louis braille
-
World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది?
అంధులు.. దృష్టిదోషమున్నా మనసుతో లోకాన్ని చూసేవారు. ఊహలతో, ఊసులతో ప్రపంచాన్ని వీక్షించేవారు. వీరు సమాజంతో సంబంధాలు నెరవేర్చేందుకు ఏర్పడినదే బ్రెయిలీ లిపి. ఇది అంధులకు వరంలాంటిదని చెప్పుకోవచ్చు.ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతీఏటా జనవరి 4న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో జీవితం గడుపుతున్న వారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. లూయిస్ బ్రెయిలీ అనే మహనీయుని పుట్టినరోజు సందర్భంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈయనే బ్రెయిలీ లిపిని ఆవిష్కరించారు. బ్రెయిలీ లిపి అనేది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయోగించే భాష. పుట్టుకతోనో, లేదా ఇతరత్రా కారణాలతో కంటి చూపు కోల్పోయిన వారు చదువుకు దూరమవకుండా ఉండేందుకే ఈ బ్రెయిలీ లిపిని రూపొందించారు. అంధత్వంతో బాధపడుతున్న వారు తమ స్వశక్తితో సమాజంలో ఇతరులతో సమానంగా నిలిచేందుకు బ్రెయిలీ లిపి దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా దృష్టిలోపంతో సతమతమవుతున్నవారికి లూయిస్ బ్రెయిలీ తన ఆవిష్కరణతో మార్గదర్శిగా నిలిచారు. లూయీస్ బ్రెయిలీ జీవించి ఉన్నప్పుడు దక్కని గౌరవం అతని మరణాంతరం దక్కింది. ఆయన పుట్టినరోజును ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరపుకోవడమే ఆయనకు దక్కిన అత్యున్నత గౌరవం.లూయిస్ బ్రెయిలీ 1809, జనవరి 4న ఫ్రాన్స్‌లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు సైమన్ రాలీ బ్రెయిలీ. అతను నాటిరోజుల్లో రాజ గుర్రాలకు జీనులు తయారు చేసేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో లూయిస్ తన మూడేళ్ల వయసు నుండే తన తండ్రితో కలిసి పని చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో ఒక కత్తి అతని ఒక కన్నుకు గుచ్చుకుని, అతని చూపు దెబ్బతింది. కొద్దికాలానికి మరో కంటి చూపు కూడా పోయింది. సరైన వైద్యం అందక లూయీస్ ఎనిమిదేళ్ల వయసులోనే పూర్తిగా చూపు కోల్పోయాడు. తరువాత లూయిస్ బ్రెయిలీ అంధుల పాఠశాలలో చేరాడు. చీకట్లో కూడా మెసేజ్‌లను చదవడంలో సహాయపడే సైనిక కోడ్ గురించి లూయిస్‌కు బాగా తెలుసు. అంధుల కోసం అలాంటి స్క్రిప్ట్ రూపొందించాలనే ఆలోచన అతని మదిలో మెదిలింది. దీంతో అతను బ్రెయిలీ లిపిని రూపొందించారు. ఇది అంధులు చదవడానికి, రాయడానికి ఉపయుక్తమయ్యే ఒక స్పర్శ కోడ్. ఈ లిపి కోసం ఎంబోస్డ్ పేపర్‌ను వినియోగిస్తారు. దానిపై ఉన్న చుక్కలను స్పర్శిస్తూ చదవవచ్చు. బ్రెయిలీ లిపిని టైప్‌రైటర్‌తో సమానమైన బ్రెయిల్రైటర్ ద్వారా రాయవచ్చు. ఇదేకాకుండా స్టైలస్, బ్రెయిలీ స్లేట్ ఉపయోగించి కూడా రాయవచ్చు. బ్రెయిలీ లిపిలో ఉపయోగించే చుక్కలను సెల్ అని అంటారు.ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలువరించిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. సుమారు 253 మిలియన్ల మంది దృష్టిలోపానికి గురయ్యారు. దీనిని గుర్తించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2018లో లూయిస్ బ్రెయిలీ జన్మదినమైన జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేసింది. అదిమొదలు ప్రతీయేటా జనవరి 4న ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇది కూడా చదవండి: Newton Birthday: ఆ మహాశాస్త్రవేత్తకు రెండు జననమరణాలు -
అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ!!
చదవడం, వ్రాయడం అనేవి రెండు కూడా ప్రజలు నేర్చుకోగల అత్యంత ఉపయోగకరమైన ముఖ్యమైన విషయాలు . అంతేకాదు ఇవి రెండే మానవులు విద్యనభ్యసించడానికి ఉపకరించే అత్యం తముఖ్యమైన సాధనాలు. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అంధులు ఉన్నారు. వారు విద్యనభ్యసంచాలంటే ఎలా అనేదానికి సమాధానమే ఈ బ్రెయిలీ లిపి. లక్షలాది మంది అంధులు మంచి విద్యనభ్యసించి వారు జీవితంలో విజయాలను సాధించేందుకు వీలు కల్పించిన పద్ధతి. బ్రెయిలీ అనేది అంధుల కోసం కనుగొన్న వ్రాతపూర్వక భాష రూపం. దీనిలో అక్షరాలను వేలికొనలతో గుర్తుపట్టేగలిగే విధంగా ఎత్తైన చుక్కల నమూనా. బ్రెయిలీ డే ప్రాముఖ్యత అంధులకు, దృష్టిలోపం ఉన్నవారికి కమ్యూనికేషన్ సాధనంగా ఉన్న బ్రెయిలీ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకే ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దృష్టి లోపం ఉన్నవారు బ్రెయిలీలో చదివి వ్రాస్తారు. దృష్టి లోపం లేని వ్యక్తులు కళ్ళతో బ్రెయిలీని చదవగలరు. వివిధ భాషలలో వర్ణమాల క్రమాన్ని బట్టి విలువలు బ్రెయిలీ చిహ్నాలకు కేటాయించబడతాయి. చాలా బ్రెయిలీ వర్ణమాలలు 26 అక్షరాల లాటిన్ వర్ణమాలకు చెందిన ఫ్రెంచ్ సార్టింగ్ క్రమాన్ని అనుసరిస్తాయి. జపనీస్, కొరియన్ బ్రెయిలీ ఇతర బ్రెయిలీ ట్రాన్స్క్రిప్షన్ల నుండి చాలా భిన్నంగా ఉంటాయి. అంతేకాదు బ్యాంకులు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు వంటి అనేక సంస్థలు ఇప్పటికీ తమ ప్రింటెడ్ మెటీరియల్‌లో బ్రెయిలీ వెర్షన్లను అందించనందున ఈ రోజు దృష్టి లోపం ఉన్న వ్యక్తులకు స్వేచ్చయుతం జీవించడానికి మన వంతుగా అందించాల్సిన సహాయ సహకారాలను గురించి వివరిస్తుంది. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు.... జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకోవాలని యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీ నవంబర్ 2018లో ప్రకటించింది. మొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జనవరి4, 2019న జరుపుకున్నారు. జనవరి 4న ఎందుకంటే.. 1809లో బ్రెయిలీని కనిపెట్టిన వ్యక్తి లూయిస్ బ్రెయిలీ జన్మదినం అయిన జనవరి 4న పురస్కరించుకుని బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. లూయిస్ బ్రెయిలీ ఎవరు? లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ విద్యావేత్త. అతను కనిపెట్టిన బ్రెయిలీ లిపి వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అంధులకు చదవడానికి విస్తృతంగా ఉపయోగించే మాధ్యమంగా ఉంది. లూయిస్ బ్రెయిలీకి మూడేళ్ల వయసులో తన తండ్రి జీనులు తయారు చేసే దుకాణంలో కుట్టుపని చేస్తున్నప్పుడు ప్రమాదంలో ఒక కన్ను పోయింది. అయితే కొన్నాళ్లకు ఇన్ఫెక్షన్ ఏర్పడి రెండు కళ్లకు వ్యాపించి పూర్తిగా అంధత్వం ఏర్పడింది. కానీ అతను అన్ని సవాళ్లను అధిగమించి విద్యలో రాణించాడమే కాకుండా కొత్త పద్ధతిలో త్వరగా చదవడం, కమ్యూనికేట్ చేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. అంతేకాదు అందుల కోసం బ్రెయిలీని కనిపెట్టాడు. బ్రెయిలిని అనేది నైట్ రైటింగ్ అనే స్పర్శ కోడ్... అయితే ఈ వ్యవస్థ రాత్రిపూట ఎటువంటి కాంతి వనరులు లేకుండా సైనికులు నిశ్శబ్దంగా కమ్యూనికేట్ చేయడానికి నెపోలియన్ ఆదేశాల మేరకు చార్లెస్ బార్బియర్ చేత అభివృద్ధి చేయబడిన నైట్ రైటింగ్ అనే స్పర్శ సైనిక కోడ్. అంతేకాదు లూయిస్ బార్బియర్ నైట్ రైటింగ్' గురించి తెలుసుకున్నాడు. దీన్ని ఆధారంగా చేసుకునే బ్రెయిలీ లిపిని కనుగొన్నాడు. అయితే లూయిస్ క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు గురువుగారి అంధుల లిపికి గుర్తింపునివ్వాలని పోరాటాలు చేయగా.. బ్రెయిలీ లిపికి గుర్తింపు నిచ్చి.. దేశ ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్. నేటికీ అంధులకు అన్నిరకాల పత్రికలు, పుస్తకాలు బ్రెయిలీ లిపిలోనే రూపొందిస్తున్నారు. లూయిస్ పేరు మీద స్టాంపులు బ్రెయిలీ కనిపెట్టిన అంధుల లిపి ప్రస్తుతమున్న కంప్యూటర్ భాషకు వీలుగా రూపొందించబడిందంటే ఆయన ముందుచూపు ఏమిటో అర్థమవుతుంది. లూయిస్ చనిపోయాక ఆయన పేరు మీద స్టాంపులు, కరెన్సీ, విద్యాసంస్థలు, పట్టణాలు వెలిశాయి. భారతదేశం 2 రూపాయల నాణెం మీద, యుఎస్ డాలర్ మీద బ్రెయిలీ ముఖచిత్రాన్ని ప్రచురించారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటయ్యే పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశాయి. (చదవండి: worlds longest name: ఎంత పె...ద్ద.. ‘పేరు’!) -
ఆఖరివాడు
‘పట్టుకుపోయేదేం లేదు’ అని చెప్పడానికి తన చేతుల్ని పైకే పెట్టించుకుని, దేహాన్ని ఖననం చేయించుకున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్. ‘కనులు లేవని నీవు కలత పడవలదు’ అంటూ స్పర్శలిపిని చెక్కి ఇచ్చి, చెక్కిన ఆ చేతులతోనే ఈ ప్రపంచానికి చిరస్మరణీయం అయ్యాడు ‘ఆఖరివాడు’ ది గ్రేట్. చిన్న గ్రామం అది. ఎంత చిన్నదంటే.. ఒక పెద్ద కుటుంబమంత. రెండొందల పదేళ్ల క్రితం ఆ గ్రామ జనాభా ఆరొందల పది. జనాభాను బట్టి చూస్తే ఇప్పటికీ అది చిన్న గ్రామమే. ఐదేళ్ల క్రితం నాటి లెక్కల ప్రకారం జనాభా మూడు వేలకు మించి లేదు. ఆరొందల పదిమంది ఉన్న ఆ గ్రామంలో ఆరుగురు మనుషులున్న ఒక కుటుంబం ఉండేది. తల్లి, తండ్రి, నలుగురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆఖరి సంతానం మగపిల్లవాడు. గ్రామంలో సారవంతమైన నేలలు, సున్నితమైన పర్వత ప్రాంతాలు, పండ్లతోటలు, వ్యవసాయ క్షేత్రాలు, ద్రాక్ష తోటలు ఉండేవి. వైద్యుడు, మంత్రసాని, దర్జి, తాళాల మనిషి, తాళ్ల మనిషి, కళ్లేల మనిషి ఉండేవారు. ఈ కళ్లేల మనిషి గుర్రాలకు, శునకాలకు తోలు కళ్లేలు తయారు చేస్తుండేవాడు. పైన చెప్పుకున్న ఆరుగురు మనుషుల కుటుంబం ఆయనదే. ఆఖరివాడు ఎప్పుడూ ఆయన్ని అంటుకునే ఉండేవాడు. తల్లిని కదా చంటి పిల్లలు అంటుకుని ఉండేది, ఈ ఆఖరివాడు తన తండ్రిని అంటుకుని ఉండేవాడు. ‘వెళ్లరా అమ్మ దగ్గరికి’ అని చెప్పినా వినకుండా మూడేళ్ల వయసున్న ఆ ఆఖరివాడు తండ్రి దగ్గరే ఉండేవాడు. ఇంటి ప్రాంగణంలోనే ఒక వైపు ఉండేది ఆయన కళ్లేల పరిశ్రమ. తోళ్లను తేలిగ్గా ఒక ఆకృతిలోకి కోసేవాడు. కోసిన తోళ్లను కలిపి మేకులు కొట్టేవాడు. ఇంకా ఏవో హంగులు జత చేశాక అందమైన కళ్లేలు తయారయ్యేవి. ఈ పనులన్నింటినీ ఆఖరివాడు అబ్బురంగా చూస్తూ కూర్చునేవాడు. తండ్రికి కళ్లేలొక్కటే పని కాదు. ముకుతాళ్లు, గుర్రపు జీనులు తయారుచేసేవాడు. ఆ ఒడుపునంతా దగ్గర్నుంచి చూస్తుండేవాడు ఈ ఆఖరివాడు. ఒకరోజు తండ్రి ఇంట్లో లేనప్పుడు తండ్రి పనిచేసే చోటుకు వెళ్లి కూర్చున్నాడు. వాడికీ తండ్రిలా చెయ్యాలని ఉంది. ఒక తోలు ముక్క తీసుకున్నాడు. పదునైన పరికరం అందుకుని దానితో తోలు ముక్కపై గట్టిగా కొట్టాడు. పరికరం చెయ్యి జారి, ఎగిరొచ్చి ఆఖరివాడి కంటికి తగిలింది! కంటిచూపు పోయింది. తర్వాత కొన్నాళ్లకే గాయం పెద్దదై రెండో కన్ను మీదా దుష్ప్రభావం చూపించి, రెండో కన్నూ పోయింది. ఆఖరివాడు అంధుడయ్యాడు!కుటుంబ పెద్దకు కుటుంబ పోషణ ఒక్కటే బాధ్యత కాదు. రోజుకింత సంపాదించి తెస్తే అయిపోదు. కుటుంబ సంరక్షణ తీసుకోవాలి. కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దాలి. పిల్లలకు ఒక దారి చూపించాలి. ఆఖరివాడికి చూపు లేదు దారి చూపించడానికి. చూపు లేకున్నా దారి వేశాడు. వేసిన దారినే చూపుగా మార్చాడు. మొదట ఎ,బి,సి,డిల దారి. తర్వాత బడి దారి. పదేళ్లు వచ్చేనాటికి ఆఖరివాడికి తండ్రి తన పక్కనే ఉంచుకుని అన్నీ నేర్పించాడు. చెక్కతో అక్షరాలను చెక్కి వాటిని వేళ్లతో తడిమి గుర్తించేలా తర్ఫీదు ఇచ్చాడు. గుర్తించిన అక్షరాలను చెయ్యి పట్టి రాయించాడు. ఆ గ్రామంలోని చర్చి ఫాదర్ ఆఖరివాడికి ప్రకృతి గురించి చెప్పాడు. ఏ పక్షి ఎలా కూస్తుందో, ఏ జంతువు ఎలా అరుస్తుందో, ఏ పువ్వు పరిమళం ఎలా ఉంటుందో, రుతువులు ఎలా మారుతాయో, ఎందుకు తెల్లవారుతుందో, ఎందుకు చీకటి పడుతుందో అర్థమయ్యేలా చెప్పాడు. ఆఖరివాడికి పదో ఏడు వచ్చిన ఆరు వారాలకు అతడిని గ్రామానికి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరంలోని ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు. అతడు అక్కడే ఉండి, అక్కడే చదువుకుని, అక్కడే పెరిగి పెద్దయి, అక్కడే పని చేసి, ఆ తర్వాత అక్కడే పాఠాలు చెప్పాడు. ఆ పాఠశాలే ‘రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ యూత్’. ఆ నగరం పారిస్. ఆ అఖరివాడు లూయీ బ్రెయిలీ. అతడి గ్రామం కూప్రే.కూప్రేలో రెండొందల పదేళ్ల క్రితం బ్రెయిలీ కుటుంబం నివసించిన ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అయితే ఇప్పుడది ఇల్లు కాదు. మ్యూజియం. బ్రెయిలీ చనిపోయాక ఆయన చేతుల్ని కూప్రేలో ఖననం చేసి, మిగతా దేహాన్ని పారిస్‌లో పూడ్చిపెట్టారు. చేతులే జీవితాంతం ఆయనను కళ్లయి నడిపించాయి. ఆయన్నొక్కర్నే కాదు. ఆ చేతులతో ఆయన కనిపెట్టిన భాష ఎందరో అంధుల్ని చూపు కర్రలా నడిపిస్తోంది. అందుకే ఆయన చేతులకు అంత ప్రత్యేక ‘స్థానం’. ఇవాళ బ్రెయిలీ జనన దినం. ఎల్లుండి మళ్లీ మరణ దినం. ఒకే నెలలో రెండు రోజుల తేడాతో ఈ నలభై మూడేళ్ల ఆఖరివాడు జన్మించి, మరణించాడు. మరణించి స్పర్శలిపిగా పునర్జన్మించాడు. -
అంధులకు అక్షరాన్నిచ్చిన వాడు
ప్రపంచవ్యాపితంగా అంధులు సైతం విద్య ద్వా రా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఏకైక లక్ష్యంతో లూయిస్ అంధుల కొరకు లిపిని కనిపెట్టారు. కనుకనే ఆయన పేరు మీదగా బ్రెయి లీ లిపి అని పేరు వచ్చింది. అంధులు విద్య ప్రపంచవ్యాపితంగా ఇప్పటికీ ఈ లిపిలోనే కొన సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది అంధుల కోసం లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో అక్షరజ్ఞానం కలిగించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో 1809 జనవరి 4న ప్యారిస్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న రకూవే గ్రామంలో సైమన్ మానిక్ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించాడు. తండ్రి లెదర్‌తో గుర్రపు జీన్లు తయారు చేస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు. మూడేళ్ల ప్రాయంలో లూయీస్ ఒక రోజు తన తండ్రి పని చేసే చోటుకి వెళ్లి అక్క డున్న పరికరాలతో ఆటలు ఆడుకుంటుండగా సన్నని చువ్వ ఒకటి వచ్చి కంటిలో గుచ్చుకుంది. దాన్ని పసిగట్టిన తండ్రి స్థానిక ఆస్పత్రికి తీసు కెళ్లాడు. అప్పటికే ఒక కంటి చూపు పూర్తిగా కోల్పో యాడు. దారిద్య్రం వల్ల మంచి వైద్యం తల్లిదం డ్రులు అందించలేకపోయారు. తర్వాత కొంత కాలానికి రెండవ కంటికి ఇన్ఫెక్షన్ సోకి రెండవ కన్ను కూడా పూర్తిగా పాడైపోయిం ది. లూయీస్ తండ్రి తన కుమా రుడు కళ్లు లేకపోయినా సరే చదు వుకోవాలని భావించి ఒక పెద్ద చెక్కపై మేకుల్ని అక్షరాల రూపం లో బిగించి లూయీస్‌ని వేలుతో స్పర్శ ద్వారా తాకమనేవాడు. అలా లూయీస్‌కి తన తండ్రే మొదటి విద్యాబోధకుడు. కొంత కాలానికే తన గ్రామంలోని పాఠశాలకు తన అన్న అక్కతో కలిసి లూయీస్‌ని పంపాడు. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులంతా లూయీస్ ప్రజ్ఞాపాఠవాలకు మంత్రముగ్ధులై ప్రపంచంలోనే మొదటిగా అం ధుల కోసం 1784 వాలెంటీన్ చేత ప్రారంభించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్‌కు లూయీస్ ని రికమండ్ చేశారు. 1819లో లూయీస్ ఇక్కడ చేరి కాగితంపై ఉబ్బెత్తుగా తడిమి గుర్తు పట్టేట్లుగా ఉండే విధానం ద్వారా విద్యాబోధన చేశాడు. ఈ పద్ధతిని లైన్టైప్ అంటారు. ఈ విధానం ద్వారానే విద్యాభ్యాసం కొనసాగించాడు. ఈ లైన్టైప్ విధా నం చాలా కష్టంగా ఉండి, పరిమాణంలో పుస్త కాలు పెద్దగా బరువుగా ఖరీదైన విగా ఉండటం వల్ల అంధులు అనేక సమస్యల్ని ఎదుర్కొనే వారు. తాను చదువుకున్న చోటే అధ్యాప కునిగా చేరి నాటి అంధుల విద్యా విధానంపై సంతృప్తి చెందక 1821 నుండే అంధుల విద్యావ్యాప్తికి పరిశోధనలు ప్రారంభించాడు. 1821లో చార్లెస్ బార్బేరియన్ అనే సైనికాధికారి శత్రువులకు అర్థం కాకుండా సందే శాలను సైనికులకు పంపడం కోసం 12 చుక్కల రహస్య కోడ్ భాషను ఉపయోగిస్తుండేవాడు. లూయీస్, చార్లెస్ బార్బేరియన్ దగ్గర చేరి 12 చుక్కల రహస్య కోడ్ భాషపై నిరంతరం పరి శోధించి చివరకు 1832లో 6 చుక్కల లిపిని కను గొన్నాడు. ఈ లిపిలోనే అంకెలను, చిహ్నాలను కూడా రూపొందించాడు. అంధుల కోసం లిపిని సృష్టించాడు. కనుక ఆయన పేరు మీదగానే బ్రెయిలీ లిపి అని పేరు వచ్చింది. లూయిస్ బ్రెయిలీ అంధ విద్యార్థులకు లిపి ని సులభతరం చేయాలనే లక్ష్యంతో పట్టువదలని విక్రమార్కునిలాగ పరిశోధనలు ప్రారంభించి పేపర్‌పై రంధ్రాలు సులభంగా చేసే డేకా పాయిం ట్ అనే విధానాన్ని రూపొందించాడు. అంధులకు లిపి ద్వారా టైప్‌రైటర్ మిషన్‌ను కనిపెట్టి దానికి పోకాల్డ్గా నామకరణం చేసి 1855 ప్రపంచస్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. చిన్నప్పటి నుండి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన లూయీస్ ట్యూబరిక్యు లోసిస్ అనే వ్యాధి వలన 1852 జనవరి 6న సొం త గ్రామంలోనే మరణించాడు. లూయీస్ మర ణానంతరం 1854లో ప్రపంచ వ్యాప్తంగా బ్రెయి లీ వాడుకలోకి వచ్చింది. అతన్ని ఫ్రాన్స్ 1852లో తమ దేశపు ముద్దుబిడ్డగా ప్రకటించింది. ఆయన ఊరిలో లూయీస్ పేరుతో మ్యూజియాన్నే ప్రారంభించింది. ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకే ఆత్మవిశ్వా సం కోల్పోతూ మానసిక సందిగ్ధంలో కొట్టుమిట్టా డుతున్న నాటి నవ యువతరానికి లూయిస్ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో జీవితంలో కఠోర శ్రమ వల్ల నిత్యస్ఫూర్తి కలిగించగల వ్యక్తిత్వం ఆయనకు సొంతం. (జనవరి 4న లూయీస్ 211వ జయంతి) పి. రాజశేఖర్ ఎన్పీఆర్డీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి