న్యూయార్క్: జిన్‌జియాంగ్‌లో ఉయిగర్ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతపై చర్యలు తీసుకోవాలని చైనాకు అమెరికా పిలుపునిచ్చింది. ఉయిగర్ ముస్లింలపై వివక్ష, అణచివేతను అంతం చేయాలని పేర్కొంది. జిన్‌జింయంగ్‌లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదలై రెండేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉయిగర్ ముస్లింల విషయంలో ఇప్పటివరకు చైనా తీసుకుంటున్న చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
జిన్‌జియాంగ్‌లో చాలా దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి 2022లో నివేదిక విడుదల చేసింది. రెండేళ్ల గడిచిన సందర్భంగా మాథ్యూ విల్లర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
Two years since the UN High Commissioner for Human Rights released an assessment on human rights violations in Xinjiang, the U.S. continues to urge the PRC to take immediate action and end the ongoing repression of Muslim Uyghurs and other ethnic and religious minority groups.
— Matthew Miller (@StateDeptSpox) August 30, 2024
‘‘చైనాలోని జిన్‌జియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ నివేదిక విడుదల చేసి రెండేళ్లు పూర్తి అయింది. ఇప్పటికైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఉయిగర్ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతను అంతం చేయాలని కోరుతున్నాం’’ అని అన్నారు. అణచివేతకు గురువుతున్న వారిని విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి పిఫార్సులను చైనా అమలు చేయకపోవటంపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందని తెలిపారు.
జిన్‌జియాంగ్‌లో ప్రధానంగా ముస్లిం ఉయిగర్లు ఇతర మైనారిటీలపై కొనసాగుతున్న అణచివేతపై అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోందని అన్నారు. ఉయిగర్ ముస్లింలపై కొనసాగుతున్న అంతర్జాతీయ నేరాలు, మానవ హక్కులకు ఉల్లంఘనలు ముగింపు పలికేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చైనాను మరోసారి కోరుతున్నామని మిల్లర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment