ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు పదవీ గండం తప్పేలా లేదు. ఇటీవలి కాలంలో ఆర్మీ, ఇమ్రాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ప్రజల్లో ఇమ్రాన్ పలుకుబడి కూడా తగ్గిపోయింది. అధికార కూటమిలోని రెండు ప్రధాన పార్టీలు మద్దతు వెనక్కి తీసుకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే నవాజ్ షరీఫ్‌ను తిరిగి తెరపైకి తెచ్చేందుకు సైన్యం ప్రయత్నాలు ప్రారంభించింది.
తన అవసరం పాకిస్తాన్‌కు ఎంతో ఉందనీ, త్వరలోనే తిరిగి అక్కడికి వెళతానని ఇటీవల ఆయన అన్నట్లు ‘సీఎన్‌ఎన్–న్యూస్18’ తెలిపింది. అవినీతి కేసుల్లో 2019లో ఆయనకు ఇస్లామాబాద్ హైకోర్టు పదేళ్ల జైలుశిక్ష వేసింది. అనంతరం అనారోగ్య కారణాలతో ఆయన లండన్ వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. త్వరలోనే ఆయన స్వదేశానికి చేరుకుంటారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment