
సినీ దర్శకుడు ఎన్.శంకర్
తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నట్లు తెలిపారు.శుక్రవారం చెన్నైలో ఎన్.శంకర్ మాట్లాడుతూ... మరికొన్ని వారాలలో తన రాజకీయ రంగ ప్రవేశంపై అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలో నిలవాలని భావిస్తున్నట్లు ఆయన మనసులోని మాటలో బయటపెట్టారు.
ఇంకా ఆ విషయంపై ఆ పార్టీ నేతలలో చర్చలు జరపలేదన్నారు. తెలంగాణ సినీ ఫోర్స్ అనే కమిటీ ఒకటి ఏర్పాటు చేసే ప్రతిపాదనలో తాను ప్రస్తుతం ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో శంకర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.రామ్ , ఆయుధం, జయం మనదేరా, జై బోలో తెలంగాణ చిత్రాలకు ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన విషయం విదితమే.