ఫేక్‌ ట్వీట్‌తో దొరికిపోయిన ఇమ్రాన్‌ | Pakistan PM Imran Khan Shares Fake Video Of India Violence | Sakshi
Sakshi News home page

ఫేక్‌ ట్వీట్‌తో దొరికిపోయిన ఇమ్రాన్‌

Published Sat, Jan 4 2020 4:02 AM | Last Updated on Sat, Jan 4 2020 4:02 AM

Pakistan PM Imran Khan Shares Fake Video Of India Violence - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ లోని ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం అని ఒక నకిలీ వీడియోను ట్వీట్‌ చేసి పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నెటిజన్లకు దొరికిపోయారు. ఆ వీడియో 2013 బంగ్లాదేశ్‌ లోని ఢాకాలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అని నెటిజన్లు వెల్లడించి, ట్రోల్‌ చేయడంతో ఆ ట్వీట్‌ను, వీడియోను ఆయన తొలగించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ స్పందించారు. ‘నకిలీ వార్తలను ట్వీట్‌ చేయండి.. దొరికిపోండి.. ఆ ట్వీట్‌లను డిలీట్‌ చేయండి.. మళ్లీ రిపీట్‌ చేయండి’ అని రవీశ్‌ శుక్రవారం వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement