కొన్నిరోజులుగా అనుకుంటున్నట్లే బాలకృష్ణ కొత్త సినిమాకు 'డాకు మహారాజ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దాదాపు 96 సెకన్ల నిడివి ఉన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో నల్లని గుర్రంపై కనిపించిన బాలయ్యకు.. డైరెక్టర్ బాబీ అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. దానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే రేంజ్ అనేలా కొట్టాడు.
(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)
'ఈ కథ వెలుగుని పంపే దేవుడిది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది.. కండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది.. మరణాన్నే వణికించిన మహారాజుది' అనే వాయిస్ ఓవర్ ఆగగానే.. 'మహారాజ్, డాకు మహారాజ్' అని బాలకృష్ణ చెప్పడం ఆకట్టుకుంది.
ఇందులో బాలయ్యతో పాటు చౌందిని చౌదరి, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ‍్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా తేదీని ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment