
కళాకారులకు పుట్టినిల్లు నల్లగొండ
నల్లగొండజిల్లా కవులు, కళాకారులకు పుట్టినిల్లని ప్రముఖ సినీ దర్శకుడు ఎన్. శంకర్ అన్నారు. నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సినిమా పండగలో ఆయన మాట్లాడారు.
నల్లగొండ కల్చరల్: నల్లగొండ జిల్లా కళలు, కళాకారులకు పుట్టినిల్లు అని ప్రముఖ సినీ డెరైక్టర్ ఎన్.శంకర్ అన్నారు. నల్లగొండ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక చినవెంకట్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ సినిమా పండగలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో దాదాపు 20 వరకు జానపద కళారూపాలు ఉన్నాయని, ఎంతో మంది కళాకారులు చైతన్యవంతంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
కనుమరగవుతున్న జానపద కళాకారుపాలకు జీవం పోసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో ప్రముఖ సినీ కళాకారులు టీఎల్ కాంతారావు, ఎం.ప్రభాకర్‌రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు జయంతి కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.నటులు ప్రభాకర్‌రెడ్డి చలువ వల్లనే తను ఈ రోజు సినీ పరిశ్రమలో నిలబడ్డానన్నారు. సినీ కళాకారులు ఎంఎన్.నాగరాజు మాట్లాడుతూ వచ్చే ఏడాది 20 మంది సినీ కళాకారులతో నల్లగొండలో తెలంగాణ సినిమా పండగ నిర్వహిస్తామన్నారు.
అలాగే తెలంగాణకు చెందిన పేద కళాకారులకు ప్రతి ఏటా రూ.లక్ష ఆర్థికసాయం, ఉత్తమ కళాకారుడికి రూ.25వేల నగదు పారితోషికాన్ని ప్రముఖ నటులు టీఎల్.కాంతారావు పేరు మీద అందిస్తామని చెప్పారు. విద్యావేత్త కొండకింద చినవెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో తెలంగాణ కళాకారులకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఫిలం సొసైటీ కార్యదర్శి పున్న అంజయ్య, దశరథకుమార్, సత్యం, మునవర్‌అలీ, గూడ రామకృష్ణ, నర్సయ్య, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు, పెన్షనర్స్ సంఘం అధ్యక్షుడు జి. దామోదర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.