ఓ లెజెండ్‌ని కోల్పోయాం!
ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు మరణం పట్ల దర్శకుడు ఎన్. శంకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ‘‘క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వంతో ఎదిగిన నిర్మాత డి. రామానాయుడు గారు. ఆయన బ్యానర్‌లో నేను చేసిన ‘జయం మనదేరా!’ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. మంచి మనసున్న లెజెండ్‌ని కోల్పోయినందుకు బాధపడుతున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు.