లాక్‌డౌన్‌లో అందరూ అలా ఫీలయ్యారు: దర్శకుడు ఎన్‌. శంకర్‌ | Director N Shankar Comments On House Arrest Movie | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌లో అందరూ అలా ఫీలయ్యారు: దర్శకుడు ఎన్‌. శంకర్‌

Published Thu, Aug 26 2021 10:30 AM | Last Updated on Thu, Aug 26 2021 10:30 AM

Director N Shankar Comments On House Arrest Movie - Sakshi

శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరి, అదుర్స్‌ రఘు, రవిప్రకాశ్, రవిబాబు, తాగుబోతు రమేష్‌ ప్రధాన పాత్రల్లో శేఖర్‌ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హౌస్‌ అరెస్ట్‌’. కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎన్‌. శంకర్‌ మాట్లాడుతూ – ‘‘కరోనా కారణంగా విధించబడిన లాక్‌డౌన్స్‌తో ప్రజలందరూ చెప్పలేని హౌస్‌ అరెస్ట్‌ను ఫీలయ్యారు. కరోనా టైమ్‌లో స్క్రిప్ట్‌ను ఓకే చేయించుకుని శేఖర్‌ సినిమాను పూర్తి చేయడం విశేషం’’ అన్నారు. 
(చదవండి: మహేశ్‌ బాబు బ్యాక్‌ టూ హైదరాబాద్‌)

‘‘పిల్లలతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఈ సినిమాను చూసి హిట్‌ చేయాలి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ‘‘చిన్న పిల్లలతో చేసిన హిలేరియస్‌ ఎంటర్‌టైనరే ఈ చిత్రం’’ అన్నారు శ్రీనివాస్‌ రెడ్డి. ‘‘పిల్లలంటే దేవుళ్లతో సమానం. వారికోసమైనా ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ జనరేషన్‌లో పిల్లలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్‌ అవుతున్నారనే విషయాన్నే ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శేఖర్‌. ఈ కార్యక్రమంలో కౌశిక్, సోహైల్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement