ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'రాఘవ రెడ్డి'! | Siva Katamneni Nandita Swetha Starrer Raghava Reddy Movie Trailer | Sakshi
Sakshi News home page

Raghava Reddy Movie Trailer: మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'రాఘవ రెడ్డి'.. ట్రైలర్ రిలీజ్!

Published Thu, Dec 21 2023 4:30 PM | Last Updated on Thu, Dec 21 2023 5:40 PM

Siva Katamneni Nandita Swetha Starrer Raghava Reddy Movie Trailer - Sakshi

శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై  శివ శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

‘రాఘవ రెడ్డి ట్రైలర్‌ చూస్తే ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసరైన హీరో డ్యూటీ పరంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేంటి? నిజాయతీగా ఉండటం వల్ల అతనేం కోల్పోయాడు? అన్న కథాంశంతో తెరకెక్కించారు.  ఈ ట్రైలర్‌లో ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో పోసాని, అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు.  జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement