అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!! | World Braille Day Is Birth Anniversary Of Louis Braille | Sakshi
Sakshi News home page

అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!

Published Tue, Jan 4 2022 10:02 AM | Last Updated on Tue, Jan 4 2022 10:03 AM

World Braille Day Is Birth Anniversary Of Louis Braille - Sakshi

చదవడం, వ్రాయడం అనేవి రెండు కూడా ప్రజలు నేర్చుకోగల అత్యంత ఉపయోగకరమైన ముఖ్యమైన విషయాలు . అంతేకాదు ఇవి రెండే మానవులు విద్యనభ్యసించడానికి ఉపకరించే అత్యం తముఖ్యమైన సాధనాలు. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అంధులు ఉన్నారు. వారు విద్యనభ్యసంచాలంటే ఎలా అనేదానికి సమాధానమే ఈ బ్రెయిలీ లిపి. లక్షలాది మంది అంధులు మంచి విద్యనభ్యసించి వారు జీవితంలో విజయాలను సాధించేందుకు వీలు కల్పించిన పద్ధతి. బ్రెయిలీ అనేది అంధుల కోసం కనుగొన్న వ్రాతపూర్వక భాష  రూపం. దీనిలో అక్షరాలను వేలికొనలతో  గుర్తుపట్టేగలిగే విధంగా ఎత్తైన చుక్కల నమూనా.

బ్రెయిలీ  డే ప్రాముఖ్యత

  • అంధులకు, దృష్టిలోపం ఉన్నవారికి కమ్యూనికేషన్ సాధనంగా ఉన్న బ్రెయిలీ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకే ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృష్టి లోపం ఉన్నవారు బ్రెయిలీలో చదివి వ్రాస్తారు. దృష్టి లోపం లేని వ్యక్తులు కళ్ళతో బ్రెయిలీని చదవగలరు.
  • వివిధ భాషలలో వర్ణమాల క్రమాన్ని బట్టి విలువలు బ్రెయిలీ చిహ్నాలకు కేటాయించబడతాయి. చాలా బ్రెయిలీ వర్ణమాలలు 26 అక్షరాల లాటిన్ వర్ణమాలకు చెందిన ఫ్రెంచ్ సార్టింగ్ క్రమాన్ని అనుసరిస్తాయి. జపనీస్,  కొరియన్ బ్రెయిలీ ఇతర బ్రెయిలీ ట్రాన్స్క్రిప్షన్ల నుండి చాలా భిన్నంగా ఉంటాయి.
  • అంతేకాదు బ్యాంకులు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు వంటి అనేక సంస్థలు ఇప్పటికీ తమ ప్రింటెడ్ మెటీరియల్‌లో బ్రెయిలీ వెర్షన్‌లను అందించనందున ఈ రోజు దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు స్వేచ్చయుతం జీవించడానికి మన వంతుగా అందించాల్సిన సహాయ సహకారాలను గురించి వివరిస్తుంది.

ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు....

  • జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని యునైటెడ్‌ నేషనల్‌ జనరల్ అసెంబ్లీ నవంబర్ 2018లో ప్రకటించింది. మొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జనవరి4, 2019న జరుపుకున్నారు.

జనవరి 4న ఎందుకంటే..

  • 1809లో బ్రెయిలీని కనిపెట్టిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ జన్మదినం అయిన జనవరి 4న పురస్కరించుకుని బ్రెయిలీ దినోత్సవంగా  జరుపుకుంటున్నారు.

లూయిస్ బ్రెయిలీ ఎవరు? 

  • లూయిస్ బ్రెయిలీ  ఫ్రెంచ్ విద్యావేత్త. అతను కనిపెట్టిన బ్రెయిలీ లిపి వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అంధులకు చదవడానికి విస్తృతంగా ఉపయోగించే మాధ్యమంగా ఉంది. లూయిస్ బ్రెయిలీకి మూడేళ్ల వయసులో తన తండ్రి జీనులు తయారు చేసే దుకాణంలో కుట్టుపని చేస్తున్నప్పుడు ప్రమాదంలో ఒక కన్ను పోయింది. అయితే కొన్నాళ్లకు ఇన్ఫెక్షన్‌ ఏర్పడి రెండు కళ్లకు వ్యాపించి పూర్తిగా అంధత్వం ఏర్పడింది. కానీ అతను అన్ని సవాళ్లను అధిగమించి విద్యలో రాణించాడమే కాకుండా కొత్త పద్ధతిలో త్వరగా చదవడం, కమ్యూనికేట్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. అంతేకాదు అందుల కోసం బ్రెయిలీని కనిపెట్టాడు.

బ్రెయిలిని అనేది నైట్ రైటింగ్ అనే స్పర్శ కోడ్‌...

  • అయితే ఈ వ్యవస్థ రాత్రిపూట ఎటువంటి కాంతి వనరులు లేకుండా సైనికులు నిశ్శబ్దంగా కమ్యూనికేట్ చేయడానికి నెపోలియన్ ఆదేశాల మేరకు చార్లెస్ బార్బియర్ చేత అభివృద్ధి చేయబడిన నైట్ రైటింగ్ అనే స్పర్శ సైనిక కోడ్‌. అంతేకాదు లూయిస్‌ బార్బియర్‌ నైట్ రైటింగ్' గురించి తెలుసుకున్నాడు. దీన్ని ఆధారంగా చేసుకునే బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు. అయితే లూయిస్‌  క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు గురువుగారి అంధుల లిపికి గుర్తింపునివ్వాలని పోరాటాలు చేయగా.. బ్రెయిలీ లిపికి గుర్తింపు నిచ్చి.. దేశ ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్. నేటికీ అంధులకు అన్నిరకాల పత్రికలు, పుస్తకాలు బ్రెయిలీ లిపిలోనే రూపొందిస్తున్నారు. 

లూయిస్‌ పేరు మీద స్టాంపులు

  • బ్రెయిలీ కనిపెట్టిన అంధుల లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా రూపొందించబడిందంటే ఆయన ముందుచూపు ఏమిటో అర్థమవుతుంది. లూయిస్ చనిపోయాక ఆయన పేరు మీద స్టాంపులు, కరెన్సీ, విద్యాసంస్థలు, పట్టణాలు వెలిశాయి. భారతదేశం 2 రూపాయల నాణెం మీద, యుఎస్ డాలర్ మీద బ్రెయిలీ ముఖచిత్రాన్ని ప్రచురించారు.  ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటయ్యే పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశాయి.

(చదవండి: worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement