వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా టెస్టుల అనంతరం ఫలితం నెగిటివ్‌గా వచ్చింది. దీంతో, ఆయన మళ్లీ బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా బైడెన్ స్పందిస్తూ.. వైట్ హౌస్‌లో మళ్లీ అడుగుపెట్టడం ఓ ఆనందంగా ఉందన్నారు.
కాగా, కరోనా పాజిటివ్ కారణంగా జో బైడెన్ ఐసోలేషన్‌లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు నెగిటివ్‌గా తేలడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బైడెన్‌కు చికిత్స అందించిన డాక్టర్ కెవిన్ ఓ కన్నర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బైడెన్ ఆరోగ్యం చాలా బాగుంది. బైడెన్‌లో కరోనా లక్షణాలో లేవు. టెస్టుల్లో నెగిటివ్‌గా తేలింది అంటూ కామెంట్స్ చేశారు.
It's great to be back at the White House. pic.twitter.com/f2HLk1Jp3O
— President Biden (@POTUS) July 23, 2024
మరోవైపు.. బైడెన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కరోనా తర్వాత మళ్లీ వైట్ హౌస్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉందన్నారు. తాను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పుకొచ్చారు.
🚨 UPDATE: President Biden just boarded Air Force One and is on his way back to the White House. pic.twitter.com/k2wNDleGa3
— Chris D. Jackson (@ChrisDJackson) July 23, 2024
ఇదిలా ఉండగా.. అధ్యక్ష రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్టు బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా చాలా రోజుల నుంచి బైడెన్ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ‘వేర్ ఈజ్ జో’ అనే ట్యాగ్ ట్విట్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్‌లోకి వచ్చింది. బైడెన్ ఎందుకు కనిపించడం లేదంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అధ్యక్షుడు బైడెన్ గతవారం కరోనా బారినపడ్డారు. ఐసోలేషన్‌లో ఉన్నారంటూ ‘వైట్‌హౌస్’ ఒక ప్రకటన కూడా చేసింది. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి.
అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, రాత్రి గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి నెలకొందంటూ సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు దర్శనం ఇచ్చాయి. ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. కాగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ మరో సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి రేసు నుంచి తప్పించేందుకు బైడెన్‌పై తిరుగుబాటు జరిగిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment