నటుడిగా ఎన్.శంకర్
నటుడిగా ఎన్.శంకర్
Published Sat, Aug 17 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
‘‘నా ఎత్తు, నా పొట్ట చూసిన తర్వాత కూడా నన్ను తెరపై చూపించాలనుకుంటున్నారా? అని కొంతమంది దర్శకులు నన్ను యాక్ట్ చేయమని అడిగినప్పుడు నవ్వుకున్నాను. ఈసారి కూడా అలానే నవ్వుకున్నా. కానీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పేసుకున్నా. కారణం కథ, నా పాత్ర నచ్చడమే. ఇలాంటి విలువైన సినిమాలో నటిస్తే తప్పేంటి? అని కూడా అనిపించింది.
ఈ సినిమా కోసం కొంచెం పొట్ట తగ్గించుకున్నా’’ అని చెప్పారు ఎన్. శంకర్. దర్శకుడిగా పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎన్.శంకర్ తొలిసారి తెరపై కనిపించబోతున్న చిత్రం ‘రిపోర్టర్’. రామ్‌కీ హీరోగా నటించి, నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ కత్తి దర్శకుడు. శుక్రవారం విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘జర్నలిస్టుల మీద సెటైర్లు వేస్తూ పలు చిత్రాలొచ్చాయి.
కానీ జర్నలిస్టులు ఎంత బాధ్యతగా ఉంటారో చెప్పే చిత్రం ఇది. ఓ గ్రామీణ రిపోర్టర్ కథ ఇది’’ అన్నారు. రామ్‌కీ మాట్లాడుతూ -‘‘మహేష్‌గారు చెప్పిన ఈ కథ బాగా నచ్చింది. రిపోర్టర్స్‌ని హైలైట్ చేసే సినిమా ఇది’’ అని చెప్పారు. రఘు కుంచె, డా. జోశ్యభట్ల ఈ చిత్రానికి స్వరాలందించారు. మంచి పాత్రలు చేశామని చలపతిరావు, సురేష్, తషు కౌశిక్ అన్నారు.
Advertisement
Advertisement