‘చూపున్నా చూడలేని అంధుల కంటే....అంధులు బాగా చూడగలరు’ అంటుంది పెర్షియన్ సామెత. కంటిచూపు బాగున్నా వాస్తవాలు చూడలేని వారిపై ఈ సామెత ఒక చురక అనుకున్నప్పటికీ.... చూపులేని మహిళలు వైద్యరంగంలో కొత్త కాంతితో వెలుగుతున్నారు. తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’తో ఎర్లీ స్టేజ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తిçస్తూ ఎంతోమంది మహిళలు ప్రమాదం బారిన పడకుండా చూస్తున్నారు...
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ్రపారంభ సంకేతాలను గుర్తించడంలో చూపులేని అయేషా వైద్యులకు సహాయపడుతుంది. ఈ పరీక్షల కోసం తన చేతి వేళ్లను ఉపయోగిస్తుంది. ‘మా చేతి వేళ్లలోని అధిక స్పర్శ జ్ఞానం వక్షోజాలలోని చిన్న లంప్స్‌ను కనిపెట్టడంలో సహాయపడుతుంది. ఈ వృత్తి నాలాంటి చూపులేని మహిళలకు బాగా సరిపోతుంది’ అంటుంది అయేషా.బెంగళూరులోని ‘సైట్‌కేర్’ హాస్పిటల్‌లో పనిచేస్తుంది అయేషా. రోజుకు తొమ్మిది పరీక్షలు చేస్తుంది. ఒక్కొక్కరికి అరగంట సమయం తీసుకుంటుంది.
‘కంటిచూపు లేని అయేషాలాంటి యువతులు ఎర్లీ స్టేజిలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను డిటెక్ట్ చేయడంలో మంచి నైపుణ్యాన్ని చూపిస్తున్నారు’ అంటున్నాడు ‘సైట్‌కేర్’ హాస్పిటల్స్ కో–ఫౌండర్, సీయివొ సురేష్ రాము. చిన్న వయసులోనే కంటిచూపు కోల్పోయిన అయేషా డిగ్రీ పూర్తి చేయడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అయితే ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అయేషా తన నెల జీతంలో కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తుంటుంది. (మా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించామని...)
అయేషాలాగే కోలార్‌కు చెందిన 29 సంవత్సరాల నూరున్నీసా చిన్న వయసులోనే చూపు కోల్పోయింది. తన ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా ఎంతోమంది మహిళలను బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించి పొంచి ఉన్న ప్రమాదం గురించి హెచ్చరిస్తుంటుంది.బెంగళూరులోని ‘జ్యోతి నివాస్ కాలేజీ’లో డిగ్రీ చేసిన నూరున్నీసాకు ఉద్యోగం దొరకడం కష్టం అయింది. ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా తనకు ఉపాధి దొరకడమే కాదు గుర్తింపు కూడా లభించింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. ‘గతంలో మాదిరిగా కాదు. ఇప్పుడు చూపులేని వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి’ అంటుంది నూరున్నీసా.అయేషా, నూరున్నీసా...ఈ ఇద్దరిలో ఎవరికీ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు.
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి, టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించడానికి అయేషా, నూరున్నీసాలు దేశంలోని ఎన్నో ్రపాంతాలు తిరిగారు. టక్ట్యల్ బ్రెస్ట్ పరీక్షలు అనేవి చూపు లేని మహిళల కోసం రూపొందించిన ప్రత్యేక పరీక్షలు. ఈ పరీక్షలను నిర్వహించేవారిని మెడికల్ టక్ట్యల్ ఎగ్జామినర్స్(ఎంఐటీ)లుగా వ్యవహరిస్తారు. ‘ఎంఐటీ’లుగా ఎంతో మంది చూపు లేని మహిళలు ఉపాధి పొందడమే కాదు తమ ‘మ్యాజిక్ ఫింగర్స్’ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎర్లీ స్టేజీలో గుర్తిస్తున్నారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)
డిస్కవరింగ్ హ్యాండ్స్
దిల్లీకి చెందిన ‘డిస్కవరింగ్ హ్యాండ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ టక్ట్యల్ బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలకు సంబంధించి చూపు లేని మహిళల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రెండున్నర సంవత్సరాల తరువాత ఈ సంస్థ బెంగళూరులో కూడా శిక్షణా కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళల్లో అయేషా, నూరున్నీసా ఉన్నారు. ‘మొదట్లో వైద్యానికి సంబంధించిన పదాలను అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది’ అంటుంది లీనా మెహతా. పన్నెండు సంవత్సరాల వయసులో ఆమె చూపు కోల్పోయింది. అయితే ట్రైనర్స్ ఒకటికి పదిసార్లు అర్థమయ్యేలా చెప్పేవాళ్లు. త్రీడీ మోడల్స్‌తో శరీర పనితీరును సులభంగా అర్థం చేయించేవారు.
Comments
Please login to add a commentAdd a comment