ఐరాస తీర్మానంలో హిందీ | UN General Assembly resolution mentions Hindi language | Sakshi
Sakshi News home page

ఐరాస తీర్మానంలో హిందీ

Published Sat, Jun 11 2022 6:09 AM | Last Updated on Sat, Jun 11 2022 12:16 PM

UN General Assembly resolution mentions Hindi language - Sakshi

ఐరాస: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ శుక్రవారం బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్‌ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి.

ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్‌ తో´ ాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తరప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్‌ పేర్కొంది. ఐరాస గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement