‘ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఎన్ . శంకర్ చారిత్రాత్మక కథాంశాలతో మూడు వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్ . శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో బ్యానర్‌లో ఆయన నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్‌లు రూ΄÷ందనున్నాయి. ఈ సందర్భంగా ఎన్ . శంకర్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సాయిధ ΄ోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మొదటి వెబ్ సిరీస్ నిర్మించనున్నాను. అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలవుతుంది.
అలాగే మహాత్మ జ్యోతీరావు ఫూలేగారి స్ఫూర్తితో రెండో వెబ్ సిరీస్ నిర్మిస్తాను. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. జ్యోతీరావు ఫూలేగారి అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు వంటివి ఈ వెబ్ సిరీస్‌లో ఉంటాయి. అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్‌గారిపై మూడో వెబ్ సిరీస్ ఉంటుంది. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. అంబేద్కర్‌గారు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, వ్యక్తి నుండి వ్యవస్థగా మారడానికి మధ్య జరిగిన సంఘర్షణల ఇతివృత్తంగా ఈ సిరీస్ సాగుతుంది. ఈ మూడు వెబ్ సిరీస్‌లను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment