Uyghurs
-
మైనార్టీల అణచివేత.. చైనాపై అమెరికా ఆగ్రహం
న్యూయార్క్: జిన్జియాంగ్లో ఉయిగర్ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతపై చర్యలు తీసుకోవాలని చైనాకు అమెరికా పిలుపునిచ్చింది. ఉయిగర్ ముస్లింలపై వివక్ష, అణచివేతను అంతం చేయాలని పేర్కొంది. జిన్జింయంగ్లో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి నివేదిక విడుదలై రెండేళ్లు గడిచిన సందర్భంగా అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఉయిగర్ ముస్లింల విషయంలో ఇప్పటివరకు చైనా తీసుకుంటున్న చర్యలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.జిన్జియాంగ్లో చాలా దారుణంగా మానవ హక్కుల ఉల్లంఘటన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి 2022లో నివేదిక విడుదల చేసింది. రెండేళ్ల గడిచిన సందర్భంగా మాథ్యూ విల్లర్ ఎక్స్ వేదికగా స్పందించారు.Two years since the UN High Commissioner for Human Rights released an assessment on human rights violations in Xinjiang, the U.S. continues to urge the PRC to take immediate action and end the ongoing repression of Muslim Uyghurs and other ethnic and religious minority groups.— Matthew Miller (@StateDeptSpox) August 30, 2024 ‘‘చైనాలోని జిన్జియాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి హైకమిషనర్ నివేదిక విడుదల చేసి రెండేళ్లు పూర్తి అయింది. ఇప్పటికైనా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఉయిగర్ ముస్లింలు, ఇతర మైనార్టీల అణచివేతను అంతం చేయాలని కోరుతున్నాం’’ అని అన్నారు. అణచివేతకు గురువుతున్న వారిని విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి పిఫార్సులను చైనా అమలు చేయకపోవటంపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుందని తెలిపారు. జిన్జియాంగ్లో ప్రధానంగా ముస్లిం ఉయిగర్లు ఇతర మైనారిటీలపై కొనసాగుతున్న అణచివేతపై అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోందని అన్నారు. ఉయిగర్ ముస్లింలపై కొనసాగుతున్న అంతర్జాతీయ నేరాలు, మానవ హక్కులకు ఉల్లంఘనలు ముగింపు పలికేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని చైనాను మరోసారి కోరుతున్నామని మిల్లర్ అన్నారు. -
చైనాకు కొంచెమైనా సిగ్గు ఉందా?
ఒకవైపు కరోనా కేసులు దాచి పెడుతూ.. ఎలాగైనా వింటర్ ఒలింపిక్స్ వేడుకల్ని నిర్వహించాలని చైనా తాపత్రయపడుతోంది. ఈ క్రమంలో సరిహద్దు అంశాన్ని కెలికి మరీ విమర్శలు ఎదుర్కొంటోంది. చైనా తాజాగా చేసిన పనిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. బుధవారం వింటర్ ఒలింపిక్ టార్చ్ రిలేను నిర్వహించిన ఆతిథ్య చైనా.. టార్చ్‌బేరర్‌గా క్వీ ఫబోవోను ఎంచుకుంది. ఇతను గల్వాన్ లోయ ఘర్షణల్లో తీవ్రంగా గాయపడిన సీపీఏల్ఏ కమాండర్. ఈ విషయాన్ని డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన షిన్జియాంగ్ మిలటరీ కమాండర్, గల్వాన్ లోయ వీరుడు క్వీ ఫబోవో.. బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు వాంగ్ మింగ్‌తో కలిసి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రిలేను ప్రారంభించారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. కాగా, ఈ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. ‘‘ఇది సిగ్గుమాలిన పని. గల్వాన్ లోయ దాడిలో పాల్గొన్న వ్యక్తిని.. అదీ ఉయిగర్ల ఊచకోతకు కారణమైన వ్యక్తి టార్చ్ బేరర్‌గా ఎంచుకోవడం వెనుక ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు పంపింది. భారత సార్వభౌమత్వానికి, ఉయిగర్ల స్వేచ్ఛకు అమెరికా ఎప్పుడూ మద్ధతు ఇస్తూనే ఉంటుంది’’ అని యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ర్యాంకింగ్ మెంబర్ ఈ ఉదయం ఒక ట్వీట్ చేశారు. ఇక, శీతాకాల ఒలింపిక్స్‌ను భారత్ బహిష్కరించనప్పటికీ.. ప్రారంభ వేడుకలు సహా ఒలింపిక్ కార్యక్రమానికి మన దేశం నుంచి ఎవ్వర్నీ పంపడంలేదు. It's shameful that #Beijing chose a torchbearer for the #Olympics2022 who's part of the military command that attacked #India in 2020 and is implementing #genocide against the #Uyghurs. The U.S. will cont. to support #Uyghur freedoms & the sovereignty of India. — Senate Foreign Relations Committee Ranking Member (@SenateForeign) February 3, 2022 నష్టం ఎక్కువే! భారత్ సైన్యంతో గల్వాన్ లోయలో 2020 జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 40 మందికిపైగా సీపీఎల్ఏ జవాన్లు చనిపోయినా.. పరువు పోతుందనే భయంతో నలుగురు మాత్రమే మరణించారని డ్రాగన్ తక్కువచేసి చెప్పింది. నలుగురు సైనికులకు మరణానంతరం గత సంవత్సరం గౌరవ బిరుదులు, ఫస్ట్-క్లాస్ మెరిట్ పతకాలను అందజేసింది. గతంలో రష్యా ఏజెన్సీలు చైనా నష్టంపై ఒక ప్రకటన చేయగా.. తాజాగా ఆస్ట్రేలియా పేపర్ ఒకటి ఏడాది విచారణ తర్వాత ఆ మరణాల సంఖ్య ఎక్కువేనని ప్రకటించింది. చీకట్లో శీతల వరద ప్రవాహాంలో పడి చాలామంది సైనికులు కొట్టుకు పోయి ఉంటారని, కానీ, చైనా ఆ విషయాన్ని దాస్తోందని ఆ వార్తా పత్రిక.. ఈ మేరకు చైనా నుంచే పలు ఆధారాలను సేకరించినట్లు మరీ వెల్లడించింది. ఇక గల్వాన్ ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారైన సంగతి తెలిసిందే. చదవండి: షిన్జియాంగ్ కాదు మొత్తం చైనాకే ముడిపెట్టిన బైడెన్ -
కీలక చట్టంపై బైడెన్ సంతకం.. చైనాకు చుక్కలే!
Joe Biden Signed Uyghurs Rights Protection Bill To Check China Atrocities: కీలకంగా భావించిన ఉయిగర్ చట్టంపై ఎట్టకేలకు అగ్రరాజ్యం అధినేత రాజముద్ర పడింది. చైనాను ఇరకాటంలో పడేసే ‘ఉయిగుర్ ఫోర్స్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్’(బలవంతపు కార్మిక నిరోధక చట్టం) మీద గురువారం అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అనంతరం ఆయన ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్వైపాక్షిక ఒప్పందం మీద సంతకం చేశా. కేవలం షిన్జియాంగ్ మాత్రమే కాదు.. చైనాలోని మిగతా ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది. చైనా ప్రతీ మూల నుంచి వచ్చేవి బలవంతపు చాకిరీ ఉత్పత్తులు కావని నిర్ధారించుకునేందుకు మా వద్ద (అమెరికా ప్రభుత్వం) ఉన్న ప్రతీ సాధనాన్ని ఉపయోగించుకుంటాం’’ అంటూ ఉయిగర్ల చట్టాన్ని బలంగా అమలు చేసే ఉద్దేశాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ట్విటర్ వేదికగా వినిపించారు. Today, I signed the bipartisan Uyghur Forced Labor Prevention Act. The United States will continue to use every tool at our disposal to ensure supply chains are free from the use of forced labor — including from Xinjiang and other parts of China. pic.twitter.com/kd4fk2CvmJ — President Biden (@POTUS) December 23, 2021 ఇదిలా ఉంటే చైనా పశ్చిమ ప్రాంతంలో పదిలక్షల మైనార్టీ వర్గపు జనాభాపై మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని, వెట్టిచాకిరీ చేయించుకుంటోందని చైనా మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అయితే ఈ వ్యవహారంలో చైనా మీద మొదటి నుంచే కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో షిన్జియాంగ్ నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ ఓ బిల్లు తీసుకొచ్చింది. బిల్లుకు సెనేట్ గత గురువారమే ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయగా.. చివరి పేరాలో అభ్యంతరాల మేరకు మరో వారం ఆమోద ముద్ర వాయిదాపడింది. దీంతో ఆ అభ్యంతరాలపై క్లియరెన్స్ అనంతరం.. గురువారం (డిసెంబర్ 23న) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడంతో చట్టం అమలులోకి వచ్చింది. Uyghur Forced Labor Prevention Act ప్రకారం.. బలవంతపు చాకిరీ లేకుండానే తయారుచేశామని నిరూపించగలిగిన ఉత్పత్తులను మాత్రమే ఇకపై అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇది నిరూపించుకోవాలంటే షిన్జియాంగ్ ప్రావిన్స్‌లోకి అమెరికా ప్రతినిధుల్ని, అంతర్జాతీయ జర్నలిస్టులు తప్పనిసరిగా అనుమతించాల్సి ఉంటుంది. అదే జరిగితే అక్కడ జరిగే అకృత్యాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇలా వర్తకవాణిజ్యాన్ని ముడిపెట్టి.. చైనా బండారం బయటపెట్టాలన్నదే బైడెన్ ప్రభుత్వం వేసిన స్కెచ్. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. కేవలం షిన్జియాంగ్ను మాత్రమే తొలుత చట్టంలో చేర్చిన అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్).. ఆపై మిగతా ప్రావిన్స్‌లకు సైతం ఈ చట్టాన్ని అన్వయింపజేయడం. ఇదిలా ఉంటే వర్తకవాణిజ్యాల పరంగా అమెరికాకు వచ్చే వీలైనన్నీ దారులను చైనాకు మూసేస్తోంది బైడెన్ ప్రభుత్వం. బొమ్మలపై విషపు రసాయనాల పూత ఉంటోందని ఆరోపిస్తూ.. మేడ్ ఇన్ చైనా బొమ్మలను అమెరికాలో అడుగు పెట్టనివ్వట్లేదు. ఇక ఉయిగర్లపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ.. ఆ దేశ బయోటెక్, నిఘా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు.. ఇలా ఒక్కోదానిపై ఆంక్షలు విధిస్తూ పోతోంది. ఇక అమెరికా వైపు నుంచి కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా.. చైనాకు ఎలాంటి ఉత్పత్తులను విక్రయించడానికి వీల్లేదని ఆదేశాలు అమలు చేస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అమెరికాతో వర్తకం ద్వారా భారీ ఆదాయం వెనకేసుకుంటోంది. అయితే కరోనా పరిణామాల అనంతరం ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం బెడిసికొడుతోంది. ఈ క్రమంలో చైనాను దూరం పెడుతూ.. క్రమంగా భారత్ సహా ఇతర ఆసియా దేశాలకు దగ్గర అవుతోంది అమెరికా. సంబంధిత వార్త: డ్రాగన్‌కు దెబ్బలు.. షిన్జియాంగ్ మీదే ఫోకస్ -
చైనా చుట్టు ఉచ్చు.. ఆ అరాచకాల్ని ఒప్పుకోక తప్పదా!
పశ్చిమ చైనాలో ఏళ్ల తరబడి ఉయిగుర్, ఇతర మైనార్టీలపై కొనసాగుతున్న ఆరాచకపర్వానికి ఎట్టకేలకు చైనా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనను కారణంగా చూపిస్తూ వచ్చే ఏడాది బీజింగ్‌లో జరగబోయే ఒలింపిక్స్‌ను కొన్ని దేశాలు దౌత్యపరమైన బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆంక్షలతో చైనాను మరో దెబ్బ కొట్టింది అమెరికా. ఇక వరుసగా జరుగుతున్న పరిణామాలు.. అంతర్జాతీయ సమాజం ముందు చైనా తన నేరాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితిని కల్పిస్తున్నాయి. సుమారు పది లక్షల మంది ఉయిగర్లు, టర్కీ మాట్లాడగలిగే ఇతర తెగల వాళ్లు పశ్చిమ చైనాలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. చైనా ప్రభుత్వం వీళ్లను మైనార్టీలుగా గుర్తించింది. అంతేకాదు ఏళ్ల తరబడి వాళ్లపై ఆర్మీ సాయంతో అరాచకాలకు పాల్పడుతోంది. ఉయిగర్ల ఊచకోతను పలు దేశాలు(భారత్‌తో సహా) ఏనాటి నుంచో ఖండిస్తూ వస్తున్నాయి. ఉయిగర్లపై చైనా సైన్యం వేధింపులను తెలియజేసేలా.. లండన్ ఉయిగర్ ట్రిబ్యునల్‌లో సంకెళ్ల ద్వారా నిరసన తెలిపిన ఉయిగర్ నేత చైనాను ఇరకాట పెట్టినవి.. ► షిన్జియాంగ్లో ఉయిగర్లపై హింసాకాండ, రంజాన్ సమయంలో మసీదుల విధ్వంసానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి రావడం. ►ఈ తరుణంలో ఇదంతా కేవలం పాశ్చాత్య దేశాల మీడియా స్పృష్టే అని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది చైనా. ►మరోవైపు ఫారినర్లను, జర్నలిస్టులను గ్జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకుండా చైనా ఆంక్షలు విధించింది. ► అయినప్పటికీ పక్కా ఆధారాలు అక్కడ జరిగే దమనకాండను వెలుగులోకి తీసుకొచ్చాయి. ► అమెరికా సహా చాలా దేశాల ఫోకస్ ఇప్పుడు గ్జిన్జియాంగ్ మీదే. ►డిసెంబర్ 10న లండన్‌లో ట్రిబ్యూనల్(ఇండిపెండెంట్) ఒకటి.. ఉయిగుర్లకు, ఇతర మైనార్టీ వర్గాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దమనకాండలో చైనా ప్రభుత్వాన్నే దోషిగా ఎత్తి చూపుతూ తీర్పు వెలువరించింది. ►డిసెంబర్ 14న అమెరికా చైనాకు ఓ ఝలక్ ఇచ్చింది. ఉయిగుర్ ఫోర్స్డ్ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం.. గ్జిన్జియాంగ్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులన్నీ.. ఉయిగుర్లను బలవంతపెట్టి తయారు చేయించిన ఉత్పత్తులు కావని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ►డిసెంబర్ 16న జో బైడెన్ ప్రభుత్వం.. గ్జిన్జియాంగ్ ప్రావిన్స్‌లోని మిలిటరీ మెడికల్ సైన్సెన్స్, దాని 11 రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్ మీద ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ►హైటెక్ సర్వయిలెన్స్ వ్యవస్థ-ఫేషియల్ రికగ్నిషన్ సాయంతో గ్జిన్జియాంగ్ ప్రజల డీఎన్ఏ శాంపిల్స్‌ను చైనా అక్రమంగా సేకరిస్తోందన్నది అమెరికా వాదన. ►భవిష్యత్తులో ఉయిగర్ల హక్కుల్ని పరిరక్షించేందుకు, స్వేచ్ఛను ప్రసాదించేందుకు.. అవసరమైతే చైనాను కడిగిపడేయాలంటూ అమెరికా, ఇతర అగ్రదేశాల సాయం కోరుతోంది ఉయిగర్ల హక్కుల పరిరక్షణ కమిటీ. ఈ తరుణంలో సానుకూల స్పందన ద్వారా చైనాను ఇరుకున పెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ► వచ్చే ఏడాది మొదట్లో అంతర్జాతీయ న్యాయస్థానానికి గ్జిన్‌జియాంగ్‌లో జరిగే మానవ హక్కుల ఉల్లంఘనను తీసుకెళ్లాలని(పిటిషన్ ద్వారా) అమెరికా భావిస్తోంది. చదవండి: ఆపరేషన్ ‘అన్నోన్’.. చైనా ఫోన్ల ద్వారా భారీ కుట్ర