
'ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదు'
హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని సినీ దర్శకుడు ఎన్.శంకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నల్గొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచనే లేనప్పుడు ఏ పార్టీ నుంచి, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం కాదని శంర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ఆయన కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రామ్ , ఆయుధం, జయం మనదేరా, జై బోలో తెలంగాణ చిత్రాలకు ఎన్. శంకర్ దర్శకత్వం వహించారు.