multi langual
-
ఐదు భాషల్లో అనర్గళంగా!
శాంతిపురం: ఒక దీపం అనంత దీపాలను వెలిగించినట్టు.. తపన ఉన్న ఓ ఉపాధ్యాయుడు తలిస్తే వందల, వేల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చన్నది చిత్తూరు జిల్లా (Chittoor District) శాంతిపురం, శెట్టేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చాటుతోంది. మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్కూలు విద్యార్థులు బహుభాషలపై తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. పాఠ్యాంశాల్లోని తెలుగు (Telugu), ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు కన్నడం, తమిళం, మలయాళీ (Malayalam) భాషలు ఇక్కడి విద్యార్థులు సులువుగా రాయటం, చదవడం, మాట్లాడడం చేస్తున్నారు. ఒక భాషలోని పద్యాలు, రచనలను మరో భాషలోకి అనువాదం చేయగలుగుతున్నారు. ప్రత్యేక పరీక్షల్లో ఉత్తీర్ణత అధికారుల అనుమతితో ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థుల భాషాపరిజ్ఞానంపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. గుడుపల్లి ఏపీ మోడల్ స్కూలు ఉపాధ్యాయుడు షిజో మైకెల్ మలయాళంపై, గుడుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎస్కే.మణి తమిళంపై, కర్ణాటకలోని వేమన విద్యా సంస్థల ఉపాధ్యాయురాలు ఎస్వనజాక్షి కన్నడ భాషపై మొత్తం 94 మంది విద్యార్థుల స్థాయిలను ఇటీవల పరీక్షించారు. వీరిలో కన్నడంలో 93 మంది, మలయాళంలో 45 మంది, తమిళంలో 36 మంది సంతృప్తికర ప్రతిభను చాటుకున్నారు. ప్రధానోపాధ్యాయుని సంకల్పం ఇక్కడ ప్రధానోపాద్యాయుడుగా ఉన్న తీగల వెంకటయ్య భాషల పట్ల ఆసక్తితో రూపకల్పన చేసిన కార్యక్రమం విద్యార్థులను బహుభాషా కోవిదులుగా తయారు చేస్తోంది. తీరిక వేళల్లో హెచ్ఎం ఇస్తున్న తర్ఫీదు, మిగతా ఉపాధ్యాయుల సహకారం అందిపుచ్చుకుని అన్ని బాషల్లోనూ తమ పట్టును పెంచుకొంటున్నారు. మాతృభాష (Mother Tongue) వస్తే మరెన్ని భాషలైనా నేర్వవచ్చనే ఆలోచనతో హెచ్ఎం తీగల వెంకటయ్య ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తన ప్రత్యేక బోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.చదవండి: సోలో లైఫే సో బెటరూ అంటున్న యువతులు! 6, 7, 8, 9 తరగతుల వారికి భాషల గురించి చెప్పి, కేవలం 26 సరళమైన పదాలతో బోధన ప్రారంభించారు. ఎవరైనా ఉపాధ్యాయులు లేని సమయంలో వారి తరగతులను తీసుకుని విద్యార్థులకు దీనిపై పాఠాలు చెప్పారు. విద్యార్థులు కూడా ఇతర భాషలు నేర్చుకోవటంపై ఆసక్తి చూపడంతో సొంత ఖర్చులతో వారికి మలయాళం, తమిళం, కన్నడ పుస్తకాలను కొనిచ్చారు. ఈ ఆసరాను అందిపుచ్చుకున్న పిల్లలు ఆయా భాషలపై సులువుగా పట్టు సాధిస్తున్నారు. నా విశ్వాసం పెరిగింది ప్రైమరీ స్కూలు రోజుల నుంచి భాషలే నాకు ఇబ్బందిగా ఉండేవి. అక్కడ తెలుగు, ఇంగ్లీషు ఉంటే 6వ తరగతిలో చేరగానే వాటికి హిందీ కూడా తోడయ్యి అంతా అయోమయంగా ఉండేది. కానీ సులువుగా భాషలు నేర్చుకునే టెక్నిక్ తెలుసుకున్న తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు కన్నడ, తమిళం కూడా నేర్చుకొంటున్నాను. నాపై నాకు విశ్వాసం పెరిగింది. – బీ.రామాచారి, 8వ తరగతిఎన్ని భాషలైనా నేర్వవచ్చు నేను రూపొందించిన ప్రాజెక్టు నమూనాతో 20–25 రోజుల్లోపు ఏ బాషలైనా నేర్చుకోవచ్చు. అందరు విద్యార్థులకు దక్షిణ భారత భాషలను నేర్పితే వారి నిత్య జీవనంలో అది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది – తీగల వెంకటయ్య, హెచ్ఎం5 భాషలు నేర్చుకొంటున్నా కొత్త భాషలను సులువుగా నేర్చుకోవటం భలే సరదాగా ఉంది. ఏడాది క్రితం వరకూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోని పాఠ్యాంశాలు నేర్చుకోవటానికే కష్ట పడేదాన్ని. కానీ మా హెడ్మాస్టర్ చెప్పిన విధానం పాటించటంతో ఆ భాషలతో పాటు మలయాళం, తమిళం, కన్నడ కూడా సులువుగా నేర్చుకున్నాను. ఇదే ప్రేరణతో భవిష్యత్తులో నేను భాషా పండిట్ అవుతాను. – కె.ధరణి, 9వ తరగతివిస్తరిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని, విద్యార్థుల మిగతా పాఠ్యాంశాలకు ఇబ్బంది కలగకుండా మా హెచ్ ఎం చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ నమూనాను పరిశీలించి మిగతా స్కూళ్లకు కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇంగ్లీషు, హిందీలకు అదనంగా పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించినా కనీసం మరో మూడు భాషలు పిల్లలకు నేర్పవచ్చు. పోటీ ప్రపంచంలో కేవలం భాషలపై అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సరైన ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. – నాగభూషణం, ఇంగ్లీష్ టీచర్ -
ML Ashwini: ఆరు భాషలు నిలబెట్టాయి
భాష విజయానికి సాధనం. రాజకీయాల్లో భాషతో ఆకర్షించేవారు వేగంగా పైమెట్టు మీదకు చేరుతారు. అయితే ఆ రంగంలో బహుభాషలతో ఆకట్టుకునే మహిళలు తక్కువ. కాని సామాన్య టీచరైన ఎం.ఎల్.అశ్విని తనకు వచ్చిన ఆరు భాషల వల్ల జన సామాన్యంలో చొచ్చుకుపోతూ బిజెపి అధినాయకత్వాన్ని మెప్పించింది. కేరళలో మహామహులు పోటీపడిన కాసర్గోడ్ పార్లమెంట్ స్థానానికి పార్టీ ఆమెను నిలబెట్టింది. అశ్విని పరిచయం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన కేరళ అభ్యర్థుల్లో కాసరగోడ్ అభ్యర్థి పేరు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అభ్యర్థి పూర్వాశ్రమంలో ఒక మామూలు స్కూల్ టీచర్. ఆ తర్వాత ఆమె ఉంటున్న ఊరు మంజేశ్వరకు కేవలం బ్లాక్ పంచాయతీ మెంబర్. పార్టీలో కేవలం మహిళా మోర్చా జాతీయస్థాయి సభ్యురాలు. అయినా సరే ఆమెకే పార్టీ అధిష్టానం సీటు ఇచ్చింది. దానికి కారణం ఆమెకు తెలిసిన ఆరు భాషలు. మలయాళం, కన్నడం, తమిళం, తుళు, హిందీ, ఇంగ్లిష్. ఆమె పేరు ఎం.ఎల్.అశ్విని. భాషతో గెలిచింది కాసరగోడ మంగుళూరుకు దగ్గరగా ఉంటుంది. కన్నడిగులు కూడా ఇక్కడ ఉంటారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఎం.ఎల్.అశ్విని కాసరగోడకు కోడలుగా వచ్చింది. ‘బెంగళూరు మెట్రోపాలిటిన్ సిటీ. అన్నిభాషల వారూ ఉంటారు. నాకు భాషలు నేర్చుకోవడం ఇష్టం. చిన్నప్పుడే ఇంగ్లిష్ మీద పట్టు వచ్చింది. కన్నడ నా మాతృభాష. నా చుట్టుపక్కల తుళు కుటుంబాలు ఉండేవి. వారి నుంచి తుళు నేర్చుకున్నాను. తమిళం కూడా బెంగళూరులోనే నేర్చుకున్నాను. కాసరగోడ వచ్చాక మలయాళం చాలా సులువుగా నేర్చుకున్నాను. హిందీ బాగా తెలుసు. ఇలా ఆరు భాషల్లో నేను అనర్గళంగా మాట్లాడగలను’ అంటుందామె. ఇంట్లో కూడా ఆమె తన భాషలను సాధన చేస్తానని చెప్పింది. ‘నేను నా భర్తతో తుళులో మాట్లాడతాను. నా భర్త, కొడుకు మలయాళంలో మాట్లాడుకుంటారు. మా అమ్మాయి నేను కన్నడంలో మాట్లాడుకుంటాం. ఇలా అన్ని భాషలు మా ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి’ అంటుందామె. ఇన్ని భాషలు రావడం ఆమెకు మేలు చేసింది. ఢిల్లీ వెళ్లాక జాతీయ పార్టీలో ఢిల్లీలో కేంద్ర స్థానంలో ఉంటాయి. స్కూలు టీచర్ ఉద్యోగం మానేసి బి.జె.పిలో చేరాక ఆమెకు మహిళా మోర్చాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పార్టీ స్థానం ఇచ్చింది. అంతే కాదు ఢిల్లీ కేంద్రంగా దాదాపు 10 రాష్ట్రాలలో మహిళా మోర్చా సభ్యులతో కార్యకలాపాలు బలపరచడానికి ఆమెకు బాధ్యత అప్పగించింది. ‘ఢిల్లీలో జాతీయ స్థాయి నాయకులు హిందీలోకాని, ఇంగ్లిష్‌లో కాని మాట్లాడటం సౌకర్యంగా భావిస్తారు. కేరళ నుంచి వచ్చిన నాయకులు మలయాళం లేదా తమిళం వంటి భాషలు అనర్గళంగా మాట్లాడతారుకాని ఇంగ్లిష్, హిందీ పూర్తిగా రావు. నాకు రావడం లాభించింది’ అంటుంది అశ్విని. మహిళా మోర్చా తరఫున జమ్ము కశ్మీర్‌తో మొదలు ఉత్తరప్రదేశ్, అస్సాం వరకు ఆమె పని చేసినప్పుడు దిగువ శ్రేణి కార్యకర్తలతో వాళ్లకు తెలిసిన భాషల్లో మాట్లాడుతూ సులువుగా కలిసిపోవడం పార్టీ గమనించింది. కాసరగోడ్‌లో ఉన్న కన్నడ, మలయాళ, తమిళ భాషీయులతో ఆమె భాషలతో చొచ్చుకుపోవడం పార్టీ దృష్టికి వచ్చింది. అందుకే జిల్లా అధ్యక్షుడు రావిష్ తంత్రి, జాతీయ ప్రతినిధీ సీనియర్ నేత అయిన పి.కె.కృష్ణదాస్‌ను కాదని పార్టీ అశ్వినికి సీటు ఇచ్చింది. భాష గొప్ప సాధనం: ‘విజయానికి భాష గొప్ప సాధనం’ అంటుంది అశ్విని. ‘రాజకీయాలలో ప్రజలకు తెలిసిన భాషలో మంచి ఉపన్యాసం ఇవ్వగలిగిన వారికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. నేను ఏ భాషలో అయినా మంచి ఉపన్యాసం ఇవ్వగలను. అందుకే నాకు ఈ అవకాశం దక్కింది. భాషలు ఎన్ని తెలిస్తే అంత మంచిది’ అందామె. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాసరగోడ్‌లో బి.జె.పి మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఏమవుతుందో చూద్దాం. -
మూడు వెబ్ సిరీస్‌లకు శ్రీకారం
‘ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఎన్ . శంకర్ చారిత్రాత్మక కథాంశాలతో మూడు వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్ . శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో బ్యానర్లో ఆయన నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్‌లు రూ΄÷ందనున్నాయి. ఈ సందర్భంగా ఎన్ . శంకర్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సాయిధ ΄ోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మొదటి వెబ్ సిరీస్ నిర్మించనున్నాను. అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. అలాగే మహాత్మ జ్యోతీరావు ఫూలేగారి స్ఫూర్తితో రెండో వెబ్ సిరీస్ నిర్మిస్తాను. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. జ్యోతీరావు ఫూలేగారి అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు వంటివి ఈ వెబ్ సిరీస్‌లో ఉంటాయి. అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్‌గారిపై మూడో వెబ్ సిరీస్ ఉంటుంది. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. అంబేద్కర్‌గారు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, వ్యక్తి నుండి వ్యవస్థగా మారడానికి మధ్య జరిగిన సంఘర్షణల ఇతివృత్తంగా ఈ సిరీస్ సాగుతుంది. ఈ మూడు వెబ్ సిరీస్‌లను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను’’ అన్నారు. -
ఐరాస తీర్మానంలో హిందీ
ఐరాస: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ శుక్రవారం బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్ తో´ ాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తరప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐరాస గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది. -
ఆయన ద్వి‘భాషి’...!
ప్రతిపక్ష నేత కె.జానారెడ్డికి తెలుగుభాష లోనే రెండు రకాల భాషలు వస్తాయట. ఆయన ప్రసంగశైలిపై కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. తెలుగులోనే మాట్లాడినా వినేవారికి అయోమయం, గందరగోళం కలిగించే విధంగా, ఏం చెప్పారో అర్థంకాకుండా మాట్లాడటం జానా రెడ్డికి వచ్చునట. అందరికీ అర్థమయ్యేవిధంగా మాట్లాడటంలోనూ ప్రావీణ్యముందట. విషయం అర్థమయ్యేటట్టు చెప్పాల్నా, అర్థంకాకుండా అటూఇటూ తిప్పి చెప్పాల్నా అనేదానిపై సారుకు ఉన్న స్పష్టతను బట్టి భాషను ఉపయోగిస్తారట. చెప్పిందే తిప్పితిప్పి చెప్పి, ఎన్నిసార్లు చెప్పినా అర్థంకాని పడికట్టు పదాలతో కూడిన తెలుగుభాషను అయోమయం చేయాలనుకుంటే ప్రయోగిస్తారట. చెప్పాలనుకున్నప్పుడు సూటిగా, స్పష్టంగా చెప్పేస్తారట. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగం సందర్భంగా సాధారణ భాషలో మాట్లాడి, పార్టీలో పరువును నిలబెట్టుకున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.