N. Shankar
-
మూడు వెబ్ సిరీస్‌లకు శ్రీకారం
‘ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఎన్ . శంకర్ చారిత్రాత్మక కథాంశాలతో మూడు వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్ . శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో బ్యానర్లో ఆయన నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్‌లు రూ΄÷ందనున్నాయి. ఈ సందర్భంగా ఎన్ . శంకర్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సాయిధ ΄ోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మొదటి వెబ్ సిరీస్ నిర్మించనున్నాను. అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. అలాగే మహాత్మ జ్యోతీరావు ఫూలేగారి స్ఫూర్తితో రెండో వెబ్ సిరీస్ నిర్మిస్తాను. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. జ్యోతీరావు ఫూలేగారి అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు వంటివి ఈ వెబ్ సిరీస్‌లో ఉంటాయి. అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్‌గారిపై మూడో వెబ్ సిరీస్ ఉంటుంది. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. అంబేద్కర్‌గారు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, వ్యక్తి నుండి వ్యవస్థగా మారడానికి మధ్య జరిగిన సంఘర్షణల ఇతివృత్తంగా ఈ సిరీస్ సాగుతుంది. ఈ మూడు వెబ్ సిరీస్‌లను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను’’ అన్నారు. -
టాలీవుడ్ దర్శకుడికి భూ కేటాయింపు.. సమర్థించిన హైకోర్టు
ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్ల గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. సినిమా, టీవీ స్టుడియో నిర్మాణంతో పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. స్టూడియో నిర్మాణం కోసం శంకర్ వినతిపత్రం అందజేసిన తర్వాతే రాష్ట్ర కేబినెట్ భూ కేటాయింపుపై నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం నేరుగా భూమి కేటాయించిందన్న పిటిషనర్ వాదనను తప్పుబట్టింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 75 సబబేనని తీర్పు వెలువరించింది. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) భూ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని.. ఈ క్రమంలోనే సినీ రంగానికి, క్రీడాకారులకు కేటాయిస్తుందని చెప్పింది. గతంలోనూ పలువురు ప్రముఖులకు భూములు కేటాయించిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు కూడా సినీ, క్రీడా.. తదితర రంగాల ప్రముఖులకు ఆయా రంగాల అభివృద్ధి కోసం భూమి కేటాయించడాన్ని సమర్థించినట్లు గుర్తుచేసింది. మోకిల్ల గ్రామం సర్వే నంబర్ 8లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను ప్రభుత్వం శంకర్‌కు కేటాయిస్తూ 2019లో జీవో నంబర్ 75 జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్‌కు చెందిన జె.శంకర్ 2020లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ పూర్తి కావడంతో బుధవారం తీర్పును రిజర్వు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మా సనం శుక్రవారం తుది ఉత్తర్వులు వెలువరించింది. సినీ పరిశ్రమను ప్రోత్సహించే సదుద్దేశంతోనే స్టూ డియో నిర్మాణం కోసం శంకర్‌కు ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇతర ఏ పనులకు వినియోగించ కూడదన్న నిబంధన కూడా విధించింది. బలహీన వర్గానికి చెందిన శంకర్ 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనకు భూమి కేటాయించే నాటికి అక్కడ ఎకరం మార్కెట్ విలువ రూ.20 లక్షలు మాత్రమే ఉంది. స్టూడియో నిర్మాణంతో పలువురు కళాకారులను సినీ రంగానికి అందించిన వారమవుతాం. చట్ట ప్రకారమే అన్ని నిబంధనలను పాటిస్తూ భూ కేటాయింపు జరిగిందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. స్టుడియో నిర్మాణానికి భూమి కేటాయించడాన్ని సమర్థించింది. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్‌లో అడుగు పెట్టిన 'సినిమా') -
సన్మార్ గ్రూపు చైర్మన్ శంకర్ అస్తమయం
చెన్నై: సన్మార్ గ్రూపు చైర్మన్ ఎన్.శంకర్ (77) అనారోగ్య కారణాలతో ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శంకర్ సోదరుడు ఎన్.కుమార్ కంపెనీకి వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. శంకర్ కుమారుడు విజయ్ శంకర్ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. అసోచామ్ ప్రెసిడెంట్, ఇండో–యూఎస్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్, మద్రాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇలా ఎన్నో సంఘాల్లో శంకర్ పనిచేశారు. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాలకు ఆయన మద్దతుగా నిలిచారు. శంకర్ మృతి పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్తలు సంతాపం తెలియజేశారు. ఆధునిక యాజమాన్య విధానాలను చాలా ముందుగా అందిపుచ్చుకున్న వ్యక్తి శంకర్ అని టీవీఎస్ గ్రూపు గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్ చెప్పారు. సన్మార్ గ్రూపు ఇండస్ట్రియల్ కెమికల్స్‌లో ప్రముఖ కంపెనీగా ఎదిగింది. భారత్ సహా అమెరికా, మెక్సికో, ఈజిప్ట్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
లాక్డౌన్లో అందరూ అలా ఫీలయ్యారు: దర్శకుడు ఎన్. శంకర్
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, రవిప్రకాశ్, రవిబాబు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ – ‘‘కరోనా కారణంగా విధించబడిన లాక్‌డౌన్స్‌తో ప్రజలందరూ చెప్పలేని హౌస్ అరెస్ట్‌ను ఫీలయ్యారు. కరోనా టైమ్‌లో స్క్రిప్ట్‌ను ఓకే చేయించుకుని శేఖర్ సినిమాను పూర్తి చేయడం విశేషం’’ అన్నారు. (చదవండి: మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్) ‘‘పిల్లలతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి హిట్ చేయాలి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘‘చిన్న పిల్లలతో చేసిన హిలేరియస్ ఎంటర్టైనరే ఈ చిత్రం’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘పిల్లలంటే దేవుళ్లతో సమానం. వారికోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ జనరేషన్లో పిల్లలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారనే విషయాన్నే ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శేఖర్. ఈ కార్యక్రమంలో కౌశిక్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ శంకర్ విడుదల చేసిన ‘తెరవెనుక’ ఫోస్టర్
హైదరాబాద్: ప్రముఖ స్టార్ హీరోయిన్ టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విజయం తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా ‘తెరవెనుక’ అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్రానికి మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ప్రవీణ్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై ఎన్. శంకర్ మాట్లాడుతూ ప్రవీణ్ చంద్ర టాలెంట్ ఉన్న దర్శకుడని, విభిన్న కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెరవెనుక సినిమాకు పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎన్. శంకర్ ధన్యవాదాలు తెలిపారు. తెరవెనుక చిత్రంలో అమన్‌తో పాటు విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి తదితరులు నటిస్తున్నారు. -
కొత్తవారి కోసం వేదిక ఏర్పాటు చేస్తున్నా!
‘‘దివంగత నటుడు, దర్శక–నిర్మాత ఎం. ప్రభాకర రెడ్డిగారిది మా పక్క ఊరు. ఆ పరిచయం వల్ల ఆయన నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఆయన తీసుకుని రాకుంటే నాకు ఇండస్ట్రీలో ఓ వేదిక దొరికేది కాదు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అని దర్శకుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఎన్కౌంటర్’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. రెండో చిత్రం ‘శ్రీరాములయ్య’ 1998 ఆగస్టు 14న విడుదలైంది. దర్శకునిగా నేటితో ఆయన ప్రయాణం 23ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో శంకర్ చెప్పిన విశేషాలు. ► ఈ 23 ఏళ్ల ప్రయాణం ఎలా అనిపిస్తోంది? ఇండస్ట్రీలో నా ప్రయాణం 36 ఏళ్లు. అయితే దర్శకునిగా మాత్రం 23 ఏళ్లు. నా మొదటి చిత్రం ‘ఎన్కౌంటర్’, రెండో సినిమా’ శ్రీరాములయ్య’ ఏడాది గ్యాప్‌లో ఒకే రోజు విడుదలయ్యాయి. ఇది అనుకోకుండా జరిగింది. ప్రతి సినిమాని ఓ కమిట్మెంట్తో చేశా. సినిమా అనేది నాకు ఇష్టమైన వృత్తి కావడంతో 100శాతం సంతృప్తిగా ఉంది. ► ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీరు సినిమాలు తీయడం తగ్గించినట్టున్నారే? అలాంటిదేం లేదు. ఓ వైపు సేవ చేస్తున్నాను. మరోవైపు కథలు రాసుకుంటున్నాను. నాకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయి స్టూడియో కట్టేందుకు భారతదేశంలోని వివిధ స్టూడియోలతో పాటు విదేశాల్లోని వాటిని కూడా పరిశీలిస్తున్నా. వాటి డిజైన్స్ తీసుకుంటున్నా. ► కేసీఆర్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారట? 2001 నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆయన, నేను కలిసి ‘బతుకమ్మ’ సినిమా చేద్దామనుకున్నాం. తెలంగాణ ఎందుకు రావాలి? అని కేసీఆర్‌గారి వద్ద మంచి కథ ఉండేది. నా దర్శకత్వంలోనే ఆ సినిమా చేద్దామనుకున్నాం. అప్పటికి నాకు వరుస హిట్స్ ఉన్నాయి. బాగా వర్కవుట్ అయ్యేది? కానీ చేయలేకపోయాం. ‘జై బోలో తెలంగాణ’ సినిమాకి నాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. దానిపైనా కొందరు కోర్టుకు వెళితే ‘ఎందుకివ్వకూడదు? ఆయన ఆ అవార్డుకు అర్హుడే’ అంటూ ఆ కేసు కొట్టేశారు. ఆ సినిమా విడుదల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇవ్వడంలో తప్పేం లేదని ఆంధ్రలోనూ చాలామంది అనుకున్నారు. ► దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? 2008 నుంచి 2010 వరకూ తొలిసారి అధ్యక్షుడిగా చేశా. 2018న మళ్లీ ఎన్నికై కొనసాగుతున్నా. డైరెక్టర్స్ వెల్ఫేర్‌కి సంబంధించి చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాం. ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దానికి అధ్యక్షుడిగా రాఘవేంద్రరావుగారు, మేనేజింగ్ ట్రస్టీగా నేను ఉన్నాను. కరోనా సమయంలో సభ్యులకు 5వేల రూపాయల చొప్పున ఇచ్చాం. చిరంజీవిగారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఇప్పటికే రెండు విడతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. వినాయక చవితికి మూడో విడత ఇవ్వబోతున్నాం. ► కొత్త ప్రాజెక్టులు ఏమైనా? రెండు సినిమాలకు కథలు రెడీ చేశా. వాటికి నేనే దర్శకత్వం వహిస్తా. ► కొత్తవారికి అవకాశాలు కల్పించడానికి ఓ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని విన్నాం... అవును. నాకు సినిమా నేపథ్యం లేదు. చాలా కష్టాలు ఎదుర్కొన్నా..మెట్టు మెట్టు ఎక్కుతూ వచ్చా.. డా. ఎన్ ప్రభాకర్ రెడ్డిగారు అవకాశం ఇవ్వడం వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ‘ఆయుధం’ సినిమా ద్వారా ఐదు మంది పాటల రచయితలను పరిచయం చేశా. ఆ తర్వాత చాలా మంది అవకాశాల కోసం నన్ను సంప్రదించారు. కానీ నేను అందరికీ ఇవ్వలేను కదా? అందుకే ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఓ వేదిక ఉంటే బాగుంటుందనిపించింది. ‘వేదిక’ అనే ఓ సంస్థని ఏర్పాటు చేస్తున్నా. దీని ద్వారా నూతన నటీనటులు, రచయితలు, దర్శకులు, సింగర్స్, సంగీతం... ఇలా అన్నివర్గాల వారిని ప్రోత్సహిస్తాం. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం.. ఇప్పటికే ఐదు వెబ్ సిరీస్‌కి కథలు రెడీ చేయించాం. కొత్తవారికి ఓ ‘వేదిక’ ఉందనేలా చేస్తాం. ► హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో కట్టబోతున్నానన్నారు.. ఆ ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చాయి? 1984 తర్వాత ప్రభుత్వాలు స్టూడియోలు కట్టుకునేందుకు ఎవరికీ స్థలాలు ఇవ్వలేదు. 2003లో స్టూడియో కోసం ఓసారి దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు. 2012లో మళ్లీ దరఖాస్తు చేయగా పరిశీలనలోకి వెళ్లింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్‌గారు సీఎం అయ్యారు. స్టూడియో కోసం 15 ఎకరాల స్థలం కావాలని ఆయన్ని కోరగా 2019 జూన్‌లో 5 ఎకరాలు నాకు కేటాయించారు. ఏ స్టూడియోకి అయినా 10 నుంచి 15 ఎకరాలుండాలి. కానీ 5 ఎకరాల్లోనే చాలెంజింగ్‌గా తీసుకుని అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. – దేరంగుల జగన్ -
ఈ స్పందన ఊహించలేదు!
సినిమా పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకి ఎంట్రీ ఈజీగా దొరుకుతుంది. కానీ, కొత్తవాళ్లు అవకాశాలు దక్కించుకోవాలంటే చాలా కష్టం. అలాంటివారి కోసం ‘కొత్తవారితో సినిమా చేస్తాం.. అవకాశం కోసం అప్లై చేసుకోండి’ అని ఓ ప్రకటన ఇస్తే, అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయ్. అది కూడా ఎన్. శంకర్ వంటి సీనియర్ డెరైక్టర్ నుంచి ఆహ్వానం వస్తే, ఆసక్తి ఉన్నవాళ్లందరూ అప్లికేషన్లు పంపించుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది. అంతా కొత్తవారితో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తాను తీయనున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్కి హీరో, హీరోయిన్‌తో పాటు 80 శాతం పాత్రలకు అవకాశం కల్పిస్తానని ఆ మధ్య శంకర్ ప్రకటించారు. మే 31 లోపు అప్లికేషన్లు పంపించాలని కోరారు. ప్రకటించి నెల అవుతున్న నేపథ్యంలో ఎనిమిదివేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ‘‘ఈ స్పందన ఊహించలేదు. వాస్తవానికి జూన్‌లోనే షూటింగ్ మొదలుపెట్టాలనుకున్నా. కానీ, అప్లికేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటిని పరిశీలించడానికి టైమ్ పడుతుంది. అన్ని అప్లికేషన్లు ఈ-మెయిల్ ద్వారా వచ్చాయి. జూన్ 15 తర్వాత అందరికీ మెయిల్స్ ద్వారా సమాధానం పంపిస్తాం. ఆ తర్వాత ఆడిషన్స్ చేసి, షూటింగ్ ప్రారంభి స్తాం. భారీ స్థాయిలో స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. -
మానవత్వమే మహా విజేత!
అందుకే... అంత బాగుంది! సేవియర్ (1998) ఎన్. శంకర్ ప్రముఖ దర్శకుడు తారాగణం: డెన్నిస్ క్వెయిడ్, స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్, నస్టాస్జౌ కిన్స్కీ, నటాషా నిన్కోవిక్, సెర్గెజ్ ట్రిపునోవిక్ రచన: రాబర్ట్ ఓర్ ; సంగీతం: డేవిడ్ రాబిన్స్ ; నిర్మాతలు: అలివర్ స్టోన్, జేనట్ యాంగ్ ; దర్శకత్వం: ప్రెడ్రగ్ ఆంటోనిజెవిక్ ; విడుదల: 1998 నవంబర్ 20 ; సినిమా నిడివి: 103 నిమిషాలు ; నిర్మాణ వ్యయం: కోటి అమెరికన్ డాలర్లు (దాదాపు 60 కోట్ల రూపాయలు) ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా నా కళ్లు వెతికేది సినిమాలు, పాటలనే! ఆయా ప్రాంతాల కలెక్షన్‌ను సేకరించడం నాకు మొదటి నుంచీ అలవాటు. విదేశాల నుంచి మా బంధువులు ఎవరు వచ్చినా నాకు డీవీడీలు గిఫ్ట్‌గా తెస్తుంటారు. కొన్నేళ్ళ క్రితం అమెరికా నుంచి మా బావ వస్తూ నా కోసం 15 డీవీడీలు తెచ్చాడు. అప్పుడు ‘జయం మనదేరా’ సినిమా ప్లానింగ్‌లో ఉన్నా. ఆ టైమ్‌లోనే ఈ 15 డీవీడీలొచ్చాయి. వాటిల్లో నుంచి ఓ హాలీవుడ్ సినిమా తీసి ప్లే చేశాను. ఆ సినిమా చూస్తూ కూర్చున్నవాణ్ణి కూర్చున్నట్టే ఉండిపోయాను. ఆకలిదప్పులు కూడా మరచిపోయాను. సినిమా అయిపోయాక కూడా ఆ అనుభూతి నుంచి బయటకు రాలేకపోయాను. నిజం చెప్పాలంటే, రెండ్రోజుల పాటు నన్ను ఆ సినిమా వెంటాడుతూనే ఉంది. ఆ దెబ్బతో వారం రోజుల పాటు ఎవరికీ చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా ఓ చోటకు వెళ్లిపోయాను. ఆ సినిమా కథాంశం, నేపథ్యం, దాని వెంట ఓ తీగలాగా, ప్రవాహంలాగా భారతదేశం-నక్సలిజం, ప్రజలూ, పోరాటాలూ, ఫ్రెంచ్ విప్లవం, వియత్నాం విప్లవం... ఇలాంటి అంశాలన్నీ నన్ను చుట్టుముట్టేశాయి. ఆ మూడ్‌లోనే ఓ స్క్రిప్టు రెడీ చేసేశాను కూడా! అయితే అది మామూలు కథ కాదు. రెండు, మూడు రాష్ట్రాల వాళ్లకు బాగా తెలిసిన హీరోకైతేనే అది కరెక్ట్. కానీ వాళ్లు ఇలాంటి కథను ఇష్టపడతారో లేదోననే సందేహం. అందుకే ఆ స్క్రిప్టును తాత్కాలికంగా పక్కన పెట్టేశాను. కానీ ఎప్పటికైనా ఆ కథతో సినిమా చేస్తాను. అది ఖాయం! నన్ను అంతలా కలవర పెట్టిన ఆ సినిమా పేరు - ‘సేవియర్’ (1998). ఈ సినిమా కథ గురించి, మేకింగ్ గురించి చెప్పే ముందు అలివర్ స్టోన్ గురించి చెప్పాలి. అతనే ఈ సినిమాకు మూలసూత్రధారి. జానెట్ యాంగ్తో కలిసి ఈ సినిమా నిర్మించాడు. ఈ తరహా సినిమాలు నిర్మించడంలో అలివర్ స్టోన్ సిద్ధహస్తుడు. అంతకు ముందు వియత్నాం యుద్ధం మీద కూడా సినిమా తీశాడు. ఏ ప్రాంతపు నేపథ్యంలో సినిమా తీస్తే, ముందు అక్కడకు వెళ్లిపోయి, అక్కడ మెరికల్లాంటి వాళ్లను ఎంచుకుని వాళ్లతోటే సినిమా తీస్తాడు. అందుకే అతని సినిమాలన్నీ అంత నేచురల్‌గా ఉంటాయి. ‘సేవియర్’ విషయానికొస్తే - ఇదొక వార్ ఫిల్మ్. బోస్నియా దేశంలోని రెండు తెగల మధ్య సంఘర్షణ నేపథ్యంలోని కథ ఇది. బోస్నియాకు చెందిన రచయిత, దర్శకుడు, కథానాయికతోనే ఈ సినిమా తీశారు. బోస్నియా యుద్ధం సందర్భంగా ఒక సెర్బియన్ మహిళకూ, ఆమెకు అప్పుడే పుట్టిన శిశువుకూ రక్షణగా నిలిచి, వారిని ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళిన ఒక అమెరికన్ కిరాయి సైనికుడి గురించిన కథ ఇది. ఇప్పుడు ఈ సినిమా కథ గురించి మరింత వివరంగా చెబుతాను... జోష్వా రోజ్ (డెన్నిస్ క్వెయిడ్) ప్యారిస్‌లో ఎంబసీ అధికారి. భార్య (నస్టస్జా కిన్స్కీ) అంటే అతనికి పంచప్రాణాలు. కొడుకైతే ఆరో ప్రాణం. ఓ రోజు రెస్టారెంట్లో వాళ్లతో గడిపి, పని మీద బయటకు వస్తాడు. అంతే... మటాష్. ఇస్లామిక్ తీవ్రవాదులు బాంబు పేల్చడంతో సర్వం భస్మీపటలం. శవాలు.. రక్తం.. భారీ విధ్వంసం. కళ్ళెదుటే భార్య, బిడ్డ చనిపోతారు. రోజ్ గుండె పగిలిపోతుంది. పగతో రగిలిపోతాడు. ఓ మందిరంలోకి చొరబడి అక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్లందర్నీ కాల్చిపారేస్తాడు. ఆ నేరాన్ని తప్పించుకోవడం కోసం ‘గై’ అనే మారు పేరుతో ‘ఫ్రెంచ్ ఫారిన్ లీజియన్’లో చేరతాడు. అతని వెంటే అతని మిత్రుడు పీటర్ (స్టెలన్ స్కార్స్‌గార్డ్) కూడా అదే బాట పడతాడు. బోస్నియా దేశంలో సెర్బ్లకూ, ఇస్లామిక్ తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో సెర్బ్ల తరఫున గై పోరాడుతూ ఉం టాడు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుంది. అందులో భాగంగా ఖైదీలను పరస్పరం అప్పగించుకుంటారు. వీళ్ల దగ్గరకొచ్చిన సెర్బ్లలో ఒక గర్భవతి ఉంటుంది. ఆమె పేరు ‘వెరా’. తీవ్రవాదుల చేతుల్లో అత్యాచార ఫలితంగా ఆమె గర్భం ధరిస్తుంది. వెరాకు ఆడపిల్ల పుడుతుంది. ఆ పిల్ల ముఖం కూడా చూడదు ఆమె. పాలివ్వడానికి కూడా అసహ్యించుకుంటుంది. కానీ గై మాత్రం ఆ పసిపిల్లను అపురూపంగా చూసుకుంటుంటాడు. వెరాను ఆమె కుటుంబం దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. వెరా తల్లితండ్రులు వెరానూ, ఆమె బిడ్డనూ సంరక్షించడానికి ససేమిరా అంటారు. దాంతో వాళ్లిద్దర్నీ తీసుకుని కారులో బయలుదేరతాడు గై. ఈ ప్రయాణంలో ఎన్నో సంఘటనలు... ఆ పాపను కారులో నుంచి విసిరేయాలనుకుంటుంది వెరా. ఇతనేమో పాలు పట్టిస్తాడు. పాపాయి మలమూత్ర విసర్జన చేస్తే, శుభ్రం చేస్తాడు. పాల కోసం గొర్రెల వెనుక పరిగెడతాడు. పాపను శత్రువులు కాల్చేయబోతుంటే ఆ తూటాకు తాను గాయపడతాడు. ఈ తల్లినీ, బిడ్డనూ ఎలాగైనా సురక్షిత ప్రాంతానికి చేర్చాలని గై నిశ్చయించుకుంటాడు. ఐక్యరాజ్య సమితి సేఫ్‌జోన్ అయిన స్ల్పిట్‌కు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ముస్లిమ్ బలగాలు వెరాను కాల్చి పారేస్తాయి. కళ్ల ముందే వెరా ప్రాణాలు విడుస్తున్నా, పాప కోసం అంతా మౌనంగా భరిస్తాడు. చివరకు పాప బాధ్యతను తానే స్వీకరిస్తాడు. దాంతో సినిమా అయిపోతుంది. కులం... మతం... ప్రాంతం... వీటన్నిటి కన్నా మానవత్వం గొప్పదని చాటి చెప్పే సినిమా ఇది. ఈ సినిమాకు అంతలా ఎందుకు కనెక్ట్ అయ్యానో నాకే తెలియదు. సినిమా చూసినప్పుడల్లా నాలో ఏవో ప్రకంపనలు కలిగేవి! ప్రాంతాల మధ్య, జాతుల మధ్య, మతాల మధ్య, అసమానతల మధ్య, అనుబంధాల మధ్య జరిగే యుద్ధంలో విజేతగా నిలిచేది ఎప్పుడూ మానవత్వమే. ఒక మనిషిని తెలియని దుఃఖం కబళించినపుడు ఎలా ఉంటుందో అంతుపట్టదు. అలాగే ధైర్యం తాలూకు శక్తి కూడా మనకు తెలీదు. ఈ సినిమా తీయడానికి అలాంటి ధైర్యమూ, దుఃఖమూ ముడిసరుకులుగా ఉపయోగపడ్డాయేమో! నా జీవితంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. వికారాబాద్ అడవుల్లో ‘ఎన్కౌంటర్’ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు సూపర్‌స్టార్ కృష్ణ గారికి అంత పోలీసు నిఘా మధ్య కూడా గన్ ఎలా పట్టుకోవాలో నక్సలైట్లు చూపించి మరీ వెళ్లారు. ‘శ్రీరాములయ్య’ సినిమా సమయంలో నాకు ప్రతిరోజూ బెదిరింపులే. ఇప్పుడు కూర్చుని అవన్నీ తలచుకుంటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ధైర్యం తాలూకు శక్తి అంటే ఇలానే ఉంటుందేమో! 2008లో సెర్బియన్లకు స్వాతంత్య్రం వచ్చింది. వాళ్లు కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఆ పోరాట నేపథ్యంలో అద్భుతమైన మానవీయ కోణంలో ‘సేవియర్’ సినిమా తీయడమంటే మాటలు కాదు. 1992 - 1995 మధ్య కాలంలో బోస్నియా యుద్ధం ప్రాతిపదికగా తీసిన ఈ సినిమాలో యుద్ధంలోని విధ్వంసాన్నీ, మనుషుల ప్రవర్తననూ, పైశాచికత్వంలోని పరాకాష్ఠనూ దర్శకుడు ఎంతో గొప్పగా తీశాడు. ఈ యుద్ధం తీవ్రత ఎలా అయిపోతుందంటే - చివరకు పసిపిల్లలను చంపడానికి కూడా వెనుకాడరు. ఓ సన్నివేశంలో వృద్ధురాలి వేలును కత్తిరిస్తారు. చూస్తే వణుకు వచ్చేస్తుంది. గర్భిణి అని కూడా చూడకుండా వెరాను హింసిస్తారు. పొట్ట మీద తంతారు. ఆమెకు స్వేచ్ఛ దొరికినా, ఆమె కడుపులో పరాయి జాతి వాడి బిడ్డ పెరుగుతుందని తెలిసి ఆమె తల్లితండ్రులే కన్నబిడ్డ అనే బంధాన్ని సైతం వదిలేసుకోవడానికి సిద్ధమవుతారు. తల్లిదీ అదే ధోరణి. నిజం చెప్పండి... ఈ జాతుల ఘర్షణకూ, ఆ పసిపాపకు ఏమైనా సంబంధం ఉందా? చివరకు వీళ్లెవరితోనూ సంబంధం లేని గై ఆ పాపకు జీవితాన్నివ్వడానికి తన జీవితాన్ని రిస్కు చేస్తాడు. మానవత్వం గొప్పతనం అదే! మాంటెనెగ్రోలో చిత్రీకరించిన ఈ ‘సేవియర్’ చిత్రాన్ని 1998లో కాన్స్ చలనచిత్రోత్సవంలో, అలాగే 1998లో సోచీ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ సినిమా రీ-రికార్డింగ్ చాలా బాగుంటుంది. సాంకేతిక విలువలూ సూపర్బ్. పైకి ఏదో వార్ మూవీలాగా, ట్రావెల్ మూవీలాగా అనిపిస్తుంది కానీ అడుగడుగునా హ్యూమన్ ఎమోషన్స్ కనబడకుండా కనిపిస్తాయి. గై, వెరాల మధ్య ప్రేమ పుడుతుందేమో, వీళ్లిద్దరూ ఏకమవుతారేమోనన్న జనరల్ సైకాలజీ మనల్నీ వెంటాడుతుంది. కానీ దర్శకుడు మాత్రం ఎన్నో మెట్లు పైన ఆలోచించి, సినిమాటిక్‌గా కాకుండా, చాలా నేచురల్‌గా కథను డీల్ చేశారు. వెరా పాత్ర పోషించిన నటాషా నిన్కోవిక్ గుర్తుండిపోతుంది. ఫ్యాకల్టీ ఆఫ్ డ్రామా ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన ఆమె ఎక్కువగా టీవీ సీరియల్స్‌లో నటించారు. సినిమాలు తక్కువ చేసినా, అన్నీ బ్రహ్మాండమైనవే. ‘సేవి యర్’, ‘ద ప్రొఫెషనల్‘, ‘ద ట్రాప్’ చిత్రాలకు ఉత్తమ నటిగా పురస్కారాలు గెలుచుకున్నారు.ఇక హీరో డెన్నిస్ క్వెయిడ్కు హాలీవుడ్లో మంచి పేరు ఉంది. ‘బ్రేకింగ్ ఎవే’, ‘ద రూకీ’, ‘వింటేజ్ పాయింట్’, ‘ఫుట్‌లూజ్’, ‘ఫ్రీక్వెన్సీ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు ప్రెడ్రగ్ ఆంటోనిజెవిక్ కూడా సెర్బియా జాతీయుడైన దర్శక - రచయిత. ఆయన తీసిన రాజకీయ కథా చిత్రం ‘ది లిటిల్ వన్’ (1992). అది చూసిన నిర్మాత అలివర్ స్టోన్ తన దగ్గర ఉన్న రాబర్ట్ ఓర్ రాసిన స్క్రీన్‌ప్లేను ఆయనకు పంపారు. బోస్నియాలోని ఒక అమెరికన్ కిరాయి సైనికుడి నిజజీవిత కథ ఆధారంగా అల్లుకున్న స్క్రీన్‌ప్లే అది. ఆ యుద్ధం సందర్భంగా ఒక ఫొటోగ్రాఫర్‌కు సహాయకుడిగా పనిచేసిన అనుభవం ఓర్ది. అందుకే, అతను ఆ కథను అంత బాగా రాయగలిగాడు. ఇలాంటి కథలు పుట్టడం కష్టం. వాటిని తెరపైకి ఎక్కించడం ఇంకా కష్టం. అందుకే ‘సేవియర్’ని అనుభవంలోకి తెచ్చుకుంటూ, చూస్తాం. హ్యాట్సాఫ్ టు ‘సేవియర్’! సంభాషణ: పులగం చిన్నారాయణ మారణహోమాన్ని కళ్లకు కట్టిన ఆంటోని... సెర్బియాకు చెందిన ్రప్రెడ్రగ్ ఆంటోనిజెవిక్ టీవి షోలు, సీరియళ్ల రూపకర.్త దర్శకునిగా ఆయన తొలి చిత్రం ‘ది లిటిల్ వన్’. ఆ తర్వాత చేసిన చిత్రం ‘సేవియర్’. 1992 నుంచి 1995 వరకూ సెర్బియన్లకు, ముస్లింలకు మధ్య జరిగిన యుద్ధానికి కదిలిపోయి, ్రప్రెడ్రగ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. స్క్రీన్‌ప్లే రచయిత రాబర్ట్ ఓర్ బోస్నియాలో యుద్ధం జరిగే సమయంలో ఫొటో జర్నలిస్ట్‌కు సహాయకునిగా పనిచేశారు. ఆయన అనుభవాల సమాహారంతో మారణ హోమాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. ఆ తర్వాత ‘హార్డ్ క్యాష్ ’, ‘లిటిల్ మర్డర్’, ‘బ్రేకింగ్ ఎట్ ద ఎడ్’్జ చిత్రాలను తెరకెక్కించారు. చేసింది తక్కువ చిత్రాలే అయినా ప్రెడ్రగ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఓ లెజెండ్‌ని కోల్పోయాం!
ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మరణం పట్ల దర్శకుడు ఎన్. శంకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ‘‘క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వంతో ఎదిగిన నిర్మాత డి. రామానాయుడు గారు. ఆయన బ్యానర్లో నేను చేసిన ‘జయం మనదేరా!’ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. మంచి మనసున్న లెజెండ్‌ని కోల్పోయినందుకు బాధపడుతున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు. -
కళాకారులకు పుట్టినిల్లు నల్లగొండ
నల్లగొండజిల్లా కవులు, కళాకారులకు పుట్టినిల్లని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్. శంకర్ అన్నారు. నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సినిమా పండగలో ఆయన మాట్లాడారు. నల్లగొండ కల్చరల్: నల్లగొండ జిల్లా కళలు, కళాకారులకు పుట్టినిల్లు అని ప్రముఖ సినీ డెరైక్టర్ ఎన్.శంకర్ అన్నారు. నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్హాల్లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సినిమా పండగలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో దాదాపు 20 వరకు జానపద కళారూపాలు ఉన్నాయని, ఎంతో మంది కళాకారులు చైతన్యవంతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కనుమరగవుతున్న జానపద కళాకారుపాలకు జీవం పోసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో ప్రముఖ సినీ కళాకారులు టీఎల్ కాంతారావు, ఎం.ప్రభాకర్‌రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు జయంతి కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.నటులు ప్రభాకర్‌రెడ్డి చలువ వల్లనే తను ఈ రోజు సినీ పరిశ్రమలో నిలబడ్డానన్నారు. సినీ కళాకారులు ఎంఎన్.నాగరాజు మాట్లాడుతూ వచ్చే ఏడాది 20 మంది సినీ కళాకారులతో నల్లగొండలో తెలంగాణ సినిమా పండగ నిర్వహిస్తామన్నారు. అలాగే తెలంగాణకు చెందిన పేద కళాకారులకు ప్రతి ఏటా రూ.లక్ష ఆర్థికసాయం, ఉత్తమ కళాకారుడికి రూ.25వేల నగదు పారితోషికాన్ని ప్రముఖ నటులు టీఎల్.కాంతారావు పేరు మీద అందిస్తామని చెప్పారు. విద్యావేత్త కొండకింద చినవెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఫిలం సొసైటీ కార్యదర్శి పున్న అంజయ్య, దశరథకుమార్, సత్యం, మునవర్అలీ, గూడ రామకృష్ణ, నర్సయ్య, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు జి. దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
ఎన్.శంకర స్మారక ఉపన్యాస కార్యక్రమం
-
తెలుగు సినీ పరిశ్రమ దారెటు..?
-
అదే జరిగితే ప్రభుత్వం, పరిశ్రమ రెంటికీ నష్టమే!
-
తెలంగాణ సినిమా అంటే..?
-
తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదు!
-
టీ జేఏసీ నేతలకు సోనియా హామీ
-
వెండితెరపై నా తెలంగాణ
ఎన్.శంకర్... తెలంగాణ సినీ దర్శకుడు. ఎన్కౌంటర్ వంటి సూపర్ హిట్ సినిమాతో మొద లైన ఆయన ప్రస్థానం...విభిన్న చిత్రాలతో ఉవ్వెత్తుకు ఎగసింది. ‘జైబోలో తెలంగాణ’తో లబ్దప్రతిష్టుడైన ఆయన వెండితెరపై నవ తెలంగాణ ఎలా ఉండాలో ఇలా విశ్లేషిస్తున్నారు... తెలుగు జాతి రెండుగా విడిపోయినా సినిమా రంగం మాత్రం ఒకటిగా ఉంటుంది. హైదరాబాద్ నుంచే రెండు రాష్ట్రాల్లోనూ తమ ప్రస్థానాన్ని కొనసాగించాలని సినీ నిర్మాతలు భావిస్తున్నారు. ఒకప్పుడు మద్రాసు నుంచే తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినీ పరిశ్రమ నడిచింది. ఇప్పుడు తెలంగాణ వచ్చినా పరిశ్రమ మాత్రం హైదరాబాద్ నుంచే కొనసాగుతుందని నిర్మాతలు, కళాకా రులు భావిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని, కళలను, భాషను, వ్యక్తిత్వాన్ని గౌరవించే సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణకు చెందిన చాలామంది కళాకారులకు అలాంటి అవకాశాలు రాలేదన్న భావన ఉంది. తరగని సాహిత్య సంపదకు నిలయం తెలంగాణలో కథలు, కథాంశాలు కోకొల్లలు. సాంస్కృతిక చరిత్ర అధికం. వీరగాధలు చాలా ఉన్నాయి. కథలకు ఉపయోగపడే ముడిసరుకు తెలంగాణలో ఎక్కువగా ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి అనేక కథాంశాలను తీసుకుని సినిమాలు నిర్మించే వీలుంది. ఇప్పటివరకు రాయలసీమ ఫ్యాక్షన్, కోస్తాంధ్ర కథాంశాలతోనే సినిమాలు వచ్చాయి. తెలంగాణ పోరాటం నేపథ్యంతో వచ్చిన సినిమాలు పెద్దగా లేవు. తెలంగాణలో సాహిత్య చైతన్యం, రచయితల సృజనాత్మకత అద్భు తం. హాస్యం, డ్రామా, ఉద్వేగం, చరిత్ర, సమ్మక్క-సారక్క, రుద్రమదేవి వీరగాధలు ఉన్నాయి. వందల సినిమాలకు ఉపయోగపడే కళా సంపద ఇక్కడ ఉంది. 120 రకాల కళలు తెలంగాణలో ఉన్నాయి. అందులో 25 కళలు ఇంకా బతికున్నాయి. ప్రతి జిల్లాకు ఒక్కో ప్రత్యేకమైన కళా సంస్కృతి ఉంది. వాటన్నింటినీ సినిమాగా రూపొందించే కార్యాచరణ జరగాలి. మూడంచెల వ్యవస్థను పునరుద్ధరించాలి ప్రస్తుత సినిమా భవిష్యత్ దళారుల చేతుల్లో చిక్కుకుపోయింది. సినిమా ఎన్ని రోజులు ఆడాలో కూడా వారే నిర్ణయిస్తున్నారు. కొన్ని సినిమాలకు మొదట్లో పెద్దగా ఓపెనింగ్స్ లేకున్నా టాక్‌ను బట్టి క్రమంగా కలెక్షన్లు పెరుగుతాయి. కానీ దళారులు మాత్రం మొదట్లో ఓపెనింగ్స్ రాకపోతే సినిమా హాలు అద్దె వృథా అని ఆ సినిమాను ఎత్తివేస్తున్నారు. ఇది చిన్న సినిమాల పాలిట శాపంగా మారుతోంది. సినిమా హాళ్లను దళారులకు లీజుకు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సినిమా భవితవ్యాన్ని దళారులు నిర్ణయించడం తగ దు. సినిమా తలరాత వారి చేతుల్లో ఉండడం పరిశ్రమకు మంచిది కాదు. కాబట్టి పాత విధానంలోలా మూడంచెల వ్యవస్థ రావాలి. అప్పుడే తెలంగాణ సినిమాకు భవిష్యత్ ఉంటుంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వచ్చాక తామూ హీరో, హీరోయిన్లు అవ్వొచ్చని, సాంకేతిక నిపుణులుగా ఎదగొచ్చని యువతీ యువకులు కలలు కంటున్నారు. ‘జైబోలో తెలంగాణ’ సినిమా నిర్మాణానికి ముందు నిర్వహించిన ఆడిషన్ టెస్ట్‌కు పదివేల మందికిపైగా వచ్చారు. ఆడిషన్‌కే మూడు నెలలు పట్టింది. దీనిని బట్టి ఎంతమంది ఔత్సాహికులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఎంతటి కళాకారుడైనా శిక్షణ లేనిదే రాణించలేడు. కాబట్టి ప్రభుత్వమే హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయాలి. చెన్నై, పుణెల్లో ప్రభుత్వ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లున్నాయి. చెన్నై ఇన్స్టిట్యూట్లో రజనీకాంత్, చిరంజీవి వంటి ప్రముఖ హీరోలు శిక్షణ తీసుకున్నారు. ఇక తెలంగాణ కళాకారులు తీసే సినిమాలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు కల్పించాలి. ఒకప్పుడు లండన్‌లో సినిమా షూటింగ్ జరిగినా రాయితీ ఇచ్చేవారు. అలాగే గుజరాతీ, భోజ్‌పురి భాషల్లో తీసే సినిమాలకు ఆయా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో రాయితీలు ఇచ్చేవారు. తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళ టైటిల్ పెట్టిన సినిమాలకు పన్ను రాయితీ కల్పించారు. అగ్రహీరో రజనీకాంత్ సినిమా ‘రోబో’ను తమిళ పేరు ‘ఎందిరన్’ (యంత్రం) అని తమిళ టైటిల్ పెట్టినందుకే కరుణానిధి పన్ను రాయితీ కల్పించారు. సబ్సిడీ, పన్ను రాయితీ ఇస్తే సినిమాలు తీసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. నవ తెలంగాణ: పోల్కేక టీకొట్టు వ్యాఖ్య ఎండలకు జనం ఫ్యాన్‌గాలిని కోరుకుంటున్నారు. కొత్త సామెత కొట్టక్కరలేదు, తిట్టక్కరలేదు కాంగ్రెస్ టికెట్ ఇస్తే వాడే కాలిపోతాడు. మాటకు మాట కొత్తవారికి పగ్గాలిస్తాం - రఘువీరారెడ్డి పగ్గాలు సరే, గుర్రమెక్కడిది? మాజీ కాంగ్రెస్ నాయకుడి ఆవేదన టైర్లు, గేర్లు లేని బస్సులో యాత్రకు బయలుదేరింది మా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఇష్టమైన పాటలు అయ్యయ్యో చేతిలో పవర్ పోయెనే అయ్యయ్యో పార్టీ ఖాళీ ఆయెనే ఢిల్లీయే మాయ, సోనియానే మాయ కాంగ్రెస్‌లో సారమింతేనయా! సమైక్యాంధ్ర పార్టీ నినాదం పోటీచే స్తే పోయేదేమీ లేదు డిపాజిట్లు తప్ప పిట్ట కథ ఒక ముసలిపులి ‘పథకాలు’ అనే చంద్రహారాన్ని చేతిలో పట్టుకుని దారిన పోతున్న ఓటర్ని పిలిచింది. ‘నా దగ్గరికి వస్తే ఈ హారం నీదే’ అని చెప్పింది. ‘అయ్యా, చంద్రపులి, హారానికి ఆశపడితే నీకు ఆహారంగా మారుతానని నాకు తెలుసు’ అని వెళ్లిపోయాడు. నీతి: పథకాలు కూడా ఒక పథకమే - జి.ఆర్.మహర్షి -
'ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదు'
హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని సినీ దర్శకుడు ఎన్.శంకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచనే లేనప్పుడు ఏ పార్టీ నుంచి, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం కాదని శంర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ఆయన కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రామ్ , ఆయుధం, జయం మనదేరా, జై బోలో తెలంగాణ చిత్రాలకు ఎన్. శంకర్ దర్శకత్వం వహించారు. -
నల్గొండ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా 'శంకర్'
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు తెలిపారు.శుక్రవారం చెన్నైలో ఎన్.శంకర్ మాట్లాడుతూ... మరికొన్ని వారాలలో తన రాజకీయ రంగ ప్రవేశంపై అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలో నిలవాలని భావిస్తున్నట్లు ఆయన మనసులోని మాటలో బయటపెట్టారు. ఇంకా ఆ విషయంపై ఆ పార్టీ నేతలలో చర్చలు జరపలేదన్నారు. తెలంగాణ సినీ ఫోర్స్ అనే కమిటీ ఒకటి ఏర్పాటు చేసే ప్రతిపాదనలో తాను ప్రస్తుతం ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో శంకర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.రామ్ , ఆయుధం, జయం మనదేరా, జై బోలో తెలంగాణ చిత్రాలకు ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన విషయం విదితమే. -
ఫస్ట్ లవ్ పాటలు
‘‘ఫస్ట్ లవ్ అనే పదం అనిర్వచనీయమైనది. నిర్వచనం ఉంటే అది ఫస్ట్ లవ్ కానే కాదు. ఈ చిత్రదర్శకుడు అంబటి గోపి నాకు మంచి స్నేహితుడు. సాహిత్యం మీద తనకు పట్టుంది. అద్భుతమైన పుస్తకాలు రాసాడు. తను తీసిన ఈ సినిమా కవితాత్మకంగా, కళాత్మకంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఎన్. శంకర్. మహేంద్ర, అమితారావ్ జంటగా అంబటి గోపి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఫస్ట్ లవ్’ మరియు బేబి అక్షర సమర్పణలో సన్‌షైన్ మూవీ ఆర్ట్స్ పతాకంపై సత్యనారాయణ మంగలిపల్లి, నాగరాజు మంగలిపల్లి నిర్మిస్తున్నారు. జీవన్ థామస్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో సీడీని ఎన్. శంకర్ ఆవిష్కరించి, సోనియాకి ఇచ్చారు. ఇంకా ఈ వేడుకలో టి.ప్రసన్నకుమార్, బసిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, మోహన్ వడ్లపట్ల, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈవీవీగారు దర్శకత్వం వహించిన ‘మావిడాకులు’ చిత్రం ద్వారా రచయితగా నా కెరీర్ ప్రారంభమైంది. ‘లిటిల్ సోల్జర్’ చిత్రానికి సోలోగా మాటలు రాశాను. దర్శకుడిగా ఇది తొలి చిత్రం. ప్రేమలో కోత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇది’’ అన్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించామని, అవుట్‌పుట్ బాగా వచ్చిందని నిర్మాతల్లో ఒకరైన సత్యనారాయణ చెప్పారు. ఈ చిత్రంలో నటించడంపట్ల మహేంద్ర, అమితారావ్ ఆనందం వ్యక్తం చేశారు. మంచి పాటలివ్వడానికి స్కోప్ ఉన్న కథ అని జీవన్ థామస్ తెలిపారు. -
ఎన్.శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రం?
కమల్‌హాసన్ హీరోగా ఎన్. శంకర్ ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారా?... ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ఇది చిన్న బడ్జెట్ సినిమా కాదని, దాదాపు 60 కోట్ల రూపాయలతో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున రూపొందనుందని టాక్. ఇప్పటికే ఈ చిత్రకథను కమల్‌కి ఎన్.శంకర్ వినిపించారట. ఈ కథాంశం కమల్‌కి నచ్చిందని, కాకపోతే కొన్ని మార్పులు సూచించారని వినికిడి. కమల్ ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చిన్న విషయం కాదు. అంగీకరించడంతో పాటు సలహాలు కూడా సూచించారంటే తప్పకుండా శంకర్ డెరై క్షన్లో ఆయన సినిమా చేయడం ఖాయమని ఊహించవచ్చు. కథానాయకుడిగా తన నలభై ఏళ్లల్లో పలు వైవిధ్యభరితమైన పాత్రలు చేశారు కమల్. ఇన్నేళ్లల్లో ఆయన చేయనటువంటి పాత్రను క్రియేట్ చేశారట శంకర్. నాయకుడు, విచిత్ర సోదరులు, భామనే సత్య భామనే, గుణ, భారతీయుడు... ఇలా పలు రకాల లుక్స్‌లో కనిపించిన కమల్ని ఈ చిత్రంలో సరికొత్త లుక్‌లో చూపించబోతున్నారట. ఇదొక యాక్షన్ అడ్వంచర్ మూవీ అని, ఇందులో లవ్‌స్టోరీ కూడా ఉంటుందని తెలిసింది. సినిమా సహజత్వానికి దగ్గరగా ఉంటుందట. ఈ చిత్రం గురించి కమల్‌తో మరోసారి చర్చలు జరపబోతున్నారట శంకర్. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించాలనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
నటుడిగా ఎన్.శంకర్
‘‘నా ఎత్తు, నా పొట్ట చూసిన తర్వాత కూడా నన్ను తెరపై చూపించాలనుకుంటున్నారా? అని కొంతమంది దర్శకులు నన్ను యాక్ట్ చేయమని అడిగినప్పుడు నవ్వుకున్నాను. ఈసారి కూడా అలానే నవ్వుకున్నా. కానీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పేసుకున్నా. కారణం కథ, నా పాత్ర నచ్చడమే. ఇలాంటి విలువైన సినిమాలో నటిస్తే తప్పేంటి? అని కూడా అనిపించింది. ఈ సినిమా కోసం కొంచెం పొట్ట తగ్గించుకున్నా’’ అని చెప్పారు ఎన్. శంకర్. దర్శకుడిగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎన్.శంకర్ తొలిసారి తెరపై కనిపించబోతున్న చిత్రం ‘రిపోర్టర్’. రామ్కీ హీరోగా నటించి, నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ కత్తి దర్శకుడు. శుక్రవారం విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘జర్నలిస్టుల మీద సెటైర్లు వేస్తూ పలు చిత్రాలొచ్చాయి. కానీ జర్నలిస్టులు ఎంత బాధ్యతగా ఉంటారో చెప్పే చిత్రం ఇది. ఓ గ్రామీణ రిపోర్టర్ కథ ఇది’’ అన్నారు. రామ్కీ మాట్లాడుతూ -‘‘మహేష్‌గారు చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. రిపోర్టర్స్ని హైలైట్ చేసే సినిమా ఇది’’ అని చెప్పారు. రఘు కుంచె, డా. జోశ్యభట్ల ఈ చిత్రానికి స్వరాలందించారు. మంచి పాత్రలు చేశామని చలపతిరావు, సురేష్, తషు కౌశిక్ అన్నారు.