Bandi Sanjay Responds on KTR Challenge over Drug Test - Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు: బండి సంజయ్‌ ఆరోపణ

Dec 21 2022 12:14 PM | Updated on Mar 9 2023 3:54 PM

Bandi Sanjay Respond On KTR Challenge On Drug Test - Sakshi

సాక్షి, కరీంనగర్‌: మంత్రి కేటీఆర్‌ సవాల్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్‌ వేశారు. తాము సవాల్‌ చేసింది ఎప్పుడు? మీరు స్పందించింది ఎప్పుడని ప్రశ్నించారు. దొంగలుపడ్డ ఆరు నెలలకు ఇప్పుడు మొరగడం ఎందుకని మండిపడ్డారు. కేటీఆర్‌ విదేశాలకు వెళ్లినప్పుడు చికిత్స చేయించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు దొరకననే ధీమాతోనే కేటీఆర్‌ స్పందించారని విమర్శించారు.

డ్రగ్స్ కోసం తన రక్తం, కిడ్నీ కూడా ఇస్తానని, క్లీన్ చీట్‌తో బయటకు వస్తే కరీంనగర్ కమాన్‌ వద్ద తన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా అని కేటీఆర్‌ మంగళవారం సంజయ్‌కు సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే.. కేటీఆర్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్‌ స్పందిస్తూ.. గతంలో ఎప్పుడో చేసిన సవాల్‌కు ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడని విమర్శించారు.  అన్ని టెస్టులకు ప్రిపేర్ అయి ఇప్పుడు రెడీ అంటున్నాడని అన్నారు. తాను తాంబాకు తింటున్నట్లు కేటీఆర్‌ ప్రచారం చేస్తున్నాడని, తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.  తనకు ఆ అలవాటే లేదని, తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలియదని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసింది. మీ భాష చూసి నవ్వుకున్నాం. మేము సంస్కారంగా పెరిగినం మీకు అది లేక ఇలా మాట్లాడుతున్నారు. మీ చెల్లి లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లే. ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేశారు.  హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. తప్పు చేయనప్పుడు కోర్టు ముందు నిరూపించుకోవచ్చు. ’ అని బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు.
చదవండి: ‘రాజగోపాల్ అన్న .. తొందర పడకు.. మాట జారకు..’ కవిత కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement