
ఐరాస: భారత్ అంటే నాకెంతో ఇష్టం అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల సమస్యకు పరిష్కారాల కోసం సోమవారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఓ సదస్సు నిర్వహించారు. ట్రంప్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరయ్యారు. సదస్సు తర్వాత ఐరాసలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ సుష్మాను ఆలింగనం చేసుకుని అక్కడే ఉన్న ట్రంప్‌కు పరిచయంచేశారు. వెంటనే సుష్మాతో ట్రంప్ ‘భారత్ అంటే నాకెంతో ఇష్టం. మా అభిమానాన్ని నా ప్రియమిత్రుడు నరేంద్ర మోదీకి తెలియజేయండి’ అంటూ కాసేపు ముచ్చటించారు.
Comments
Please login to add a commentAdd a comment