![Srinivas Reddy And Saptagiri House Arrest New Movie Launch - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/11/Srinivasreddy%2C-sapthagiri.jpg.webp?itok=aUnWvaw7)
సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బాబీ
హాస్యనటులు సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి హీరోలుగా ‘హౌస్ అరెస్ట్’ అనే సినిమా ప్రారంభమైంది. ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ బాబీ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ప్రేక్షకులకు విభిన్నమైన, చక్కని వినోదాన్ని అందించే సినిమాలు అందిస్తూ భవిష్యత్తులో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో మా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ అడుగులు వేస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె. యువరాజ్.
Comments
Please login to add a commentAdd a comment