వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు మతిమరుపుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయంటూ వస్తున్న వదంతుల్ని వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ ఖండించారు. అధ్యక్షుడి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని తెలిపారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్ట్ ప్రతినిధి జోబైడెన్ ఆరోగ్యం గురించి వ్యక్తమవుతున్న ఆందోళనపై డాక్టర్ కెవిన్‌ను ప్రశ్నించారు.
ప్రస్తుతం జోబైడెన్ ఆరోగ్యం ఎలా ఉంది? అధ్యక్ష పదవి ముగిసేలోపు ఆయనలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. లేదు.లేదు. ఆయ ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. మరి మానసిక పరిస్థితి ఎలా ఉందని అడగ్గా.. అద్భుతంగా ఉందని బదులిచ్చారు.
మరోవైపు ఆనారోగ్యం కారణంగా డాక్టర్ కెవిన్ ఓ కార్నర్ సుమారు ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది సార్లు వైట్ హౌస్‌లో బైడెన్‌తో భేటీ అయినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
In just a few months, the American people will choose the course of America’s future. I made my choice.
And I would like to thank our great Vice President—@KamalaHarris.
She’s experienced, tough, capable.
She has been an incredible partner to me and leader for our country.— Joe Biden (@JoeBiden) July 25, 2024
అధ్యక్ష రేసు నుంచి అవుట్
ఇటీవల బైడెన్‌కు తలెత్తుతున్న అనారోగ్య సమస్యల కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీలో ఓటమి భయం మొదలైంది. అందుకే మరోసారి బైడెన్‌ను అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. బాహాటంగా నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
కమలా హారిస్ సమర్థురాలంటూ
పదవుల కంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని బైడెన్ సమర్థించుకున్నారు. నియంత, నిరంకుశుల కంటే కూడా దేశం గొప్పదని పరోక్షంగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సమర్థురాలంటూ... ఆమే అధ్యక్ష అభ్యర్థికి తగిన వ్యక్తి అని పునరుద్ఘాటించారు. మిగిలి ఉన్న ఆరు నెలల పదవీకాలంలో తన విధిని సమర్థంగా నిర్వర్తిస్తానని బైడెన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment