ఒక్కోసారి కొన్ని సంఘటనలు చూస్తే మనలో మనకే వ్యతిరేకతన అనిపిస్తుంది. కొన్ని రకాల శిక్షణకు, ఆటలకు, వ్యాయమాలకు వెసులుబాటుగా ఉండే దుస్తులే ధరించాల్సి ఉంటుంది. తప్పదు. దీన్ని కొందరూ పెద్దవాళ్లు విశాల దృక్పథంతో అర్థం చేసుకునే యత్నం చేయాలి. లేదా ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటే సూచించొచ్చు. అంతేగానీ బహిరంగంగా వేరొకరి వేషధారణ గురించి అవమానకరంగా మాట్లాడటం సబబు కాదు. కానీ ఇక్కడ అలాంటి దిగ్బ్రాంతికర ఘటనే చోటు చేసుకుంది.
బెంగళూరులో టానీ భట్టాచార్జీ అనే యోగా ట్రైనర్ షార్ట్స్ వేసుకున్నందుకు బహిరంగంగా ఓ వృద్ధ మహిళ అవమానించింది. ఇలాంటివి వేసుకోకూడదంటూ తన మాతృభాషలో అరుస్తూ మాట్లాడింది. అందుకు యోగా ట్రైనర్ మీకేంటి సమస్య అని సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్న అదేపనిగా మాట్లాడుతూ ఆమెని ఇబ్బంది పెట్టింది. చివరికీ ఆమెకు అర్థం కావడం లేదు లే అని సదరు యోగా ట్రైనరే పక్కకు తప్పుకుని వెళ్లిపోతున్నా.. వెంటపడి మరీ అవమానించే పని చేసింది.
అంతేగాదు ఆమె వేసుకున్న షార్ట్‌ని అక్కడున్న మరికొందరికీ చూపిస్తూ గట్టి గట్టిగా మాట్లాడటం వంటివి చేసింది. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర చర్చకు తెరలేపింది. సంప్రదాయం, ఆధునిక విలువల మధ్చ తీవ్రమైన చర్చకు దారితీసింది. కొందరూ ఆ వృద్ధ మహిళకు సపోర్ట్ చేయగా, మరికొందరూ మాత్రం సదరు యోగా ట్రైనర్‌ని లైట్ తీసుకోమని పట్టించుకోవద్దని సలహాలిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.
(చదవండి: 'ఎకో ఫ్రెండ్లీ జర్నీ'! 27 దేశాలు చుట్టొచ్చిన ఇద్దరు మిత్రులు..!)
Comments
Please login to add a commentAdd a comment