telangana Director
-
ఇక్రిశాట్ డెరైక్టర్‌గా తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ
హైదరాబాద్: అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం (ఇక్రిశాట్) డెరైక్టర్‌గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి అశీష్ బహుగుణ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్రిశాట్లో డెరైక్టర్‌గా వ్యవహరించేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇక్రిశాట్ తెలంగాణ రాష్ర్ట పరిధిలోకి వచ్చినందున.. రాష్ట్రం నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డెరైక్టర్‌గా వ్యవహరిస్తారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇక్రిశాట్లో భారతదేశం నుంచి ముగ్గురు డెరైక్టర్లు ఉంటే.. అందులో తెలంగాణ సీఎస్ ఒకరు. -
'ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదు'
హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి లేదని సినీ దర్శకుడు ఎన్.శంకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా నల్గొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచనే లేనప్పుడు ఏ పార్టీ నుంచి, ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం కాదని శంర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ఆయన కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రామ్ , ఆయుధం, జయం మనదేరా, జై బోలో తెలంగాణ చిత్రాలకు ఎన్. శంకర్ దర్శకత్వం వహించారు. -
నల్గొండ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా 'శంకర్'
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు తెలిపారు.శుక్రవారం చెన్నైలో ఎన్.శంకర్ మాట్లాడుతూ... మరికొన్ని వారాలలో తన రాజకీయ రంగ ప్రవేశంపై అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలో నిలవాలని భావిస్తున్నట్లు ఆయన మనసులోని మాటలో బయటపెట్టారు. ఇంకా ఆ విషయంపై ఆ పార్టీ నేతలలో చర్చలు జరపలేదన్నారు. తెలంగాణ సినీ ఫోర్స్ అనే కమిటీ ఒకటి ఏర్పాటు చేసే ప్రతిపాదనలో తాను ప్రస్తుతం ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో శంకర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.రామ్ , ఆయుధం, జయం మనదేరా, జై బోలో తెలంగాణ చిత్రాలకు ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన విషయం విదితమే.