అంధులకు అక్షరాన్నిచ్చిన వాడు
ప్రపంచవ్యాపితంగా అంధులు సైతం విద్య ద్వా రా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఏకైక లక్ష్యంతో లూయిస్ అంధుల కొరకు లిపిని కనిపెట్టారు. కనుకనే ఆయన పేరు మీదగా బ్రెయి లీ లిపి అని పేరు వచ్చింది. అంధులు విద్య ప్రపంచవ్యాపితంగా ఇప్పటికీ ఈ లిపిలోనే కొన సాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది అంధుల కోసం లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో అక్షరజ్ఞానం కలిగించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ.
లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్ దేశంలో 1809 జనవరి 4న ప్యారిస్‌కు 20 మైళ్ల దూరంలో ఉన్న రకూవే గ్రామంలో సైమన్ మానిక్ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మించాడు. తండ్రి లెదర్‌తో గుర్రపు జీన్లు తయారు చేస్తూ కుటుంబ పోషణ సాగించేవాడు. మూడేళ్ల ప్రాయంలో లూయీస్ ఒక రోజు తన తండ్రి పని చేసే చోటుకి వెళ్లి అక్క డున్న పరికరాలతో ఆటలు ఆడుకుంటుండగా సన్నని చువ్వ ఒకటి వచ్చి కంటిలో గుచ్చుకుంది. దాన్ని పసిగట్టిన తండ్రి స్థానిక ఆస్పత్రికి తీసు కెళ్లాడు. అప్పటికే ఒక కంటి చూపు పూర్తిగా కోల్పో యాడు. దారిద్య్రం వల్ల మంచి వైద్యం తల్లిదం డ్రులు అందించలేకపోయారు. తర్వాత కొంత కాలానికి రెండవ కంటికి ఇన్‌ఫెక్షన్ సోకి రెండవ కన్ను కూడా పూర్తిగా పాడైపోయిం ది. లూయీస్ తండ్రి తన కుమా రుడు కళ్లు లేకపోయినా సరే చదు వుకోవాలని భావించి ఒక పెద్ద చెక్కపై మేకుల్ని అక్షరాల రూపం లో బిగించి లూయీస్‌ని వేలుతో స్పర్శ ద్వారా తాకమనేవాడు. అలా లూయీస్‌కి తన తండ్రే మొదటి విద్యాబోధకుడు. కొంత కాలానికే తన గ్రామంలోని పాఠశాలకు తన అన్న అక్కతో కలిసి లూయీస్‌ని పంపాడు. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయులంతా లూయీస్ ప్రజ్ఞాపాఠవాలకు మంత్రముగ్ధులై ప్రపంచంలోనే మొదటిగా అం ధుల కోసం 1784 వాలెంటీన్ చేత ప్రారంభించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది బ్లైండ్‌కు లూయీస్ ని రికమండ్ చేశారు. 1819లో లూయీస్ ఇక్కడ చేరి కాగితంపై ఉబ్బెత్తుగా తడిమి గుర్తు పట్టేట్లుగా ఉండే విధానం ద్వారా విద్యాబోధన చేశాడు. ఈ పద్ధతిని లైన్‌టైప్ అంటారు. ఈ విధానం ద్వారానే విద్యాభ్యాసం కొనసాగించాడు.
ఈ లైన్‌టైప్ విధా నం చాలా కష్టంగా ఉండి, పరిమాణంలో పుస్త కాలు పెద్దగా బరువుగా ఖరీదైన విగా ఉండటం వల్ల అంధులు అనేక సమస్యల్ని ఎదుర్కొనే వారు. తాను చదువుకున్న చోటే అధ్యాప కునిగా చేరి నాటి అంధుల విద్యా విధానంపై సంతృప్తి చెందక 1821 నుండే అంధుల విద్యావ్యాప్తికి పరిశోధనలు ప్రారంభించాడు. 1821లో చార్లెస్ బార్బేరియన్ అనే సైనికాధికారి శత్రువులకు అర్థం కాకుండా సందే శాలను సైనికులకు పంపడం కోసం 12 చుక్కల రహస్య కోడ్ భాషను ఉపయోగిస్తుండేవాడు. లూయీస్, చార్లెస్ బార్బేరియన్ దగ్గర చేరి 12 చుక్కల రహస్య కోడ్ భాషపై నిరంతరం పరి శోధించి చివరకు 1832లో 6 చుక్కల లిపిని కను గొన్నాడు. ఈ లిపిలోనే అంకెలను, చిహ్నాలను కూడా రూపొందించాడు. అంధుల కోసం లిపిని సృష్టించాడు. కనుక ఆయన పేరు మీదగానే బ్రెయిలీ లిపి అని పేరు వచ్చింది.
లూయిస్ బ్రెయిలీ అంధ విద్యార్థులకు లిపి ని సులభతరం చేయాలనే లక్ష్యంతో పట్టువదలని విక్రమార్కునిలాగ పరిశోధనలు ప్రారంభించి పేపర్‌పై రంధ్రాలు సులభంగా చేసే డేకా పాయిం ట్ అనే విధానాన్ని రూపొందించాడు. అంధులకు లిపి ద్వారా టైప్‌రైటర్ మిషన్‌ను కనిపెట్టి దానికి పోకాల్డ్‌గా నామకరణం చేసి 1855 ప్రపంచస్థాయి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు.
చిన్నప్పటి నుండి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన లూయీస్ ట్యూబరిక్యు లోసిస్ అనే వ్యాధి వలన 1852 జనవరి 6న సొం త గ్రామంలోనే మరణించాడు. లూయీస్ మర ణానంతరం 1854లో ప్రపంచ వ్యాప్తంగా బ్రెయి లీ వాడుకలోకి వచ్చింది. అతన్ని ఫ్రాన్స్ 1852లో తమ దేశపు ముద్దుబిడ్డగా ప్రకటించింది. ఆయన ఊరిలో లూయీస్ పేరుతో మ్యూజియాన్నే ప్రారంభించింది.
ప్రస్తుతం చిన్న చిన్న సమస్యలకే ఆత్మవిశ్వా సం కోల్పోతూ మానసిక సందిగ్ధంలో కొట్టుమిట్టా డుతున్న నాటి నవ యువతరానికి లూయిస్ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో జీవితంలో కఠోర శ్రమ వల్ల నిత్యస్ఫూర్తి కలిగించగల వ్యక్తిత్వం ఆయనకు సొంతం.
(జనవరి 4న లూయీస్ 211వ జయంతి)
పి. రాజశేఖర్
ఎన్‌పీఆర్‌డీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి