్కోర్లను (152/0 VS 170/0) ప్రస్తావిస్తూ.. ఈ ఆదివారం 152/0 VS 170/0 అంటూ పాక్ ప్రధాని తన స్థాయి దిగజార్చుకునే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత అభిమానులు, మాజీలు తగు రీతిలో ఇప్పటికీ కౌంటర్లిస్తూనే ఉన్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి ఫైనల్ దాకా చేరిన మీకు ఇంత పొగరు పనికిరాదంటూ చురకలంటిస్తున్నారు. చదవండి: టీమిండియా ఓటమిపై పాక్ ప్రధాని ట్వీట్ వైరల్.. కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్ -
Imran Khan: నన్ను చంపజూసింది ప్రధానే
ఇస్లామాబాద్/లాహోర్: ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను చంపేందుకు కుట్ర పన్నారని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ‘‘ఆంతరంగిక శాఖ మంత్రి సనావుల్లా, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఫైసల్ నసీర్తో పాటు మరొకరికి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యముంది. వీరి పేర్లతో కూడిన వీడియోను ఇప్పటికే విదేశాలకు పంపించేశాను. నాకు జరగరానిది జరిగితే ఆ వీడియో బయటకు వస్తుంది’ అన్నారు. దుండగుడి కాల్పుల్లో తన కుడి కాలిలోకి నాలుగు బుల్లెట్లు దిగాయని చెప్పారు. చికిత్స పొందుతున్న తన సొంత షౌకత్ ఖానుమ్ ఆస్పత్రి నుంచి శుక్రవారం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 2011లో పంజాబ్ గవర్నర్‌ను చంపినట్లుగానే వజీరాబాద్‌లో తనను చంపేందుకు కుట్ర జరుగుతున్న విషయం ముందే తెలుసన్నారు. ‘‘నాపై కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉగ్రవాది కాడు. నాపై దైవదూషణ నేరం మోపారు. అధికార పీఎంఎల్ఎన్ దాన్ని ప్రచారం చేసింది. అంతా పథకం ప్రకారం జరుగుతోంది. దీని వెనుక కుట్రను ఛేదిస్తాం’’ అన్నారు. గాయం నుంచి కోలుకున్నాక పోరాటం కొనసాగిస్తానన్నారు. దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ నేతకు కూడా న్యాయం జరగడం లేదని పాక్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ బందియాల్నుద్దేశించి అన్నారు. ఇమ్రాన్ కుడి కాలి ఎముక విరిగిందని వైద్యులు చెప్పారు. ఇమ్రాన్‌పై కాల్పులను నిరసిస్తూ పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పీటీఐ కార్యకర్తలు రావల్పిండి, ఫైజాబాద్‌ల్లో భారీగా రోడ్లపై బైఠాయించారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. లాహోర్‌లో గవర్నర్ హౌస్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ ఘటనపై పోలీసులు, నిఘా అధికారులతో సంయుక్త విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ ప్రభుత్వం పంజాబ్‌ను కోరింది. ఇమ్రాన్ మాత్రమే చంపేందుకు కాల్పులు జరిపినట్లు నిందితుడు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో లీక్‌కు కారకులైన పలువురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. వారి సెల్ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. వజీరాబాద్ పట్టణంలో గురువారం పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ ర్యాలీలో దుండగుల తుపాకీ కాల్పుల్లో ఒకరు చనిపోగా ఇమ్రాన్ సహా పలువురు గాయపడిన విషయం తెలిసిందే. -
ఐరాసలో పాక్ ‘శాంతి’ మాటలు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) 77వ సమావేశాల వేదికగా భారత్‌ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు దీటుగా బదులిచ్చింది ఢిల్లీ. పొరుగుదేశాలతో శాంతిని కోరుకునేవారే అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషించరని స్పష్టం చేసింది. 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్లను ప్రస్తావిస్తూ.. శాంతి కోరుకునేవారెవరూ అలాంటి హింసాత్మక దాడులకు కుట్రలు చేసిన వారికి ఆశ్రయం ఇవ్వరని మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ 2019లో తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో శాంతి ప్రక్రియకు విఘాతం ఏర్పడిందన్నారు. భారత్ సహా అన్ని పొరుగు దేశాలతోనూ తాము శాంతిని కాంక్షిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత బృందం తొలి సెక్రెటరీ మిజిటో వినిటో పాక్‌పై నిప్పులు చెరిగారు. ‘భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు పాకిస్థాన్ ప్రధాని ఈ వేదికను ఎంచుకోవడం విచారకరం. తమ సొంత దేశంలో జరిగిన అకృత్యాలు బయటపడకుండా ఉండేందుకు, భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేస్తోన్న చర్యలను సమర్థించుకునేందుకే ఆయన ఇలా మాట్లాడారు. పొరుగుదేశాలతో శాంతిని కోరుకుంటున్నామని చెబుతున్నారు. అలాంటి వారు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. ముంబయిలో ఉగ్ర పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వరు. శాంతిని కాంక్షించేవారు.. అన్యాయంగా, అక్రమంగా పొరుగుదేశాల భూభాగాలను లాక్కోవాలని చూడరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు వినిటో. పాకిస్థాన్‌తో ఉగ్రవాద రహిత వాతావరణంలో సాధారణ పొరుగు సంబంధాలను కొనసాగించాలని భారత్ కాంక్షిస్తోందని పేర్కొన్నారు వినిటో. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగామేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని హిందూ, సిక్కు, క్రిస్టియన్ కుటుంబాల్లోని బాలికలకు బలవంతపు పెళ్లిళ్ల అంశాన్ని సూచిస్తూ.. మైనారిటీల హక్కులను కాలరాస్తున్న దేశం, అంతర్జాతీయ వేదికపై మైనారిటీల గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. శాంతి, భద్రత, పురోగతినే భారత్ కోరుకుంటోందని, అది సీమాంతర ఉగ్రవాదం సమసిపోయినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు -
పాక్ వరదలకు మరో 119 మంది బలి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల వల్ల గత 24 గంటల్లో 119 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,000 మార్కును దాటేసింది. దేశంలో జూన్ 14 నుంచి భీకర వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా దక్షిణ, నైరుతి పాకిస్తాన్లో తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,033 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1,527 మంది క్షతగాత్రులయ్యారని పాకిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) ఆదివారం ప్రకటించింది. వరదల కారణంగా 3,451.5 కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. 147 వంతెనలు దెబ్బతిన్నాయి. 170 దుకాణాలు నేలమట్టమయ్యాయి. 9.49 లక్షల ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎంతమేరకు ఆర్థిక నష్టం వాటిల్లందనేదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చెప్పారు. రూ.వందల కోట్ల నష్టం వాటినట్లు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని పాక్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. -
భారత్‌తో శాంతినే కోరుకుంటున్నాం కానీ.. కశ్మీర్‌తో ముడిపెట్టిన పాకిస్తాన్ ప్రధాని
ఇస్లామాబాద్: భారత్‌తో శాంతియుత సంబంధాలకు సిద్ధమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్ సమస్య పరిష్కారంతోనే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి నెలకొంటుందని అన్నారు. ‘యుద్ధం రెండు దేశాలకు ఎంతమాత్రం మంచిది కాదు. భారత్‌తో చర్చల ద్వారా శాశ్వత శాంతి స్థాపన జరగాలని కోరుకుంటున్నాం. అయితే, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించినప్పుడే ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సాధ్యం’అని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థుల బృందంతో ఆయన పేర్కొన్నట్లు ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ తెలిపింది. వాణిజ్యం, ఆర్థిక రంగాలతోపాటు ప్రజల జీవన స్థితిగతులను పెరుగుపరచడంలో ఇరు దేశాల మధ్య పోటీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘పాక్ దురాక్రమణదారు కాదు. మా రక్షణ వ్యయం సరిహద్దుల రక్షణ కోసమే తప్ప దురాక్రమణ కోసం కాదు’అని అన్నారు. ‘పాక్ ఆవిర్భావం తర్వాత మొదట్లో ఆర్థికంగా అన్ని రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. అనంతరం రాజకీయ అస్థిరత, సంస్థాపరమైన లోపాల కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది’అని ఆయన చెప్పారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన అనంతరం భారత్, పాక్ సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. చదవండి: అరుదైన ఘటన.. కవలలే.. కానీ కంప్లీట్ డిఫరెంట్! -
భారత్‌పై మరోమారు ఇమ్రాన్ ప్రశంసలు.. ‘జైశంకర్’ వీడియో ప్రదర్శన!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఏ దేశం ఒత్తిడికీ లొంగకుండా భారత విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉందంటూ కొనియాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలుతో భారత్‌పై పశ్చిమ దేశాలు విమర్శించటాన్ని తప్పుపడుతూ ఈ మేరకు భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. లాహోర్ జాతీయ హాకీ మైదానంలో శనివారం అర్ధరాత్రి బహిరంగ సభలో మాట్లాడారు ఇమ్రాన్ ఖాన్. అమెరికా ఒత్తిడి ఉన్నా రష్యా నుంచి తక్కువ ధరకు భారత్ చమురు కొనుగోలు చేసిందన్నారు. ‘భారత్, పాకిస్థాన్ ఒకేసారి స్వాతంత్య్రం పొందాయి. విదేశాంగ విధానం విషయంలో భారత్ ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. ఐరోపా దేశాలు రష్యా నుంచి గ్యాస్‌ను కొనుగోలు చేస్తున్నాయి. భారత ప్రజల కోసం తామూ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రశ్నించారు.’ అని పేర్కొన్నారు ఇమ్రాన్ ఖాన్. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జేశంకర్ ప్రశ్నించిన వీడియోను సభలో ప్రదర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిడికి పాకిస్థాన్ ప్రభుత్వం లొంగిపోతోందని విమర్శించారు. Former Pak PM Imran Khan plays out video clip of India's foreign minister Dr S Jaishankar during his mega Lahore Rally on Saturday, pointing out his remarks how India is buying Russian oil despite western pressure. Says, 'yeh hoti hai Azad Haqumat' pic.twitter.com/tsSiFLteIv — Sidhant Sibal (@sidhant) August 14, 2022 ఇదీ చదవండి: తైవాన్‌లో అమెరికా బృందం పర్యటనపై చైనా ఆగ్రహం -
పాక్... మరో శ్రీలంక
ఇస్లామాబాద్: శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో గంటల కొద్దీ విద్యుత్ కోతలు అమల్లో ఉండటంతో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పాకిస్తాన్ ప్రభుత్వమే ప్రజలను హెచ్చరించింది. విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని శుక్రవారం నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ (ఎన్ఐబీటీ) ట్విట్టర్లో తెలిపింది. దేశ అవసరాలకు సరిపోను ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) అందకపోవడంతో జూలైలో ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఇటీవల పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక వైపు పెరుగుతుండగా జూన్‌లో దిగుమతులు తగ్గిపోయినట్లు జియో న్యూస్ పేర్కొంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కరాచీ తదితర నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీల్లో పని గంటలను కుదించారు. ఇంధన కొరతను అధిగమించేందుకు ఖతార్‌తో చర్చలు జరుగుతున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా రెట్టింపయింది. -
Pakistan PM: థ్యాంక్స్ ‘మోదీ జీ’.. పాక్ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్తాన్ నూతన పీఎం షెహబాజ్ షరీఫ్ ఆదివారం లేఖ రాశారు. ఈ లేఖలో భారత్‌తో శాంతియుత సంబంధాలు, కశ్మీర్ సహా అపరిష్క్రత సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అయితే, పాక్‌లో అవిశ్వాస తీర్మానం తర్వాత ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఓ లేఖలో భారత ప్రధాని మోదీ.. షెహబాజ్ షరీఫ్‌కు అభినందనలు తెలిపారు. ఆ లేఖలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ నూతన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. కాగా, ఈ లేఖపై పాక్ ప్రధాని స్పందిస్తూ.. శుభాకాంక్షలు తెలిపినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. భారత్‌తో పాకిస్తాన్ శాంతియుత, సహకార సంబంధాలను కోరుకుట్టున్నట్టు తెలిపారు. అలాగే, జమ్ముకశ్మీర్‌తో సహా ఇతర వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ త్యాగం అందరికీ తెలిసిందేనని అన్నారు. శాంతి కోసం పాటుపడాలని అన్నారు. సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధి గురించి ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిన అవసరముందని షెహబాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పుల్వామా ఉగ్రదాడికి ప్రతి స్పందనగా 2019లో పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనంతరం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్తాన్‌తో భారత్ నిర్మాణాత్మక సంబంధాలను కోరుకుంటోందని ఇటీవలే స్పష్టం చేశారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. -
పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ (70) సోమవారం ఎన్నికయ్యారు. పాక్ పార్లమెంట్లో ఇమ్రాన్‌పార్టీ వాకౌట్‌తో షరీఫ్ ఎన్నికకు ఎలాంటి వ్యతిరేకతా రాలేదు. షరీఫ్ పదవీ స్వీకారానికి ముందు అధ్యక్షుడు అరీఫ్ అలీ అనారోగ్యకారణాలు చూపుతూ సెలవు పెట్టారు. దీంతో షరీఫ్‌తో సెనేట్ చైర్మన్ సాదిక్ సంజ్రానీ ప్రమాణ స్వీకారం చేయించారు. షరీఫ్ ఎన్నికతో గతనెల 8న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో మొదలైన పాక్ రాజకీయ డ్రామాకు తెరపడినట్లయిందని నిపుణులు భావిస్తున్నారు. అంతకుముందు పార్లమెంట్లో షరీఫ్‌కు 174 ఓట్లు రావడంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌కు ఆయన్ను ప్రధానిగా ప్రకటిస్తున్నట్లు స్పీకర్ అయాజ్ సిద్ధిఖీ తెలిపారు. డిఫ్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరీ పక్కకు తప్పుకోవడంతో సిద్ధిఖీ సభను నడిపించారు. ప్రధానిగా ఎన్నికయ్యేందుకు పాక్ పార్లమెంట్లో 172 ఓట్లు కావాల్సి ఉంది. అనంతరం పార్లమెంట్‌నుద్దేశించి షరీఫ్ ప్రసంగించారు. పాక్ చరిత్రలో ఒక ప్రధానికి వ్యతిరేకంగా అవిశ్వాసం విజయం సాధించడం ఇదే తొలిసారన్నారు. చెడుపై మంచి గెలిచిందన్నారు. దేశానికి ఇది శుభదినమని, ఒక ఎంచుకున్న ప్రధానిని (ఇమ్రాన్) చట్టబద్ధంగా తొలగించిన రోజని ఆయన అభివర్ణించారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు షహబాజ్ సోదరుడు. తన ఎన్నిక రోజు పాక్ రూపాయి బలపడడం ప్రజల్లో ఆనందానికి చిహ్నమన్నారు. అవిశ్వాసంపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు వచ్చిన రోజు పాక్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అంతా అబద్ధం తమ ప్రభుత్వాన్ని పడదోసేందుకు విదేశీ కుట్ర జరిగిందన్న ఇమ్రాన్ వ్యాఖ్యలు డ్రామాగా షరీఫ్ విమర్శించారు. విదేశీ కుట్ర జరుగుతోందన్న వివాదాస్పద లేఖపై పార్లమెంట్ భద్రతా కమిటీకి వివరణ ఇస్తామన్నారు. సైన్యాధికారులు, ప్రభుత్వాధికారులు, ఐఎస్ఐ చీఫ్, విదేశాంగ కార్యదర్శి, సదరు లేఖ రాసిన రాయబారి సమక్షంలోనే కమిటీ సభ్యులకు వివరిస్తామన్నారు. ఈ వివాదంలో కుట్ర ఉందని తేలితే తాను రాజీనామాకైనా సిద్ధమన్నారు. నిజానికి సదరు ఉత్తరం మార్చి 7న వచ్చిందని, కానీ తాము అవిశ్వాసా న్ని అంతకుముందే నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రపంచ రాజకీయాల్లో తమకు సహకరిస్తున్నందుకు ఆయన చైనాను ప్రశంసించారు. పీటీఐ వాకౌట్: పాక్ కొత్త ప్రధాని ఎన్నిక సమావేశాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ బహిష్కరించింది. అంతకుముందు పీటీఐ నేత, మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీ మాట్లాడుతూ పాకిస్తాన్ ముందు ఆత్మ గౌరవం, బానిసత్వం అనే రెండు దారులున్నాయని చెప్పారు. తమ పార్టీ ఎన్నికలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తోందని ప్రకటించారు. తమ పార్టీ సభ్యులంతా జాతీయ అసెంబ్లీ నుంచి రాజీనామా చేస్తారని, విదేశీ ఎజెండాతో పనిచేసే ఏ ప్రభుత్వంలో భాగస్వాములు కాబోరని మాజీ మంత్రి ఫహాద్ చౌదరీ చెప్పారు. షరీఫ్‌కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్‌కు భారత ప్రధాని మోదీ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. భారత్ ఎప్పుడూ శాంతిని, స్థిరత్వాన్ని కోరుతుందన్నారు. ఉపఖండంలో ఉగ్రవాదం ఉండకూడదన్నది భారత్ అభిలాషన్నారు. అప్పుడే అభివృద్ధిపై దృష్టి సారించగలమన్నారు. సవాళ్లు అనేకం రాజీనామా చేసిన ఇమ్రాన్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతోంది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తోంది. ఈ నేపథ్యంలో దేశ శాంతి భద్రతలను, ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాల్సిన పెను సవాళ్లు షరీఫ్ ముందున్నాయి. పార్లమెంట్లో షరీఫ్ పార్టీకి 86 సీట్లే ఉన్నాయి. పలు మిత్రపక్షాల సహకారంతో తాజా ప్రభుత్వం ఏర్పడింది. వీరిలో ఏ ఒక్కరు అలిగినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. వీరందరినీ సంతృప్తి పరచడం, నూతన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అంచనాలను అందుకోవడం కూడా షరీఫ్‌కు సవాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశంలో పలు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. విదేశాంగ శాఖ పనితీరు మసకబారింది. భారత్‌తో ఉద్రిక్తతలు సరేసరి! వీటన్నింటినీ తట్టుకొని షరీఫ్ మనుగడ సాగించాల్సిఉంది. షహబాజ్‌పై నేరారోపణ విచారణ వాయిదా ఈనెల 27కు వాయిదా వేసిన పాక్ కోర్టు లాహోర్: పాక్ కొత్త ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆయన కుమారుడు హంజాపై మనీలాండరింగ్ కేసులో నేరారోపణను పాక్ కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. ఆ రోజు వరకు వీరికి ప్రీ అరెస్టు బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. దీంతో షరీఫ్ ప్రధాని అయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టులో వ్యక్తిగత విచారణ నుంచి తనను ఒక్కరోజు మినహాయించాలని, తమ బెయిల్‌ను పొడిగించాలని అంతకుముందు షహబాజ్ వేసిన పిటిషన్‌ను ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) కోర్టు అనుమతించిందని కోర్టు అధికారి ఒకరు చెప్పారు. విచారణకు ఎఫ్ఐఏ టీమ్ న్యాయవాది హాజరుకానందున విచారణ వాయిదా పడింది. 2020లో షహబాజ్ ఆయన కుమారులు హంజా, సులేమాన్‌పై ఎఫ్ఐఏ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సులేమాన్ అప్పట్లో యూకేకు పారిపోయారు. వీరంతా కలిసి 2008–18 కాలంలో 1,400 కోట్ల పాక్ రూపాయల మేర మోసం చేశారని ఆరోపణలున్నాయి. త్వరలో పాక్‌కు నవాజ్ లండన్‌లో ఉంటున్న పాక్ మాజీ ప్రధాని, షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫ్ వచ్చేనెల్లో ఈద్ తర్వాత స్వదేశానికి వచ్చే అవకాశాలున్నాయని పీఎంఎల్ఎన్ పార్టీ నేతలు చెప్పారు. నవాజ్‌పై ఇమ్రాన్ ప్రభుత్వం పలు అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆయన చికిత్స కోసమని కోర్టు అనుమతి తీసుకొని 2019లో దేశం విడిచి లండన్ వెళ్లారు. -
తొండి ఆటతో.. హిట్ వికెట్
నాయకుడంటే ఎలా ఉండాలి? మాట తప్పకూడదు. మడమ తిప్పకూడదు ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గకూడదు ప్రధాని పీఠం ఎక్కేవరకు తూటాల్లా పేలే మాటలతో, భావోద్వేగ ప్రసంగాలతో అవినీతి నాయకులపై సమరోత్సాహంతో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ప్రధాని పదవి చేపట్టాక ఎందుకు ప్రజల ఆశలకి తగ్గట్టుగా ఉండలేకపోయారు? సమర్థుడైన క్రికెట్ కెప్టెన్‌గా పాక్‌కు ప్రపంచ కప్‌ను అందించిన ఇమ్రాన్ ఒక అసమర్థ ప్రధానిగా ప్రపంచ దేశాల్లో ఎందుకు ముద్ర పడ్డారు? మొదటి నుంచి పాటించిన ఉన్నత విలువలకు అధికారం రాగానే తిలోదకాలు ఇచ్చారు కాబట్టి.. మాట తప్పి.. ప్రధాని పదవిని నిలుపుకోవడానికి అమెరికా బూచి చూపి పాక్ ప్రజలను బురిడీ కొట్టించాలని చూశారు కాబట్టి.. క్రికెట్ నుంచి రాజకీయాల వరకు ఇమ్రాన్ ప్రస్థానం అత్యంత ఆసక్తికరమే అయినప్పటికీ అబద్ధమాడి ప్రజాదరణను కోల్పోయారు! క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్‌తో దూకుడు చూపించి పాకిస్తాన్‌కు వరల్డ్‌కప్ అందించిన సమర్థుడైన కెప్టెన్‌గా పేరుప్రతిష్టలు సంపాదించుకున్న ఇమ్రాన్‌ఖాన్ పొలిటికల్ పిచ్‌పై అవమాన భారంతో పెవిలియన్ ముఖం పట్టారు. దుందుడుకు స్వభావం, ఆవేశాన్ని అణచుకోలేని తత్వం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఆయన రాజకీయ జీవితానికి ఎదురు దెబ్బలా మారాయి. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో 1952 సంవత్సరం అక్టోబర్ 5న ఇమ్రాన్‌ఖాన్ జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ చేశారు. క్రికెట్‌పై మక్కువతో దానిపైనే దృష్టి పెట్టారు. 1976లో జాతీయ స్థాయిలో పాక్ క్రికెట్ జట్టులో స్థానం పొందారు. ఎదురులేని ఆల్‌రౌండర్‌గా ఎదుగుతూనే , తనకున్న అందమైన రూపంతో ఒక ప్లేబాయ్ ఇమేజ్ సంపాదించారు. అత్యంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ లేడీ లిజా కేంబెల్, సుసన్నా కాన్ స్టాంటైన్ వంటి మోడల్స్‌తో ప్రేమాయణం నడిపారు. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ తన వ్యక్తిగత జీవితాన్ని దాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్ స్మిత్‌ను 1995లో పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం. 2004లో విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్ రెహామ్ ఖాన్‌ను రెండోసారి పెళ్లి చేసుకున్నారు. పది నెలల్లోనే వారి బంధం ముగిసింది. ముచ్చటగా మూడోసారి తన ఆధ్యాత్మిక గురు బష్రా మనేకను పాకిస్తాన్ ప్రధాని పదవి అందుకోవడానికి కొన్ని నెలల ముందే పెళ్లాడారు రెండు సీట్ల నుంచి ప్రధాని పదవి వరకు 1992లో పాక్‌కు ప్రపంచ కప్ అందించాక క్రికెట్‌కు గుడ్‌బై కొట్టిన ఇమ్రాన్‌ఖాన్ ప్రజాసేవ వైపు మళ్లారు. 1996లో అందరికీ న్యాయం అన్న నినాదంతో పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అన్న పార్టీని స్థాపించారు.మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పీటీఐ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అవినీతికి వ్యతిరేకంగా 2008 ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్‌ఖాన్ 2011 వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకున్నారు. దేశంలో అవినీతి నేతలకు వ్యతిరేకంగా గళమెత్తి, ఉద్వేగభరితంగా చేసే ప్రసంగాలు వినడానికి జనం వెల్లువెత్తారు. ప్రధాన పార్టీలైన నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్), బేనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)ని ఢీ కొట్టి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2013 నాటికల్లా పీటీఐ 35 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధానంగా ఆయన నవాజ్ షరీఫ్ అవినీతిపైనే న్యాయపోరాటం చేసి, చివరికి ఆయనని జైలు పాలు చేశారు. 2018 ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాని పీఠం అందుకున్నారు. ప్రధానిగా ఎలా విఫలమయ్యారు ? నయా పాకిస్తాన్‌ను నిర్మిస్తానన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ గత మూడున్నరేళ్లలో కఠినమైన సవాళ్లే ఎదుర్కొన్నారు. ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడంలో విఫలమయ్యారు. ఆర్థిక వృద్ధి రేటు 3.5శాతానికి మించలేదు. ద్రవ్యోల్బణం 12 శాతానికి పరుగులు పెట్టింది. కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ నెరవేర్చలేక చేతులెత్తేశారు. దీంతో సాధారణ ప్రజల్లో ఇమ్రాన్‌పై వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రభుత్వం కంటే ఆర్మీ శక్తిమంతంగా ఉండే పాకిస్తాన్లో ఇమ్రాన్‌ఖాన్‌కి, ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో విభేదాలు ఏర్పడడంతో ఆయన పదవికి గండం ఏర్పడింది. ఐఎస్ఐ చీఫ్ జనరల్‌గా నదీమ్ అహ్మద్ అంజుమ్ నియామకం అంశంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో విపక్ష పార్టీలు ఇదే అదునుగా ఏకమై ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేశాయి. మళ్లీ పాక్‌లో సైనిక పాలన వస్తుందని భావించారు కానీ ఈసారి ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకే ఆర్మీ మొగ్గు చూపించినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పటివరకు పాకిస్తాన్ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా పూర్తి కాలం పదవిలో లేరు. అయితే సైనిక తిరుగుబాటు లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వాలు పతనమయ్యాయి. ఇమ్రాన్‌ఖాన్‌కి ఇప్పుడు అదే అనుభవం ఎదురైంది. పశ్చిమదేశాలపై ఎందుకీ ఆరోపణలు అమెరికా కుట్ర చేసి తన ప్రభుత్వాన్ని కూల్చేస్తోందంటూ ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలు పెను సంచలనంగా మారి చర్చకు దారి తీశాయి. రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన ఫిబ్రవరి 24నే ఇమ్రాన్ రష్యా పర్యటనకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకోవడం రాజకీయంగా కలకలం రేపింది. తాను రష్యా వెళ్లినందుకే అమెరికా కక్ష కట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలే ఇప్పుడు ఆయన పదవికి ఎసరు తెచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో విపక్షాలపై వ్యతిరేకత ఏర్పడడానికే ఇమ్రాన్‌ఖాన్ ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువే పోతుందని భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. అవిశ్వాస తీర్మానం ఫలితంతో సంబంధం లేకుండా పాకిస్తాన్లో గడువు కంటే ముందే ఎన్నికలు వస్తాయని అంచనాలు ఉండడంతో.. అతివాద భావజాలం ప్రబలుతున్న పాక్‌లో అమెరికా ఎదురించిన రియల్ హీరో ఇమేజ్ను సంపాదించి మళ్లీ ఎన్నికల్లో గెలవాలనేది ఇమ్రాన్‌ఖాన్ ఆలోచనగా ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. – నేషనల్ డెస్క్ సాక్షి -
ఎట్టకేలకు... ఇమ్రాన్ ఇంటికి
ఇస్లామాబాద్: నెలకు పైగా నానా మలుపులు తిరుగుతూ వచ్చిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం కథ ఎట్టకేలకు కంచికి చేరింది. పాక్ జాతీయ అసెంబ్లీలో శనివారం రోజంతా జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం అర్ధరాత్రి దాటాక అధికార సభ్యుల గైర్హాజరీలో జరిగిన ఓటింగ్‌లో 174 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దాంతో విపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడం, ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడం చకచకా జరిగిపోయాయి. అంతకుముందు జాతీయ అసెంబ్లీ వేదికగా శనివారం రోజంతా పాక్ రాజకీయాలు నానా మలుపులు తిరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తీర్మానంపై ఓటింగ్ జరిపేందుకు ఉదయం 10.30కు సమావేశమైన సభ అర్ధర్రాతి దాకా నాలుగైదుసార్లు వాయిదా పడింది. స్పీకర్ అసద్ ఖైజర్ ఉద్దేశపూర్వకంగానే ఓటింగ్‌ను జాప్యం చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. తక్షణం ఓటింగ్ చేపట్టాలని కోరాయి. కానీ ఓటింగ్‌కు స్పీకర్ ససేమిరా అన్నారు. ‘‘ఓటింగ్ జరిపి ఇమ్రాన్‌తో నా 30 ఏళ్ల బంధాన్ని తెంచుకోలేను. కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కోవాల్సి వచ్చినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ జరపబోను’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ గలాభా మధ్యే రాత్రి వేళ ఇమ్రాన్ తన నివాసంలో అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించారు. రాజీనామా చేయబోయేది లేదని స్పష్టం చేశారు. ఆయన సభకు కూడా వెళ్లలేదు. అనంతరం పాక్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 తర్వాత స్పీకర్ ఇమ్రాన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. విదేశీ కుట్రకు రుజువుగా కేబినెట్ తనకు ముఖ్యమైన పత్రాలు అందజేసిందని, వాటిని సీజేఐ, విపక్ష నేత పరిశీలించాలని కోరారు. ‘‘ఓటింగ్ జరిపి విదేశీ కుట్రలో భాగం కాలేను. రాజీనామా చేస్తున్నా’’ అని అర్ధరాత్రి 11.30కు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి కూడా ఆయన బాటలోనే నడిచారు. స్పీకర్ సూచన మేరకు విపక్ష పీఎంఎల్ (ఎన్)కు చెందిన ప్యానల్ చైర్మన్ అయాజ్ సాదిక్ అధ్యక్షతన అర్ధరాత్రి 11.45కు ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. 11.50కి అధికార పీటీఐకి చెందిన 156 మంది ఎంపీలూ సభ నుంచి వెళ్లిపోయారు. సభ నిబంధనల మేరకు 11.58కి సభను మర్నాటికి వాయిదా వేశారు. నాలుగు నిమిషాల అనంతరం అర్ధరాత్రి 12.02కు సభ తిరిగి సమావేశమైంది. అనంతరం మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు స్వీకరిస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. తర్వాత తలుపులన్నీ మూసేసి ఓటింగ్ చేపట్టారు. 12.10కి ఓటింగ్ జరిగింది. 342 మంది సభ్యులున్న సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే విపక్షాలకు కనీసం 172 మంది మద్దతు అవసరం. రాత్రి ఒంటిగంటకు 174 మంది అనుకూలంగా ఓటేయడంతో తీర్మానం సులువుగా గట్టెక్కింది. అంతకుముందు, శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటింగ్ జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఇమ్రాన్ కావాలనే ధిక్కరిస్తున్నారంటూ విపక్షాలు మరోసారి కోర్టు తలుపు తట్టాయి. ఇమ్రాన్ దేశం విడిచిపోకుండా చూడాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు ప్రధా న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ శనివారం అర్ధరాత్రి 12 తర్వాత కోర్టును సమావేశపరచాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. పూర్తిస్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరుపుతామని ప్రకటించారు. ఈలోపు పరిస్థితులు మారి పరిణామాలు ఓటింగ్‌కు దారి తీశాయి. భారత్‌కే వెళ్లిపో... ఇమ్రాన్‌పై విపక్షాల ధ్వజం భారత్‌ను ప్రశంసిస్తూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలపై అక్కడి విపక్షాలు మండిపడ్డాయి. భారత్ అంతగా నచ్చితే అక్కడికే వెళ్లిపోవాలని పీఎంఎల్ (ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం అన్నారు. భారత్ సిసలైన సార్వభౌమ దేశమని, ఏ అగ్రరాజ్యం కూడా దాన్ని శాసించలేదంటూ ఇమ్రాన్ ప్రశంసించడం తెలిసిందే. ‘‘అవిశ్వాస తీర్మానాల విషయంలో కూడా భారత్‌ను అనుసరించు. అక్కడి ప్రధానులు 27 దాకా అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొన్నారు. వాజ్‌పేయి వంటివారు కేవలం ఒక్క ఓటుతో ఓడి హుందాగా తప్పుకున్నారు. అంతే తప్ప నీలా ఎవరూ ప్రజాస్వామ్యంతో, రాజ్యాంగంతో, విలువలతో ఇష్టానికి ఆడుకోలేదు’’ అని ఆయన్నుద్దేశించి మరియం అన్నారు. ‘‘ఇమ్రాన్ ఓ సైకో. ఆయనకు పిచ్చెక్కింది’’ అంటూ మండిపడ్డారు. -
Pakistan PM: ఓ పవర్ఫుల్ దేశం భారత్‌కు అండగా ఉంది..
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్‌లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకు ముందు తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వెనుక అమెరికాతో సహా ఇతర దేశాల కుట్ర ఉందంటూ పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి ఇమ్రాన్ వార్తల్లో నిలిచారు. ఇస్లామాబాద్‌లో శుక్రవారం భద్రతపై ఓ సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘ నేను రష్యా పర్యటనకు వెళ్లడం వల్లే అమెరికా నాపై తీవ్ర కోపాన్ని పెంచుకుంది. తప్పు అంతా పాకిస్థాన్‌దే.. ప్రతిపక్షాల కారణంగా ప్రపంచ పటంపై పాక్ బలహీనపడింది. మేము అన్ని దేశాలను గౌరవిస్తాం.. కానీ.. ఓ దేశాన్ని మరో దేశం బెదిరించవచ్చా?. భారత్‌కు ఓ పవర్ ఫుల్ దేశం మద్దతిస్తూ మాట్లాడింది. ఇండియా ఓ స్వతంత్ర దేశం, భారత్‌కు ఏమీ చెప్పలేమని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి అన్నారు. అయితే, భారత్‌కు మద్దతు ఇచ్చినందుకు నాకేమీ బాధలేదు. పాకిస్తాన్ నేతల వల్లే సమస్య’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దానికి సంబంధించిన లేఖ కూడా ఉందంటూ చేసిన వ్యాఖ్యలను అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండించారు. ఇమ్రాన్ చెబుతున్నట్లుగా పాకిస్థాన్‌కు తమ ప్రభుత్వ సంస్థలు గానీ, అధికారులు గానీ ఎలాంటి లేఖ పంపలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్లో తాజా పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అమెరికా ప్రభుత్వాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. అయితే, గురువారం దిగువ సభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ‘గో ఇమ్రాన్ గో’ అంటూ నినాదాలు చేశారు. శాంతించాలంటూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను ఆదివారం ఉదయం 11.30 వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరుగనుంది. ఇది చదవండి: భారత్‌కు బంపర్ ఆఫర్.. టెన్షన్లో అమెరికా..? -
ఇమ్రాన్ అవుట్! పాకిస్తాన్ కొత్త ప్రధాని ఆయనేనా.. ఎవరీ షాబాజ్ షరీఫ్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ చివరి దశకు చేరుకుంది. ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ, మిత్రపక్షం నుంచి కూడా ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా మద్దతివ్వడంతో ఆయన గద్దె దిగిపోవడం దాదాపు ఖరారు అయిపోయింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పాక్ జాతీయ అసెంబ్లీలో ఏప్రిల్ మూడో తేదీన చర్చ జరుగనుంది. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఇమ్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందే. ఇతర పార్టీల నుంచి కొత్త ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పాక్ నేషనల్ అసెంబ్లీకి ఆగస్టు 2023 వరకు గడువు ఉండటంతో అప్పటి వరకు కొత్త ప్రధాని పాలించవచ్చు. లేదా తాజాగా ఎన్నికలను నిర్వహించాలని కూడా కోరవచ్చు. మరి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని నుంచి దిగిపోతే.. తదుపరి ప్రధాని ఎవరనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్, నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటున్నారు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. చివరి బంతి వరకూ పోరాడతానని సవాల్ చేస్తున్నారు. చదవండి: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన ఎవరీ షాబాజ్ షరీఫ్? పాకిస్థానీ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షాబాజ్ షరీఫ్. 1988లో రాజకీయల్లోకి వచ్చిన ఆయన పంజాబ్ సీఎంగా మూడు సార్లు బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారు. భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తిచేయడంలో దిట్టగా పేరుంది. చైనా, టర్కీలతో విదేశీ వ్యవహారాలను నడపడంలో షాబాజ్‌కు మంచి పేరుంది. 1997లో మొదటిసారిగా పంజాబ్ ప్రావిన్స్‌కి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో సైనిక తిరుగుబాటు జరిగిన సమయంలో ఎనిమిదేళ్ల పాటు సౌదీ అరేబియాలో ప్రవాసం జీవితం గడిపారు. 2007లో తిరిగి పాకిస్థాన్‌కు వచ్చారు. 2008 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధించడంతో మళ్లీ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో పీఎంఎల్(ఎన్) ఓడిపోయింది. తర్వాత నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నామినేట్ అయ్యారు. 2019లో పాక్ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్ఏబీ) షాబాజ్‌కు చెందిన 28 ఆస్తులను జప్తు జేసింది. ఇదే కేసులో 2020, సెప్టెంబర్‌లో ఆయనను ఎన్ఏబీ అరెస్ట్ చేసింది. ఏడు నెలల తర్వాత లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2021, ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాసంతో ప్రధాని పదవి రేసులోకి దూసుకొచ్చారు. -
మెజారిటీ కోల్పోయిన ఇమ్రాన్ సర్కార్
-
చివరి బంతి వరకూ పోరాడుతా..
ఇస్లామాబాద్: పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని కచ్చితంగా ఎదుర్కొంటానని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(69) సంకేతాలిచ్చారు. ఆయన గురువారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఫలితంతో సంబంధం లేకుండా బలీయమైన శక్తిగా తిరిగి వస్తానని చెప్పారు. రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, అసలు ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. తాను క్రీడాకారుడినని, 20 ఏళ్లపాటు క్రికెట్ ఆడానని, చివరి బంతి వరకూ పోరాడుతూనే ఉంటానని అందరికీ తెలుసని చెప్పారు. జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదని చెప్పారు. తమ విధానాలు అమెరికాకు, యూరప్‌కు, భారత్‌కు వ్యతిరేకం కాదని అన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని భారత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని విమర్శించారు. భారత్–పాక్ మధ్య ఉన్న అతిపెద్ద వివాదం కశ్మీర్ అంశమేనని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాతే భారత్‌కు పాక్ వ్యతిరేకంగా మారిందన్నారు. అవినీతిపరులు కావాలా? పాకిస్తాన్‌పై విదేశీ శక్తుల పెత్తనాన్ని సహించే ప్రసక్తే లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. కొందరు పాక్ ప్రతిపక్ష నేతలు విదేశీ శక్తులతో అంటకాగుతున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, అధికారం కోసం దేశాన్ని అమ్మేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధ్యక్షుడు షెహజాద్ షరీఫ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో–చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ, జామియత్ ఉలెమా–ఇ–ఇస్లామా నేత మౌలానా ఫజలుర్ రెహ్మాన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. కుట్రదారుల ఆటలు సాగవని హెచ్చరించారు. పాకిస్తాన్ ప్రయాణం ఎటువైపు అన్నది అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ తర్వాత తేలిపోతుందని వ్యాఖ్యానించారు. నోరుజారిన ఇమ్రాన్ తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలో భాగంగా అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు లేఖ పంపిందని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కేవలం విదేశాల కుట్ర అని ఆరోపిస్తున్న ఆయన పొరపాటున అమెరికా పేరును బయటపెట్టారు. ఆ లేఖ కేవలం తనకు వ్యతిరేకంగా ఉందని, తన ప్రభుత్వానికి కాదని చెప్పారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో ప్రధాని 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్)లో అవిశ్వాస తీర్మాన పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ నెగ్గాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, తమకు 175 మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ప్రతిపక్ష కూటమి చెబుతోంది. పాకిస్తాన్ చరిత్రలో ఇప్పటిదాకా ఇద్దరు ప్రధానమంత్రులు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఎవరూ ఈ తీర్మానంలో ఓడిపోలేదు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ రికార్డుకెక్కారు. పాక్ పార్లమెంట్ 3కు వాయిదా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) సెషన్ అనూహ్యంగా ఆదివారానికి వాయిదా పడింది. గురువారం దిగువ సభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ‘గో ఇమ్రాన్ గో’ అంటూ నినాదాలు చేశారు. శాంతించాలంటూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి చేసిన వినతిని వారు పట్టించుకోలేదు. దీంతో సభను ఆదివారం ఉదయం 11.30 వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై ఆదివారం ఓటింగ్ జరుగనుంది. పాక్‌కు ఎలాంటి లేఖ పంపలేదు: అమెరికా తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వెనుక అమెరికాతో సహా ఇతర దేశాల కుట్ర ఉందంటూ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఖండించారు. ఇమ్రాన్ చెబుతున్నట్లుగా పాకిస్తాన్‌కు తమ ప్రభుత్వ సంస్థలు గానీ, అధికారులు గానీ ఎలాంటి లేఖ పంపలేదని పేర్కొన్నారు. పాకిస్తాన్లో తాజా పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అమెరికా ప్రభుత్వాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని హితవు పలికారు. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చిచెప్పారు. జాతీయ అసెంబ్లీ రద్దుకు తెరవెనుక ముమ్మర యత్నాలు 342 సభ్యులున్న జాతీయ అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన పరువు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలతో రాజీకోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. జాతీయ అసెంబ్లీ రద్దు కోసం ప్రతిపక్షాలతో ఒప్పందం కుదుర్చుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై అధికార తెహ్రిక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం, ప్రతిపక్షాల నడుమ చర్చలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్షాలు ఉపసంహరించుకోవడం, అందుకు ప్రతిఫలంగా పార్లమెంట్‌ను రద్దు చేసి, మళ్లీ తాజాగా ఎన్నికలకు వెళ్లడం.. ఇదే ఈ చర్చ ఏకైక ఎజెండా అని వెల్లడించాయి. అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రతిపాదన పట్ల ప్రతిపక్షాలు అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇమ్రాన్ ప్రభుత్వం కూలిపోయి, ఎన్నికలు రావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్‌కు ‘సేఫ్ ప్యాకేజీ’ ఇవ్వొద్దని ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో గురువారం అన్నారు. పార్లమెంట్లో మెజారిటీని కోల్పోయిన ఇమ్రాన్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. -
క్లీన్ బోల్డ్
-
హ్యాండ్ ఇచ్చిన ఆర్మీ.. ఇమ్రాన్ ఖాన్ ఆశలు గల్లంతు
Pakistan Political Turmoil: నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హడావిడిగా శనివారం అంతా పాక్ కీలక విభాగాలతో భేటీ అయ్యాడు. ఇందులో భాగంగా.. ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బజ్వా జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి వస్తే.. సాయం చేయాలని ఇమ్రాన్ ఖాన్ కోరగా, అందుకు పాక్ ఆర్మీ విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ భేటీలో ఆర్మీ చీఫ్, ఇమ్రాన్ ఖాన్‌కు రాజీనామా సలహానే ఇచ్చినట్లు తెలుస్తోంది. అవిశ్వాసంలో గనుక ఓడితే.. ఈ నెలాఖరులో జరిగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇది ఇస్లామిక్ కో ఆపరేషన్ (OIC) తర్వాత పదవికి రాజీనామా చేయాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్‌తో.. ఆర్మీ ఛీప్ ఖనార్ జావెద్ బజ్వా చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో బజ్వాతో పాటు ముగ్గురు సీనియర్ లెఫ్టినెంట్ జనరల్స్, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) డీజీ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. అంతేకాదు బజ్వాతో పాటు మిగిలిన మిలిటరీ అధికారులు కూడా ఇమ్రాన్ ఖాన్‌తో గద్దె దిగిపోమనే సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఖాన్‌కు దారులన్నీ మూసుకుపోయాయి. ప్రభుత్వం గనుక కూలిపోయే పరిస్థితి వస్తే సైన్యం సాయం తీసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ భావించాడు. అంతకు ముందు ఆర్మీ మాజీ ఛీఫ్ రహీల్ షరీఫ్.. బజ్వాతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఇమ్రాన్ ఖాన్ తరపున రాయబారం నడిపే ప్రయత్నం చేశాడు. కానీ, రహీల్ దౌత్యాన్ని సైతం పాక్ ఆర్మీ ఛీ కొట్టిందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం దగ్గరపడిందనే సంకేతాలు అందాయి. అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కించాలంటూ ప్రధాని వారిని కోరినా తామేమీ చేయలేమంటూ వారు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అవిశ్వాస తీర్మానంతో పాటు ఓఐసీ సమ్మిట్, బెలూచిస్థాన్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇక ఈ భేటీపై పీటీఐ నేతలు గంపెడు ఆశలు పెట్టుకోగా.. ఫలితం ఇలా రివర్స్ రావడంతో అసంతృప్తిలో కూరుకుపోయారని క్యాపిట్ టీవీ కథనం ప్రసారం చేసింది. మొదటి నుంచి పాక్ ప్రభుత్వాన్ని నియంత్రించే పనిలో ఆర్మీ ఉంటోంది. ప్రతిపక్ష నేతలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దంటూ ఆర్మీ ఛీఫ్ బజ్వా మొదటి నుంచి పీటీఐ నేతలకు చెబుతున్నా.. స్వయంగా ఇమ్రాన్ ఖానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడం విశేషం. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో సతమతమవుతున్న దేశం.. ఇప్పుడీ రాజకీయ సంక్షోభంతో మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆర్మీ. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా, యూరోపియన్ యూనియన్ పై అనవసర వ్యాఖ్యలు చేశారంటూ ఇమ్రాన్ పై ఆర్మీ గుర్రుగా ఉంది. ఇప్పటికే సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ కే చెందిన 24 మంది నేతలు.. ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ దిగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. చదవండి: సొంత పార్టీలోనే తిరుగుబాటు.. ఎందుకు? -
అమెరికాపై నిప్పులు చెరిగిన ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: అగ్రరాజ్యం అమెరికాపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. వ్యూహాత్మక లక్ష్యాలు సాధించుకొనేందుకు పాకిస్తాన్‌ను ఉపయోగించుకోవడం, అవసరం తీరాక పక్కన పెట్టేయడం, పైగా ఆంక్షలు విధించడం అమెరికాకు అలవాటుగా మారిపోయిందని దుయ్యబట్టారు. ‘మిత్ర’ దేశం చైనా తమకు అండగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరీక్షా సమయంలో చైనా తమను ఆదుకుంటోందని అన్నారు. చైనా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడాన్ యూనివర్సిటీ సలహా కమిటీ డైరెక్టర్ ఎరిస్ లీకి ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వివరాలను న్యూస్ ఇంటర్నేషన్ పత్రిక శుక్రవారం బహిర్గతం చేసింది. ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ బదులిస్తూ.. గతంలో అమెరికాతో పాకిస్తాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉండేవని చెప్పారు. ఇప్పుడు పాక్ అవసరం లేదని అమెరికా భావిస్తోందని, అందుకే దూరం పెడుతోందని పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడల్లా మళ్లీ తమ దేశానికి దగ్గర కావడం అగ్రరాజ్యం విధానమని అన్నారు. అవసరం తీరాక తమవైపు కన్నెత్తి కూడా చూడదని ఆక్షేపించారు. 1980వ దశకంలో పాక్–యూఎస్ సంబంధాలను ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. అప్పట్లో సోవియన్ యూనియన్ సైనిక దళాలు అఫ్గానిస్తాన్‌లో అడుగుపెట్టాక అమెరికా తమ దేశంతో చేతులు కలిపిందన్నారు. సోవియట్ యూనియన్ను అడ్డుకోవడానికి పాకిస్తాన్‌ను వాడుకుందని తెలిపారు. అఫ్గాన్ నుంచి సోవియట్ యూనియన్ సైన్యం వెనక్కి వెళ్లిపోయాక పాక్‌పై అమెరికా ఆంక్షలు విధించిందని మండిపడ్డారు. సెప్టెంబర్ 11(9/11) దాడుల అనంతరం పాక్–అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని గుర్తుచేశారు. గత ఏడాది చోటుచేసుకున్న అఫ్గానిస్తాన్ పరిణామాల తర్వాత తమ దేశాన్ని ఆమెరికా నిందిస్తోందని తప్పుపట్టారు. చైనా–పాకిస్తాన్ గత 70 ఏళ్లుగా పరస్పరం చక్కగా సహకరించుకుంటున్నాయని ఇమ్రాన్ ఖాన్ ఉద్ఘాటించారు. -
సిద్ధూను మంత్రిని చేయమని పాక్ కోరింది: అమరీందర్ సింగ్
న్యూఢిల్లీ: నవజోత్ సింగ్ సిద్ధూను మంత్రిగా తొలగించిన తర్వాత తిరిగి ప్రభుత్వంలోకి తీసుకోవాలని తనకు పాకిస్తాన్ నుంచి సందేశం వచ్చిందని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఆరోపించారు. సిద్ధూ తమ ప్రధానికి పాత స్నేహితుడని, అందువల్ల ఆయన్ను తిరిగి పదవిలోకి తీసుకోవాలని తనను కోరారన్నారు. ఈ విషయమై స్పందించేందుకు సిద్ధూ నిరాకరించారు. సిద్ధూకు పదవినిస్తే ఇమ్రాన్ ఖాన్ సంతోషిస్తారని తనకు చెప్పారని అమరీందర్ తెలిపారు. అయితే సిద్ధూ అసమర్ధుడనే తాను తొలగించానని, 70 రోజులు పదవీలో ఉండి ఆయన కనీసం ఒక్క ఫైలును చూడలేదని దుయ్యబట్టారు. తర్వాత తనకు పాకిస్తాన్ నుంచి రాయబారాలు వచ్చాయని చెప్పారు. రెండోమారు పదవి ఇచ్చాక పనితీరు కనబరచకపోతే అప్పుడు తొలగించమని తనను పాకిస్తాన్ వర్గాలు కోరాయన్నారు. అయితే ఎవరి నుంచి ఈ సందేశం వచ్చిందో చెప్పలేదు. సరిహద్దు అవతల నుంచి భారీగా భారత్‌లోకి ఆయుధాలు అక్రమంగా వస్తున్నాయని అమరీందర్ ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: Yogi Adityanath: ఆయనొక క్రౌడ్ పుల్లర్.. మాటలు తూటాల్లా పేలుతాయ్.. అక్రమ ఇసుక మైనింగ్‌తో సంబంధం ఉన్న ఎంఎల్ఏలకు సిద్ధూ ఆశ్రయమిచ్చాడని అమరీందర్ ఆరోపించారు. ఇందులో సిద్ధూ సొంత ప్రయోజనాలున్నాయన్నారు. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడిని కోరితే ఆయన నిరాకరించడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనపై సిద్దూ ఆరోపణలు గుప్పించడం చూస్తే, ఆయన ఎంత అభద్రతా భావనతో ఉన్నారో అర్ధమవుతోందన్నారు. చదవండి: ఓబీసీ నేతల జంప్.. కీలకంగా మారిన కేశవ్ ప్రసాద్.. యోగి లేకుంటే సీఎం అయ్యేవారే! -
పాక్ ప్రధానికి పదవీ గండం..!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు పదవీ గండం తప్పేలా లేదు. ఇటీవలి కాలంలో ఆర్మీ, ఇమ్రాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ప్రజల్లో ఇమ్రాన్ పలుకుబడి కూడా తగ్గిపోయింది. అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీలు మద్దతు వెనక్కి తీసుకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే నవాజ్ షరీఫ్‌ను తిరిగి తెరపైకి తెచ్చేందుకు సైన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. తన అవసరం పాకిస్తాన్‌కు ఎంతో ఉందనీ, త్వరలోనే తిరిగి అక్కడికి వెళతానని ఇటీవల ఆయన అన్నట్లు ‘సీఎన్ఎన్–న్యూస్18’ తెలిపింది. అవినీతి కేసుల్లో 2019లో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు పదేళ్ల జైలుశిక్ష వేసింది. అనంతరం అనారోగ్య కారణాలతో ఆయన లండన్ వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. త్వరలోనే ఆయన స్వదేశానికి చేరుకుంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.